Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, March 18, 2008

437.namO namO daSarathanaMdana - నమో నమో దశరథనందన రామ

Audio link ...Vani Jayram
నమో నమో దశరథనందన రామ
కమనీయయాగభాగకర్త రామ

కాకుత్థ్సకుల రామ కౌసల్యాసుత రామ
శ్రీకరగుణోన్నత శ్రీరామ
కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ
భీకర తాటకాంతకబిరుద రామ

వారిధిబంధన రామ వాలిహరణ రామ
చారుహరకోదండభంజన రామ
ధారుణీజపతి రామ దశకంఠహర రామ
సారవిభీషణాభీషేచన రామ

అమరపాలిత రామ అయోధ్యాపతి రామ
సమరకోవిద రామ సర్వజ్ఞ రామ
విమల రామ శ్రీవేంకటగిరి రామ
రమణ శరణాగతరక్షక రామ

namO namO daSarathanaMdana rAma
kamanIyayAgabhAgakarta rAma

kAkutthsakula rAma kausalyAsuta rAma
SrIkaraguNOnnata SrIrAma
kAkAsuravairi rAma kauSikavatsala rAma
bhIkara tATakAMtakabiruda rAma

vAridhibaMdhana rAma vAliharaNa rAma
chAruharakOdaMDabhaMjana rAma
dhAruNIjapati rAma daSakaMThahara rAma
sAravibhIshaNAbhIshEchana rAma

amarapAlita rAma ayOdhyApati rAma
samarakOvida rAma sarwaj~na rAma
vimala rAma SrIvEMkaTagiri rAma
ramaNa SaraNAgatarakshaka rAma

436.ataDE rakshakuDaMdari - అతడే రక్షకుడందరి కతడే

Click here to listen to this kirtana sung by Balakrishnaprasad
అతడే రక్షకుడందరి కతడే
పతి యుండగ భయపడ జోటేది

అనంతకరము లనంతాయుధము-
లనంతుడు ధరించెలరగను
కనుగొని శరణాగతులకు మనకును
పనివడి యిక భయపడజోటేది

ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుడై యలరగను
నరహరికరుణే నమ్మిన వారికి
పరదున నిక భయపడజోటేది

శ్రీవేంకటమున జీవుల గాచుచు
నావల నీవల నలరగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపగ భయపడజోటేది


ataDE rakshakuDaMdari kataDE
pati yuMDaga bhayapaDa jOTEdi

anaMtakaramu lanaMtAyudhamu-
lanaMtuDu dhariMchelaraganu
kanugoni SaraNAgatulaku manakunu
panivaDi yika bhayapaDajOTEdi

dharaNi nabhayahastamutO neppuDu
hari rakshakuDai yalaraganu
naraharikaruNE nammina vAriki
paraduna nika bhayapaDajOTEdi

SrIvEMkaTamuna jIvula gAchuchu
nAvala nIvala nalaraganu
daivaSikhAmaNi dApagu mAkunu
bhAviMpaga bhayapaDajOTEdi

435.gOviMda naMda naMdana - గోవింద నంద నందన గోపాలకృష్ణ

Click here to listen to this kirtana
గోవింద నంద నందన గోపాలకృష్ణ నీ
భావము మాకు జిక్కె గోపాలకృష్ణ

కొంగువట్టె వదేమోయి గోపాలకృష్ణ మా
పంగెన కోవుదువా గోపాలకృష్ణ
దొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ
బంగారు కాశతోది గోపాలకృష్ణ

కొమ్మలచీర లంటిన గోపాలకృష్ణ
పమ్మి నిన్ను తిట్టము గోపాలకృష్ణ
కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ
బమ్మెర పోకిందుల గోపాలకృష్ణ

కొసరకు మంత నీవు గోపాలకృష్ణ (నీ)
పస నే నెరగనా గోపాలకృష్ణ
పొసగ శ్రీవేంకటాద్రి బొందితి నన్ను
పసి మెక్కె మొగము గోపాలకృష్ణ


gOviMda naMda naMdana gOpAlakRshNa nI
bhAvamu mAku jikke gOpAlakRshNa

koMguvaTTe vadEmOyi gOpAlakRshNa mA
paMgena kOvuduvA gOpAlakRshNa
doMgatanAla navvEvu gOpAlakRshNa
baMgAru kASatOdi gOpAlakRshNa

kommalachIra laMTina gOpAlakRshNa
pammi ninnu tiTTamu gOpAlakRshNa
kummariMchE vEla siggu gOpAlakRshNa
bammera pOkiMdula gOpAlakRshNa

kosaraku maMta nIvu gOpAlakRshNa (nI)
pasa nE neraganA gOpAlakRshNa
posaga SrIvEMkaTAdri boMditi nannu
pasi mekke mogamu gOpAlakRshNa

