Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, April 27, 2008

460.nIvaMTi daivAlu vErI - నీవంటి దైవాలు వేరీ నిఖిలలోకములందు


Audio link : Download and listen : Balakrishnaprasad
నీవంటి దైవాలు వేరీ నిఖిలలోకములందు
యీవల నావల ఎందు నెంచి చూడ మాకును

తగిలి నీమోము చక్కదనమెంచి చూచితిమా
తగిన మరుని గన్న తండ్రివి నీవు
అగపడ్డ నీగుణములవి యెంచి చూచితిమా
నిగిడి కళ్యాణగుణనిధివనీ శ్రుతులు

గుట్టు నీ పెద్దతనము కులమెంఛి చూచితిమా
అట్టె బ్రహ్మ కులము నీయందు బుట్టెను
దట్టపు నీ పనులవర్తన మెంచి చూచితిమా
ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి

బెడిదమైన నీబిరుదెంచి చీచితిమా
వడి శరణాగతవత్సలు(డవు
కడగి శ్రీ వేంకటేశ కంటిమి నీ మహిమలు
బడి నిన్నే సేవించి బ్రతికిమిదివో


nIvaMTi daivAlu vErI nikhilalOkamulaMdu
yIvala nAvala eMdu neMchi chUDa mAkunu

tagili nImOmu chakkadanameMchi chUchitimA
tagina maruni ganna taMDrivi nIvu
agapaDDa nIguNamulavi yeMchi chUchitimA
nigiDi kaLyANaguNanidhivanI Srutulu

guTTu nI peddatanamu kulameMChi chUchitimA
aTTe brahma kulamu nIyaMdu buTTenu
daTTapu nI panulavartana meMchi chUchitimA
muTTi sarwarakshakatwamuna velasitivi

beDidamaina nIbirudeMchi chIchitimA
vaDi SaraNAgatavatsalu(Davu
kaDagi SrI vEMkaTESa kaMTimi nI mahimalu
baDi ninnE sEviMchi bratikimidivO

459.mETi nEruparulAla merutalAla - మేటి నేరుపరులాల మెరుతలాల

Audio download link : Balakrishnaprasad
మేటి నేరుపరులాల మెరుతలాల
కూటములిద్దరికిని కూరుచరె యెపుడు

చెప్పగానే నోరూరీ చెలువనిచేతలు
చొప్పులెత్తి అతని నాకు చూపంగదరే
కుప్పవడీ కోరికలు గుణములు వింటేను
వొప్పుగా పొందులు నాకు ఒనరించరే

విననే వేడుకవుట్టీ విభుని చక్కదనాలు
ఆనువుగా నిద్దరి మాటాడించరే
మనసయ్యీ నాతని మంచితనాలు(నములు) చూడాగా
యెనయగ నాతని నింటికి తోడితేరే

తలచగానె వచ్చె తానె శ్రీవేంకతేశ్వరుడు
తెలుపరే నా మోహము దేవునికిని
తిలకించి చూచి ఇట్టె తిరముగా పెండ్లాడె
కలకాలమును నన్ను కరుణించుమనరె


mETi nEruparulAla merutalAla
kUTamuliddarikini kUruchare yepuDu

cheppagAnE nOrUrI cheluvanichEtalu
choppuletti atani nAku chUpaMgadarE
kuppavaDI kOrikalu guNamulu viMTEnu
voppugA poMdulu nAku onariMcharE

vinanE vEDukavuTTI vibhuni chakkadanAlu
AnuvugA niddari mATADiMcharE
manasayyI nAtani maMchitanAlu(namulu) chUDAgA
yenayaga nAtani niMTiki tODitErE

talachagAne vachche tAne SrIvEMkatESwaruDu
teluparE nA mOhamu dEVunikini
tilakiMchi chUchi iTTe tiramugA peMDlADe
kalakAlamunu nannu karuNiMchumanare

Friday, April 25, 2008

458.mIku mIku namarunu mikkili - మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా



Audio link : S. Janaki 
Audio link : G. Balakrishnaprasad
మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా
కైకొని నేమెల్లా చూడగంటిమిగదె

