Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, December 30, 2008

558.tanamEla kulamEla - తనమేల కులమేల తపమే కారణము


Audio link : Dr.Pasupati
Archive link :
తనమేల కులమేల తపమే కారణము
యెలమి హరిదాసులు యేజాతి యైన నేమి

కాకమువల్ల( బుట్టదా ఘనమైన యశ్వత్ధము
దాకొని గుల్లలో( బుట్టదా ముత్తెము
చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము
యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి

బిడిపిరాళ్ళా( బుట్టవా చెలువైన వజ్రములు
పుడమి నీ(గలవల్ల( బుట్టదా తేనె
వెడగు( బిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది
వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి

పంకములో పుట్టదా పరిమళపు( దామెర
పొంకపు కీటకములందు పుట్టదా పట్టు
కొంకక శ్రీవేంకటేశు కొలిచిన దాసులు
సంకలేని జ్ఞాను లెందు జనియించి రేమి


t
anamEla kulamEla tapamE kAraNamu
yelami haridAsulu yEjAti yaina nEmi

kAkamuvalla( buTTadA ghanamaina yaSwatdhamu
dAkoni gullalO( buTTadA muttemu
chaukaina vishalatanE janmiMchadA nirvishamu
yEkaDa mahAnubhAvu leMdu puTTi rEmi

biDipirALLA( buTTavA cheluvaina vajramulu
puDami nI(galavalla( buTTadA tEne
veDagu( billi mEnanu veLLadAyenA javvAdi
vuDivOni puNyu leMdu nudayiMchi rEmi

paMkamulO puTTadA parimaLapu( dAmera
poMkapu kITakamulaMdu puTTadA paTTu
koMkaka SrIvEMkaTESu kolichina dAsulu
saMkalEni j~nAnu leMdu janiyiMchi rEmi


Meaning from Sangeethasudh.org


talamEla kulamEla-Sree

In this Padam Annamaiah denounces the importance of lineage emphasising it with several examples.
PtalamEla kulamEla tapamE kAraNamu
elami haridAsulu yE jAti yainanEmi ||
Whatever be the status and caste devotion to Vishnu alone is important.
C 1kAkamu valla buTTadA ghanamaina yashwaddhamu
dAkoni gullalO buTTadA muttemu
choukaina visha latanE janminchadA nirvishamu
yEkaDa mahAnubhAvu lendu puTTerEmi? ||
Does not a crow propagate sacred Aswaddha(cedar) trees? Is not precious pearl hiding in ordinary shell? Is not antidote to poison grown in an a creeper plant? Eminent seers may take birth in any caste.
C 2chiDipi rALLa buTTavA cheluvaina vajramulu
puDami neegala valla buTTadA tEne
veDagu pilli mEnanu veLLadAyanA javvAdi
vuDivOni puNyulendu nudayinchirEmi? ||
Are not valuable diamonds found in stones? Are you not getting honey because of bees? Don't we get javvadi perfume from the body of a cat? Unblemished devotees may born in any class.
C 3pankamu lO buTTadA parimaLapu tAmera
ponkapu keetamulandu puTTadA paTTu
konkaka SrivEnkaTESu golichina dAsulu
sanke lE jNAnu lendu jani inchirEmi? ||
Does not fragrant lotus grow in dirty mud? Is not pure silk produced by ordinary insects? Devotees of Sri Venkatesa may be of any lineage.

Sunday, December 28, 2008

557.పూవుబోణుల కొలువే పుష్పయాగము - pUvubONula koluvE pushpayAgamu





Audio link :
Archive link :








పూవుబోణుల కొలువే పుష్పయాగము
పూవక పూచె నీకిట్టె పుష్పయాగము

కలువరేక్ల వంటి ఘనమైన కన్నుల
పొలతుల చూపులే నూ పుష్పయాగము
తలచి తలచి నిన్ను తమమేనుల (బొడమే
పులక జొంపములె నీ పుష్పయాగము

కరకమలములను కందువగోపికలెల్లా
పొరసి నిను( జూపుటే పుష్పయాగము
సరసపు మాటలే సారెనాడి తమనవ్వు
పొరి నీపై జల్లుటే పుష్పయాగము

గాటపు కొలనిదండ కాంతలు సిగ్గున నిన్ను
బూటకానకు( దిట్టుటే పుష్పయాగము
యీటున శ్రీవేంకటేశ యిట్టె యలమేలుమంగ
పూటవూటరతులివి పుష్పయాగము
pUvubONula koluvE pushpayAgamu
pUvaka pUche nIkiTTe pushpayAgamu

kaluvarEkla vaMTi ghanamaina kannula
polatula chUpulE nU pushpayAgamu
talachi talachi ninnu tamamEnula (boDamE
pulaka joMpamule nI pushpayAgamu

karakamalamulanu kaMduvagOpikalellA
porasi ninu( jUpuTE pushpayAgamu
sarasapu mATalE sArenADi tamanavvu
pori nIpai jalluTE pushpayAgamu

gATapu kolanidaMDa kAMtalu sigguna ninnu
bUTakAnaku( diTTuTE pushpayAgamu
yITuna SrIvEMkaTESa yiTTe yalamElumaMga
pUTavUTaratulivi pushpayAgamu

Monday, December 15, 2008

556.hari nIpratApamuna kaDDamEdi - హరి నీప్రతాపమున కడ్డమేది లోకమున



Audio link - priya sisters
Archive link :

హరి నీప్రతాపమున కడ్డమేది లోకమున
సరి వేరీ నీకుమరి సర్వేశ్వరా

నీవు నీళ్ళు నమిలితే నిండెను వేదములు
యీవల తలెత్తితేనే యింద్రపదవులు మించె
మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె
మోవిబార నవ్వితేనే ముగిసి రసురులు

గోరగీరితే నీరై కొండలెల్ల తగబారె
మారుకొంటే బయటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకు ప్రాణము వచ్చె
కూరిమి కావలెనంటే కొండా గొడుగాయను

కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే


hari nIpratApamuna kaDDamEdi lOkamuna
sari vErI nIkumari sarwESwarA

nIvu nILLu namilitE niMDenu vEdamulu
yIvala talettitEnE yiMdrapadavulu miMche
mOva mUti giripitE mUDu lOkAlu niliche
mOvibAra navvitEnE mugisi rasurulu

gOragIritE nIrai koMDalella tagabAre
mArukoMTE bayaTanE maDugulai niliche
chEri yaDuguveTTitE Silaku prANamu vachche
kUrimi kAvalenaMTE koMDA goDugAyanu

koMgujArinaMtalOnE kUlenu tripuramulu
kaMgi gamaniMchitEnE kalidOshamulu mAne
raMguga nISaraNaMTE rakshiMchiti dAsulanu
muMgiTa SrIvEMkaTESa mUlamavu nIvE

Sunday, December 14, 2008

555.haridAsu(DaguTE yadi tapamu - హరిదాసు(డగుటే యది తపము



Audio download link , set to Amrutavarshini ragam, with explation by Nookala China Satyarayana
Archive link :

హరిదాసు(డగుటే యది తపము
పరమార్గములను ఫలమే లేదు
తిట్టినయప్పుడు దీవించినప్పుడు
అట్టె సమమగునది తపము
వెట్టి నేమములు వేవేలు చేసిన
బట్టబయలే కాని ఫలమే లేదు

యిచ్చినయప్పుదు యియ్యనియప్పుడు
అచ్చుగ నవ్విన దది తపము
యిచ్చల పుణ్యము లెన్ని సేసినా
బచ్చన లింతే ఫలమే లేదు

కూడినయప్పుడు గొణగినయప్పుడు
ఆడిక విడిచిన యది తపము
యీడనె శ్రీవేంకటేశుడే శరణము
పాడి పంతముల ఫలమే లేదు

haridAsu(DaguTE yadi tapamu
paramArgamulanu phalamE lEdu

tiTTinayappuDu dIviMchinappuDu
aTTe samamagunadi tapamu
veTTi nEmamulu vEvElu chEsina
baTTabayalE kAni phalamE lEdu

yichchinayappudu yiyyaniyappuDu
achchuga navvina dadi tapamu
yichchala puNyamu lenni sEsinA
bachchana liMtE phalamE lEdu

kUDinayappuDu goNaginayappuDu
ADika viDichina yadi tapamu
yIDane SrIvEMkaTESuDE SaraNamu
pADi paMtamula phalamE lEdu

Thursday, December 11, 2008

554.iTTi saMsArikEdiyu lEdAya - ఇట్టి సంసారికేదియు లేదాయ



Audio link :PRanganath
Archive link :

ఇట్టి సంసారికేదియు లేదాయ
తట్టువడుటే కాని దరిచేరలేదు

ములిగి భారపు మోపు మోచేటివాడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలగని భారమెందును దించలేదు

తడవి వేపచేదు త్రావెడివాడు
ఎడయెడ (దిను తీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడుజేదెకాని యెక్కడ తీపులేదు