Monday, March 17, 2008

434.ItaDE haruDu yItaDE yajuDu - ఈతడే హరుడు యీతడే యజుడు

Audio link : Balakrishnaprasad
ఈతడే హరుడు
యీతడే యజుడు

ఈతనికి నీ చేతలెంత
ఘనమటుగాన


కడుపెక్కు బ్రహ్మాండ
కటకములు సుడివడిన

కడుపులో నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యంత

వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు-
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమింతురు గాన

తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె


ItaDE haruDu yItaDE yajuDu
Itaniki nI chEtaleMta ghanamaTugAna

kaDupekku brahmAMDa kaTakamulu suDivaDina
kaDupulO niDukonna ghanuDu
veDali pUtakichaMTi vishamu tAgina yaMta
vaDi tanaku nEmAya vaTTibUmelugAka

ellajaladhulu migili yEkamai pabbinapu-
Dullasilluchu nItaDuMDu
mallADi yoka reMDu maddulu virachinaTTi
balliduDavani ninnu pariNamiMturu gAna

tiruvEMkaTESwaruDu dEva dEvOttamuDu
paripUrNuDachyutuDabhavuDu
SaraNAgatula rakshasEyu vADanumATa
gurutugA talapOsi koniyADAgA valase

Sunday, March 16, 2008

433.ASAbaddhuDanai yalasi ninnu - ఆశాబద్ధుడనై యలసి నిన్ను గడు

Click here to listen to this kirtana : Shobharaju(?)
ప|| ఆశాబద్ధుడనై యలసి నిన్ను గడు- |
గాసి బేట్టినవాడ గాను ||

చ|| ఘనకర్మపరుడనై కర్మరూపుని జేయ |
నిను దూరి భారము నీకు గట్టినవాడ గాను |
పనిలేని దుహ్ఖలంపటుడనై దుహ్ఖము |
గనుపించకుమని కడు వేడినవాడ గాను ||

చ|| శ్రీవేంకటగిరిదేవేశ నాకిది |
గావలెననువాడ గాను |
కావలసినయవి గదిసిన నవి నాకు |
గావనుమనుజుండ గాను ||


pa|| ASAbaddhuDanai yalasi ninnu gaDu- | gAsi bETTinavADa gAnu ||
ca|| GanakarmaparuDanai karmarUpuni jEya | ninu dUri BAramu nIku gaTTinavADa gAnu |
panilEni duHKalaMpaTuDanai duHKamu | ganupiMcakumani kaDu vEDinavADa gAnu ||
ca|| SrIvEMkaTagiridEvESa nAkidi | gAvalenanuvADa gAnu |
kAvalasinayavi gadisina navi nAku | gAvanumanujuMDa gAnu ||

432.lakshmI kaLyANamu - లక్ష్మీ కళ్యాణము

Audio Archive link :Vedavyasa Ananda Bhattar
లక్ష్మీ కళ్యాణము లీలతో బాడే మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనము నీవును

చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్ను గుబ్బలివి బూజగుండలు
తీపుల మోవితేనెలు తీరని మధు పర్కము
దాపుగ బెండ్లి యాడరయ్య తగుదగు మీకును

మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు
మేటితలబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీతున పెండ్లాడరయ్య నెరవేరె మీకును

కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాగిన కోరికలే పావకోళ్ళు
ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీగక పెండ్లాడడయ్య వేడుకాయమీకును


lakshmI kaLyANamu lIlatO bADE midE nEmu
lakshmI nArAyaNulE lalanamu nIvunu

chUpulu chUpulu mIku sUsakamu bAsikamu
vUpachannu gubbalivi bUjaguMDalu
tIpula mOvitEnelu tIrani madhu parkamu
dApuga beMDli yADarayya tagudagu mIkunu

mATalu mI kiddariki madana maMtramulu
mETitalabAlu mIlO miMchu navvulu
gATamaina pulakalu kappuravasaMtAlu
nItuna peMDlADarayya neravEre mIkunu

kaugili kaugili mIku kaMduva peMDli chavike
pAgina kOrikalE pAvakOLLu
Agina SrIvEMkaTESa alamElumaMgA nIvu
vIgaka peMDlADaDayya vEDukAyamIkunu

431.nIvEmi sEtuvayya nIvu dayAnidhi - నీవేమి సేతువయ్య నీవు దయానిధి

Audio Archive link
ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||
చ|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె |
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని ||
చ|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత |
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని ||
చ|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే |
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని ||


pa|| nIvEmi sEtuvayya nIvu dayAnidhi vaMduvu | BAviMcalEnivAri pApamiMtE kAni ||
ca|| paramapada mosagi pApamaDacEnani | caramaSlOkamunaMdu cATitivi tolutane |
niratini BUmilOna nIvalla dappulEdu | paraga nammanivAri pApamiMtE kAni ||
ca|| nIpAdamulaku nAku neyyamaina laMkeni | yEpuna dvayArthamuna niyyakoMTivi toluta |
dApugA nIvalla niMka dappulEdu yeMcicUci | paipai namminavAri pApamiMtE kAni ||
ca|| baMti burANamulanu BaktasulaBuDa nani | aMtarAtma nImATa ADitivi tolutanE |
iMtaTa SrIvEMkaTESa yEmisEtuvayya nIvu | paMtAna namminavAri pApamiMtE kAni ||

