Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, March 31, 2010

679.sEyanivADevvaDu chEri chillara dOshAlu - సేయనివాడెవ్వడు చేరి చిల్లర దోషాలు



Audio link : Sri Mangalampalli Balamuralikrishna సేయనివాడెవ్వడు చేరి చిల్లర దోషాలు యేయెడ జీవుల జాడ లీశ్వరకల్పితమే దేవుని నమ్మినయట్టి దేహియట ఆతనికి యీవల యెంతట పాప మేమి సేసును భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే ఆవటించు సూర్యునికి అంధకారమెదురా పూజింపించుకొనువాడు భువనరక్షకుడట తేజముతో దురితాలు తెంచగలేడా రాజు సేసిన యాజ్ఞ రాజుకంటెనెక్కుడా వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు జాతిలేని జీవునికి స్వతంత్రమేది కాతరపు జన్మానకు కార్యకారణమేది యేతున గరుడనికి నెదురా పాములు sEyanivADevvaDu chEri chillara dOshAlu yEyeDa jIvula jADa lISwarakalpitamE dEvuni namminayaTTi dEhiyaTa Ataniki yIvala yeMtaTa pApa mEmi sEsunu bhAviMchi yanni nErAlu parihariMchu nataDE AvaTiMchu sUryuniki aMdhakAramedurA pUjiMpiMchukonuvADu bhuvanarakshakuDaTa tEjamutO duritAlu teMchagalEDA rAju sEsina yAj~na rAjukaMTenekkuDA vOjatO vajrAyudhAna kOpunA parwatAlu chEtanAtmakuDaTa SrIvEMkaTESwaruDu jAtilEni jIvuniki swataMtramEdi kAtarapu janmAnaku kAryakAraNamEdi yEtuna garuDaniki nedurA pAmulu

Saturday, March 27, 2010

678.balavaMtuDitani baMTlamai bratukudumu - బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము



బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము
కిలకిల నవ్వీ సుగ్రీవ నరసింహుడు

 
దేవదేవుడితడు తేజోరాశి యితడు
భావించ నలవిగాని బ్రహ్మ మితడు
శ్రీవల్లభుడితడు జీవరక్షకుడితడు
కేవలమయిన సుగ్రీవనరసింహుడు


పరమాత్ముడితడు భయహరుడితడు
నిరుపమగుణముల నిత్యుడితడు
వరదుడితడు సర్వవంద్యుడు నీతడు
గిరిగుహలోని సుగ్రీవ నరసింహుడు


లరూపుడితడు కరుణానిధియితడు
మేలిమి జగత్తులకు మేటి యీతడు
మూలమై శ్రీవేంకటశైల నిలయుడితడు
కీలకమిన్నిటికి సుగ్రీవ నరసింహుడు


balavaMtuDitani baMTlamai bratukudumu
kilakila navvI sugrIva narasiMhuDu

dEvadEvuDitaDu tEjOrASi yitaDu
bhAviMcha nalavigAni brahma mitaDu
SrIvallabhuDitaDu jIvarakshakuDitaDu
kEvalamayina sugrIvanarasiMhuDu

paramAtmuDitaDu bhayaharuDitaDu
nirupamaguNamula nityuDitaDu
varaduDitaDu sarvavaMdyuDu nItaDu
giriguhalOni sugrIva narasiMhuDu

larUpuDitaDu karuNAnidhiyitaDu
mElimi jagattulaku mETi yItaDu
mUlamai SrIvEMkaTaSaila nilayuDitaDu
kIlakaminniTiki sugrIva narasiMhuDu

