634.tAnE yeruMgunu ramaNuDu - తానే యెఱుఁగును రమణుడు
Audio link : Composed and sung by Sri Voleti Venktateswarlu
Article on this great composer : The Hindu
తానే యెఱుఁగును రమణుడు తనకెదు రాడేనా
నానెను జెమటలఁ బులకలు నటనకు పనిలేదే
కోపమూ కన్నుల నున్నది కూరిమి మదిలో నున్నది
యేపున పతి కింక నుత్తర మేమని చెప్పుదునే
తీపులు మాటల నున్నవి తెగువలు కాకల నున్నవి
రాపుగ పతివద్దకి నేరాకుండుట మేలే
జంకెలూ బొమ్మల నున్నవి చనవులు మొక్కుల నున్నవి
బింకముతో బేర్కొని తనుబిలువగ జోటేదే
మంకులు వొట్టూల నున్నవి మర్మము పైపై నున్నది
యింకా బుద్దులు మీరిక నేమని చెప్పరే
వలపులూ కౌగిట నున్నవి వాసులు సిగ్గుల నున్నవి
తల దడిసెను చలి వాసెను తానేమనగలడే
వలె నని శ్రీవేంకటపతి వడదేరిచి నను గూడెను
నిలువున ముంచెను మరపులు నేరము లెంచకురే
tAnE ye~ru@Mgunu ramaNuDu tanakedu raDEnA
nAnenu jemaTala@M bulakalu naTanaku panilEdE
kOpamU kannula nunnadi kUrimi madilO nunnadi
yEpuna pati kiMka nuttara mEmani cheppudunE
tIpulu mATala nunnavi teguvalu kAkala nunnavi
rApuga pativaddaki nErAkuMDuTa mElE
jaMkelU bommala nunnavi chanavulu mokkula nunnavi
biMkamutO bErkoni tanubiluvaga jOTEdE
maMkulu voTTUla nunnavi marmamu paipai nunnadi
yiMkA buddulu mIrika nEmani chepparE
valapulU kaugiTa nunnavi vAsulu siggula nunnavi
tala daDisenu chali vAsenu tAnEmanagalaDE
vale nani SrIvEMkaTapati paDadErichi nanu gUDenu
niluvuna muMchenu marapulu nEramu leMchakurE
Explanation by Sri SankarRao garu :
No comments:
Post a Comment