Saturday, March 15, 2008

430.paratatwaM bagu bAluDu - పరతత్వం బగు బాలుడు

Click here to listen : Balakrishnaprasad
పరతత్వం బగు బాలుడు
పరిపరివిధముల బాలుడు

చద్దులమూటలు చంకల వ్రేలెడి
ముద్దులపడుచుల మూకలతో
పెద్దరికంబున పేయల( గాచిన
బద్దులనటనల బాలుడూ

వెన్నలుదాకగ వేట్లాడుచును
సన్నపుబడుచుల సంగడిని
కన్నెలు దూరగ కలకల నవ్విన
పన్నిన మాయల బాలుడు

బచ్చన రూపుల పాయపుబడుచులు
నిచ్చలు కొలువగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున నాడెడి
పచ్చిలపదకపు బాలుడు

paratatwaM bagu bAluDu
pariparividhamula bAluDu

chaddulamUTalu chaMkala vrEleDi
muddulapaDuchula mUkalatO
peddarikaMbuna pEyala( gAchina
baddulanaTanala bAluDU

vennaludAkaga vETlADuchunu
sannapubaDuchula saMgaDini
kannelu dUraga kalakala navvina
pannina mAyala bAluDu

bachchana rUpula pAyapubaDuchulu
nichchalu koluvaga nemmadini
nachchina vEMkaTa nagamuna nADeDi
pachchilapadakapu bAluDu

429.itaDE parabrahma midiye rAmakatha - ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ


  - has a version tuned and sung by Sri Sattiraju Venumadhav in ritigowla ragam
youtube link : Sri Sathiraju Venumadhav
ప|| ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ | శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ||
చ|| ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె | అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె |
సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె | ఖరదూషణులను ఖండించి వేసె ||
చ|| కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె |వనధి బంధించి దాటె వానరులతో |
కవలి రావణ కుంభకర్ణాదులను జంపి | వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును ||
చ|| సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ | భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె |
శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద | కామించి విభీషణు లంకకు బట్టముగట్టె ||


pa|| itaDE parabrahma midiye rAmakatha | SatakOTi vistaramu sarvapuNya Palamu ||
ca|| dharalO rAmuDu puTTe dharaNija beMDlADe | araNya vAsulakella naBayamicce |
soridi mukkujevulu cuppanAtikini gOse | KaradUShaNulanu KaMDiMci vEse ||
ca|| kinisi vAli jaMpi kiShkiMda sugrIvukicce |vanadhi baMdhiMci dATe vAnarulatO |
kavali rAvaNa kuMBakarNAdulanu jaMpi | vanita jEkoni maLLivacce nayOdhyakunu ||
ca|| saumitriyu BaratuDu SatruGnuDu goluvaga | BUmi yEle kuSalava putrula gAMce |
SrImaMtuDai nilice SrIvEMkaTAdri mIda | kAmiMci viBIShaNu laMkaku baTTamugaTTe ||

428.ramaNuDu pilichIni rAvE - రమణుడు పిలిచీని రావే

Audio link ...(Balakrishnaprasad)
రమణుడు పిలిచీని రావే చెలియ నీవు
తమకమె వలె గాక తరుణులకు

తలపుకొలది మంచితనమే వలె గాక
చలపాదితనమేల సరసులకు
వెలలేని మాటల వినయమే వలెగాక
సొలపు వెంగము లేల సుగుణులకు

కోటిసేయ వలపులు కుమ్మరించవలెగాక
నీటుతో గర్వములేల నేర్పరులకు
మేటిసరసము లాడి మెఱయగవలె గాక
జూటుతనము లేటికి సొంపుదొరలకును

నయగారితనమున నవ్వు నవ్వవలెగాక
రయమున దాగనేల రసికులకు
నియతి నన్నేలినాడు నేడు శ్రీవేంకటేశుడు
క్రియతో వేసరనేల కిమ్ముల దేవుళ్ళకు


ramaNuDu pilichIni rAvE cheliya nIvu
tamakame vale gAka taruNulaku

talapukoladi maMchitanamE vale gAka
chalapAditanamEla sarasulaku
velalEni mATala vinayamE valegAka
solapu veMgamu lEla suguNulaku

kOTisEya valapulu kummariMchavalegAka
nITutO garwamulEla nErparulaku
mETisarasamu lADi me~rayagavale gAka
jUTutanamu lETiki soMpudoralakunu

nayagAritanamuna navvu navvavalegAka
rayamuna dAganEla rasikulaku
niyati nannElinADu nEDu SrIvEMkaTESuDu
kriyatO vEsaranEla kimmula dEvuLLaku