Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, November 30, 2007

360.AMganaku nIvE akhilasAmrAjyamu - అంగనకు నీవే అఖిలసామ్రాజ్యము


Archive Audio link 
అంగనకు నీవే
అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు
శ్రీసతినిధానము

కమలాలపానుపు
కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు
పాలజలధి
అమరు నీభుజాంతర
మట్టె తీగెపొదరిల్లు
రమణీయ (ప్ర)హారాలు
రత్నాలమేడలు


సతికి నీమెడా రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర

నెమ్మి నలమేల్మంగ నీకౌగిలి పెండ్లిపీట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భోగము


AMganaku nIvE akhilasAmrAjyamu
SriMgArarAya(Da nIku SrIsatinidhAnamu

kamalAlapAnupu kAMtaku nIvuramu
pramadapu nImanasu pAlajaladhi
amaru nIbhujAMtara maTTe tIgepodarillu
ramaNIya (pra)hArAlu ratnAlamEDalu

satiki nImeDA ratisAmu sEsEkaMbamu
pratilEni vayyALi bayalu nIvu
matiMchina kaustubhamaNi niluvuTaddamu
mitilEni SrIvatsamu miMchubaMDArumudra

nemmi nalamElmaMga nIkaugili peMDlipITa
chimmula chaMdanacharcha sEsapAlu
vummaDi meDanULLu vuyyAlasarapaNulu
pammi SrIvEMkaTESa nIbhAvamE bhOgamu

359.Matanga parvatamaada - మతంగ పర్వతామాడ

Archive Audio link: Shobharaju
మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడ

ఈతడా రాముని బంటు ఈతడా వాయు సుతుడు
ఆతతబలాడ్యూలందురు ఆతడితడా
సీతను వెదకి వచ్చి చెప్పిన ఆతడితడా
ఘాతల లంకలోని రాక్షస వైరి ఇతడ

ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడు ఇతడ
సంజీవిని కొండ దెచ్చే సారె నితడా
భంజిన్‌చె గాలనేమిని పంతముననితడా
రంజితప్రతాప కపిరాజ సఖుడితడా

చీరజీవి ఈతడ జీతేంద్రీయుడు ఇతడ
సురలకు ఉపకారపు చుట్టము ఈతడ
నిరతి శ్రీ వేంకటాద్రీని వి నగరములో
నరిది వరములిచ్చి అందరికి ఇతడ


Matanga parvatamaada maalyavanthamu needa
Atishayillina pedda hanumanthudu ithada

Eethada raamuni bantu eethada vaayu suthudu
Aathatha balaadhyulanduru aathadithada
Seethanu vedaki vachi cheppina aathadithada
Ghathala lankaloni rakshasa vairi ithada

Anjanaasuthudithada akshamardhanudithada
Sanjeevini konda dechhe saarenithada
Bhanjinche gaalanemini panthamunanithada
Ranjitha prathapa kapiraaja sakhudithada

Chirajeevi eethada jithendriyudu ithada
Suralaku upakaarapu chuttamu eethada
Nirathi sree venkatadrini vijanagaramulo
Naridi varamulichhi andariki ithada

358.nelamUDu SOBanAlu - నెలమూడు శోభనాలు

Archive Audio link
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||


pa|| nelamUDu SOBanAlu nIku natanikidagu | kalakAlamunu niccakalyANamammA
ca|| rAmanAmamatanidi rAmavu nIvaitEnu | cAmana varNamataDu cAmavu nIvu |
vAmanuDaMduratani vAmanayanavu nIvu | prEmapumI yiddariki pErubalamokaTE
ca|| hari pErAtaniki hariNEkShaNavu nIvu | karigAcedAnu nIvu kariyAnavu |
sari jaladhiSAyi jaladhikanyavu nIvu | berasi mIyiddariki bErubalamokaTE ||
ca|| jalaja nABuDataDu jalajamuKivi nIvu | alamElumaMgavu ninnelamedAnu |
ilalO SrIvEMkaTESuDiTu ninnurAnamOce | pilici pEruceppebErubalamokaTE ||

Thursday, November 29, 2007

357.kalaSApuramukADa gaMdhapumAkula - కలశాపురముకాడ గంధపుమాకుల

Archive Audio link 
కలశాపురముకాడ గంధపుమాకుల నీడ
నలరేవు మేలు మేలు హనుమంతరాయ

సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బతికించి
భంజించితి వసురుల బలువిడిని
కంజాప్తకులరాఘవుని మెప్పించితివి
అంజనీతనయ వో హనుమంతరాయ

లంక సాధించితివి వీలావులెల్లా జూపితివి
కొంకక రాముని సీత( గూరిచితివి
లంకెల సుగ్రీవునికి లలి ప్రధానివైతివి
అంకెలెల్లా నీకు జెల్లె హనుమంతరాయ

దిక్కులు గెలిచితివి ధీరత( బూజ గొంటివి
మిక్కిలిప్రతాపాన మెరసితివి
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరుబంట వైతివి
అక్కజపుమహిమల హనుమంతరాయ


kalaSApuramukADa gaMdhapumAkula nIDa
nalarEvu mElu mElu hanumaMtarAya

saMjIvi koMDa techchi saumitri batikiMchi
bhaMjiMchiti vasurula baluviDini
kaMjAptakularAghavuni meppimchitivi
amjanItanaya vO hanumaMtarAya

laMka sAdhiMchitivi vIlAvulellA jUpitivi
koMkaka rAmuni sIta( gUrichitivi
laMkela sugrIvuniki lali pradhAnivaitivi
aMkelellA nIku jelle hanumaMtarAya

dikkulu gelichitivi dhIrata( bUja goMTivi
mikkilipratApAna merasitivi
ikkuvatO SrIvEMkaTESwarubaMTa vaitivi
akkajapumahimala hanumaMtarAya

