Monday, June 17, 2013
Friday, June 14, 2013
795.madavikAramulu mAnEvO - మదవికారములు మానేవో
మదవికారములు మానేవో, నా
యెదురనె నీవు నేడింకాఁజేసేవో
నందవ్రజములోన నాడు నీవు గొల్ల
మందల మగువల మరగించీనా
మందులు మాయలు మఱచితివో, యిప్పు
డిందూ నామీద నింకాఁ జేసేవో
నలినాప్తకులుడవైనాడు నీవు ఇంతిం
గలకాలమెల్ల నంగడిబెట్టినా
మలినపు మాటలు మఱచితివో నన్ను
నెలయించి కాకల నింకా నేసేవో(నేపేవొ?)
నరసింహుడవై నాడు నీవు పెక్కు
మురిపెంపు వికారములఁబోయినా
తిరువేంకటేశ పొందితివి నన్ను నీ
యిరవైన యీ చేత లింకాఁ జేసేవో
Posted by
Sravan Kumar DVN
at
7:03 PM
0
comments
Labels: [M_Annamayya], [మ_అన్నమయ్య], Raga : Desakshi, TunedBy : Sattiraju Venumadhav
Sunday, June 09, 2013
794.eppuDu gAni rADO yeMtadaDavAya - ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ
ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి -
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా
ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న -
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా కస్తూరిబొట్టు పెట్టిననాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా
పాయక యాతడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ
బోయి పోయి కడుఁ జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుఁ జంద్రుల జూచి భ్రమసితినమ్మా
కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా -
వేడుక మతిఁ దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడో
నాడినట్టే నాచిత్తమలరించే నమ్మా
eppuDu gAni rADO yeMtadaDavAya kAli -
chappuDAlakiMchi mati jalluranenammA
iddaramadaripATu yEkAMtAna nADukonna -
suddulu dalachimEnu churukanenammA
peddagA kastUriboTTu peTTinanAtaDu gOra
tidduTa dalachi mEnu digulanenammA
pAyaka yAtaDU nEnu@M bavvaLiMchE yiMTivaMka@M
bOyi pOyi kaDu@M jinnabOti nOyammA
tOyapu gubbala channudOyi mIda vADottina
pAyapu@M jaMdrula jUchi bhramasitinammA
kUDina saukhyamulaMdu kodalEni vAni nA -
vEDuka mati@M dalachi veragAya nammA
yIDulEni tiruvEMkaTESuDide nAtODO
nADinaTTE nAchittamalariMchE nammA
Posted by
Sravan Kumar DVN
at
1:39 AM
0
comments
Labels: [C_Annamayya], [ఎ_అన్నమయ్య], virahagitam
Friday, June 07, 2013
793.kamalAsana saubhAgyamu kalikitanaMbulu - కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
Sung by Bombay Jayashree , in film IntinTa Annamayya , music by MM Keeravani (7th in the list)
Meaning by Dr.Tadepalli Patanjali
కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకాంగా రాదు
మించిన చొక్కులు మీరినయాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచబాణుని పరిణత (తు) లూ
కనుగవ జలములు కమ్మని చెమటలు
అనయము చెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెఱపులు
వినుకలి కనుకలి వేడుకలు
మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీవేంకతపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుఁ గూడిన యలసములు
Posted by
Sravan Kumar DVN
at
2:04 PM
8
comments
Labels: [K_Annamayya], [క_అన్నమయ్య]
Wednesday, June 05, 2013
792.kAnakuMTi miMaka kaMTi - కానకుంటి మిందాకా కంటి
కానకుంటి మిందాకా కంటి మాడకుఁ బోదము
కానీలే అందుకేమి కళవళ మేలయ్యా IIపల్లవిII
తొంగి చూచెనదె సీత తూరుపునఁ దమ్ముఁడా
సంగతి చందురుఁడింతె సతి గాదయ్యా
చెంగట నే వెదకగాఁ జేరి నవ్వీఁ జూడరాదా
రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా IIకానII
పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత
అంచెలఁ దీగె ఇంతే అటు గాదయ్యా
యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా
పెంచపు నెమలి గాని పిలుపు గాదయ్యా IIకానII
నిలుచుండి చూచె నదె నిండుఁ గొలఁకులో సీత
కలువలింతే ఆపె గాదయ్యా
కలికి శ్రీ వెంకటాద్రిఁ గాగిలించె నిదె నన్ను
తలపులో నాకె నిన్నుఁ దగిలుండు నయ్యా IIకానII
kaanakuMTi miMdaakaa kaMTi maaDaku@M bOdamu
kaaneelae aMdukaemi kaLavaLa maelayyaa IIpallaviII
toMgi choochenade seeta toorupuna@M dammu@MDaa
saMgati chaMduru@MDiMte sati gaadayyaa
cheMgaTa nae vedakagaa@M jaeri navvee@M jooDaraadaa
raMgagu vennela liMtae raamachaMdra chooDumaa IIkaanaII
poMchi chaeta@M bilicheeni poda daMDa nade seeta
aMchela@M deege iMtae aTu gaadayyaa
yeMchanaela davvulanu yeli@MgiMchee vinaraadaa
peMchapu nemali gaani pilupu gaadayyaa IIkaanaII
niluchuMDi chooche nade niMDu@M gola@MkulO seeta
kaluvaliMtae aape gaadayyaa
kaliki Sree veMkaTaadri@M gaagiliMche nide nannu
talapulO naake ninnu@M dagiluMDu nayyaa IIkaanaII
Meaning by Mallina Narasimharao garu in his blog : http://kastuuritilakam.blogspot.in/2008/06/26-105.html
సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు సీతను వెదుకుతున్నప్పుడు
రామలక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణా పూర్వకముగా అన్నమయ్య
చెప్పిన కీర్తన యిది. ఇటువంటి సంభాషణగా నడిచే వానిని "వాకో వాక్య"
రూపమైన కీర్తనలని కూడా అంటారు.ఇటువంటి "వాకో వాక్య"కీర్తనలు
చాలానే వున్నవి.
