శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, July 01, 2009

627.kOri nIpai tolli nAku - కోరి నీపైఁ దొల్లి నాకు

Audio link : composed and sung by TP Chakrapani

కోరి నీపైఁ దొల్లి నాకు కోపమున్నదా
ఆరీతి ఱట్టు సేయగా నంటి నింతేకాక

ఆనలేల పెట్టేవు అంత వేడుకొనలేల
కానీయవయ్యా నీమాటుకు కాదనేమో
నేనిట్టె మాటాడగాను నేరుపుతో నాపెచేతి -
కాను కందుకొనగాను కసరితిగాక

కొప్పుదువ్వి యెంతనన్ను కొస రొడబరచేవు
చెప్పినట్టల్లా నీకుఁ జేయకుండేనా
యిప్పుడు నావద్ద నుండి యెలమి నాపెమట్టెల -
చప్పుడాలకించగాను జరసితిగాక

వీడెమిచ్చి చేయినాపై వేసేవు శ్రీవేంకటేశ
కూడితి విందులకు నియ్యకొనవలదా
జాడతోడ నన్నేలి సంగడినున్నాపెమోము
చూడగా నందుకు నిట్టె సొలసితిగాక


kOri nIpai@M dolli nAku kOpamunnadA
ArIti ~raTTu sEyagA naMTi niMtEkAka

AnalEla peTTEvu aMta vEDukonalEla
kAnIyavayyA nImATuku kAdanEmO
nEniTTe mATADagAnu nEruputO nApechEti -
kAnu kaMdukonagAnu kasaritigAka

koppuduvvi yeMtanannu kosa roDabarachEvu
cheppinaTTallA nIku@M jEyakuMDEnA
yippuDu nAvadda nuMDi yelami nApemaTTela -
chappuDAlakiMchagAnu jarasitigAka

vIDemichchi chEyinApai vEsEvu SrIvEMkaTESa
kUDiti viMdulaku niyyakonavaladA
jADatODa nannEli saMgaDinunnApemOmu
chUDagA naMduku niTTe solasitigAka


Get this widget | Track details | eSnips Social DNA

0 comments: