Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, February 01, 2008

404.koMDA chUtamu rArO - కొండా చూతము రారో

Audio Archive link :
కొండా చూతము రారో కొండొక తిరుమలకొండా
కొండని యడిగిన వరము లొసగు మాకొండల తిమ్మయ కొండా ||

మేరువు మును స్తుతియింపగను వారిజసంభవుడా
పేరు కలుగు నవరత్నంబులు బంగారము కల్పతరువూ
మేరకు మీఱగని నెలవున నారుగ నిడెనొకో యనగా
ధారుణి భ్రహ్మాణ్డములకు నాధారంబగు మాకొండా ||

గరుడాచలం బనగా శ్రీవేంకటశైలం బనగా
గిరులకు నేలికె యగు ననంతగిరి దా నీ గిరియనగా
సిరులాయ జనమగు యంజన శబరి యనెడి నామములూ
పరగగ నాలుగు యుగముల వెలసిన ప్రబలంబగు మాకొండా ||

పొదలూ సొంపగు నింపుల పూబొదలూ వాసననదులూ
కొదలూ గల తామరకొలకులపై మెదలుతుమ్మెదలూ
కడలి మలయానిలు వలపులపస కదళీవనములనూ
మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలు గల మాకొండా ||

జంతువులెల్లను మునులూ సకలమైన దేవతలూ
జంతువుల యెలగులు వేదసారంబగు హరినుతులూ
చింతామణులట రాళ్ళెల్లను సిరులనెలవు లా గుహలూ
సంతతసౌభాగ్యంబుల నొప్పెడు సందడిగల మా కొండా ||

వొకచో బ్రహ్మాదులు మునులును వొకచో నింద్రాదులునూ
వొకచో భాగవతులు యతులు శ్రుతులు వొకచో చంద్రార్కులు
వొకచో తీర్థంబులు గిరులును వొకచో యోగీశ్వరులూ
అకలంకత తనుగోరి తపము సేయనాస లెఱగు మాకొండా ||

శుకములతో చదువుదురా శుకబ్రహ్మాదులు శ్రుతులూ
తకదిమ్మని యాడించు మయూరతతిని యోగీశ్వరులూ
సకల పురాణంబులు విందురు మఱి పికశారికలచే మునులూ
ప్రకటితముగ నీవిద్యల నొప్పెడు భాగ్యముకల మా కొండా ||

స్వామితీర్థములకును స్వామిపుష్కరణియునూ
పామరులా యమరుల జేయును పాపవినాశనమూ
తా మహిగోరిక లిచ్చు కుమారధారయూ పాండవసరసీ
కామితఫలగాయిని ఆకాశగంగయు గల మాకొండా ||

యిదియె క్షీరాంబుధి యనుచు మరి యిదియె ద్వారక యనుచు
యిదియె నందవ్రజ మనుచును మరి యిది దా నయోద్య యనుచూ
యిదియె వైకుంఠం బనుచును యిది పరతత్వంబనుచు
యిదియె పరమపదం బనుచు వేదములు యెన్నగగల మా కొండా ||


తలచిన శుకశౌనకాదులకు తలచిన తలపొసగినా
తలపులోపల నెలకొన్నా దయతో నన్నేలినా
చెలువుడు మావేంకటరాయడు సిరులనెలవు చేకొన్నా
కలియుగవైకుఠంబను నామము గలిగివెలయు మాకొండా ||


koMDA chUtamu rArO koMDoka tirumalakoMDA
koMDani yaDigina varamu losagu mAkoMDala timmaya koMDA ||

mEruvu munu stutiyiMpaganu vArijasaMbhavuDA
pEru kalugu navaratnaMbulu baMgAramu kalpataruvU
mEraku mI~ragani nelavuna nAruga niDenokO yanagA
dhAruNi bhrahmANDamulaku nAdhAraMbagu mAkoMDA ||

garuDAchalaM banagA SrIvEMkaTaSailaM banagA
girulaku nElike yagu nanaMtagiri dA nI giriyanagA
sirulAya janamagu yaMjana Sabari yaneDi nAmamulU
paragaga nAlugu yugamula velasina prabalaMbagu mAkoMDA ||


podalU soMpagu niMpula pUbodalU vAsananadulU
kodalU gala tAmarakolakulapai medalutummedalU
kaDali malayAnilu valapulapasa kadaLIvanamulanU
modalugA nellappuDu nI saMpadalu gala mAkoMDA ||

jaMtuvulellanu munulU sakalamaina dEvatalU
jaMtuvula yelagulu vEdasAraMbagu harinutulU
chiMtAmaNulaTa rALLellanu sirulanelavu lA guhalU
saMtatasaubhAgyaMbula noppeDu saMdaDigala mA koMDA ||

vokachO brahmAdulu munulunu vokachO niMdrAdulunU
vokachO bhAgavatulu yatulu Srutulu vokachO chaMdrArkulu
vokachO tIrthaMbulu girulunu vokachO yOgISwarulU
akalaMkata tanugOri tapamu sEyanAsa le~ragu mAkoMDA ||

SukamulatO chaduvudurA SukabrahmAdulu SrutulU
takadimmani yADiMchu mayUratatini yOgISwarulU
sakala purANaMbulu viMduru ma~ri pikaSArikalachE munulU
prakaTitamuga nIvidyala noppeDu bhAgyamukala mA koMDA ||

swAmitIrthamulakunu swAmipushkaraNiyunU
pAmarulA yamarula jEyunu pApavinASanamU
tA mahigOrika lichchu kumAradhArayU pAMDavasarasI
kAmitaphalagAyini AkASagaMgayu gala mAkoMDA ||

yidiye kshIrAMbudhi yanuchu mari yidiye dwAraka yanuchu
yidiye naMdavraja manuchunu mari yidi dA nayOdya yanuchU
yidiye vaikuMThaM banuchunu yidi paratatwaMbanuchu
yidiye paramapadaM banuchu vEdamulu yennagagala mA koMDA ||


talachina SukaSaunakAdulaku talachina talaposaginA
talapulOpala nelakonnA dayatO nannElinA
cheluvuDu mAvEMkaTarAyaDu sirulanelavu chEkonnA
kaliyugavaikuThaMbanu nAmamu galigivelayu mAkoMDA ||

1 comment:

Anonymous said...

Check out http://telugu.blogkut.com/ for all Telugu blogs, News & Videos online. Lets Get united with other bloggers.