356.nATiki nADE nAcaduvu - నాటికి నాడే నాచదువు

Archive Audio link
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచదువు |
మనసున నీతిని మరచుటకే పో | పనివడి యిప్పటి ప్రౌఢలచదువు ||
చ|| తెలిసి యితనినే తెలియుటకే పో | తొలుత గృతయుగాదుల చదువు |
కలిగియీతని గాదననే పో | కలియుగంబులో గలిగిన చదువు ||
చ|| పరమై వేంకటపతి గనుటకే పో | దొరలగు బ్రహ్మాదుల చదువు |
సిరుల నితని మరచెడికొరకే పో | విరసపుజీవుల విద్యలచదువు ||


pa|| nATiki nADE nAcaduvu | mATalADucunu maracETicaduvu ||
ca|| enaya nItani neruguTakE pO | venakavAru cadivinacaduvu |
manasuna nItini maracuTakE pO | panivaDi yippaTi prauDhalacaduvu ||
ca|| telisi yitaninE teliyuTakE pO | toluta gRtayugAdula caduvu |
kaligiyItani gAdananE pO | kaliyugaMbulO galigina caduvu ||
ca|| paramai vEMkaTapati ganuTakE pO | doralagu brahmAdula caduvu |
sirula nitani maraceDikorakE pO | virasapujIvula vidyalacaduvu ||

Wednesday, November 28, 2007

355.vEvElacaMdAla vADu - వేవేలచందాల వాడు విఠలేశుడు


Archive Audio link : vani jayaram, parupalli brothers
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు ||
చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి | అతిశయిల్లేటి పరమానందమితడు ||
చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
చ|| వరముతో యశోద వసుదేవాదులకు | పరగిన కన్నుల పండుగీతడు |

సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | నిరతి దాసుల పాలి నిధాన మితడు ||

pa|| vEvElacaMdAla vADu viThalESuDu | BAviMca nalavigAni paramAtmuDitaDu ||
ca|| satatamu rukmiNI satyaBAmala naDuma | ratikekkina siMgAra rAyaDu itaDu |
caturata sanakAdi saMyamIMdrula mati | atiSayillETi paramAnaMdamitaDu ||
ca|| dEvatala kellAnu dikku desai velugoMdi | tAvu konnayaTTi yAdhAra mItaDu |
mUvoMka golletalu munnu sEsina tapamu | kaivasamai PaliMcina GanaBAgya mitaDu ||
ca|| varamutO yaSOda vasudEvAdulaku | paragina kannula paMDugItaDu |
sirula miMcina yaTTi SrI vEMkaTAdri mIdi | nirati dAsula pAli nidhAna mitaDu ||

354.unnatOnnatuDu vuDayavaru-ఉన్నతోన్నతుడు వుడయవరు

Archive Audio link : G Balakrishnaprasad
ఉన్నతోన్నతుడు వుడయవరు
యెన్న ననంతుడే యీ వుడయవరు
సర్వలోకముల శాస్త్రరహస్యము
లుర్వి( బొడమె నీ యుడయవరు
పూర్వపు వేదాంత పుణ్యశాస్రములు
నిర్వహించె నన్నిటా నుడయవరు
వెక్కస(పు శ్రీవిష్ణుభక్తియే
వొక్కరూపమే వుడయవరు
చక్కనైన సుజ్ఞానమున కిరవై
వుక్కు మీఱెనిదె వుడయవరు
కదినె మోక్షసాకారము దానై
వుదుటున నిలిచె నీ వుడయవరు
యిదిగో శ్రీవేంకటేశ్వరు యీ(నీ)డై
పొదలుచు నున్నాడు భువి నుడయవరు


unnatOnnatuDu vuDayavaru
yenna nanaMtuDE yI vuDayavaru

sarwalOkamula SAstrarahasyamu
lurvi( boDame nI yuDayavaru
pUrwapu vEdAMta puNyaSAsramulu
nirwahiMche nanniTA nuDayavaru

vekkasa(pu SrIvishNubhaktiyE
vokkarUpamE vuDayavaru
chakkanaina suj~nAnamuna kiravai
vukku mI~renide vuDayavaru

kadine mOkshasAkAramu dAnai
vuduTuna niliche nI vuDayavaru
yidigO SrIvEMkaTESwaru yI(nI)Dai
podaluchu nunnADu bhuvi nuDayavaru

Monday, November 26, 2007

353.sarvAMtarAtmuDavu - సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను

ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||

చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||

చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||

చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||

sarvAMtarAtmuDavu (Raagam: ) (Taalam: )
pa|| sarvAMtarAtmuDavu SaraNAgatuDa nEnu | sarvAparAdhinaiti cAlujAlunayyA ||

ca|| vUrakunnajIvuniki vokkokka svataMtramicci | kOrETiyaparAdhAlu konni vEsi |
nErakuMTE narakamu nEricitE svargamaMTU | dUruvEsEviMtEkAka dOShamevvaridayyA ||

ca|| manasu cUDavalasi mAyalu nIvE kappi | janulaku viShayAlu cavulucUpi |
kanugoMTE mOkShamicci kAnakuMTe karmamicci | Ganamu sEsEviMdu kartalevvarayyA ||

ca|| vunnAru prANulellA nokkanIgarBamulOnE | kannakanna BramatalE kalpiMci |
yinniTA SrIvEMkaTESa yElitivi mammu niTTe | ninnu nannu neMcukuMTE nIkE teliyunayyA ||


Saturday, November 24, 2007

352.jayalakshmI varalakshmI - జయలక్ష్మీ వరలక్ష్మీ


Archive Audio link : G Balakrishnaprasad
Meaning : Tadepalli Patanjali
యలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ

పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ

చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ


jayalakshmI varalakshmI saMgrAma vIralakshmi
priyurAlavai hariki( berasiti vamma

pAlajalanidhilOni pasanaina mIgaDa
mElimi tAmeralOni miMcu vAsana
nIlavarNunuramupai niMDina nidhAnamavai
ElEvu lOkamulu mammElavamma

chaMdurutODabuTTina saMpadala meraguvO
kaMduva brahmalagAchE kalpavallivO
aMdina gOviMduniki aMDanE tODu nIDai
vuMdAnavu mA yiMTanE vuMDavammA

padiyAru vannelatO baMgAru patima
chedarani vEdamula chiguru bODi
eduTa SrIvEMkaTESu nillAlavai nIvu
nidhula nilichE talli nIvAramamma

Friday, November 23, 2007

351.paripUrNagaruDAdripaMcAnanaM- పరిపూర్ణగరుడాద్రిపంచాననం

Archive Audio link : G Balakrishnaprasad , D Pasupati
ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
చ|| కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం | పారీణచక్రధర పంచాననం |
వీరపంచాననం విజయపంచాననం | భారభూభారహరపంచాననం ||
చ|| దివిజపంచాననం తీవ్రనఖకాననం | భవనాశినీతీరపంచాననం |
కువలయాకాశసంఘోషపంచాననం | పవిశబ్దదంతరవపంచాననం ||
చ| శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం | పావనం పంచముఖపంచాననం |
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం | భావితం శ్రీయుక్తపంచాననం ||


pa|| paripUrNagaruDAdripaMcAnanaM | paramaM sEvE paMcAnanaM ||
ca|| kRUradaMShTrAgnikaNaGOrapaMcAnanaM | pArINacakradhara paMcAnanaM |
vIrapaMcAnanaM vijayapaMcAnanaM | BAraBUBAraharapaMcAnanaM ||
ca|| divijapaMcAnanaM tIvranaKakAnanaM | BavanASinItIrapaMcAnanaM |
kuvalayAkASasaMGOShapaMcAnanaM | paviSabdadaMtaravapaMcAnanaM ||
ca| SrIvEMkaTAKya GanaSiKaripaMcAnanaM | pAvanaM paMcamuKapaMcAnanaM |
sEvitaprahlAdasiddhipaMcAnanaM | BAvitaM SrIyuktapaMcAnanaM ||

Tuesday, November 20, 2007

350.pUjalaMdaru jEsEdE pushpayAgamu - పూజలందరు జేసేదే పుష్పయాగము


Archive Audio link : G Balakrishnaprasad
పూజలందరు జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము

మొదల శ్రీసతి చేతి మోహన కమలమే
పొదల నీకెపుడును పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు
పొదిగి పూజించిన పుష్పయాగము

మాలాకారుడిచ్చిన మధురలో పూదండా
పోలింప నీకు నదె పుష్పయాగము
కేలితో నారదుడొసగిన పారిజాతము
భుఊలోకమున నీకు పుష్పయాగము

తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీవురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ నీకు
పొరిపొరి జేసేరు పుష్పయాగము
pUjalaMdaru jEsEdE pushpayAgamu
Aji narjunuDu chEsinadi pushpayAgamu

modala SrIsati chEti mOhana kamalamE
podala nIkepuDunu pushpayAgamu
gudigona mimmiddari gUDimchE maruvirulu
podigi pUjiMchina pushpayAgamu

mAlAkAruDichchina madhuralO pUdaMDA
pOliMpa nIku nade pushpayAgamu
kElitO nAraduDosagina pArijAtamu
bhuUlOkamuna nIku pushpayAgamu

torali alamElmaMga turumuna virulE nIku
porasi nIvuramupai pushpayAgamu
sirulatO munulella SrIvEMkaTAdrISa nIku
poripori jEsEru pushpayAgamu

349.paTTamu gaTTitiviMka - పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా


Audio link : Balakrishnaprasad
Archive Audio link: G Balakrishnaprasad
ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
చ|| అలమేలు మంగకు సింహాసనము నీవురము | కలిత హారములే సింగారపు దండలు |
తొలుత నీహస్తములే తోరణ గంభములు | చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||
చ|| పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు | మెరుగు గౌస్తుభమణి మించుటద్దము |
గరిమ నీసొబగులు కప్పములు గానికలు | సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా ||
చ|| సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు | వింత రతి భోగములు వినోదాలు |
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి | చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా ||


pa|| paTTamu gaTTitiviMka bratukarayyA | ciTTakAlu lEvu mIku SrI vEMkaTESuDA ||
ca|| alamElu maMgaku siMhAsanamu nIvuramu | kalita hAramulE siMgArapu daMDalu |
toluta nIhastamulE tOraNa gaMBamulu | celi rAjyamE nIvu SrI vEMkaTESuDA ||
ca|| paragu tulasIdaMDa pacca tOraNamApeku | merugu gaustuBamaNi miMcuTaddamu |
garima nIsobagulu kappamulu gAnikalu | sirulu nI kUrimalu SrI vEMkaTESuDA ||
ca|| saMtatamaina viMdulu sAre nImOvi tEnelu | viMta rati BOgamulu vinOdAlu |
koMta niyyArunu boDDu kuMceyu gALANi | ceMtalanannI namare SrI vEMkaTESuDA ||

348.vishNuDE yiMtAnani bhAviMchuTE - విష్ణుడే యింతానని భావించుటే బుధ్ధి

Archive Audio link : Shobharaju
విష్ణుడే యింతానని భావించుటే బుధ్ధి
వైష్ణవుడై యాచార్యసేవసేయుటే బుధ్ధి

కొండవంటితనలోనికోపము రేగ వచ్చితే
దండనే యెచ్చిరి వూరకుండుటే బుధ్ధి
మెండుగా బరకాంతలమీదితమి పుట్టితేను
అండుకాచందుకు భ్రమయకుండుటే బుధ్ధి

అట్టె యెవ్వరయినా గృహారామాదులపై నాస
వుట్టించితే వానివెంట బోనిదే బుధ్ధి
చుట్టపుసమ్మంధాన సోకితే పరబాధలు
చుట్టుకోక లోనుగాక జునుగుటే బుధ్ధి

తప్పదింతా దైవికమే తనవద్దనున్నవారి
దప్పులువట్టనిదే తగినబుధ్ధి
యెప్పుడూ శ్రీవేంకటేశుడెదలోన నున్నవాడు
చొప్పెత్తి యాతనిమూర్తి చూచుటే బుధ్ధి


vishNuDE yiMtAnani bhAviMchuTE budhdhi
vaishNavuDai yAchAryasEvasEyuTE budhdhi

koMDavaMTitanalOnikOpamu rEga vachchitE
daMDanE yechchiri vUrakuMDuTE budhdhi
meMDugA barakAMtalamIditami puTTitEnu
aMDukAchaMduku bhramayakuMDuTE budhdhi

aTTe yevvarayinA gRhArAmAdulapai nAsa
vuTTiMchitE vAniveMTa bOnidE budhdhi
chuTTapusammaMdhAna sOkitE parabAdhalu
chuTTukOka lOnugAka junuguTE budhdhi

tappadiMtA daivikamE tanavaddanunnavAri
dappuluvaTTanidE taginabudhdhi
yeppuDU SrIvEMkaTESuDedalOna nunnavADu
choppetti yAtanimUrti chUchuTE budhdhi

Sunday, November 18, 2007

347.vEdaMbevvani vedakeDivi - వేదంబెవ్వని వెదకెడివి



Archive Audio link : Priya Sisters
ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||
చ|| అలరిన చైతన్యాత్మకు డెవ్వడు | కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ | యిల నాతని భజియించుడీ ||
చ|| కడగి సకలరక్షకు డిందెవ్వడు | వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తౄప్తులు పితరు లెవ్వనిని | దడవిన ఘనుడాతని గనుడు ||
చ|| కదసి సకలలోకంబుల వారలు | యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||


pa|| vEdaM bevvani vedakeDivi | AdEvuni goniyADuDI ||
ca|| alarina caitanyAtmaku DevvaDu | kalaDevva DecaTa galaDanina |
talatu revvanini danuviyOgadaSa | yila nAtani BajiyiMcuDI ||
ca|| kaDagi sakalarakShaku DiMdevvaDu | vaDi niMtayu nevvanimayamu
piDikiTa tRuptulu pitaru levvanini | daDavina GanuDAtani ganuDu ||
ca|| kadasi sakalalOkaMbula vAralu | yidivO koliceda revvanini |
tridaSavaMdyuDagu tiruvEMkaTapati | vedaki vedaki sEviMcuDI ||

346.viShNuDokkaDE viSwAtmakuDu - విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు


Arvhie Audio link : Mangalampalli Balamuralikrishna
విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
వైష్ణవమే సర్వంబును

పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ
యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే

అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే
viShNuDokkaDE viSwAtmakuDu
vaiShNavamE sarvaMbunu

paramEShThi nEyubrahmAMDasRShThiyu
harunilOni saMhAraSakti
paragaga niMdruniparipAlanamunu
arasichUDa SrIharimahima

yilapaMchabhUtamulalO guNamulu
ala navagrahavihAramulu
talakonu kAlatrayadharMAmbunu
alaraga nArAyaNunimahimalE

aMtaTa galamAyAvilAsamulu
poMta paramapadabhOgamulu
maMtukunekkinamarisamastamunu
yiMtayu SrIvEMkaTESumahimalE

345.vEdamu dIrchadu vErE SAstramulu - వేదము దీర్చదు వేరే శాస్త్రములు

Archive Audio link : Mangalampalli Balamuralikrishna
వేదము దీర్చదు వేరే శాస్త్రములు
యేదియు దీర్చదు యిది నీమాయ

నీవల్ల బ్రతికిరి నిండుదేవతలు
నీవల్ల నసురులు నెఱిజెడిరి
ఆవల నిందరి కాత్మవు నీవే
చేవదేరె నీచిక్కులే భువిని

నెమ్మి పాండవుల నీవారంటివి
కమ్మర విడిచితి కౌరవుల
యిమ్ముల నీవావి యిద్దరికొకటే
కెమ్మలాయ నీతీరనిచిక్కు

జగమున నీదే స్వతంత్రమెల్లా
నెగడినజీవులు నీవారు
తగు శ్రీవేంకటదయివమ యిన్నియు
తెగి నీదాసులు తెలిసిన చిక్కు


vEdamu dIrchadu vErE SAstramulu
yEdiyu dIrchadu yidi nImAya

nIvalla bratikiri niMDudEvatalu
nIvalla nasurulu ne~rijeDiri
Avala niMdari kAtmavu nIvE
chEvadEre nIchikkulE bhuvini

nemmi pAMdavula nIvAraMTivi
kammara viDichiti kauravula
yimmula nIvAvi yiddarikokaTE
kemmalAya nItIranichikku

jagamuna nIdE swataMtramellA
negaDinajIvulu nIvAru
tagu SrIvEMkaTadayivama yinniyu
tegi nIdAsulu telisina chikku