దొరకని హేయమే తోడేటివాడు
పరిఠవించును మేన( బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు (శ్రీ)వేంకటపతి నెఱుగలేడు
iTTi saMsArikEdiyu lEdAya
taTTuvaDuTE kAni darichEralEdu

muligi bhArapu mOpu mOchETivADu
alasi diMchukonu nADADanu
alaru saMsAriki nadiyu lEdAya
tolagani bhArameMdunu diMchalEdu

taDavi vEpachEdu trAveDivADu
eDayeDa (dinu tIpEmainanu
aDaru saMsAriki nadiyu lEdAya
kaDujEdekAni yekkaDa tIpulEdu

dorakani hEyamE tODETivADu
pariThaviMchunu mEna( barimaLamu
aridi saMsAriki nadiyu lEdAya
iravu (SrI)vEMkaTapati ne~rugalEDu

Wednesday, December 10, 2008

553.idiyE vEdAMta miMdukaMTe lEdu - ఇదియే వేదాంత మిందుకంటె లేదు



Audio link : Balakrishnaprasad in Arabhi raga

Explanation

ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము


విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియేపో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనకవారెల్ల
విరతి బొందకున్న వీడదు భవము

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తము వలెనె శ్రీహరి నిలుచును
చిత్త శాంతిలేక చేరదు పరము

యెంతచదివినా యెంత వెదకినా
యింతకంటే మరి యికలేదు
యింతకంటె శ్రీవేంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు

idiyE vEdAMta miMdukaMTe lEdu
idiyE SrIvEMkaTESuni matamu


viratiyE lAbhamu viratiyE saukhyamu
viratiyEpO vij~nAnamu
viratichE ghanulairi venakavArella
virati boMdakunna vIDadu bhavamu

chittamE pApamu chittamE puNyamu
chittamE mOkshasiddhiyunu
chittamu valene SrIhari niluchunu
chitta SAMtilEka chEradu paramu

yeMtachadivinA yeMta vedakinA
yiMtakaMTE mari yikalEdu
yiMtakaMTe SrIvEMkaTESudAsulauTa
yeMtavArikaina yidiyE teruvu

Tuesday, December 09, 2008

552.Itani mahimalu yeMtani cheppeda - ఈతని మహిమలు యెంతని చెప్పెద



Audio link:PSRanganath  in raga Saraswati
Archive link :


ఈతని మహిమలు యెంతని చెప్పెద
చేతుల మొక్కెద జెలగుచు నేను
శ్రీనరసింహుడు చిన్మయమూరితి
నానావిధకరనఖరుడు
దారుణ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు

అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహుదేవతా సార్వభౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
యిహపరములొసగు యేలిక యితడూ
కేవలుడగు సుగ్రీవ నృసింహుడు
భావించ సుజనపాలకుడు
శ్రీవేంకటేశుడు చిత్తజజనకుడు
వేవేలకు నిలువేలుపు యితడు




Itani mahimalu yeMtani cheppeda
chEtula mokkeda jelaguchu nEnu

SrInarasiMhuDu chinmayamUriti
nAnAvidhakaranakharuDu
dAruNa daitya vidAruDu viShNuDu
tAnakamagu mA daivaMbitaDu

ahObalESuDu AdimapurushuDu
bahudEvatA sArwabhaumuDu
sahajAnaMduDu sarwarakshakuDu
yihaparamulosagu yElika yitaDu

kEvaluDagu sugrIva nRsiMhuDu
bhAviMcha sujanapAlakuDu
SrIvEMkaTESuDu chittajajanakuDu
vEvElaku nilavElupu yitaDu

Monday, November 24, 2008

551.సగము మానిసి రూపు - sagamu mAnisi rUpu



Audio link : sung by Balakrishnaprasad
Archive link :

సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణిత ప్రతాపుడు అహోబలేశుడు

గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు
కొద్దిమీర గడునవ్వుకొంటా నున్నాడు
వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు

పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుపమతేజుడమ్మ అహోబలేశుడు

వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు
శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ-
నావల నీవల మించె నహోబలేశుడు
sagamu mAnisi rUpu sagamu megamu rUpu
agaNita pratApuDu ahObalESuDu

gaddemIda gUchunnADu kaMbamulO buTTinADu
koddimIra gaDunavvukoMTA nunnADu
voddane SrIsatichannulorayuchu nunnavADu
addivO chUDaramma ahObalESuDu

penumIsAlavADu pedapedagOLLavADu
ghanunigA prahlAduni gAchukunnADu
manasichchina suralatO mATalADuchunnavADu
anupamatEjuDamma ahObalESuDu

vEvElu chEtulavADu vennelachAyalavADu
bhAviMchi kolchinavAri pAliTivADu
SrIvEMkaTagirimIda jEri bhavanASidaMDa-
nAvala nIvala miMche nahObalESuDu