ఈ కీర్తనలో ఒక వాక్యము (లైను)రాముడు, తరువాతి వాక్యము లక్షణుడు
అంటున్నట్లుగా సాగుతుంది.
ఇంత దాకా సీతను కనుక్కోలేక పోయాము.దూరంగా ఆ కనిపించే చోటికి వెళ్ళి వెదకుదాము-అన్నాడు రాముడు.
దానికి జవాబుగా లక్షణుడు-అలాగే కానీ! అందుకోసమై నీకు కళవళ మెందుకయ్యా అన్నాడు.
రాము డప్పుడు -అదిగో! తూర్పున సీత తొంగి చూస్తున్నది తమ్ముడా-అంటాడు.
జవాబుగా లక్షణుడు-కనిపించే అది చందురుడే ! కాని సీత గాదయ్యా-అంటాడు.
అప్పుడాయన-దగ్గరికెళ్ళి నే వెదగ్గా నను చేరి నా సీత నవ్వుతోంది చూడరాదా-అంటాడు.
లక్ష్మణుడు-నువ్వనుకొనే ఆ నవ్వులు రంగులలో మెరిసే వెన్నెలలే ! రామచంద్రా వేరు కాదు, సరిగా చూడ మంటాడు.
పొద చెంత నుండీ చేత్తో నన్ను సీత పిలుస్తోంది! చూడయ్యా-రాముడు
అది హంస తీగ ఇంతే కాని అటు పిలవడం కాదయ్యా-లక్ష్మణుడు.
రాముడు- ఆలోచించక్కరలేదు.దూరాన యెలుగెత్తి పిలుస్తోంది.వినబట్టంలేదా!?
లక్ష్మణుడు-అది పిలుపు గాదయ్యా పింఛాన్ని ధరించిన నెమలి క్రేంకారమది.
రాముడు-నిండు కొలనిలో నిలచి సీత నన్ను చూస్తోందయ్యా
లక్ష్మణుడు- అని కలువపువ్వులయ్యా !ఆమె గాదు.
రాముడు- సీత ఈ వేంకటాద్రి మీద ఇదో నన్ను కాగిలించినదయ్యా
లక్ష్మణుడు- నీ తలపులో ఆమె నిన్ను తగిలి(కౌగలించుకొని) ఉన్నదయ్యా
ఇలా రామచంద్రమూర్తి సీతా విరహార్తిలో పరిపరి విధములుగా దుఃఖిస్తుండగా లక్ష్మణుడు నిజ పరిస్ధితిని వివరిస్తున్న
కీర్తన యిది.
