Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, April 09, 2015

842. kaadanna vaariki vaarikarmamE saakShi - కాదన్న వారికి వారికర్మమే సాక్షి

Audio Archive link: (.wma file , download to listen)
కాదన్న వారికి వారికర్మమే సాక్షి
యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి

వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై
ఆదటఁ దెచ్చి నిలిపె నది సాక్షి
ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన
పోదితో నీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి

అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్త-
మెదుట విశ్వరూపము యిది సాక్షి
మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు
పొదిగొన్న యాగములే భువిలో సాక్షి

బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు
పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి
యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతడనుటకు
వరమిచ్చే శ్రీవేంకటేశుడే సాక్షి

kaadanna vaariki vaarikarmamE saakShi
yEdesa choochina maaku neeta@mDE saakShi

vEdaalu satyamouTaku vishNu@mDu matsyaroopamai
aadaTa@m dechchi nilipe nadi saakShi
aadi@m garmamulu satyamauTaku brahmAyagAna
pOditO nItaDu yaj~nabhOktauTE sAkshi

ade brahmamu sAkAramauTaku purushasUkta-
meduTa viSwarUpamu yidi sAkshi
modalanuMDi prapaMchamunu tathyamaguTaku
podigonna yAgamulE bhuvilO sAkshi

berasi jIvESwarula bhEdamu galuguTaku
pori brahmAdula haripUjalE sAkshi
yiravai dAsyAna mOkshamichchu nItaDanuTaku
varamichchE SrIvEMkaTESuDE saakshi

4 comments:

Unknown said...

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవిచేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

Unknown said...

Sairam.manchi manchi keertanalu andisthunnaru.aa purushottamudi inka ee sadguru sai nathuni anugraham meeku ella velala vuntundi

Mahendra Dabhi said...

Nice Lyrics

Unknown said...

Great song...
Get Lyrics | Songs lyrics Site