833. maMgaLasUtra mokkaTE - మంగళసూత్ర మొక్కటే మగనాలికిఁ గట్టేది
మంగళసూత్ర మొక్కటే మగనాలికిఁ గట్టేది
అంగవించే మీఁదిపన్నులన్నియు విభునివే
తలఁపులోపల నిన్నుఁ దలఁచినానుఁ గలవు
తలఁచకున్నా నంతరాత్మవై కలవు
పలుపూజ లిఁకనేల భక్తిసేయనేల నీవు
గలవని నమ్మేదొక్కటే బుద్ధిగాకా
మొక్కినా రక్షింతువు మొక్కకున్నా జగములో
యిక్కువతో రక్షింతువు యెపుడు నీవు
పెక్కు విన్నపాలేల పిలిచి యలయనేల
తక్కక నమ్మేటిది నీదాస్య మొక్కటే
కడుసుజ్ఞానినైనా నీగర్భవాసమే వునికి
వెడ నజ్ఞానినైనాను విడిదక్కడే
బడినే శ్రీవేంకటేశ పలునావుద్యోగాలేల
నిడివి నిన్ను నుతించేనేమమే నాది
maMgaLasootra mokkaTae maganaaliki@M gaTTaedi
aMgaviMchae mee@Mdipannulanniyu vibhunivae
tala@MpulOpala ninnu@M dala@Mchinaanu@M galavu
tala@Mchakunnaa naMtaraatmavai kalavu
palupooja li@Mkanaela bhaktisaeyanaela neevu
galavani nammaedokkaTae buddhigaakaa
mokkinaa rakshiMtuvu mokkakunnaa jagamulO
yikkuvatO rakshiMtuvu yepuDu neevu
pekku vinnapaalaela pilichi yalayanaela
takkaka nammaeTidi needaasya mokkaTae
kaDusuj~naaninainaa neegarbhavaasamae vuniki
veDa naj~naaninainaanu viDidakkaDae
baDinae SreevaeMkaTaeSa palunaavudyOgaalaela
niDivi ninnu nutiMchaenaemamae naadi