సింగార రాయడుకదె చిత్తజ గురుడు కదె
అంగవించి నిన్ను పెండ్లాడినవాడు
బంగారుపతిమవు పాలవెల్లి కూతురవు
అంగన నీవు దేవులవైతివి గదె

కాంచనపుదట్టివాడు కౌస్తుభపుమణివాడు
మంచితనమున మీకు మగడు కదె
మించు సిరుల దానవు మేటితమ్మిపైదానవు
ఎంచగ నితని వురము ఎక్కితివి గదవే

చేతులు నాల్గిటివాడు శ్రీవేంకటేశ్వరుడు
ఆతుమగా నిన్నునేలి అలరెగదె
యీతల శ్రీకాంతవు యిన్నిటా నేరుపరివి
యీతనికెప్పుడు యిరవైతివి కదవే


mIku mIku namarunu mikkili vEDukalellA
kaikoni nEmellA chUDagaMTimigade

siMgAra rAyaDukade chittaja guruDu kade
aMgaviMchi ninnu peMDlADinavADu
baMgArupatimavu pAlavelli kUturavu
aMgana nIvu dEvulavaitivi gade

kAMchanapudaTTivADu kaustubhapumaNivADu
maMchitanamuna mIku magaDu kade
miMchu sirula dAnavu mETitammipaidAnavu
eMchaga nitani vuramu ekkitivi gadavE

chEtulu nAlgiTivADu SrIvEMkaTESwaruDu
AtumagA ninnunEli alaregade
yItala SrIkAMtavu yinniTA nEruparivi
yItanikeppuDu yiravaitivi kadavE

Thursday, April 24, 2008

457.EdAya nEmi hari ichchina janmamE - ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు

Audio download link : Balakrishnaprasad
ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిలరక్షకు(డు

శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు

పురువు కుండే నెలవు భువనేశ్వరమై తోచు
పెరచోటి గుంతయైన ప్రియమై యుండు
యిరవై ఉండితే చాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు "సర్వం విష్ణు మయము"

అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికిదాసుడైతే
హెచ్చుకుందేమి లేదు యేలినవాడితడే


EdAya nEmi hari ichchina janmamE chAlu
AdinArAyaNuDI akhilarakshaku(Du

Sunakamu batukunu sukhamayyE tOchugAni
tanakadi hInamani talachukOdu
manasoDabaDitEnu maMchidEmi kAnidEmi
tanuvulO aMtarAtma daivamauTa tappadu

puruvu kuMDE nelavu bhuvanESwaramai tOchu
perachOTi guMtayaina priyamai yuMDu
yiravai uMDitE chAlu yeguvEmi diguvEmi
varusa lOkamulu "sarwaM vishNu mayamu"

achchamaina j~nAniki aMtA vaikuMThamE
chechchera tana timmaTE jIvanmukti
kachchupeTTi SrIvEMkaTapatikidAsuDaitE
hechchukuMdEmi lEdu yElinavADitaDE


video with lyrics :

456.daivaMbavu kartavu nIvE hari - దైవంబవు కర్తవు నీవే హరి

Audio download link : Balakrishnaprasad
దైవంబవు కర్తవు నీవే హరి
యీవల నావల నెవ్వడనయ్యా

తలచిన తలపులు దైవ యోగములు
కలిగిన చేతలు కర్మములు
వెలసిన దేహము విషయాధీనము
యిల నౌకాదన నెవ్వడనయ్యా

జిగి నింద్రియములు చిత్తపు మూలము
తగులమి మాయకు తను గుణము
జగతి ప్రాణములు సంసార బంధము
యెగదిగ నాడగ యెవ్వడనయ్యా

శ్రీ తరుణేశ్వర శ్రీవేంకటపతి
ఆతుమ యిది నీ అధీనము
యీతల నీవిక నెట్టైన జేయుము
యేతలపోతకు నెవ్వడనయ్యా


daivaMbavu kartavu nIvE hari
yIvala nAvala nevvaDanayyA

talachina talapulu daiva yOgamulu
kaligina chEtalu karmamulu
velasina dEhamu vishayAdhInamu
yila naukAdana nevvaDanayyA

jigi niMdriyamulu chittapu mUlamu
tagulami mAyaku tanu guNamu
jagati prANamulu saMsAra baMdhamu
yegadiga nADaga yevvaDanayyA