Saturday, November 17, 2007

344.inniTa niMtaTa iravokaTE - ఇన్నిట నింతట ఇరవొకటే

Archive Audio link : G Balakrishnaprasad
ప|| ఇన్నిట నింతట ఇరవొకటే | వెన్నుని నామమే వేదంబాయె ||
చ|| నళినదళాక్షుని నామ కీర్తనము | కలిగి లోకమున గల దొకటే |
ఇల నిదియే భజియింపగ పుణ్యులు | చెలగి తలప సంజీవని యాయె ||
చ|| కోరిన నచ్యుత గోవిందా యని | ధీరులు తలపగ తెరువకటే |
ఘోరదురితహర గోవర్ధన | నారాయణ యని నమ్మగ గలిగె ||
చ|| తిరువేంకటగిరి దేవుని నామము | ధర తలపగ నాధారమిదె |
గరుడధ్వజుని సుఖప్రద నామము | నరులకెల్ల ప్రాణము తానాయె ||


pa|| inniTa niMtaTa iravokaTE | vennuni nAmamE vEdaMbAye ||
ca|| naLinadaLAkShuni nAma kIrtanamu | kaligi lOkamuna gala dokaTE |
ila nidiyE BajiyiMpaga puNyulu | celagi talapa saMjIvani yAye ||
ca|| kOrina nacyuta gOviMdA yani | dhIrulu talapaga teruvakaTE |
GOraduritahara gOvardhana | nArAyaNa yani nammaga galige ||
ca|| tiruvEMkaTagiri dEvuni nAmamu | dhara talapaga nAdhAramide |
garuDadhvajuni suKaprada nAmamu | narulakella prANamu tAnAye ||

Friday, November 16, 2007

343.ihamEkAni yika baramEkAni-ఇహమేకాని యిక బరమేకాని

Archive Audio link : Balamuralikrishna
ప|| ఇహమేకాని యిక బరమేకాని | బహుళమై హరి నీపైభక్తే చాలు ||
చ|| యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి | కందువనీదాస్యము గలిగితే జాలు |
అంది స్వర్గమేకాని అలనరకమేకాని | అందపునీనామము నాకబ్బుటే చాలు ||
చ|| దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు | కరగి నిన్నుదలచగలితే జాలు |
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు | హరినీసేవాపరుడౌటే చాలు ||
చ|| యిల జదువులురానీ యిటు రాకమాననీ | తలపు నీపాదములతగులే చాలు |
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె | చలపట్టి నాకు నీశరణమేచాలు ||


pa|| ihamEkAni yika baramEkAni | bahuLamai hari nIpaiBaktE cAlu ||
ca|| yeMdu janiMcina nEmi yeccOTanunnanEmi | kaMduvanIdAsyamu galigitE jAlu |
aMdi svargamEkAni alanarakamEkAni | aMdapunInAmamu nAkabbuTE cAlu ||
ca|| dorayainajAlu gaDu ducCapubaMTaina jAlu | karagi ninnudalacagalitE jAlu |
parulumeccinamElu pammidUShiMcinamElu | harinIsEvAparuDauTE cAlu ||
ca|| yila jaduvulurAnI yiTu rAkamAnanI | talapu nIpAdamulatagulE cAlu |
yelami SrIvEMkaTESa yElitivi nannu niTTe | calapaTTi nAku nISaraNamEcAlu ||

Thursday, November 15, 2007

342.sahajavaiShNavAcAravartanula - సహజవైష్ణవాచారవర్తనుల

Archive Audio link : G Balakrishnaprasad
ప|| సహజవైష్ణవాచారవర్తనుల- | సహవాసమె మాసంధ్య ||
చ|| అతిశయమగు శ్రీహరిసంకీర్తన | సతతంబును మాసంధ్య |
మతి రామానుజమతమే మాకును | చతురత మెరసిన సంధ్య ||
చ|| పరమభాగవత పదసేవనయే | సరవి నెన్న మాసంధ్య |
సిరివరుమహిమలు చెలువొందగ వే- |సరక వినుటె మాసంధ్య ||
చ|| మంతుకెక్క తిరుమంత్ర పఠనమే | సంతతమును మాసంధ్య |
కంతుగురుడు వేంకటగిరిరాయని | సంతర్పణమే మాసంధ్య ||


pa|| sahajavaiShNavAcAravartanula- | sahavAsame mAsaMdhya ||
ca|| atiSayamagu SrIharisaMkIrtana | satataMbunu mAsaMdhya |
mati rAmAnujamatamE mAkunu | caturata merasina saMdhya ||
ca|| paramaBAgavata padasEvanayE | saravi nenna mAsaMdhya |
sirivarumahimalu celuvoMdaga vE- |saraka vinuTe mAsaMdhya ||
ca|| maMtukekka tirumaMtra paThanamE | saMtatamunu mAsaMdhya |
kaMtuguruDu vEMkaTagirirAyani | saMtarpaNamE mAsaMdhya ||

341.sakala SAMtikaramu sarvESa-సకల శాంతికరము సర్వేశ

Click for Audio by Nedunuri , have a look at the above rare pic of starwalts..
Archive Audio link 
ప||
సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||
అనుప||
ప్రకటమై మాకునబ్బె బతికించు నిదియె సర్వేశ ||

చ|| మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన | నినుదలచినంతనే నీరౌను|
కనుగొన్న పాపములు కడలేనివైనను | ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును ||

చ|| చేతనంటిపాతకాలు సేనగానే చేసినాను |ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు |
ఘాతలజెవుల వినగా నంటిన పాపము | నీతితో నీ కథవింటే నిమిషాసబాయును ||