Monday, March 22, 2010

677.kAnIvE aMdukEmI kanukonE - కానీవే అందుకేమీ కనుకొనే పను లెల్ల


Audio link : Classical tune, Sri Saralarao(?) కానీవే అందుకేమీ కనుకొనే పను లెల్ల యీ నాటకములు నేనెఱగనివా పంతము లాడిన తానే భ్రమసీ గాక నాకు యింతలోనే యేమి దప్పె నెందు వోయీని వింత యడవుల వెంట వెదకడా సీతఁదొల్లి యెంత లేదు తనగుండె యెఱగనిదా బిగియుచున్న వాడే బిలిచీగాక నన్ను తగవులే నెరపేను దాని కేమే వెగటయి రాధాదేవివెంట తిరుగడా యెగువనె తనగుట్టు యెఱగనిదా కడలనున్న వాడే కలసీగాక నన్ను తడవకు వాని నిట్టె తతి రానీవే అడరి శ్రీవేంకటేశ్వరుడట్టె నన్ను గలసె యెడయకున్నాడు నే నిది యెఱగనిదా kAnIvE aMdukEmI kanukonE panu lella yI nATakamulu nEne~raganivA paMtamu lADina tAnE bhramasI gAka nAku yiMtalOnE yEmi dappe neMdu vOyIni viMta yaDavula veMTa vedakaDA sIta@Mdolli yeMta lEdu tanaguMDe ye~raganidA bigiyuchunna vADE bilichIgAka nannu tagavulE nerapEnu dAni kEmE vegaTayi rAdhAdEviveMTa tirugaDA yeguvane tanaguTTu ye~raganidA kaDalanunna vADE kalasIgAka nannu taDavaku vAni niTTe tati rAnIvE aDari SrIvEMkaTESwaruDaTTe nannu galase yeDayakunnADu nE nidi ye~raganidA

Friday, March 19, 2010

676.adiyepO SrIhari nAmamu - అదియెపో శ్రీహరి నామము


Audio link : Sri Nukala China satyanarayana
అదియెపో శ్రీహరి నామము తుదిపదమిదియె ధృవమై కలిగె తొడరి చిత్రకేతు డే నామము తడవి లోకమంతయు గెలిచె విడువక బ్రహ్మయు వెస నే నామము బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె హరుడే నామము అదె తారకముగ నిరతిఁదడవి యెన్నిక మీరె ధర నే నామము దలచి నారదుడు సురమునియై సంస్తుతులకు నెక్కె ధృవుడే నామము దొరకొని నుతియించి ధృవ పట్టంబున తుద బ్రదికె జవళి శ్రీ వేంకటేశ్వరుదాసులెల్లాను భువి నేనామము భోగించి మనిరి adiyepO SrIhari nAmamu tudipadamidiye dhRvamai kalige toDari chitrakEtu DE nAmamu taDavi lOkamaMtayu geliche viDuvaka brahmayu vesa nE nAmamu baDibaDi nuDuguchu prabhuDai niliche haruDE nAmamu ade tArakamuga nirati@MdaDavi yennika mIre dhara nE nAmamu dalachi nAraduDu suramuniyai saMstutulaku nekke dhRvuDE nAmamu dorakoni nutiyiMchi dhRva paTTaMbuna tuda bradike javaLi SrI vEMkaTESwarudAsulellAnu bhuvi nEnAmamu bhOgiMchi maniri

Friday, March 12, 2010

675.nApAli ghana nidhAnamuvu - నాపాలి ఘన నిధానమువు నీవే

Audio link : Shobharaj

నాపాలి ఘన నిధానమువు నీవే నన్ను
నీపాల నిడుకొంటి నీవే నీవే

ఒలిసి నన్నేలే దేవుడవు నీవే యెందు
తొలగని నిజబంధుడవు నీవే
పలుసుఖమిచ్చే సంపదవు నీవే యిట్టే
వెలయ నిన్నియును నీవే నివే


పొదిగి పాయని ఆప్తుడవు నివే నాకు
నదన తోడగు దేహమవు నీవే
మదమువాపెడినా మతియు నీవే నాకు
వెదక నన్నియును నీవే నీవే