SrI taruNESwara SrIvEMkaTapati
Atuma yidi nI adhInamu
yItala nIvika neTTaina jEyumu
yEtalapOtaku nevvaDanayyA

455. anniTA jANavu nIku namaru - అన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు

Audio download link : Balakrishnaprasad
అన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు
కన్నుల పండుగ గాను కంటిమి నేడిపుడు

సేయని సింగారము చెలియ చక్కదనము
మోయని మోపు గట్టిముద్దుచన్నులు
పూయకపూసిన పూత పుత్తడి మేనివాసన
పాయని చుట్టరికము పైకొన్న చెలిమి

గాదెబోసిన మణులు కనుచూపు తేటలు
వీదివేసిన వెన్నెల వేడుకనవ్వు
పోదితో విత్తిన పైరు పొదిలిన జవ్వనము
పాదుకొన్న మచ్చికలు పరగువలపులు

పుట్టగా బుట్టిన మేలు పోగము సమేళము
పెట్టెబెట్టిన సొమ్ములు పెనురతులు
యిట్టె శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
నిట్టన గూడితి వీకె నిండిన నిధానము


anniTA jANavu nIku namaru nI javarAlu
kannula paMDuga gAnu kaMTimi nEDipuDu

sEyani siMgAramu cheliya chakkadanamu
mOyani mOpu gaTTimudduchannulu
pUyakapUsina pUta puttaDi mEnivAsana
pAyani chuTTarikamu paikonna chelimi

gAdebOsina maNulu kanuchUpu tETalu
vIdivEsina vennela vEDukanavvu
pOditO vittina pairu podilina javvanamu
pAdukonna machchikalu paraguvalapulu

puTTagA buTTina mElu pOgamu samELamu
peTTebeTTina sommulu penuratulu
yiTTe SrIvEMkaTESa yI yalamElumaMganu
niTTana gUDiti vIke niMDina nidhAnamu

Sunday, April 20, 2008

454.chEri kolvarO ItaDu SrIdEvuDu - చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు

Audio download link : sung by Balakrishnaprasad
ప|| చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు |
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు ||
చ|| అలమేలుమంగ నురమందిడు కొన్న దేవుడు |
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు|
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు |
మలసీ శ్రీవత్స వనమాలికల దేవుడు ||
చ|| ఘన మకర కుణ్డల కర్ణముల దేవుడు |
కనక పీతాంబర శౄంగార దేవుడు |
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు |
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు ||
చ|| కోటి మన్మథాకార సంకులమైన దేవుడు |
జూటుపు కిరీటపు మించుల దేవుడు |
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు |
యీటులేని శ్రీ వేంకటేశుడైన దేవుడు ||


pa|| cEri kolvarO ItaDu SrIdEvuDu | yI rIti SrI vEMkaTAdri niravaina dEvuDu ||
ca|| alamElumaMga nuramaMdiDu konna dEvuDu | celagi SaMKa cakrAla cEti dEvuDu|
kala varada hastamu gaTi hastapu dEvuDu | malasI SrIvatsa vanamAlikala dEvuDu ||
ca|| Gana makara kuNDala karNamula dEvuDu | kanaka pItAMbara SRuMgAra dEvuDu |
nanici brahmAdula nABi ganna dEvuDu | janiMce bAdAla gaMga saMgataina dEvuDu ||
ca|| kOTi manmathAkAra saMkulamaina dEvuDu | jUTupu kirITapu miMcula dEvuDu |
vATapu sommula tODi vasudhApati dEvuDu | yITulEni SrI vEMkaTESuDaina dEvuDu ||


Saturday, April 12, 2008

453.dEhinityuDu dEhamu lanityAlu - దేహినిత్యుడు దేహము లనిత్యాలు

click here to listen to this kirtana sung by Balakrishnaprasad
దేహినిత్యుడు దేహము లనిత్యాలు
యిహల నా మనసా యిది మరువకుమీ ||

గిది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు
ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని
గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు ||

ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు
యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండౌ చెలియించ డేమిటను
యీతల ననాది యీ తడిరవు గదలడు ||

చేరికాని రాని వాడు చింతించరాని వాడు
భారపువికారాల బాసిన వాడీ యాత్మ
అరయు శ్రీవేంకటేశు ఆధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానం ||

dEhinityuDu dEhamu lanityAlu
yihala nA manasA yidi maruvakumI ||

gidi bAtachIramAni kotta chIragaTTinaTTu
mudimEnu mAni dEhamumogi gottamEnu mOchu
adana jaMpagalEvu Ayudhamu litani
gadasi yagniyu nIru gAli jaMpaga lEvu ||

ItaDu naraku vaDa DItaDagni gAlaDu
yItaDu nITamunuga DItaDu gAlibODu
chEtanuDai sarvagatuMDoU cheliyiMcha DEmiTanu
yItala nanAdi yI taDirapu gadalaDu ||

chErikAni rAni vADu chiMtiMcharAni vADu
bhArapuvikArAla bAsina vADI yAtma
arayu SrIvEMkaTESu AdhIna mItaDani
sAramu teliyuTE satyaM j~nAnaM

I believe this is translation of few gita slokas:
వాసాఁసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సఁయాతి నవాని దేహీ
మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో,అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
నైనం చిందన్తి శస్త్రాణి నైనం దహతి పావక:
నచైనం క్లేదయన్త్యాపో నశోషయతి మారుత:
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శాస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది.

Thursday, April 10, 2008

452.vibhuni vinayamulu vinavammA - విభుని వినయములు వినవమ్మా

Click here to listen to this kirtana sung by NC Sridevi(?)

విభుని వినయములు వినవమ్మా - నిను
నభయంబడిగీ నయ్యో తాను
రహస్యమున శ్రీరమణుడు పంపిన
విహరణలేఖలు వినవమ్మా
అహిపతిశయనంబు అతితాపంబై
బహువేదనకు అగపడెనటగాను (?)

ఆదిమపతి నీయడుగుల కెరగిన
వేదంత రచన వినవమ్మా
నీదయగానక నిమిషమె యుగమై
ఖేదంబున నలగీనట తాను

కింకరుడట నీకినుక సేతలకు(చూపులకు?)
వేంకటపతి గతి వినవమ్మా
సంకెలేక నీ చనవున జగములు
కొంకకిపుడె చేకొనెనట గాను


vibhuni vinayamulu vinavammA - ninu
nabhayaMbaDigI nayyO tAnu

rahasyamuna SrIramaNuDu paMpina
viharaNalaekhalu vinavammA
ahipatiSayanaMbu atitApaMbai
bahuvaedanaku agapaDenaTagAnu (?)

aadimapati neeyaDugula keragina
vaedaMta rachana vinavammA
nIdayagAnaka nimishame yugamai
khaedaMbuna nalageenaTa tAnu

kiMkaruDaTa nIkinuka setalaku(chUpulaku?)
vaeMkaTapati gati vinavammA
saMkelEka nI chanavuna jagamulu
koMkakipuDe chEkonenaTa gAnu



Monday, April 07, 2008

451.mAyA mOhamu mAnadidi - మాయా మోహము మానదిది




Audio archive link : Sattiraju Venumadhav
Audio Archive link - M.Balamurali krishna
Youtube link 
మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత ని చిత్తమే కలది

యెంత వెలుగునకు అంతే చీకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా ఔషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది

చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన తలపే కలది

మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ -
గలిగిన మాకెల్ల ఘనతే కలది


mAyA mOhamu mAnadidi
SrI achyuta ni chittamE kaladi

yeMta velugunaku aMtE chIkaTi
yeMta saMpadaku naMtApada
aMtaTA aushadha mapathyamunu sari
viMtE migilenu vEsaTE kaladi

chEsina kUliki jItamunaku sari
pUsina karma bhOgamu sari
vAsula janmamu vaDi maraNamu sari
Asala migilina talapE kaladi

molachina dEhamu mudiyuTakunu sari
talachina daivamu tanalOnu
yilalO SrIvEMkaTESa nI karuNa -
galigina mAkella ghanatE kaladi
)