Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, March 31, 2007

168.dRshTitAku mAayyaku-దృష్టితాకు మాఅయ్యకు


Audio link :P.Ranganath
Archive link :
దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే
దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే
చప్పుడు సేయుటకవసరము కాదనరే
అప్పుడు మజ్జనము ఆడుననీ తెలుపరే
కప్పురంపు సురటుల కొలిచెదరనరే
అప్పుడు సతుల తోనూ ఆరగించినాడనరే
దంతపు చవికెలో ఏకాంతమాదేననరే
అంతరంగమున నృత్యము ఆడెదరని తెలుపరే
దొంతి పూలతోటలోన తమిగూడి యున్నాడనరే
చెంత కేళాకూళి లోన చిత్తగించి యున్నాడనరే
పట్టంపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే
రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు
సృష్టిలోకకర్త గాన సేవించి పొమ్మనరే


in english:
dRshTitAku mAayyaku teravEyarE
dRshTiMchedarevarainA darichEranIyakurE

chappuDu sEyuTakavasaramu kAdanarE
appuDu majjanamu ADunanI teluparE
kappuraMpu suraTula kolichedaranarE
appuDu satula tOnU AragiMchinADanarE

daMtapu chavikelO EkAMtamAdEnanarE
aMtaraMgamuna nRtyamu ADedarani teluparE
doMti pUlatOTalOna tamigUDi yunnADanarE
cheMta kELAkULi lOna chittagiMchi yunnADanarE


paTTaMpu rANiyu tAnu pavvaLiMchiyunnADanarE
raTTusEyaniMdevarainA rAnIyakurE
paTTapu alamElumaMgapati SrIvEMkaTESwaruDu
sRshTilOkakarta gAna sEviMchi pommanarE

Friday, March 30, 2007

167.kaMTi naKilAMDa-కంటి నఖిలాండ



Ragam : Brindavani, composer : G.Balakrishnaprasad
ప|| కంటి నఖిలాండ (తతి) కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||
చ|| పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||
చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన | సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి | తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||


in english:
pa|| kaMTi naKilAMDa tati kartanadhikuni gaMTi | kaMTi naGamulu vIDukoMTi nijamUrti gaMTi ||
ca|| mahanIya Gana PaNAmaNula Sailamu gaMTi | bahu viBavamula maMTapamulu gaMTi |
sahaja navaratna kAMcana vEdikalu gaMTi | rahi vahiMcina gOpuramulave kaMTi ||
ca|| pAvanaMbaina pApavinASamu gaMTi | kaivaSaMbagu gagana gaMga gaMTi |
daivikapu puNyatIrthamulella boDagaMTi | kOvidulu goniyADu kOnEri gaMTi ||
ca|| parama yOgIMdrulaku BAvagOcaramaina | sarilEni pAdAMbujamula gaMTi |
tiramaina giricUpu divyahastamu gaMTi | tiru vEMkaTAcalAdhipu jUDagaMTi ||

another Audio version from Surasa.net

166.adigAka nijamataMbadi-అదిగాక నిజమతంబద

audio by Nityasree , musicindiaonline :
ప|| అదిగాక నిజమతంబది గాక యాజకం- | బదిగాక హౄదయసుఖ మదిగాక పరము ||
చ|| అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు- | నమరినది సంకల్పమను మహాపశువు
ప్రమదమను యూపగంబమున వికసింపించి | విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా ||
చ|| అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ | వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ |
దొరకొన్న శమదమాదులు దానధర్మ | భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా ||
చ|| తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు | నరులకును సోమపానంబు గావలదా |
పరగ నాతనికౄపా పరిపూర్ణజలధిలో | నర్హులై యపబౄథం బాడంగవలదా ||

in english:
pa|| adigAka nijamataMbadi gAka yAjakaM- | badigAka hRudayasuKa madigAka paramu ||
ca|| amalamagu vij~nAnamanu mahAdhvaramunaku- | namarinadi saMkalpamanu mahApaSuvu
pramadamanu yUpagaMbamuna vikasiMpiMci | vimalEMdriyAhutulu vElpaMgavaladA ||
ca|| araya nirmamakAra mAcAryuDai celaga | varusatO dharmadEvata brahma gAga |
dorakonna SamadamAdulu dAnadharma | BAsvaraguNAdulu viprasamiti gAvaladA ||
ca|| tiruvEMkaTAcalAdhipu nijadhyAnaMbu | narulakunu sOmapAnaMbu gAvaladA |
paraga nAtanikRupA paripUrNajaladhilO | narhulai yapabRuthaM bADaMgavaladA ||