యింకా లోకములకు నెప్పుడు నీవే యీ
పంకజభవాది దేవపతి నీవే
అంకిలి వాపగ నంతకు నీవే తిరు
వేంకటేశ్వరుడవు నీవే నీవే

nApAli ghana nidhAnamuvu nIvE nannu
nIpAla niDukomTi nIvE nIvE

olisi nannElE dEvuDavu nIvE yemdu
tolagani nijabamdhuDavu nIvE
palusukhamiccE sampadavu nIvE yiTTE
velaya ninniyunu nIvE nivE

podigi pAyani AptuDavu nivE nAku
nadana tODagu dEhamavu nIvE
madamuvApeDinA matiyu nIvE nAku
vedaka nanniyunu nIvE nIvE

yimkA lOkamulaku neppuDu nIvE yI
pamkajabhavAdi dEvapati nIvE
amkili vApaga namtaku nIvE tiru
vEmkaTESvaruDavu nIvE nIvE

Tuesday, March 09, 2010

674.vEvElu bandhamulu viDuvamuDuvambaTTe - వేవేలు బంధములు విడువముడువంబట్టె



వేవేలు బంధములు విడువముడువంబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్య పారేముందటి భవపాశములు తీరీదొల్లిటి తిత్తి లో పుణ్యము కోరీ కోరికలొకటొకటే ఏ రీతి సుజ్ఞాన విరిగేనయ్య పట్టినాకొంగు పంచేంద్రియములు తొట్టీ పాపము తోడుతనే పెట్టీ భ్రమల పెరిగెనీ మాయలు అట్టే మోక్షము ఎన్నడందేమయ్య విందై ఇహము వెనకకూతీసి అందీ వైరాగ్యం అరచేతికి కందువా శ్రీవేంకటపతి ఈ రెండు బంధించి తివేది భోగింతునయ్యా vEvElu bandhamulu viDuvamuDuvambaTTe daivamA ninneTTu tagilEmayya pArEmumdaTi bhavapASamulu tIrIdolliTi titti lO puNyamu kOrI kOrikalokaTokaTE E rIti suj~nAna virigEnayya paTTinAkongu panchEndriyamulu toTTI pApamu tODutanE peTTI bhramala perigenI mAyalu aTTE mOkshamu ennaDandEmayya vindai ihamu venakakUtIsi amdI vairAgyam aracEtiki kanduvA SrIvEmkaTapati I remDu bamdhimci tivEdi bhOgimtunayyA

Saturday, March 06, 2010

673.soridi saMsAraMbu suKamA yiMdariki - సొరిది సంసారంబు సుఖమా యిందరికి


ప|| సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగల వేగేరుగా || చ|| దేహములు దలప సుస్థిరములా ప్రాణులకు- | నూహింప లోభ మట్లుండుగాక | మోహంబుచే వెనుకముందెఱుగలేక తమ- | దేహసుఖములు మరిగి తిరిగేరుగాక || చ|| నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి | అలవి నిలుపగరాని యాసగాక | బలువైనవట్టిభ్రాంతిచే దగులువడి | తెలిసియును దెలియకిటు తిరిగేరుగాక || చ|| నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి | కొఱమాలినట్టి తమగుణముగక | యెఱుకతో దిరువేంకటేశు గొలువగలేక | తెఱగుమాలినబుద్ధి దిరిగేరుగాక ||
pa|| soridi saMsAraMbu suKamA yiMdariki | veraverxaMgaka vagala vEgErugA || ca|| dEhamulu dalapa susthiramulA prANulaku- | nUhiMpa lOBa maTluMDugAka | mOhaMbucE venukamuMderxugalEka tama- | dEhasuKamulu marigi tirigErugAka || ca|| nelakonnadravyamulu nilucunA yevvariki | alavi nilupagarAni yAsagAka | baluvainavaTTiBrAMticE daguluvaDi | telisiyunu deliyakiTu tirigErugAka || ca|| nerxayuviBavamulella nijamulA yiMdariki | korxamAlinaTTi tamaguNamugaka | yerxukatO diruvEMkaTESu goluvagalEka | terxagumAlinabuddhi dirigErugAka ||

