787.గోనెలె కొత్తలు కోడెలెప్పటివి - gOnele kottalu kODeleppaTivi
గోనెలె కొత్తలు కోడెలెప్పటివి
నానినలోహము నయమయ్యీనా
మున్నిటిజగమే మున్నిటిలోకమే
యెన్నగ బుట్టుగులివె వేరు
నన్ను నెవ్వ రున్నతి బోధించిన
నిన్న నేటనే నేనెఱిగేనా
చిత్తము నాటిదే చింతలు నాటివే
యిత్తల భోగములివె వేరు
సత్తగు శాస్త్రము చాయ చూపినా
కొత్తగ నే నిక గుణినయ్యేనా
జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడే
యీవల భావనలివే వేరు
ధావతి కర్మము తప్పఁ దీసినా
దైవము గావక తలగీనా