చ|| కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల | కాయవు నీ ముద్రలచే గ్రక్కున వీడు |
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా | ఆయమైన నీ శరణాగతిచే నణగు ||


pa|| sakala SAMtikaramu sarvESa nIpai Bakti sarvESa ||
anupa|| prakaTamai mAkunabbe batikiMcu nidiye sarvESa ||
ca|| manasulO pApabuddhi mariyeMta dalacina | ninudalacinaMtanE nIraunu|
kanugonna pApamulu kaDalEnivainanu | GanuDaninnu jUcitE kaDaku dolagunu ||
ca|| cEtanaMTipAtakAlu sEnagAnE cEsinAnu |Atala nIku mrokkitE nanniyu bAyu |
GAtalajevula vinagA naMTina pApamu | nItitO nI kathaviMTE nimiShAsabAyunu ||
ca|| kAyamuna jEsETi karmapu pApamulella | kAyavu nI mudralacE grakkuna vIDu |
yEyeDa vEMkaTESa yEyEpAtakamainA | Ayamaina nI SaraNAgaticE naNagu ||

340. rAmaBadra raGuvIra - రామభద్ర రఘువీర


Archive Audio link 
AUdio link : Parupalli brothers
ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో ||
చ|| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత | భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ |
రాసికెక్కు కోదండరచన విద్యాగురువ | వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా ||
చ|| మారీచసుబాహు మర్దన తాటకాంతక | దారుణ వీరశేఖర ధర్మపాలక |
కారుణ్యరత్నాకర కాకాసురవరద | సారెకు వేదములు జయవెట్టేరయ్యా ||
చ|| సీతారమణ రాజశేఖరశిరోమణి | భూతలపుటయోధ్యా పురనిలయా |
యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ | ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా ||

pa|| rAmaBadra raGuvIra ravivaMSatilaka nI- | nAmamE kAmadhEnuvu namO namO ||
ca|| kausalyAnaMdavardhana Gana daSarathasuta | BAsurayaj~jarakShaka BaratAgraja |
rAsikekku kOdaMDaracana vidyAguruva | vAsitO suralu ninu paDi meccErayyA ||
ca|| mArIcasubAhu mardana tATakAMtaka | dAruNa vIraSEKara dharmapAlaka |
kAruNyaratnAkara kAkAsuravarada | sAreku vEdamulu jayaveTTErayyA ||
ca|| sItAramaNa rAjaSEKaraSirOmaNi | BUtalapuTayOdhyA puranilayA |
yItala SrIvEMkaTAdri niravayinarAGava | GAta nIpratApamellA gaDu niMDenayyA ||

Wednesday, November 14, 2007

339.yajnamUrti yajnakarta - యజ్ఞమూర్తి యజ్ఞకర్త

Archive Audio link : NC Sridevi
యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే

పరికించ జీవులకు ప్రాణమవైన నీకు
నిరతి( బ్రాణప్రతిష్ఠ నేము సేసేమా
మరిగి మా పూజలంది మమ్ముగాచెడికొరకు
హరి నీమూర్తి ప్రాణ మావహించవే

జగతికి నీపాదజలమే సంప్రోక్షణ
జిగినీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున నన్నునేడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే

వేదములు తిచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
యీదెస నీదాసులమయిన మమ్ముగాచుటకు
వేదమూర్తివై యిందే విచ్చేశి వుండవే


yaj~namUrti yaj~nakarta yaj~nabhOkta vinniTAnu
yaj~nAdiphalarUpa miTu nIvai vuMDaVE

parikiMcha jIvulaku prANamavaina nIku
nirati( brANapratishTha nEmu sEsEmA
marigi mA pUjalaMdi mammugAcheDikoraku
hari nImUrti prANa mAvahiMchavE

jagatiki nIpAdajalamE saMprOkshaNa
jiginIku saMprOkshaNa sEyuvAramA
pagaTuna nannunEDu pAvanamu sEyuTaku
agu puNyatIrthamula abhishEkamaMdavE

vEdamulu tichchina SrIvEMkaTESa nEmu nIku
vEdamaMtramula pUjAvidhi sEsEmA
yIdesa nIdAsulamayina mammugAchuTaku
vEdamUrtivai yiMdE vichchESi vuMDavE

Tuesday, November 13, 2007

338.hInAdhikamu liMka nEDa- హీనాధికము లింక నేడ

A great social composition by Annamcharya. Click here to listen to this kriti in the golden voice of Balakrishnaprasad.
Archive Audio link
హీనాధికము లింక నేడ నున్నవో కాని
ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే

నానావర్ణములవారు నరహరి(దలచేటి-
ఆనామమంత్రజప మది యొకటే
పూని యాతనిగొలిచి భువి నేజాతైనాను
మోనమున(బొందేటి మోక్షము నొకటే

వెనకకు ముందరికి విష్ణుకింకరులకెల్ల
పనివడి కైకొనేటి భక్తియొక్కటే
వునికి నాదేవుడు వొకడే అంతర్యామి
మనెడివైష్ణవకులమతమెల్లా నొకటే

భేదాభేదము లేదు పెక్కు మరగులు లేవు
ఆదినంత్యములను ముక్తాత్మ లొక్కటే
శ్రీదేవుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని-
యాదరాన( బొందుశరణాగతియు నొకటే



hInAdhikamu liMka nEDa nunnavO kAni
Anina dAsyamu pottu aMdariki nokaTE

nAnAvarNamulavAru narahari(dalachETi-
AnAmamaMtrajapa madi yokaTE
pUni yAtanigolichi bhuvi nEjAtainAnu
mOnamuna(boMdETi mOkshamu nokaTE

venakaku muMdariki vishNukiMkarulakella
panivaDi kaikonETi bhaktiyokkaTE
vuniki nAdEvuDu vokaDE aMtaryAmi
maneDivaishNavakulamatamellA nokaTE

bhEdAbhEdamu lEdu pekku maragulu lEvu
AdinaMtyamulanu muktAtma lokkaTE
SrIdEvuDainaTTi SrIvEMkaTESwaruni-
yAdarAna( boMduSaraNAgatiyu nokaTE