Posted by
Sravan Kumar DVN
at
11:12 PM
1 comments
Labels: [K_Annamayya], [క_అన్నమయ్య], Deity:Rama, Raga : Sama, samvadam/conversation, TunedBy : Sattiraju Venumadhav
Saturday, April 27, 2013
791. dEvaSiKAmaNivi dishTadaivamavu - దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
Audio link : G.Balakrishnaprasadప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది
చ : కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ
చ : ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ
చ : తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ
Posted by
Sravan Kumar DVN
at
1:33 PM
0
comments
Labels: [D_Annamayya], [ద_అన్నమయ్య], Adhyatmika
Thursday, April 25, 2013
790.bhakti nIpai dokaTe parama sukhamu - భక్తి నీపై దొకటె పరమ సుఖము
Audio link : composed and sung by Sri Nedunuri Krishnamurthy , in sahana ragam. (recorded by phone from a svbc program)
భక్తి నీపై దొకటె పరమ సుఖము
యుక్తి జూచిన నిజం బొక్కటే లేదు
కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమే రేచు
తలపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు
ధనమెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేచు
ఘనవిద్యఁ గలిగినను కప్పు పైపై మదము
యెనయగ పరమపద మించుకయు లేదు
తరుణు లెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేస నినుఁ గొలువగా
పెరిగె నానందంబు బెళకు లికలేవు
Posted by
Sravan Kumar DVN
at
11:36 PM
0
comments
Labels: [B_Annamayya], [భ_అన్నమయ్య], Adhyatmika, Raga : Sahana, TunedBy:NedunuriKrishnamurty
Monday, March 18, 2013
789.indirA nAmamu indariki - ఇందిరా నామము ఇందరికి
ఇందిరా నామము ఇందరికి
కుందనపు ముద్దవో గోవిందా
అచ్యుత నామము అనంత నామము
ఇచ్చిన సంపదలు ఇందరికి
నచ్చిన సిరులు నాలుకతుదలు
కొచ్చి కొచ్చివో గోవిందా
వైకుంఠ నామము వరద నామము
ఈకడ నాకడ ఇందరికి
వాకుదెరపులు వన్నెలు లోకాల
కూగులు వంతులునో గోవిందా
పండరి నామము పరమ నామము
ఎండలు బాపెడి ఇందరికి
నిండు నిధానమై నిలిచిన పేరు
కొండల కోనేటివో గోవిందా
Posted by
Sravan Kumar DVN
at
2:48 AM
0
comments
Labels: [I_Annamayya], [ఇ_అన్నమయ్య], nama keerthana, Raga:Mohana
Tuesday, January 22, 2013
788.appaDuMDE koMDalOna - అప్పడుండే కొండలోన
Audio link :
1.అప్పడుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే - ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ
2. ఆకాశాన పొయ్యే కాకి మూకజూచి కేకవేశే - మూక మూడు విధములాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
3. అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదక పోతే - వొల్వలెల్ల మల్ల్యెయాయే - ఓ వేంకటేశ
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
4. అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే - కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా
5. పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే - పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా
6. చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడు మేశే - కాళ్ళు లేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేని వాడు చిలుక తినేరా ఓ వేంకటేశా!
7. గుంటయెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే - కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
8. సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయ - తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ
9. ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ - ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా
10. ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె - దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
11. ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె - పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
12. ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని - మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
13. పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి - కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని - నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
Posted by
Sravan Kumar DVN
at
5:12 PM
0
comments
Labels: [A_Annamayya], [అ_అన్నమయ్య], folk, janapada
Wednesday, December 19, 2012
787.గోనెలె కొత్తలు కోడెలెప్పటివి - gOnele kottalu kODeleppaTivi
గోనెలె కొత్తలు కోడెలెప్పటివి
నానినలోహము నయమయ్యీనా
మున్నిటిజగమే మున్నిటిలోకమే
యెన్నగ బుట్టుగులివె వేరు
నన్ను నెవ్వ రున్నతి బోధించిన
నిన్న నేటనే నేనెఱిగేనా
చిత్తము నాటిదే చింతలు నాటివే
యిత్తల భోగములివె వేరు
సత్తగు శాస్త్రము చాయ చూపినా
కొత్తగ నే నిక గుణినయ్యేనా
జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడే
యీవల భావనలివే వేరు
ధావతి కర్మము తప్పఁ దీసినా
దైవము గావక తలగీనా
Posted by
Sravan Kumar DVN
at
11:09 PM
0
comments
Labels: [G_Annamayya], [గ_అన్నమయ్య], tatwAlu-తత్వాలు, tatwam, Tuned by : PS Ranganath
Other Web Resuources on Annamacharya kirtanas
- https://swaramaadhuri-annamayyasankeerthananidhi.weebly.com/annamacharya-keerthanalu.html
- http://srinivasamsujata.blogspot.com/
- http://kasstuuritilakam.blogspot.com/
- http://atributetoannamayya.blogspot.com/
- http://krsnadasakaviraju.rediffblogs.com/
- http://flowersathisfame.blogspot.com/
- Article : Dr.V.Sinnamma
- Kriti Meanings by IV Sitapatirao , Telugubhakti.com
- annamayyapetika - Kamisetti Srinivasulu
- Vamsi Karthik's blog on Annamacharya kirtanalu
- Karthikeya _ blog on Annamayyakritis, with explanation
- Annamayya Lyrics WIKI
- Annamacharya Vaibhavam-ORKUT Community
- TTD Annamacharya Kritis Page
- Prasanth's Annamacharya Kritis Blog
- Prasanth's eSnips Audio Folder
- My eSnips - Kritis Audio Folder
- Kritis Index - కీర్తనల సూచిక


