665.vorapO merupO vayyAramO - వొరపో మెరుపో వయ్యారమో
వొరపో మెరుపో వయ్యారమో నీకు వెరుతుమయ్యా గోవిందుడా కపటమో నిజమో కరుణయో కోపమో ఉపచారమో ఉపతాపమో నిపుణత తనపై నెయ్యమే చేసేవు విపరీతము గోవిందుడా ననుపో నగవో నయమో ప్రియమో చనవో చలమో సరసమో కనుకూరిమియో గయ్యాళితనమో వెనుతగిలేవు గోవిందుడా మంకో మరులో మదమో ముదమో జంకో లంకో జగడమో శంకలేక నను సరుసనకూడితి వేంకటగిరి గోవిందుడా vorapO merupO vayyAramO nIku verutumayyA gOviMduDA kapaTamO nijamO karuNayO kOpamO upachAramO upatApamO nipuNata tanapai neyyamE chEsEvu viparItamu gOviMduDA nanupO nagavO nayamO priyamO chanavO chalamO sarasamO kanukUrimiyO gayyALitanamO venutagilEvu gOviMduDA maMkO marulO madamO mudamO jaMkO laMkO jagaDamO SaMkalEka nanu sarusanakUDiti vEMkaTagiri gOviMduDA