337.vIDivO alavijayarAghavuDu- వీడివో అలవిజయరాఘవుడు

Archive Audio link  : G Balakrishnaprasad
వీడివో అలవిజయరాఘవుడు
పోడిమి గొలువున( బొదలీ చెలియా

రాముడు లోకాభిరాముడు - గుణ
ధాము( డసురులకు దమనుడు
తామరకన్నులదశరథ తనయుడు
మోమున నవ్వీ మొక్కవె చెలియా

కోదండధరుడు గురుకిరీటపతి
పోదిగ సురముని పూజితుడు
ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు
నీదెస చూపులు నించీ( జెలియా

రావణాంతకుడూ రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలిపాటిలో వరమూర్తి తానై
వోవరి( గొలువున నున్నాడే చెలియా


vIDivO alavijayarAghavuDu
pODimi goluvuna( bodalI cheliyA

rAmuDu lOkAbhirAmuDu - guNa
dhAmu( Dasurulaku damanuDu
tAmarakannuladaSaratha tanayuDu
mOmuna navvI mokkave cheliyA

kOdaMDadharuDu gurukirITapati
pOdiga suramuni pUjituDu
Adima purushuDu aMbudavarNuDu
nIdesa chUpulu niMchI( jeliyA

rAvaNAMtakuDU rAjaSEkharuDu
SrIvEMkaTagiri sItApati
vAvilipATilO varamUrti tAnai
vOvari( goluvuna nunnADE cheliyA

Monday, November 12, 2007

336. trikaraNaSuddhiga jEsinapanulaku- త్రికరణశుద్ధిగ జేసినపనులకు

Archive Audio link : G Balakrishnaprasad
Ragam : Chakravakam, Composer : Balakrishnaprasad ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||
చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||
చ|| హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు |
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు |
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు |
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా |
చ|| మొదల శ్రీవేంకటపతికిని జేయెత్తి మొక్కినమాత్రములోపలనే |
పదిలపుషోడశదానయాగములుపంచమహాయజ్ఞంబులును |
వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు |
మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి దనకేలా ||


pa|| trikaraNaSuddhiga jEsinapanulaku dEvuDu meccunu lOkamu meccunu |
vokaTi kOTiguNitaMbagumArgamuluMDaga brayAsapaDanElA ||
ca|| tanamanasE paripUrNamaina gOdAvari gaMgA kAvEri |
kanakabiMduyamunAgayAdi muKyakShEtraMbula saMtatamun |
dinakarasOmagrahaNakAlamula tIrthAcaraNalu sEsinaPalamulu |
tanudAnE siddhiMcunu vUrakE davvulu dirugaga mari yElA ||
ca|| hari yanureMDakSharamulu nuDivina naKilavEdamulu maMtramulu |
garima dharmaSAstrapurANAdulu kramamuna jadivinapuNyamulu |
paramatapOyOgaMbulu modalagubahusAdhanamulasAraMbu |
paripakvaMbai PaliyiMcagA baTTabayalu vedakanElA |
ca|| modala SrIvEMkaTapatikini jEyetti mokkinamAtramulOpalanE |
padilapuShODaSadAnayAgamulu paMcamahAyaj~jaMbulunu |
vadalaka sAMgaMbulugA jEsinavADE kADA palumAru |
madimadinuMDE kAyaklESamu mATiki mATiki danakElA ||

Click here to listen to this kirtana : Balakrishnaprasad

Thursday, November 08, 2007

335.valapula solapula vasaMta - వలపుల సొలపుల వసంత

Archive Audio link :  G Balakrishnaprasad
వలపుల సొలపుల వసంత వేళ యిది
సెలవి నవ్వకువే చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు పడకువే
పరగ నిన్నతడు తప్పక చూచీని
విరులు దులుపకవే వెసదప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవెట్టీని

చేయెత్తి యెడ్డుకోకువే చేరి యానపెట్టకువే
చాయల నాతడు నీ చన్నులంటిని
ఆయములు దాచకువే అట్టే వెరగందకువే
మోయనాడీ సరసము మోహాన నీ విభుడు

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీవేంకటేశుడు కౌగిలించీని
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చనవిచ్చి నిన్నునేలె సమ్మతించీ యాతడు


valapula solapula vasaMta vELa yidi
selavi navvakuvE chemariMchI mEnu

Sirasu vaMchakuvE siggulu paDakuvE
paraga ninnataDu tappaka chUchIni
virulu dulupakavE vesadappiMchukOkuvE
sirulanI vibhuDiTTE sEsaveTTIni

chEyetti yeDDukOkuvE chEri yAnapeTTakuvE
chAyala nAtaDu nI channulaMTini
Ayamulu dAchakuvE aTTE veragaMdakuvE
mOyanADI sarasamu mOhAna nI vibhuDu

penagulADakuvE biguvu chUpakuvE
ghana SrIvEMkaTESuDu kaugiliMchIni
anumAniMchakuvE alamElmaMgavu nIvu
chanavichchi ninnunEle sammatiMchI yAtaDu

Sunday, November 04, 2007

334.tAnE kAkevvaru mAku- తానే కాకెవ్వరు మాకు దాతయు

Archive Audio link : Nukala China Satyanarayana & G Balakrishnaprasad
ఈ కీర్తనలో దశావతారాలు ఇమిడిఉన్నాయి, గమనించగలరు. వివరణ-Explanation
ప|| తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- | లోన బెట్టుకొని మాకు లోనైనవాడు ||
చ|| చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి | బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి |
యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి | పదిలమై తమ్ము బాలించినవాడు ||
చ|| మోహవియోగమ్ము మోహానురాగమ్ము | దేహవిభాగంబు దెలిపిన కలికి |
ఐహికమున వేంకటాధీశుడై సర్వ- | దేహరక్షకుడై తిరుగుచున్నాడు ||

pa|| tAnE kAkevvaru mAku dAtayu daivamu tana- | lOna beTTukoni mAku lOnainavADu ||
ca|| cadiviMci kUDuveTTi jArakuMDa nillugaTTi | bedurulEni buddhi pinnanADE ceppi |
yediri naDigi dravyamidi gommanucu nicci | padilamai tammu bAliMcinavADu ||
ca|| mOhaviyOgammu mOhAnurAgammu | dEhaviBAgaMbu delipina kaliki |
aihikamuna vEMkaTAdhISuDai sarva- | dEharakShakuDai tirugucunnADu ||

