593.kOrika dIruTa yennaDu guNamunu - కోరిక దీరుట యెన్నడు గుణమును
Archive link :
కోరిక దీరుట యెన్నడు గుణమును నవగుణమునుఁ జెడి
వూరక యీమది నీపైనుండుట యెన్నడుకో
చిత్తంబాకలి దీరదు చింత దలంపునఁ బాయదు
యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర
హత్తిన పుణ్యము పాపము నప్పటిసుఖముల కొరకే
వత్తికి నూనెకు కొలదై వడిఁజనె దివసములు
జీవుడె పరతంత్రుడుగన చింతింపడు నిన్నెప్పుడు
చావును పుట్టుగు సహజము శరీరధారులకు
శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ
పావనమతియై ప్రాణులు బ్రదుకుట యెన్నడుకో
kOrika dIruTa yennaDu guNamunu navaguNamunu@M jeDi
vUraka yImadi nIpainuMDuTa yennDukO
chittaMbAkali dIradu chiMta dalaMpuna@M bAyadu
yettina paritApamunaku nEdI mitimEra
hattina puNyamu pApamu nappaTisukhamula korakE
vattiki nUneku koladai vaDi@Mjane divasamulu
jIvuDe parataMtruDugana chiMtiMpaDu ninneppuDu
chAvunu puTTugu sahajamu SarIradhArulaku
SrIvanitAhRdayESwara SrIvEMkaTagirivallabha
pAvanamatiyai prANulu bradukuTa yennaDukO
No comments:
Post a Comment