550.ఉన్నమంత్రాలిందు సదా - unnamaMtrAliMdu sadA




Audio link : PriyaSisters
Archive link :

ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే
విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము

పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము
అరయనిదొక్కటేపో హరినామమంత్రము

యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము
వోజదప్పితే జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము
సాజమైన దిదెపో సత్యమైన మంత్రము

యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము
సహజమై వేదాలసారమంత్రము
బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము
విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము
unnamaMtrAliMdu sadA(rA) vogivichAriMchukoMTE
vinnakannavArikella vishNunAmamaMtramu

paraga puchchakAyala parasipOdu maMtramu
garima muTTaMTulEni ghanamaMtramu
varusa nevvaru vinnA vADicheDanimaMtramu
arayanidokkaTEpO harinAmamaMtramu

yEjAtinOrikaina neMgili lEni maMtramu
vOjadappitE jeDakavuMDE maMtramu
tEjAna nokarikistE tIripOnimaMtramu
sAjamaina didepO satyamaina maMtramu

yihamu paramu tAnE yiyyajAlina maMtramu
sahajamai vEdAlasAramaMtramu
bahunAradAdulella pATapADinamaMtramu
vihitamayina SrIvEMkaTESumaMtramu


GB Shankar rao gari vivarana (from sujanaranjani)

విష్ణు నామ మంత్ర విశిష్టతను ఈ సంకీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆచార్య పురుషుడు! శ్రీ మహా విష్ణు మంత్రము సాటిలేనిది, తత్త్వ విచారణతో చూస్తే దీనికి సాటికి రాగల మరొక మంత్రం లేదు. (మరొక సంకీర్తనలో కూడా అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అని అంటాడు). హరి నామ మంత్రము ముట్టు, అంటూ లేనిది. ఎవరైనా వినవచ్చు, పఠించవచ్చు! కులమత జాతి బేధములు లేక ఈ మంత్రోపాసన, మంత్రోఛ్ఛారణ చెయ్యవచ్చు. (రామానుజ సిద్ధాంతం) ఇది ఎంతమందికి పంచినా తరగని మంత్రము! సకల వేదాల సారమైన ఈ మంత్రం ఇహపరాలను అవలీలగా అందిస్తుంది. విష్ణు భక్తులైన నారదాదులు భక్తితో పాటలుగా పాడుకున్న మంత్రం! కలియుగంలో మనందరకు శ్రీ వెంకటేశ మంత్రంగా విహితమైనది! దానిని అన్నమయ్య సంకీర్తనలో పాడుకుందాం రండి!
పరగ = అతిశయము; గరిమ = గొప్పతనము; అరయ = చూడగా;
వోజ = క్రమము;
సాజము = సహజము;
విహితము = హితకరమైనది

Sunday, November 23, 2008

549.UrakE dorakunA vunnatOnnatasukhamu - ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము


Audio link : MangalampalliBalaMuraliKrishna
Audio link :MangalampalliRajeswari
Archive link :

ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము
సారంబు తెలిసికా జయము చేకొనుట

తలపు లోపలిచింత దాటినప్పుడు కదా
అలరి దైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడుగదా
తలకొన్న మోక్షంబు తనకు జేపడుట

కర్మంబుకసటు వోగడిగినప్పుడుగదా
నిర్మలజ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీ మఱుగుచొచ్చినగదా
కూర్మి తనజన్మ మెక్కుడు కెక్కుడౌట


తనశాంతమాత్మలో తగిలినప్పుడు గదా
పనిగొన్నతనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినగదా దరిచేరిమనుట


UrakE dorakunA vunnatOnnatasukhamu
sAraMbu telisikA jayamu chEkonuTa

talapu lOpalichiMta dATinappuDu kadA
alari daivaMbu pratyakshamauTa
kalushaMpu durmadamu gaDachinappuDugadA
talakonna mOkshaMbu tanaku jEpaDuTa

karmaMbukasaTu vOgaDiginappuDugadA
nirmalaj~nAnaMbu neravEruTa
marmaMbu SrIhari nI ma~ruguchochchinagadA
kUrmi tanajanma mekkuDu kekkuDauTa



tanaSAMtamAtmalO tagilinappuDu gadA
panigonnatanachaduvu phaliyiMchuTa
yenalEni SrIvEMkaTESwaruni dAsyaMbu
tanaku nabbinagadA darichErimanuTa

Thursday, October 16, 2008

548.paripUrNu(Davu nIvu parAkunnadA - పరిపూర్ణు(డవు నీవు పరాకున్నదా




Audio link :GBKP
Archive link :
పరిపూర్ణు(డవు నీవు పరాకున్నదా నిన్ను
మరిగి వుండనిదే మావల్ల దప్పు గాకా