333.kalalOnE yiruvuramu aligi -కలలోనే యిరువురము

ARchive link : Click for Audio : book:5, kriti:21
కలలోనే యిరువురము అలిగి వేగ
కలయనుచు తెలిసి నిను కౌగిలించితిరా

అలుగుదురె (సతులు)(బతులనగా వినగ-
నలవాటు లేక నే నలుగుచుండుదురా
అలిగితటా వురక నీవంత నాతోను మరి-
నలుగులౌనట పూవులంతలోపలనే

చందురుడే సూర్యుడై జరగ మిగుల
కెందమ్ములవుర నా కెంగేలుదోయి
గందమే తోచెనట కస్తూరియనగ నా-
చందమపుడొకలాగు చందమవునటరా

విటవరుడ కోనేటివిభుడ నీ-
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా
యిటువలెనె మనలోన నెలమి మరచి
తటుకనను( గలయనుచు తలకి తెలిసితిరా

kalalOnE yiruvuramu aligi vEga
kalayanuchu telisi ninu kaugiliMchitirA

alugudure (satulu)(batulanagA vinaga-
nalavATu lEka nE naluguchuMDudurA
aligitaTA vuraka nIvaMta nAtOnu mari-
nalugulaunaTa pUvulaMtalOpalanE

chaMduruDE sUryuDai jaraga migula
keMdammulavura nA keMgEludOyi
gamdamE tOchenaTa kastUriyanaga nA-
chaMdamapuDokalAgu chaMdamavunaTarA

viTavaruDa kOnETivibhuDa nI-
veTu dolaMgina dEhameTTu nilupudurA
yiTuvalene manalOna nelami marachi
taTukananu( galayanuchu talaki telisitirA

Click here to listen to this kriti : Srirangam Gopalaratnam

Friday, November 02, 2007

332.neyyamulallO nErELLO-నెయ్యములల్లో నేరేళ్ళో

book:5, kriti:179 , click to listen to this kriti from movie:Subhalekha link2

Audio download link : Shobharaju

to listen :
Archive Audio link : Shobharaju & another version
నెయ్యములల్లో నేరేళ్ళో

వొయ్యన వూరెడి వువ్విళ్ళో

పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనా చెలువములే
థళథళమను ముత్యపు చెఱగు సురటి
దులిపేటి నీళ్ళాతుంపిళ్ళో

తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళ
చిటిపొటి యలుకలు చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

గరగరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాకులినుపగుగ్గిళ్ళో



neyyamulallO nErELLO
voyyana vUreDi vuvviLLO

palachani chemaTala bAhumUlamula-
chelamalalOnA cheluvamulE
thaLathaLamanu mutyapu che~ragu suraTi
dulipETi nILLAtuMpiLLO

toTatoTa kannula torigETi nILLa
chiTipoTi yalukalu chirunagavE
vaTaphalaMbu nI vannela mOviki
guTukalalOnA gukkiLLO

garagarikala vEMkaTapati kaugiTa
parimaLamulalO bachchanalu(lE)
maruniviMTi kammaniyaMpa virula-
guritAkulinupaguggiLLO

discussion on this in google groups

Click here to listen to this kriti from movie Subhalekha, sung by SPB

Thursday, November 01, 2007

331.arudI kapIndruni-అరుదీ కపీంద్రుని

Archive Audio link : G Balakrishnaprasad
అరుదీ కపీంద్రుని అధిక ప్రతాపము
సురలకు నరులకీసుద్దులెందు కలవా

ఉదయాచలము మీదినొక్కజంగ చాచుకొని
ఉదుటున నపరాద్రి నొక్కజంగ చాచుకొని
తుద సూర్యమండాలము తోడ మోము దిప్పుకుంటా
పెదవు లెత్తి చదివె పెద్దహనుమంతుడు

వొక్కమొలగంట చంద్రు డొక్కమొలగంట రవి
చుక్కలు మొలపూసలై చూపట్టగా
నిక్కిన వాలాగ్రమందు నిండిన భ్రహ్మలోకము
పిక్కటిల్ల పెరిగెను పెద్దహనుమంతుడు

పిడికిలించిన చేత బిరుదులపండ్లగొల
తడయక కుడిచేత దశదిక్కుల
జడియక శ్రీవేంకటేశ్వరుని మన్ననబంటు
బెడిదపు మహిమల పెద్దహనుమంతుడు



arudI kapIndruni adhika pratApamu
suralaku narulakIsudduleMdu kalavA

udayAchalamu mIdinokkajaMga chAchukoni
uduTuna naparAdri nokkajaMga chAchukoni
tuda sUryamaMDAlamu tODa mOmu dippukuMTA
pedavu letti chadive peddahanumaMtuDu

vokkamolagaMTa chaMdru DokkamolagaMTa ravi
chukkalu molapUsalai chUpaTTagA
nikkina vAlAgramaMdu niMDina bhraHmalOkamu
pikkaTilla perigenu peddahanumaMtuDu

piDikiliMchina chEta birudulapaMDlagola
taDayaka kuDichEta daSadikkula
jaDiyaka SrIvEMkaTESwaruni mannanabaMTu
beDidapu mahimala peddahanumaMtuDu