Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, November 13, 2018

848. nImahimO nAlOna niMDinavalapujADO - నీమహిమో నాలోన నిండినవలపుజాడో

Audio link : sri G.Balakrishnaprasad
నీమహిమో నాలోన నిండినవలపుజాడో
యేమి సేతు నన్నెప్పుడు యెడయకువయ్యా      // పల్లవి //


యెనసి నీతో నేను యెంతవడి మాటాడినా
తనియదు నామనసు తమి యెట్టిదో
వినయముతో రెప్పలువేయక చూచినాను
నినుపులై మమతలు నిచ్చ కొత్తలు                   // నీమ //


చలపట్టి నీతోను సారెసారెఁ బెనఁగిన -
నలయదు నామేను ఆస యెట్టిదో
కొలువులో నీవద్దఁ గూచుండి యెంతనవ్విన
తలఁపులో కోరికలు తరగనిధాన్యాలు                // నీమ //


కడఁగి యందాఁకా నిన్నుఁ గాఁగిలించుకుండినాను
విడువవు చేతులు వేడు కెట్టిదో
అడరి శ్రీవేంకటేశ యలమేల్ మంగను నేను
తొడరి యేలితివి రతులు తరితీపులు              // నీమ //



nImahimO nAlOna niMDinavalapujADO
yEmi sEtu nanneppuDu yeDayakuvayyA            // pallavi //


yenasi nItO nEnu yeMtavaDi mATADinA
taniyadu nAmansu tami yeTTidO
vinayamutO reppaluvEyaka chUchinAnu
ninupulai mamatalu nichcha kottalu                   // nIma //


chalapaTTi nItOnu sAresAre benagina
nalayadu nAmEnu Asa yeTTidO
koluvulO nIvadda gUchuMDi yeMtanavvina
talapulO kOrikalu taraganidhAnyAlu               // nIma //


kaDagi yaMdAkA ninnu gAgiliMchukuMDinAnu
viDuvavu chEtulu vEDu keTTidO
aDari SrIvEMkaTESa yalamEl maMganu nEnu
toDari yElitivi ratulu taritIpulu                       // nIma //