వినవా నీ వేమియైనా విశ్వమెల్లా వీనులే
యెనసి విన్నవించని యెడ్డతన మింతే కాక
కనవా నీ విన్నియు నీ కన్నులే యెందు చూచినా
పనితో నా భావము చూపని నేరమి గాకా

పలుకవా నీ వేమియైనా బహుశబ్దమయుడవు
అలరి పిలువని నా యవివేక మింతే కాక
నిలువవా నా ముందర నిఖిలస్వరూపడవు
తెలిసి చూడలేని సందేహ మింతే కాక

మన్నించవా నీవేమి మఱగు చొచ్చితి నంటే
పన్ని మత్తుడనై యున్న నా కర్మము గాక
యిన్నిట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిన్నాళ్ళెఱుగని భాగ్యమిట్టుండె( గాకా

paripUrNu(Davu nIvu parAkunnadA ninnu
marigi vuMDanidE mAvalla dappu gAkA


vinavA nI vEmiyainA viSwamellA vInulE
yenasi vinnaviMchani yeDDatana miMtE kAka
kanavA nI vinniyu nI kannulE yeMdu chUchinA
panitO nA bhAvamu chUpani nErami gAkA


palukavA nI vEmiyainA bahuSabdamayuDavu
alari piluvani nA yavivEka miMtE kAka
niluvavA nA muMdara nikhilaswarUpaDavu
telisi chUDalEni saMdEha miMtE kAka


manniMchavA nIvEmi ma~ragu chochchiti naMTE
panni mattuDanai yunna nA karmamu gAka
yinniTa SrIvEMkaTESa yElitivi nannu niTTe
yinnALLe~rugani bhAgyamiTTuMDe( gAkA

Tuesday, October 14, 2008

547.చూడవమ్మ యశోదమ్మ - cUDavamma yaSOdamma




Audio link :SJanaki
Archive link :
ప చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో
చ పొంచి పులివాలు పెరుగు మించు మించు మీగడలు
వంచి వారలు వట్టిన కంచపుటుట్ల కాగులివో
చ పేరీ బేరని నేతులు చూరల వెన్నల జున్నులును
ఆరగించి యట నగుబాళ్ళు పార వేసిన బానలివిగో
చ తెల్లని కను దీగల సోగల చల్ల లమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి కొల్లలాడిన గురుతు లివిగో


pa cUDavamma yaSOdamma vADa vADala varadalivigO
ca poMci pulivAlu perugu miMcu miMcu mIgaDalu
vaMci vAralu vaTTina kaMcapuTuTla kAgulivO
ca pErI bErani nEtulu cUrala vennala junnulunu
AragiMci yaTa nagubALLu pAra vEsina bAnalivigO
ca tellani kanu dIgala sOgala calla lammETi javvanula
cellinaTlane SrI vEMkaTapati kollalADina gurutu livigO

Wednesday, October 08, 2008

546.chAla novvi sEyunaTTi - చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి


Audio link : JanakiRamana
Archive link :

చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి
మాలుగలిపి దొరతనంబు మాంపు టింత చాలదా

పుడమి పాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు
కడపరాని బంధములకు కారణంబులైనవి
యెడపకున్న పసిడి సంకెలేమి యినుపసంకెలేమి
మెడకు దగిలి యుండి యెపుడు మీదు చూడరానివి

చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు తనకు
అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టి
యెలమి బసిడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు
ములుగ ములుగ తొలితొలి మోదుటింత చాలదా

కర్మియైనయేమి వికృతకర్మియైనయేమి తనకు
కర్మఫలముమీదకాంక్ష గలుగు టింత చాలదా
మర్మమెరిగి వేంకటేశు మహిమిలనుచు దెలిసినట్టి
నిర్మలాత్ము కిహము పరము నేడు గలిగె చాలదా

chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi
mAlugalipi doratanaMbu mA&npu TiMta chAladA

puDami pApakarmamEmi puNyakarmamEmi tanaku
kaDaparAni baMdhamulaku kAraNaMbulainavi
yeDapakunna pasiDi saMkelEmi yinupasaMkelEmi
meDaku dagili yuMDi yepuDu mIdu chUDarAnivi

chalamukonna ApadEmi saMpadEmi yepuDu tanaku
alamipaTTi du@hkhamulaku nappagiMchinaTTi
yelami basiDigudiyayEmi yinupagudiyayEmi tanaku
muluga muluga tolitoli mOduTiMta chAladA

karmiyainayEmi vikRtakarmiyainayEmi tanaku
karmaphalamumIdakAMksha galugu TiMta chAladA
marmamerigi vEMkaTESu mahimilanuchu delisinaTTi
nirmalAtmu kihamu paramu nEDu galige chAladA