Friday, March 05, 2010

672.ennaDu tIravu Ipanulu - ఎన్నడు తీరవు ఈపనులు


ఎన్నడు తీరవు ఈపనులు పన్నిన నీమాయ బహుళంబాయె పెక్కుమతంబుల పెద్దలునడచిరి ఒక్కసమ్మతై ఒడబడరు పెక్కుదేవతలు పేరు ఆడెదరు తక్కక ఘనులము తామేఅనుచు పలికెడి చదువులు బహుమార్గంబులు కలసి ఏకవాక్యత కాదు చలవాదంబులు జనులు మానరు పలు తర్కంబులె పచరించేరు శరణాగతులకు శ్రీవేంకటేశ్వర తిరముగ నీవే తీర్చితివీ పరమవైష్ణవులు పట్టిరివ్రతము ఇరవుగ నాచార్యులెరుగుదురూ ennaDu tIravu Ipanulu pannina nImAya bahuLambAye pekkumatambula peddalunaDaciri okkasammatai ODabaDaru pekkudEvatalu pEru ADedaru takkaka ghanulamu tAmEanucu palikeDi caduvulu bahumArgambulu kalasi EkavAkyata kAdu calavAdambulu janulu mAnaru palu tarkambule pacarimcEru SaraNAgatulaku SrIvEmkaTESwara tiramuga nIvE tIrcitivI paramavaishNavulu paTTirivratamu iravuga nAchAryulerugudurU

Monday, February 08, 2010

671.hari hari nI mAyAmahima - హరి హరి నీ మాయామహిమ

Audio link : Sri Balakrishnaprasad హరి హరి నీ మాయామహిమ సరవి దెలియ నను గరుణించగదే తలతును నా పాలిదైవమవని నిను తలతును తల్లిని దండ్రివని మలసి యంతలో మఱతును తెలుతును కలవలె నున్నది కడగనరాదు మొక్కుదు నొకపరి మొగినేలికవని మొక్కుదు నీ వాదిమూలమని వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు కక్కసమైనది కడ గనరాదు చూతును నీమూర్తి సులభుడవనుచును చూతు జగములకు సోద్యమని యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి కౌతుకమొదవెను కడ గనరాదు hari hari nI mAyAmahima saravi deliya nanu garuNiMcagadE talatunu nA pAlidaivamavani ninu talatunu tallini daMDrivani malasi yaMtalO marxatunu telutunu kalavale nunnadi kaDaganarAdu mokkudu nokapari moginElikavani mokkudu nI vAdimUlamani vukkuna garviMci yubbudu saggudu kakkasamainadi kaDa ganarAdu cUtunu nImUrti sulabhuDavanucunu cUtu jagamulaku sOdyamani yItala SrI vEMkaTESa nannElitivi kautukamodavenu kaDa ganarAdu

Monday, January 11, 2010

670.SaraNAgata vajra paMjaruDitaDu - శరణాగత వజ్ర పంజరుడితడు


Audio link : Sri Nukala China satyanarayana
ప శరణాగత వజ్ర పంజరుడితడు చక్రధరుడు అసుర సంహారుడు
అప వెరవుతోడ తను శరణనువారికి వెనుబలమీతడే రక్షకుడు

చ అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది
ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి
ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రక్షకుడు

చ శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి
దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి
శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు


pa SaraNAgata vajra paMjaruDitaDu cakradharuDu asura saMhAruDu
apa veravutODa tanu SaraNanuvAriki venubalamItaDE rakShakuDu

ca aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi
iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru
eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki
iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu

ca SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi
dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru
tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki
SrIpati goliciti cEre saMpadalu jiginitaDE mA rakShakuDu