843. ni dasyamokkate nilichi nammagaladi - నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది
YouTube link : Priya Sisters (@1hr:30min)
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది | శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము ||
చ|| అనుష్టానములు గతియని నమ్మీ చేసితినా | తనువిది మలమూత్రములప్రోగు |
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా | వొనరగర్మమనేవోదాన బడితిని ||
చ|| చదువులశాస్త్రములజాడలు నమ్మితినా | పొదలిన మతములపోరాట మదీ |
మదిమదినుండిననామనసే నమ్మితినా | అదియును నింద్రియలకమ్ముడువోయినది ||
చ|| పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా | పాత్రమగు రుణానుబంధములవి |
చిత్రముగ నను గావు శ్రీవేంకటేశ నీవే | పత్రపుష్ప మాత్రమే నాభక్తియెల్లా నీకు ||
needaasyamokkaTae nilichi nammagaladi | SreedaevuDavu neechittamu naabhaagyamu ||
cha|| anushTaanamulu gatiyani nammee chaesitinaa | tanuvidi malamootramulaprOgu |
janulalO nuttamapujanmamae nammitinaa | vonaragarmamanaevOdaana baDitini ||
cha|| chaduvulaSaastramulajaaDalu nammitinaa | podalina matamulapOraaTa madee |
madimadinuMDinanaamanasae nammitinaa | adiyunu niMdriyalakammuDuvOyinadi ||
cha|| putradaaradhanadhaanyabhoomulu nammitinaa | paatramagu ruNaanubaMdhamulavi |
chitramuga nanu gaavu SreevaeMkaTaeSa neevae | patrapushpa maatramae naabhaktiyellaa neeku
@1hr:30min in below video: