717.erigiti nammiti nitaDu dayAnidhi - ఎఱిగితి నమ్మితి నితడు
ఎఱిగితి నమ్మితి నితడు దయానిధి
మఱగులు మొరగులు మరియిక లేవు
వేదోద్ధరణుడు విశ్వరక్షకుడు
ఆదిమూర్తి శ్రీఅచ్యుతుడు
సోదించి కొలిచితి సుముఖుడై మమ్మేలె
యేదెస మాపాల నితడే కలడు
పరమపురుషుడు ఆపన్నివారకుడు
హరి శాంతుడు నారాయణుడు
శరణంటి మితడు చేకొని కాచెను
తరవాతి పనులఁ దప్పడితడు
హృదయాంతరంగుడు యీశ్వరేశ్వరుడు
ఇదివో శ్రీవేంకటేశ్వరుడు
వెదకితి మీతడు విడువడు మమ్మిక
తుదకును మొదలికి దొరికినవాడు
e~rigiti nammiti nitaDu dayAnidhi
ma~ragulu moragulu mariyika lEvu
vEdOddharaNuDu viSwarakshakuDu
AdimUrti SrIachyutuDu
sOdiMchi kolichiti sumukhuDai mammEle
yEdesa mApAla nitaDE kalaDu
paramapuruShuDu ApannivArakuDu
hari SAMtuDu nArAyaNuDu
SaraNaMTi mitaDu chEkoni kAchenu
taravAti panula@M dappaDitaDu
hRdayAMtaraMguDu yISwarESwaruDu
idivO SrIvEMkaTESwaruDu
vedakiti mItaDu viDuvaDu mammika
tudakunu modaliki dorikinavADu
3 comments:
One more ANimutyam of Annamayya. Please add last word of last line i.e., tudakunu modaliki 'dorikinavaadu'
thank you sir, modified the lyric.
thanks,
Sravan
ee keerthanalu vinataaniki enno janmala punyam chesukoni undaali
Post a Comment