859. aemanavachchunu chelluchunnavive - ఏమనవచ్చును చెల్లుచున్నవివె
Tuned and Sung by Sri Sathiraju Venumadhav : Audio link
ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు -పల్లవి-
కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే -ఏమ-
శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే -ఏమ-
శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే -ఏమ-
aemanavachchunu chelluchunnavive yeeSvara neemaayalu gonni
Sreemaadhava nee chittamu kola@Mdi@Mka cheppeDidae@MTiki jeevulaku -pallavi-
kalidOshaniruharaNa kaivalyaakara hari
tala@Mchinavaaridi naerupu mimu@M dala@Mchanivaaridi naerami
kalushameDali sooryOdayamainaa kaanavukonnijaMtuvulu
telisinavaaralu kaMduru yeetera@Mgalu reMTiki dinamokaTae -aema-
SaraNaagatarakshaNachatura sarvaaMtaraatmaka yachyuta
sari ninnu@M golichinavaaridi puNyamu chalamuna maanuTae paapamu
sarugana@M gaachaeTi challani chaMdru@MDu jaarachOrulaku@M gaDu vae@MDi
araya@Mga@M galuvalakunu hitu@MDu aMduku niMduku guri yita@MDae -aema-
SreevaeMkaTagirinilaya SreesateeSa purushOttama
mivoddanuMDitae vaikuMThamu mimmu neDasitae narakamu
bhaavamulOpala neevae vuMDa@Mga bhakti laedu koMdarikaitae
SreevaishNuvulaku nityamu yee chiMtalu reMTiki nee mahimae -aema-