Monday, October 06, 2008

545.tiruvIdhu lEgIni dEvatalu - తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట



Audio link :
Archive link :

తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట 
హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున  

కనకపుఁగొండవంటిఘనమైనరథముపై 
దనుజమర్దనుఁడెక్కెఁ దరుణులతో
వినువీధిఁ బడెగెలు వేవేలు కుచ్చులతోడఁ 
బెనగొనఁగఁ గదలె భేరులు మ్రోయఁగను  

వరుసఁ జంద్రసూర్యులవంటిబండికండ్లతోడ
గరుడధ్వజుఁ డొరసీఁ గడు దిక్కులు 
విరుగువేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ 
సరుగ దుష్టులఁ గొట్టి జయము చేకొనెను  

ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను 
యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక
వాటపుసింగారముతో వాకిటవచ్చి నిలిచీ 
కోటానఁగోటివరాలు కొమ్మని ఇచ్చుచును


tiruvIdhu lEgIni dEvatalu jayaveTTa 
hari vADe peMDlikoDukai pratApamuna 

kanakapugoMDavaMTighanamainarathamupai 
danujamardanuDekke daruNulatO 
vinuvIdhi baDegelu vEvElu kuchchulatODa 
benagonaga gadale bhErulu mrOyaganu  

varusa jaMdrasUryulavaMTibaMDikaMDlatODa 
garuDadhvaju DorasE gaDu dikkulu 
viruguvEdarAsulE paggAlu vaTTitiyyaga 
saruga dushTula goTTi jayamu chEkonenu  

aaTalu bATalu viMTA nalamElmaMgayu( dAnu 
yITuna SrIvEMkaTaeSu@M DedurulEka 
vATapusiMgAramutO vAkiTavachchi nilichI 
kOTAna@MgOTivarAlu kommani ichchuchunu

Sunday, October 05, 2008

544.sAmAnyamA pUrva saMgrahaMbagu - సామాన్యమా పూర్వ సంగ్రహంబగు



Archive link :

ప సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము
నేమమున బెనగొనియె నేడు నీవనక

చ జగతి బ్రాణులకెల్ల సంసారబంధంబు
తగుల బంధించు దురితంపు గర్మమున
మగుడ మారుకుమారు మగువ నీయురముపై
తెగి కట్టిరెవ్వరో దేవుండ వనక

చ పనిలేని జీవులను భవసాగరంబులో
మునుగ లేవగ జేయు మోహదోషమున
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను
వెనకెవ్వరో మొదలి వేలువనక

చ ఉండనీయక జీవనోపాయమున మమ్ము
కొండలను గొబల దతి గొని త్రిప్పుఫలము
కొండలను నెలకొన్న కోనేటి పతి వనగ
నుండవలసెను నీకు నోపలేవనక

pa sAmAnyamA pUrva saMgrahaMbagu Palamu
nEmamuna benagoniye nEDu nIvanaka
ca jagati brANulakella saMsArabaMdhaMbu
tagula baMdhiMcu duritaMpu garmamuna
maguDa mArukumAru maguva nIyuramupai
tegi kaTTirevvarO dEvuMDa vanaka
ca panilEni jIvulanu BavasAgaraMbulO
munuga lEvaga jEyu mOhadOShamuna
panipUni jaladhilO baMDabeTTiri ninnu
venakevvarO modali vEluvanaka
ca uMDanIyaka jIvanOpAyamuna mammu
koMDalanu gobala dati goni trippuPalamu
koMDalanu nelakonna kOnETi pati vanaga
nuMDavalasenu nIku nOpalEvanaka

Saturday, October 04, 2008

543.bhAvamerigina nalla - భావమెరిగిన నల్ల(బల్లి చెన్నుడా



Audio link :
Archive link :

భావమెరిగిన నల్ల(బల్లి చెన్నుడా 
నావద్దనే వుండుమీ నల్ల(బల్లి చెన్నుడా  

వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి 
బాసలు నమ్మితి నల్ల(బల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను 
నా సూటికే మన్నించు నల్ల(బల్లి చెన్నుడా  

క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి  
బయలీదించకు నల్ల(బల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా 
నయములు చూపుమీ నల్ల(బల్లి చెన్నుడా  

యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని 
పనుపడె రతి నల్ల(బల్లి చెన్నుడా 
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి 
నను నిందరిలోపల నల్ల(బల్లి చెన్నుడా 


bhAvamerigina nalla(balli chennuDA 
nAvaddanE vuMDumI nalla(balli chennuDA  

vEsaraka nIvu nAtO vEmAru jEsinaTTi 
bAsalu nammiti nalla(balli chennuDA 
vAsiki vanneku nIku valachi chokkiti nEnu 
nA sUTikE manniMchu nalla(balli chennuDA  

kriya gUDa nEnu nI kEluvaTTi peMDlADiti  
bayalIdiMchaku nalla(balli chennuDA 
priyamulu reTTiMpa benagiti niMdAkA 
nayamulu chUpumI nalla(balli chennuDA  

yenasiti viTu nannu niyyakOlu sEsukoni 
panupaDe rati nalla(balli chennuDA 
ghana SrIvEMkaTAdripai kaMduva nElukoMTivi 
nanu niMdarilOpala nalla(balli chennuDA 


Thursday, October 02, 2008

542.baDalenu pAnupu - బడలెను పానుపు పరచరే


Audio link : Vani Jayaram
Archive link :

బడలెను పానుపు పరచరే
అడుగరే యిదియేమని చెలులు

చెలప చెమటలు మై( జిప్పిలీని
అలసి వచ్చినాడు నేడదే విభుడు
చలువగా( గప్రము పై చల్లగదరే
వెలయ సురటిగొని విసరరే

పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని
పనిసేసి వచ్చినా డప్పటి విభుడు
తనివార చల్లనిగంధము మెత్తరే
నినుపుగ పన్నీరు నించరే

దాగక దప్పి మోవులు దడిపీని
కాగి వచ్చినాడు శ్రీవేంకటవిభుడు
పాగి వాసించినబాగాలియ్యరే
చేగదేర నన్నునేలె సేవలెల్లా జేయరే

baDalenu pAnupu paracharE
aDugarE yidiyEmani chelulu
chelapa chemaTalu mai( jippilIni
alasi vachchinADu nEDadE vibhuDu
chaluvagA( gapramu pai challagadarE
velaya suraTigoni visararE
ponugu niTTUrupula busakoTTIni
panisEsi vachchinA DappaTi vibhuDu
tanivAra challanigaMdhamu mettarE
ninupuga pannIru niMcharE
dAgaka dappi mOvulu daDipIni
kAgi vachchinADu SrIvEMkaTavibhuDu
pAgi vAsiMchinabAgAliyyarE
chEgadEra nannunEle sEvalellA jEyarE

Wednesday, September 24, 2008

541.vaddE golleta vadalakuvE - వద్దే గొల్లెత వదలకువే




Archive link :
ప: వద్దే గొల్లెత వదలకువే నీ- ముద్దుమాటలకు మొక్కేమయ్యా
చ: యేలే యేలే యేలే గొల్లెత నాలాగెరగవా నన్నునే చేవు
చాలుజాలు నిక జాలు నీరచనలు పోలవు బొంకులు పోవయ్యా
చ: కానీ కానీ కానిలే గొల్లెత పోనీలే నీవెందు వోయిననుమాని మాని పలుమారు జెనుకుచు మా- తోనిటు సొలయక తొలవయ్యా
చ: రావా రావా రావా గొల్లెత శ్రీ వేంకటగిరి చెలువుడనునీవె నీవె నను నించితి కౌగిట కైవశమైతిని గదవయ్యా


pa: vaddE golleta vadalakuvE nI- muddumATalaku mokkEmayyA
ca: yElE yElE yElE golleta nAlAgeragavA nannunE cEvu
cAlujAlu nikajAlu nIracanalu pOlavu boMkulu pOvayyA
ca: kAnI kAnI kAnilE golleta pOnIlE nIveMdu vOyinanu
mAni mAni palumAru jenukucu mA- tOniTu solayaka tolavayyA
ca: rAvA rAvA rAvA golleta SrI vEMkaTagiri celuvuDanu
nIve nIve nanu niMciti kaugiTa kaivaSamaitini gadavayyA

Monday, September 22, 2008

540.pAladoMgavadda vachchi - పాలదొంగవద్ద వచ్చి పాడేరు



Audio link :GBKP
Archive link :
ప పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటిదైవమని బ్రహ్మాదులు

