Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, April 13, 2012

776. ayyO yEmari nE nADAppuDEmai vuMTinO - అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో


Audio link : YVS Padmavati
Audio download link : divshare
అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా


అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా


మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా


వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా


 ayyO yEmari nE nA@MDAppuDEmai vuMTinO
ayyaDa nI dAsi naitE ADariMtugA


allanADu bAluDavai AVulagAchEvELa
chillara dUDanaitE chEri kAtuvugA
vallegA viTuDavai rEpalle lO nuMDE nADu
golleta nayina nannu kUDukoMduvugA


mElimi rAmAvatAravELa rAyi rappa nainA
kAlu mOpi badikiMchi kAtuvugA
vAli sugrIvula vadda vAnaramai vuMDinAnu
yEli nannu panigoni yIDErtuvugA


vAridhilO machcha kUrmAvatAramulaina nADu
nIrulO jaMtuvunainA nIvu gAtuvugA
yIrIti SrIvEMkaTESa yElitivi nannu niTTE
mOratOpuna ninnALLu mOsapOtigA


 మోరతోపు, మోరత్రోపు orమోరతోపుతనము mōra-tōpu. n. Aversion, turning away or averting the face.మూతులుతిప్పడము, పరాఙ్ముఖత్వముపూనుకొని మోరతోపున బోవబోనీనునేను.

Wednesday, April 11, 2012

775.muddu gArI jUDaramma mOhanA - ముద్దు గారీ జూడరమ్మ మోహన


Audio link : 
Audio download link :
ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు

చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు


మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు 
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు


హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు


muddu gArI jUDaramma mOhana murAri vIDe
maddulu viricina mA mAdhavuDu
calla lamma nEricinajANa golletala kella
valletADu mA cinna vAsudEvuDu
mollapu gOpikala mOvipaMDulaku nella
kollakADu gadamma mA gOla gOviMduDu

maMdaDisAnula kammani mOmudammulaku
ceMdinatummidavO mA SrIkRShNuDu 
caMda maina doDDIvAri satulavayasulaku
viMduvaMTivA Damma mA viThThaluDu

hattina rEpallelOni aMganAmaNula kella
pottula sUtramu mA buddHula hari
mattili vrEtela niMDumanasula kellAnu
cittajunivaMTi vADu SrI vEMkaTESuDu

Tuesday, April 10, 2012

774.aMdichUDaga nIku avatAramokaTE - అందిచూడగ నీకు అవతారమొకటే

Audio link :  G.Aniala kumar
అందిచూడగ నీకు అవతారమొకటే
యెందువాడవైతివి యేటిదయ్యా


నవనీతచోర నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివల కొడుకవనేదిది యేటిదయ్యా


పట్టపు శ్రీరమణ భవరోగవైద్య
జట్టిమాయలతోడి శౌరి కృష్ణ
పుట్టినచోటొకటి పొదలెడి చోటొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేటిదయ్యా


వేదాంతనిలయా వివిధాచరణ
ఆదిదేవా శ్రీవేంకటాచలేశ
సోదించి తలచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేటిదయ్యా




aMdichUDaga nIku avatAramokaTE
yeMduvADavaitivi yETidayyA


navanItachOra nAgaparyaMkA
savanarakshaka harI chakrAyudhA
avala dEvakipaTTivani yaSOdaku ninnu
nivala koDukavanEdidi yETidayyA


paTTapu SrIramaNa bhavarOgavaidya
jaTTimAyalatODi Sauri kRshNa
puTTinachOTokaTi podaleDi chOTokaTi
yeTTani nammavachchu nidiyETidayyA


vEdAMtanilayA vividhAcharaNa
AdidEvA SrIvEMkaTAchalESa
sOdiMchi talachinachOTa nI vuMduvaTa
yEdesa nI mahima yidETidayyA

Monday, March 26, 2012

773.talagarO lOkulu taDavakurO mammu - తలగరో లోకులు తడవకురో మమ్ము


Audio link : Dr Shobharaju

ప|| తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము ||


చ|| నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ |
మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము ||


చ|| శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు |
యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు ||


చ|| శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు |
దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||

pa|| talagarO lOkulu taDavakurO mammu | kaliginadidi maakaapuramu ||

cha|| narahari keertana naanina jihva | vorula nutiMpaga nOpadu jihva |
muraharu padamula mokkina Siramu | parula vaMdanaku baragadu Siramu ||

cha|| Sreepatinae poojiMchina karamulu | chOpi yaachanaku joravu karamulu |
yaepuna harikaDa kaegina kaaLLu | paapula yiMDlaku baaravu kaaLLu ||

cha|| Sree vaeMkaTapati jiMtiMchu manasu | daavati nitaramu dalachadu manasu |
daevuDatani yaadheenapu tanuvu | taevala nitaraadheenamu gaadu ||

Wednesday, March 21, 2012

772.nArAyaNuni SrInAmamidi - నారాయణుని శ్రీనామమిది





Audio link : P.Ranganath
నారాయణుని శ్రీనామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా


