311.nIvu turagamu mIda nErpu-నీవు తురగముమీద నేర్పు
book:5, kriti:210
Archive Audio link : G Balakrishnaprasad
నీవు తురగము మీద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు
పదిలముగ నిరువంక పసిడిపింజల యంప-
పొదల తరకసములొరపులు నెరపగ
గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు
సొరిది శేషుని పెద్దచుట్టు పెనుకేవడము
సిరిదొలక నొకచేత చిత్తగించి
దురమునకు తొడవైన ధూమకేతువు చేత-
నిరవైన బల్లెమై యేచెనందపుడు
కరకజడాతో రమాకాంత జయలక్ష్మియై
తొరలి కౌగిట నిన్ను(దొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుగు కుచకుంభముల మిసిమితో నపుడు
nIvu turagamu mIda nErpu meraya
vEvElu rUpamulu vedachallitapuDu
padilamuga niruvaMka pasiDipiMjala yaMpa-
podala tarakasamulorapulu nerapaga
gadayu SaMkhamu chakramu dhanu@hkhaDgamulu
padivElu sUryabiMbamulainavapuDu
soridi SEshuni peddachuTTu penukEvaDamu
siridolaka nokachEta chittagiMchi
duramunaku toDavaina dhUmakEtuvu chEta-
niravaina ballemai yEchenaMdapuDu
karakajaDAtO ramAkAMta jayalakshmiyai
torali kaugiTa ninnu(doDiki paTTi
charache venu vEMkaTaswAmi ninu geluvumani
merugu kuchakuMbhamula misimitO napuDu
No comments:
Post a Comment