Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, January 23, 2022

911. Srihari pAdatIrthamE cheDani maMdu - శ్రీహరిపాదతీర్ధంబే చెడని మందు

శుక్రవారం అభిషేకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారిి మూలమూర్తికి 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమపువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పోడి మున్నగు పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. వీటితో శ్రీవారికి అభిషేకం చెయ్యగా వచ్చే తీర్ధాన్ని "పులికాపుతీర్ధం (శ్రీ పాదతీర్ధం)" అంటారు. ఈ తీర్ధాన్ని అభిషేకంలో పాల్గొనే భక్తులుపై సంప్రోక్షిస్తారు. ఈ తీర్ధాన్ని శ్రీవారి భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు (TTD వారు Bottles లో వేసి అభిషేకంలో భక్తులందరికీ ఈ తీర్ధం ఇస్తారు). ఈ హరిపాద తీర్ధ మహిమను గూర్చి 'అన్నమయ్య' ఇలా కీర్తించాడు. 

(taken from http://tvramudu.blogspot.com/2016_05_18_archive.html)

YouTube link : Smt YogaKirtana

శ్రీహరిపాదతీర్ధంబే చెడని మందు 

మోహపాసాలు గోసి మోక్షమిచ్చే మందు 


కారమై కంటగించని కడు చల్లని మందు 

నూరని కాచనియట్టి నున్నని మందు 

కోరికతో వెలవెట్టి కొని తేవల్లని మందు 

వేరు వెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు 


గురుతైన రోగములు గుణముచేసే మందు 

దురితములు పెడబాపే దోడ్డ మందు 

నిరతము బ్రహ్మాదులు నేరుపుతో సేవించే మందు 

నరకము సొరమట్టి నయమయిన మందు 


SukravaaraM abhishaekaMlO SreevaeMkaTaeSvarasvaamivaarii moolamoortiki 84 tulaala pachchakarpooraM, 36 tulaala kuMkumapuvvu, 1 tulaM kastoori, 1.5 tulaM punugu tailaM, 24 tulaala pasupu pODi munnagu parimaLa dravyaalu upayOgistaaru. veeTitO Sreevaariki abhishaekaM cheyyagaa vachchae teerdhaanni "pulikaaputeerdhaM (Sree paadateerdhaM)" aMTaaru. ee teerdhaanni abhishaekaMlO paalgonae bhaktulupai saMprOkshistaaru. ee teerdhaanni Sreevaari bhaktulu teerdhaMgaa sveekaristaaru (TTD vaaru Bottles lO vaesi abhishaekaMlO bhaktulaMdarikee ee teerdhaM istaaru). ee haripaada teerdha mahimanu goorchi 'annamayya' ilaa keertiMchaaDu. 


SreeharipaadateerdhaMbae cheDani maMdu 

mOhapaasaalu gOsi mOkshamichchae maMdu 


kaaramai kaMTagiMchani kaDu challani maMdu 

noorani kaachaniyaTTi nunnani maMdu 

kOrikatO velaveTTi koni taevallani maMdu 

vaeru vellaMkulu koorchanaTTi veMduvOni maMdu 


gurutaina rOgamulu guNamuchaesae maMdu 

duritamulu peDabaapae dODDa maMdu 

niratamu brahmaadulu naeruputO saeviMchae maMdu 

narakamu soramaTTi nayamayina maMdu


in boot19, i see different lyrics






Friday, January 07, 2022

910. ఇట్టివాని నన్ను దైవ మెట్టు గాచెను - iTTivAni nannu daivameTTu gAcheunu

 Youtube Link: Tuned & Sung by Sri G Balakrishnaprasad

ఇట్టివాని నన్ను దైవ మెట్టు గాచెను

నట్టనడుమ నిదియే నాకు వెఱగాయెను


పరసతి పరధన పరనిందలకు రోయ

యిరవై పెద్దలలోన యెట్టున్నాఁడనో

హరి సేవ గురుసేవ అవియుఁ జేయుట లేదు

సరవి నింకా నేమి చదివేనో


పాపమును కోపమును పట్టిన చలము మాన

యేపున విజ్ఞాని నంటా యేమి సేసేనో

పై పై సన్మార్గము పట్టదు నా మతిలోన

దాపగు తత్త్వము నెట్టు తలపోసెనో


మోహమును దాహమును ముందు వెనకా నెఱుఁగ

ఆహా విరక్తుఁడ నే ననుట యెట్టు

వోహో శ్రీ వేంకటేశుఁ డొలిసి మన్నించెఁ గాక

సాహసించి నే నెట్టు శరణంటినో



iTTivaani nannu daiva meTTu gaachenu

naTTanaDuma nidiyae naaku ve~ragaayenu


parasati paradhana paraniMdalaku rOya

yiravai peddalalOna yeTTunnaa@MDanO

hari saeva gurusaeva aviyu@M jaeyuTa laedu

saravi niMkaa naemi chadivaenO


paapamunu kOpamunu paTTina chalamu maana

yaepuna vij~naani naMTaa yaemi saesaenO

pai pai sanmaargamu paTTadu naa matilOna

daapagu tattvamu neTTu talapOsenO


mOhamunu daahamunu muMdu venakaa ne~ru@Mga

aahaa viraktu@MDa nae nanuTa yeTTu

vOhO Sree vaeMkaTaeSu@M Dolisi manniMche@M gaaka

saahasiMchi nae neTTu SaraNaMTinO