శుక వరదుని సొంపుగ దలచుటె
సకలభవ విజయము 
అకలంకము మహాభయహరణ
మొకటి నొకటి వోహొ మనసా


పక్షి గమన శుభము (పదము) దలచుటే
అభయ భోగ విహారమ్ము
వక్షపు లక్ష్మీవరుసే(చే) సిరులు
లక్షలు గోట్లొల్లవో మనసా


ఇంకా నీ తలపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించగదో
అంకెలకిన్నియునైన ఈ(?)
మంకపు గాక నమ్మవో మనసా



nArAyaNuni SrInAmamidi
kOrinavichchI@M gOvO manasA

Suka varaduni sompuga dalachuTe
sakalabhava vijayamu 
akalamkamu mahaabhayaharaNa
mokaTi nokaTi vOho manasA

pakshi gamana Subhamu (padamu) dalachuTE
abhaya bhOga vihaarammu
vakshapu lakshmIvarusE(chE) sirulu
lakshalu gOTlollavO manasaa

imkaa nee talapulenni galigina
vEnkaTaadhipu sEvimchagadO
amkelakinniyunaina I(?)
mamkapu gaaka nammavO manasA

Wednesday, February 15, 2012

771.vaddu vaddu saTaliMka vaamanaa - వద్దు వద్దు సటలింక వామనా



వద్దు వద్దు సటలింక వామనా నీ 
వద్దనే వున్నార మిదె వామనా ||

వరుసలు వెదకేవు వామనా నీవు 
వరుడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే 
వరవలె నున్నాడవు వామనా ||

వనము కోగిల వైతి వామనా నీకు 
వనితలు బాతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా 
నను వేళ చూచుకోమీ వామనా ||

వాడవారు మొక్కేరు వామ్నా నీకు 
వాడుదేరె కెమ్మోవి వామనా 
వాడికె శ్రీవేంకటాద్రివామనా
వాడేచెలమవు నీవు వామనా ||


vaddu vaddu saTaliMka vaamanaa nee 
vaddanae vunnaara mide vaamanaa ||


varusalu vedakaevu vaamanaa neevu 
varuDa viMdarikini vaamanaa
varavaata valapiMchi vaamanaa dae 
varavale nunnaaDavu vaamanaa ||


vanamu kOgila vaiti vaamanaa neeku 
vanitalu baati vaamanaa
vanaraeru golletalu vaamanaa kaa 
nanu vaeLa choochukOmee vaamanaa ||


vaaDavaaru mokkaeru vaamnaa neeku 
vaaDudaere kemmOvi vaamanaa 
vaaDike SreevaeMkaTaadrivaamanaa
vaaDaechelamavu neevu vaamanaa ||

770.chepparAni mahimala SrIdharA - చెప్పినట్టు చేసేము శ్రీధరా


peda tirumalacharyula kirtana
Audio link : Sri P.Ranganath
చెప్పరాని మహిమల శ్రీధరా నీవు 
చెప్పినట్టు చేసేము శ్రీధరా 


చేర దీసి నా కన్నుల శ్రీధరా నీ 
జీరల మేను చూచితి శ్రీధరా 
చేరువ సంతోషమబ్బె శ్రీధరా 
చీరుమూరాడెదమీ శ్రీధరా 


చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ 
చిల్లరసతులు వారే శ్రీధరా
చెల్లబో ఆ సుద్ది విని శ్రీధరా నాకు 
చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా 


సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ము 
జేవదేరగూడితివి శ్రీధరా
చేవల్లకు రావోయి శ్రీధరా
శ్రీవేంకటాద్రి మీది శ్రీధరా

chepparaani mahimala Sreedharaa neevu 
cheppinaTTu chaesaemu Sreedharaa 


chaera deesi naa kannula Sreedharaa nee 
jeerala maenu choochiti Sreedharaa 
chaeruva saMtOshamabbe Sreedharaa 
cheerumooraaDedamee Sreedharaa 


chellu nanniyunu neeku Sreedharaa nee 
chillarasatulu vaarae Sreedharaa
chellabO aa suddi vini Sreedharaa naaku 
chillulaaye veenulellaa Sreedharaa 


saevalu saesaemu neeku Sreedharaa mammu 
jaevadaeragooDitivi Sreedharaa
chaevallaku raavOyi Sreedharaa
SreevaeMkaTaadri meedi Sreedharaa

Wednesday, February 08, 2012

769.ichchakAlu nAku neeku nika nElarA - ఇచ్చకాలు నాకు నీకు నిక నేలరా

Audio link : from movie Tenali Ramakrishna, sung by Sri P.Leela
ఇచ్చకాలు నాకు నీకు నింక నేలరా నీ-
యచ్చపు గోరిక నాతో నానతీరా వోరి

అమ్మితి నా మేను నీకు నప్పుడె వోరి చూపు-
జిమ్ముల నేచకమైనా జిత్తగించరా
అమ్మక చెల్ల నే నీకు నడ్డమా వోరి యింపు
గుమ్మరింపుచు నా గుట్టు కొల్ల గొంటి వోరి

