661.nIvu na sommavu nEnu nI sommu - నీవు న సొమ్మవు నేను నీ సొమ్ము
Audio link : Sri Balakrishnaprasad
నీవు న సొమ్మవు నేను నీ సొమ్ము
యీవల నీవెపుడు మాయింట నుండ తగవాహరి నీరూపము నాకు నాచార్యుడు మున్నె
కెరలి నాపాల నప్పగించినాడు
నరహరి నిను నే నన్యాయమున తెలియను
పొరబడి నీ కెందు పోదగునా
జనని నీదేవి లక్ష్మి జనకుడవు నీవే
తనువులు నాత్మబాంధవము నీవే
అనయము నేనెంత నపరాధినైనాను
పనివడి నీవు నన్ను పాయదగునా
బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని
సహజబిరుదు భువిజాటీనీ
యిహమున శ్రీవేంకటేశ యిది దలచైన
విహితమై నాకడకు విచ్చేయవే
nIvu na sommavu nEnu nI sommu
yIvala nIvepuDu mayiMTa nuMDa tagavA
hari nIrUpamu nAku nAchAryuDu munne
kerali nApAla nappagiMchinaDu
narahari ninu nE nanyAyamuna teliyanu
porabadi nI keMdu pOdagunA
janani nIdEvi lakshmi janakuDavu nIvE
tanuvulu nAtmabAMdhavamu nIvE
anayamu nEneMta naparAdhinainAnu
panivaDi nIvu nannu pAyadagunA
bahuvEdamulu ninnu bhaktavatsaluDavani
sahajabirudu bhuvijATInI
yihamuna SrIvEMkaTESa yidi dalachaina
vihitamai nAkaDaku vichchEyavE
No comments:
Post a Comment