Thursday, March 29, 2007

165.kolicina vArala-కొలిచిన వారల


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ragam : kambhoji, composer : Balakrishnaprasad
audio link
ప|| కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు ||
చ|| ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినుపుల రఘుకుల నిధానమీతడు ||
చ|| పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము | ధరలో రామావతారంబితడు ||
చ|| చకితదానవుల సంహారచక్రము | సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము | ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||in english:
pa|| kolicina vArala koMgupaiDitaDu | balimi tAraka brahmamItaDu ||
ca|| inavaMSAMbudhi negasina tEjamu | Ganayaj~naMbula gala Palamu |
manujarUpamuna maniyeDi brahmamu | ninupula raGukula nidhAnamItaDu ||
ca|| paramAnnamulOpali sArapujavi | paraginadivijula Bayaharamu |
mariginasItA maMgaLasUtramu | dharalO rAmAvatAraMbitaDu ||
ca|| cakitadAnavula saMhAracakramu | sakala vanacarula jayakaramu |
vikasitamagu SrIvEMkaTa nilayamu | prakaTita daSaratha BAgyaMbitaDu ||

Monday, March 26, 2007

164.iMdirA ramaNudechchi-ఇందిరా రమణుదెచ్చి



ప|| ఇందిరా రమణుదెచ్చి యియ్యరో మాకిటువలె | పొంది యీతనిబూజింప బొద్దాయనిప్పుడు ||
చ|| ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి | నేరుపున మించిన యంజనీ తనయా |
ఘొరనాగ పాశముల గొట్టివేసీ యీతని | కారుణ్యమంది నట్టి ఖగరాజు గరుడా ||
చ|| నానాదేవతలకు నరసింహగంభములో | పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా |
మానవుడై కృష్ణ మహిమల విశ్వరూపు | పూని బండి నుంచుకొన్న పోటు బండ యర్జునా ||
చ|| శ్రీ వల్లభునకు నశేష కైంకర్యముల | శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ |
కైవసమైన యట్టి కార్త వీర్యార్జునుడా యీ- | దేవుని నీవేల నిట్టితెచ్చి మాకు నియ్యరే ||


in english:
pa|| iMdirA ramaNudecci yiyyarO mAkiTuvale | poMdi yItanibUjiMpa boddAyanippuDu ||
ca|| dhAruNi mairAvaNu daMDiMci rAmudecci | nErupuna miMcina yaMjanI tanayA |
GoranAga pASamula goTTivEsI yItani | kAruNyamaMdi naTTi KagarAju garuDA ||
ca|| nAnAdEvatalaku narasiMhagaMBamulO | pAnipaTTi cUpinaTTi prahlAduDA |
mAnavuDai kRShNa mahimala viSvarUpu | pUni baMDi nuMcukonna pOTu baMDa yarjunA ||
ca|| SrI vallaBunaku naSESha kaiMkaryamula | SrI vEMkaTAdrivaina SEShamUritI |
kaivasamaina yaTTi kArta vIryArjunuDA yI- | dEvuni nIvEla niTTitecci mAku niyyarE ||

Sunday, March 25, 2007

163.idivO suddulu-ఇదివో సుద్దులు


Audio link :G.BalaKrishnaPrasad
Archive Link :
సంపుటి-22, కీర్తన-77
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ( గైకొనవయ్యా
పలచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతె చూచెనటా
తళుకులగోళ్ళ దండె మీటి యదె
పలికి నిన్నొకతె పాడెనటా
చనవులు నెరపుచు సన్న సేయుచును
ననుపున నొక్కతె నవ్వెనటా
చెనకి యొకతె యదె చిగురుగేద(గుల
వెనకనుండి నిను వేసెనటా
అదన నీవు నన్నలమిపట్ట(గా
కొదలి యొకతె గని గొణ(గెనటా
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ
చెదరినయలకలు చెరిగెనటా


in english:
book-22,kIrtana-77
idivO suddulu yIrEpallenu
kadisi yiMdarivI( gaikonavayyA

palachanireppala pagaTulu nerapuchu
solasi ninnokate chUchenaTA
taLukulagOLLa daMDe mITi yade
paliki ninnokate pADenaTA

chanavulu nerapuchu sanna sEyuchunu
nanupuna nokkate navvenaTA
chenaki yokate yade chigurugEda(gula
venakanuMDi ninu vEsenaTA

adana nIvu nannalamipaTTa(gA
kodali yokate gani goNa(genaTA
yedurane SrIvEMkaTESa yokate nI
chedarinayalakalu cherigenaTA

162.satulAla chUDarE-సతులాల చూడరే


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :

సంపుటి-14, కీర్తన-453
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి(
గతలాయ నడురేయి( గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు



in english:
book-14, kIrtana-453
satulAla chUDarE SrAvaNabahuLAshTami(
gatalAya naDurEyi( galige SrIkRshuDu

puTTEyapuDE chaturbhujAlu SaMkhuchakrAlu
yeTTu dhariyiMchenE yI kRshNuDu
aTTe kirITamu nAbharaNAlu dhariMchi
yeTTA neduTa nunnADu yI kRshNuDu

vachchi brahmayu rudruDu vAkiTa nutiMchagAnu
yichchagiMchi vinuchunnA(DIkRshNuDu
muchchaTADI dEvakitO muMchi vasudEvunitO
hechchinamahimalatO yI kRshNuDu

koda dIra mari naMdagOpunaku yaSOdaku
idigO tA biDDADAye nIkRshNuDu
adana SrI vEMkaTESuDai yalamElmaMga(gUDi
yeduTanE niluchunnA DIkRshNuDu

Another Audio version from Surasa.net

Friday, March 23, 2007

161.uppavaDamu-ఉప్పవడము


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ప|| ఉప్పవడము గాకున్నారిందరు | యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ||
చ|| కన్నులు చంద్రుడు కమలమిత్రుడును | వున్నతి నివి నీకుండగను |
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను- | టెన్నడు నిద్దుర యెన్నడు నీకు ||
చ|| కందువ సతికనుగలువలు ముఖార- | విందము నిదివో వికసించె |
ముందర నిద్దుర మొలవదు చూచిన | విందగు నీతెలివికి తుదయేది ||
చ|| తమము రాజసము తగుసాత్వికమును- | నమరిన నీమాయారతులు |
కమలాధిప వేంకటగిరీశ నిన్ను | ప్రమదము మరపును బైకొనుటెట్లా ||

in english
pa|| uppavaDamu gAkunnAriMdaru | yeppuDu rEyi nIkeppuDu pagalu ||
ca|| kannulu caMdruDu kamalamitruDunu | vunnati nivi nIkuMDaganu |
vennelayeMDalu velayaga mElkonu- | TennaDu niddura yennaDu nIku ||
ca|| kaMduva satikanugaluvalu muKAra- | viMdamu nidivO vikasiMce |
muMdara niddura molavadu cUcina | viMdagu nIteliviki tudayEdi ||
ca|| tamamu rAjasamu tagusAtvikamunu- | namarina nImAyAratulu |
kamalAdhipa vEMkaTagirISa ninnu | pramadamu marapunu baikonuTeTlA ||

video: by Kaushik Ram in Atlanta Annamcharya Aradhana


160.ugguveTTarE vOyammA-ఉగ్గువెట్టరే వోయమ్మా


Audio link :
Archive link :
ప|| ఉగ్గువెట్టరే వోయమ్మా | చేయ్యొగ్గీ నిదె శిశువోయమ్మా ||
చ|| కడుపులోని లోకమ్ములు గదిలీ | నొడలూచకురే వోయమ్మా |
తొడికెడి సరగున తొలగదీయరే | పుడికెడి పాలివి వోయమ్మా ||
చ|| చప్పలు పట్టుక సన్నపు బాలుని | నుప్పర మెత్తకు రోయమ్మా |
అప్పుడె సకలము నదిమీ నోరనె | వొప్పదు తియ్యరె వోయమ్మా ||
చ|| తొయ్యలు లిటు చేతుల నలగించక | వుయ్యల నిడరే వోయమ్మా |
కొయ్యమాటలను కొండల తిమ్మని | వొయ్యన తిట్టకు రోరమ్మా ||

in english:
pa|| ugguveTTarE vOyammA | cEyyoggI nide SiSuvOyammA ||
ca|| kaDupulOni lOkammulu gadilI | noDalUcakurE vOyammA |
toDikeDi saraguna tolagadIyarE | puDikeDi pAlivi vOyammA ||
ca|| cappalu paTTuka sannapu bAluni | nuppara mettaku rOyammA |
appuDe sakalamu nadimI nOrane | voppadu tiyyare vOyammA ||
ca|| toyyalu liTu cEtula nalagiMcaka | vuyyala niDarE vOyammA |
koyyamATalanu koMDala timmani | voyyana tiTTaku rOrammA ||

Video : after 16:10min , background veena is superb

Thursday, March 22, 2007

159.AdidEva paramAtmA- ఆదిదేవ పరమాత్మా



Audio link :NedunuriKrishnamurthy
Archive link :
ragam : sindhubhairavi, composer : Nedunuri Krishnamurty
ప|| ఆదిదేవ పరమాత్మా | వేదవేదాంతవేద్య నమో నమో ||
చ|| పరాత్పరా భక్తభవభంజనా | చరాచరలోకజనక నమో నమో ||
చ|| గదాధరా వేంకటగిరినిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||

in english:
pa|| AdidEva paramAtmA | vEdavEdAMtavEdya namO namO ||
ca|| parAtparA BaktaBavaBaMjanA | carAcaralOkajanaka namO namO ||
ca|| gadAdharA vEMkaTagirinilayA | sadAnaMda prasanna namO namO ||

Adideva Paramatma, on Veena by E.Gayatri:









by Hyderbad Brothers:





by small kids, watch this video after 5:30min