జట్టి గొంటి ఎదె నన్ను జాలదా వోరి యీ
చిట్టంట్ల నీ నేచక చిత్తగించరా-
ఎట్టైనా నే నీ కింత యెదురా వోరి నీ
పట్టన చలమే చెల్లె బాపురా వోరి

వేసాల వేంకట గిరి విభుడా నేడోరి నీ-
సేసిన మన్నన లిట్టే చిత్తగించరా
వాసన కస్తూరి మేని వన్నెకాడా నీ
యాసలే మాకు దక్కెనదిరా వోరి


ichchakAlu nAku neeku nika nElarA nee-
yachchapu gOrika nAnateerA vori

ammiti nA mEnu neeku nappude vOri choopu-
jimmula nEchakamainA jittagincharA
ammaka chella nE neeku naDDAmA vori yimpu
gummariMpuchu nA guttu kolla gonti vori

jatti gonti ede nannu jaaladA vori ee-
chittantla nee nEchaka chittagincharA
eTTenA nE nee kinta EdurA vori nee-
pattina calamE chelle bApurA vOri

vESAla vEnkata giri vibhudA nEdori nee-
sesina mannana litte chittagincharA
vAsana kasturi mEni vannekAda nee
YAsala mEkulE dakkenadirA vori

Tuesday, February 07, 2012

768.చూడరమ్మ యిదె నేడు సుక్కురారము - cUDaramma yide nEDu sukkurAramu


Audio link : Nithyashree Mahadevan
చూడరమ్మ యిదె నేడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాడు


చప్పుడుతో పన్నీటి మజ్జనముతో నున్నవాడు
అప్పుడే ఆదినారాయాణునివలె
కప్పురకాపామీద కడుఁబూసుకున్నవాడు
ముప్పిరి బులుకడిగె ముత్యమువలె


పొసగెనప్పటి తట్టుపుణుగులందుకున్నాడు
కసుగందని కాలమేఘమువలెను
సుసగాన మేనునిండా సొమ్మువెట్టుకున్నాడు
పసల పద్దరువన్నె బంగారువలెను


అలమేల్మంగను యురమందు నిడుకొన్నవాడు
యెలమి సంపదలకు యిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీదనున్నవాడు
కలబోసి చూడగా దొంతరకొండవలెను

cUDaramma yide nEDu sukkurAramu
vEDuka cakkadanaalu vEvElainADu

cappuDutO pannITi majjanamutO nunnavADu
appuDE AdinaaraayaaNunivale
kappurakaapaamIda kaDu@MbUsukunnavaaDu
muppiri bulukaDige mutyamuvale

posagenappaTi taTTupuNugulamdukunnADu
kasugamdani kaalamEghamuvalenu
susagaana mEnuniMDA sommuveTTukunnADu
pasala paddaruvanne bamgaaruvalenu

alamElmamganu yuramamdu niDukonnavADu
yelami sampadalaku yilluvalenu
alarucu SrIvEMkaTAdrimIdanunnavADu
kalabOsi cUDagaa domtarakoMDavalenu

Monday, January 02, 2012

767.iTuvale nuMDavaddA yiravaina mOhamu - ఇటువలె నుండవద్దా యిరవైన మోహము


Audio link :Sri G Balakrishnaprasad

ఇటువలె నుండవద్దా యిరవైన మోహము
తటుకన నీమీది తగులెంతోఁ గానీ


సొరిది నీ మోము సారెఁ జూచియిను తనియదు
తరుణి మాటలాడియుఁ తనియదు
సరసము లాడియాడి చాలునని తనియదు
అరుదైన మదిలోని యాస యం(యెం)తో కాని


ననుపుసేసుక చెలి నవ్వియును తనియదు
తనువుసోక పెనగియు తనియదు
మునుకొని చేతులెత్తి మొక్కియును తనియదు
యెనసి నీపై వలపింకా నెంతో కాని


రమణి నీ కాగిట రతిసేసి తనియదు
తమితో గుబ్బలనొత్తి తనియదు
జమళి శ్రీవేంకటేశ సన్నసేసి తనియదు
అమరిన సంతోసమది యెంతోకాని



iTuvale nuMDavaddA yiravaina mOhamu
taTukana nImIdi taguleMtO@M gAnI


soridi nI mOmu sAre@M jUchiyinu taniyadu
taruNi mATalADiyu@M taniyadu
sarasamu lADiyADi chAlunani taniyadu
arudaina madilOni yAsa yaM(yeM)tO kAni


nanupusEsuka cheli navviyunu taniyadu
tanuvusOka penagiyu taniyadu
munukoni chEtuletti mokkiyunu taniyadu
yenasi nIpai valapiMkA neMtO kAni


ramaNi nI kAgiTa ratisEsi taniyadu
tamitO gubbalanotti taniyadu
jamaLi SrIvEMkaTESa sannasEsi taniyadu
amarina saMtOsamadi yeMtOkAni