110.viSvaprakASunaku veliyEDa lO nEDa - విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ
ప విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ శాశ్వతునకు కూహింప జన్మ మిక నేడ
చ సర్వపరిపూర్ణునకు సంచార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
చ నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహౄదయస్థునకు మాటేడ పలుకేడ జ़్జానస్వరూపునకు గాన విన నేడ
చ పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ
in English:
pa viSvaprakASunaku veliyEDa lO nEDa SASvatunaku kUhiMpa janma mika nEDa
ca sarvaparipUrNunaku saMcAra mika nEDa nirvANamUrtikini nilaya mika nEDa
vurvIdharunaku gAlUda nokacOTEDa pArvatIstutyunaku BAva mika nEDa
ca nAnApraBAvunaku naDumEDa modalEDa Ananasahasrunaku navvalivvalEDa
maunihRudayasthunaku mATEDa palukEDa j~jAnasvarUpunaku gAna vina nEDa
ca paramayOgIMdrunaku parulEDa tAnEDa duritadUrunaku saMstutiniMda lEDa
tiruvEMkaTESunaku divyavigrahamEDa hariki nArAyaNuna kavugAmulEDa
No comments:
Post a Comment