Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, May 01, 2007

200.hari yavatAra mItaDu-హరి యవతార మీతడు


Audio link :PRanganath
Archive link :
Click here to downloand this kirtana sung by Shobharaju
ప|| హరి యవతార మీతడు అన్నమయ్య |
అరయ మా గురుడీతడు అన్నమయ్య |

చ|| వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు |
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య |

ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు |
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు |
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య |

భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు |
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు |
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య |

ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు |
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ||

in english: pa|| hari yavatAra mItaDu annamayya |
araya mA guruDItaDu annamayya |

ca|| vaikuMTha nAthuni vadda vaDi paDu cunna vADu |
Akaramai tALLapAka annamayya |

Akasapu viShNu pAdamaMdu nityamai unna vADu |
AkaDIkaDa tALLapAka annamayya ||

ca|| Ivala saMsAra lIla iMdirESutO nunna vADu |
AvaTiMci tALLapAka annamayya |

BAviMpa SrI vEMkaTESu padamulaMdE yunnavADu |
hAva BAvamai tALLapAka annamayya ||

ca|| kShIrAbdhiSAyi baTTi sEviMpucu nunnavADu |
AritEri tALLapAka annamayya |

dhIruDai sUryamaNDala tEjamu vadda nunnavADu |
ArItula tALLapAka annamayya ||


Meaning by GB Sankara Rao in Sujana Ranjani
అన్నమయ్యను సాక్షాత్తూ హరి అవతారంగా కీర్తిస్తూ, ఆ మహానుభావుని విశేషతలను ఈ కీర్తన ద్వారా మనకందిస్తున్నాడు పెదతిరుమలయ్య!!
వెకుంఠ౦లో స్వామివారి వద్ద అన్నమాచార్యుల వారు ఆశీనులై తన భక్తికి సూచికగా సంకీర్తనలను గానం చేస్తున్నారు! క్షీరసాగరంలో కొలువెన శ్రీ విష్ణు పాదములను నిత్యం సేవిస్తున్నారు ఆచార్యులవారు! ఇందిరా దేవితో కూడిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనా తేజస్సుతో ధీరుడై అన్నమయ్య ఆరాధిస్తున్నాడని పెద తిరుమలాచార్యులవారు భక్తి పూర్వకంగా కొనియాడూతున్నారు.
ఆసరము=సూచిక

1 comment:

janardhan said...

Another link for this song sung by Susheela garu is :http://www.mediafire.com/?dytmtneynvw