913. imtE imtE yimkA neMta chUchinA - ఇంతే యింతే యింకా నెంత చూచినా
Youtube link : Tuned and composed by Sri Malladi Suribabu , ragam bilahari
ఇంతే యింతే యింకా నెంత చూచినా
చింతలఁ జిగురులెక్కి చేఁగ దేరినట్లు
వుల్లములో నెంచనెంచ నుద్యోగములే పెక్కు
పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు
బల్లిదుని హరినాత్మ భావించుటొకటే
ముల్ల ముంటఁ దీసి సుఖమున నుండినట్లు
అనిన సంసారమున నలయికలే పెక్కు
చానిపిఁ జవి వేఁడితేఁ జప్పనైనట్టు
పూని హరిఁ జేతులారాఁ బూజించుటొకటే
నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు
వెనకఁ దలఁచుకొంటే విజ్ఞానములే పెక్కు
తినఁ దిన వేమేల్లాఁ దీపైనట్టు
చనవై శ్రీవేంకటేశు శరణను టొక్కటే
పనివడి చెఱకునఁ బండువండినట్లు