Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, April 29, 2019

ఎంత పరమ బంధుడవో! - వేణుమాధవుడికి నివాళి !



దాదాపు 126  అన్నమాచార్య కీర్తనలు స్వరపరిచి మరెన్నో కీర్తనలు గానంచేసిన సత్తిరాజు వేణుమాధవ్ గారు స్వర్గస్థులవ్వటం, అన్నమయ్య భక్త ప్రపంచానికి తీరని లోటు. గత కొద్దిరోజులుగా ఆయన పాటలే మదిలో మెదలుతున్నాయి. స్పష్టమైన ఉచ్చారణ, సాహిత్యానికి విలువనివ్వటం, భావానుగుణంగా గానం చెయ్యటం ఆయన శైలి. ఆయన పాడుతుంటే కీర్తన లోని ప్రతి పదానికి ప్రాణం వచ్చినట్టుంటుంది. ఆ గాత్రం వింటుటే వేంకటేశ్వర భక్తి తత్వం సామాన్యుల మనసుల్లోకి అన్నమయ్య నిర్దేసించ విధంగా తెలికగా చేరుతుంది.

ఆర్తుడనేను నీకడ్డమెందును లేదు,  కర్మమంటా మాకు మాయ కప్పేవు గాక, మొదలగు శరణాగతి కీర్తనలు,
కానకుంటి మిందాక, ఇదియే పరబ్రహ్మ మిదియే రామకథ, ఎక్కది మాయమృగము మొదలగు రామయణ కీర్తనలు,
ఆతడితడా వెన్నలింతట, ముద్దుగారీ చూడరమ్మ, అచ్చపురాల యమునలోపల, యెక్కడి కంసుడు మొదలగు కృష్ణ కీర్తనలు,
చదివితి తొల్లి కొంత, చదివేది వేదములు, సదా సకలము, గుఱ్ఱాల గట్టని తేరు, అతివరో శ్రీవేంకతపతి, వంటి  వైరాగ్య, భక్తి సంకీర్తనలు,
ఏమి నిద్దిరించేవు అనె మేలుకొలుపు కీర్తన, శృగారశీలునకు మంగళం అనే మంగళం,
తానేడో మనసేడో, కాలములారును, తిరుమలయ్య విందు మున్నగు శృంగార కీర్తనలు,
తిమ్మిరెడ్డి మాకునిచ్చే , ఇంతగా జేసితి, మొదలగు జానపద
కీర్తనలు,
సురలకు నరులకు సొరిది వినవిన, నీవుగలిగిన చాలు మున్నగు అన్నమచార్య సాహిత్య విశిష్టతకు చెప్పే కీర్తనలను,
మరెన్నో అరుదైన కీర్తనలకు అద్భుతమైన రీతిలొ స్వరరచన చేసి భక్తజనకోటికి అందించి వైకుంఠానికి పయనమయ్యారు వేణుమాధవ్ గారు.

ఈ కీర్తనలు అన్నమయ్య పదమందాకిని (108 కిర్తనలు 108 రాగాలలో), నీవుగలిగిన చాలు (9), అన్నమయ్య వేణుగానం(9) ఆల్బంస్ సుజన రంజని సంస్థ ద్వార విడుదల చేయబడి బాగా ప్రాచుర్యం పొదాయి.

మీ గానామృతం ముఖతా వినే భాగ్యం గల్గటం మా అదృష్టం, మీ శిష్యులు ధన్యులు.

వేణుమాధవ్ గారు, మీ గాత్రం అద్భుతం, మీ స్వర రచన అసామాన్యం!  తాళ్ళపాక కవుల సాహిత్య సంగీత ప్రపంచంలో ఒక ధృవతారగా నిరంతరం ప్రకాశించే 'భావ రాగ తాళ సునాద సంగీత విద్వన్మణీ' శ్రీ సత్తిరాజు
వేణుమాధవ్ గారికి శతకోటి నమస్సులతో అశ్రునివాళి   _/\_ .

ఓం శాంతిః ! 


some useful links  
Nivugaliginachalu & Annamayya Venuganam Albums available in amazon music (one can listen to full songs in Amazon Music at this link):
Sri Sattiraju Venumadhav's Youtube play list:
Few kirtanas of Venumadhav garu available in this blog here  and here
 Face book page of Venumadhav garu. 

sharing here: Annamacharya kirtana sung by Sri Sattiraju Venumadhav, tuned by Sri Vinnakota Murali krishna, pray paramatma to stay with Venumadhav's soul as he starts his vaikunta yatra. 

Tuesday, April 16, 2019

852. ayyO nEnE kaa anniTikaMTe deelu - అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు


అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుఁ గాని    ॥పల్లవి॥


తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా-
యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే-
ముడిచి వేసినంతనే ముట్టరాదాయను    ॥అయ్యో॥


వెక్కసపు రచనల వేవేలు రుచులు నా
వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు
పక్కన దేవార్హపుఁ బరిమళ గంధములు నా-
ముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను    ॥అయ్యో॥


గగనాననుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనే యోగ్యము గావు
నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక
మొగడై యెరుక తుదిముట్టరాదాయను    ॥అయ్యో॥



ayyO naenae kaa anniTikaMTe@M deelu
gayyaaLinai vridhaa garviMtu@M gaani    


taDipivudikinaTTi dhautavastramulu naa-
yoDalu mO@Mchinamee@Mda yOgyamu gaavu
vuDivOka vanamulO voppainavirulu nae-
muDichi vaesinaMtanae muTTaraadaayanu  


vekkasapu rachanala vaevaelu ruchulu naa
vokkanaalukaMTitaenae yOgyamugaavu
pakkana daevaarhapu@M barimaLa gaMdhamulu naa-
mukkusO@MkinaMtalOna muTTaraadaayanu 
vogi naagOraMTitaenae yOgyamu gaavu
nagu SreevaeMkaTapati nannae rakshiMchinadaa@Mka
mogaDai yeruka tudimuTTaraadaayanu 
FB: By Rahul Vellal, tuned by Sri Josyabhatla 
Youtube:

851. Emani nutiMchavachchu nitaniroopamu - ఏమని నుతించవచ్చు నితనిరూపము

 ఏమని నుతించవచ్చు నితనిరూపము
భీమవిక్రముఁ డితఁడు పెద్ద హనుమంతుఁడు    ॥పల్లవి॥


వొక్కజంగఁ చాఁచినాఁడు వొగిఁ దూర్పుఁబడమర
తక్కక భుజా లుబ్బించె దక్షిణోత్తరాలు నిండ
మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెత్తెను
పిక్కటిల్లు మహిమతోఁ బెద్ద హనుమంతుఁడు    ॥ఏమ॥


వేడుక వాల మాకాశవీథితోఁ బెనచినాఁడు
యేడుజలధులు చేసె నదె మోకాళ్లబంటి
వోడక పిడికిలించి వుగ్రదైత్యుల తలలు
బేడలుగాఁ జేసినాఁడు పెద్ద హనుమంతుఁడు    ॥ఏమ॥


జళిపించి వలకేలు సకలము మెచ్చ నెత్తె
కులగిరులు తనతొడలసందినే యడఁచె
బలువుఁడు శ్రీవేంకటపతిబంటు మతంగాద్రి-
బిలమువాత నున్నాఁడు పెద్దహనుమంతుఁడు    ॥ఏమ॥


aemani nutiMchavachchu nitaniroopamu
bheemavikramu@M Dita@MDu pedda hanumaMtu@MDu    


vokkajaMga@M chaa@Mchinaa@MDu vogi@M doorpu@MbaDamara
takkaka bhujaa lubbiMche dakshiNOttaraalu niMDa
mikkili brahmalOkamu meeranu Sirasettenu
pikkaTillu mahimatO@M bedda hanumaMtu@MDu  


vaeDuka vaala maakaaSaveethitO@M benachinaa@MDu
yaeDujaladhulu chaese nade mOkaaLlabaMTi
vODaka piDikiliMchi vugradaityula talalu
baeDalugaa@M jaesinaa@MDu pedda hanumaMtu@MDu


jaLipiMchi valakaelu sakalamu mechcha nette
kulagirulu tanatoDalasaMdinae yaDa@Mche
baluvu@MDu SreevaeMkaTapatibaMTu mataMgaadri-
bilamuvaata nunnaa@MDu peddahanumaMtu@MDu 