చ రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబరభాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చ నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చ ముద్దులు మోమునగార మూలలమూలలదాగె-
బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు


pa: pAladoMga vadda vacci pADEru tama-
pAliTidaivamani brahmAdulu
ca: rOla gaTTiMcuka peddarOlalugA
vApOvu bAlunimuMdara vacci pADEru
AlakiMci vinumani yaMbaraBAgamunaMdu
nAlugudikkulanuMDi nAradAdulu
ca: nOruniMDA jollugAra nUgi dhULimEnitO

pArETibiDDanivadda bADEru
vErulEnivEdamulu veMTaveMTa jaduvucu
jEricEri yiMtanaMta SEShAdulu
ca: muddulu mOmunagAra mUlalamUlaladAge-
baddulabAlunuvadda bADEru addivO
SrItiruvEMkaTAdrISu DitaDani
caddiki vEDiki vacci sanakAdulu

Saturday, September 20, 2008

539. konarO konarO mIru - కొనరో కొనరో మీరు కూరిమి మందు



Audio link :CPadmaja
Audio link :VoletiVenkateswarlu

Ragam : Mohana, Misrachapu talam.
Archive link :


కొనరో కొనరో మీరు కూరిమి మందు
ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు

ధృవుడు గొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు
చవిగా గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పారగ పెద్దలు మున్ను
జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు , జనకుడు
గెలుపుతో కొని బ్రదికిన యా మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు
కలకాలము గొని కడగన్న మందు
అజునకు పరమాయువై యొసగిన మందు
నిజమై లోకమెల్లా నిండిన మందు
త్రిజగములు నెఱుగ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు


konarO konarO mIru kUrimi maMdu
uniki maniki kellA okkaTE maMdu

dhRvuDu gonina maMdu tolli prahlAduDu
chavigA gonina maMdu challani maMdu
bhavarOgamulu vIDi pAraga peddalu munnu
java kaTTukonina nichchalamaina maMdu

nilichi nAraduDu gonina maMdu , janakuDu
geluputO koni bradikina yA maMdu
molachi nAlugu yugamula rAjulu ghanulu
kalakAlamu goni kaDaganna maMdu

ajunaku paramAyuvai yosagina maMdu
nijamai lOkamellA niMDina maMdu
trijagamulu ne~ruga tiruvEMkaTAdripai
dhwajamettE kOnETi darinunna maMdu

Meaning by GB Sankara Rao garu in sujanaranjani
మనం భౌతిక రోగాలు పోవడానికి, ఉపశమనం కలగడానికి అనేక రకాలైన మందులు వేసుకుంటాం! కాని అన్నమయ్య ఇక్కడ జీవుల మనుగడకు శాశ్వతమై ఉన్న మందు ఒక్కటే! అదే శ్రీ వేంకటేశ్వరుడు! దానిని తీసుకొనండి! ధన్యులు కండి అంటూ ప్రహ్లాదుడు, నారదుడు, జనకుడు, బ్రహ్మ మొదలగువారంతా ఈ మందును సేవించి తరించారు కాబట్టి మనమంతా ఈ ఔషధాన్ని స్వీకరిద్దాం! అని విజ్ఞానదాయకమైన బోధను చేశాడు! మరి మనమంతా కలియుగంలో తిరువేంకటేద్రిపై కోనేటి దరినున్న ఆ మందును (శ్రీ వేంకటశ్వరుని) తీసుకుందామా! (ఆశ్రయిద్దామా!)
ఉనికి మనికికి = ఉండుటకు, బ్రదుకుటకును;
జవకట్టికొనిన = పొదిగి కొనిన, స్వాధీనము గావించుకొన్న;
నిచ్చలము = నిశ్చలము

Saturday, September 13, 2008

538.kolichitE rakShiMchE - కొలిచితే రక్షించే గోవిందుడితడు



Click here to download this kirtana sung by Shobharaju(?)
Audio link :SPB
Archive link :


కొలిచితే రక్షించే గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు

గోవర్థనమెత్తినట్టి గోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు

కౄరకాళింగ మర్దన గోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు

కుందనపు కాశతోడి గోవిందుడితడు
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు


kolichitE rakShiMchE gOviMduDitaDu
yilaku lakshmiki magaDI gOviMduDitaDu

gOvarthanamettinaTTi gOviMduDitaDu
vEvElu golletala gOviMduDitaDu
kOviduDai AlagAchE gOviMduDitaDu
Avala kaMsu(jaMpina AgOviMduDitaDu

kRUrakALiMga mardana gOviMduDitaDu
vIra chakrAyudhapu gOviMduDitaDu
kOri samudrAlu dATE gOviMduDitaDu
ArIti bAlura (dechchE yAgOviMduDitaDu

kuMdanapu kASatODi gOviMduDitaDu
viMdula rEpalle gOviMduDitaDu
poMdi SrIvEMkaTAdripai posaga tirupatilO
aMdamai pavvaLiMchina A gOviMduDitaDu