Rahul Vellal's second performance in the Annamayya Paataku Pattabhishekam. A keertana praising Lord Hanuman by Annamacharya, set to tune in Raaga Reetigowla by Sri Josyabhatla Rajasekhara Sarma (Josyabhatla Rajasekhara SarmaYajushi Sarma). Thanks to all the wonderful musicians who worked on this song

Sunday, April 07, 2019

850. eMdu kaapuramu saetu - ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల

Archive Audio link 

ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే మూఁడు గాలములు ॥పల్లవి॥

తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో తలపోఁత మరి యొక్క లోకము
యెనసిన కలలోని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూఁడు లోకములు ॥ఎందుఁ॥

పంచభూతముల చేతిబంధ మొక్క దేహము
యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము
ముంచె నిదె వొకటిలో మూఁడు దేహములు ॥ఎందుఁ॥

జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు
తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే
శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే
మూవంకల మముఁ గాచె మొక్కితి మాతనికి ॥ఎందుఁ॥

eMdu@M gaa@Mpuramu saetu naedi nija maedi galla
muMdara nokkadinamae moo@MDu gaalamulu pallavi
tanubhOgamula nivae taga noka lOkamu
manasulO talapO@Mta mari yokka lOkamu
yenasina kalalOni didi yokka lOkamu
munupu venakalivae moo@MDu lOkamulu eMdu@M
paMchabhootamula chaetibaMdha mokka daehamu
yeMcha@Mga noorupugaali yidi yokka daehamu
koMchaka triguNamulaguri sookshma daehamu
muMche nide vokaTilO moo@MDu daehamulu eMdu@M
jeevunilOpalivaa@MDu SreevaeMkaTaeSu@MDu
taavai velinunnavaa@MDu taa nokka@MDae
SreevaeMkaTaadrimeeda@M jela@Mginaata@M DeetaDae
moovaMkala mamu@M gaache mokkiti maataniki eMdu@M

849. telisi badukarO daehoolaala - తెలిసి బదుకరో దేహూలాల

FB link : Sung by Sri Kaushik Kalyan, tuned by : Sri Sai charan

తెలిసి బదుకరో దేహూలాల
వలెనని తలఁచినవారివాఁడే దేవుఁడు ॥పల్లవి॥

తనుఁ గొలువకూడితే తారము వెట్టఁ డేలిక
పెనఁగి కొలువకున్నఁ బెట్టు దేవుఁడు
జునుగుచు విడుతురు చుట్టాలు దరిద్రులైతే
వెనువెంటా నెంతయినా విడువఁడు దేవుఁడూ ॥తెలిసి॥

అంతట ముదిసితేను అంగనలు రోతురు
అంతరాత్మ యెన్నఁడు రోయఁడు దేవుఁడు
వింతగా నన్నఁ దమ్ములు విసాన కలుగుదురు
పొంతనే తా నలుగుఁడు పుట్టించిన దేవుఁడు ॥తెలిసి॥

వొదిగి మూల నుండితే వూరివారు మఱతురు
వదల కెందున్నా మఱవఁడు దేవుఁడు
తుదిముట్ట రక్షించు దుఃఖము లెల్ల నణఁచు

యెదుట శ్రీవేంకటేశుఁ డితఁడె పోదేవుఁడు ॥తెలిసి॥

telisi badukarO daehoolaala
valenani tala@Mchinavaarivaa@MDae daevu@MDu pallavi
tanu@M goluvakooDitae taaramu veTTa@M Daelika
pena@Mgi koluvakunna@M beTTu daevu@MDu
junuguchu viDuturu chuTTaalu daridrulaitae
venuveMTaa neMtayinaa viDuva@MDu daevu@MDoo telisi
aMtaTa mudisitaenu aMganalu rOturu
aMtaraatma yenna@MDu rOya@MDu daevu@MDu
viMtagaa nanna@M dammulu visaana kaluguduru
poMtanae taa nalugu@MDu puTTiMchina daevu@MDu telisi
vodigi moola nuMDitae voorivaaru ma~raturu
vadala keMdunnaa ma~rava@MDu daevu@MDu
tudimuTTa rakshiMchu du@hkhamu lella naNa@Mchu
yeduTa SreevaeMkaTaeSu@M Dita@MDe pOdaevu@MDu telisi