837. enta parama baMdhudavu - ఎంత పరమ బంధుడవు యేమని
ఎంత పరమ బంధుడవు యేమని నుతింతు మిమ్ము
అంత నిన్ను మరచి నే నపరాధి నైతిని
దురితములే నే జేసి దు:ఖముఁబొందే నాడు
తొరలి నన్ను రోసి తొలగ వైతి
నరకము చొచ్చేనాడు నాకు నంతర్యామి వై
పరుడు వీడేల యని పాయ వైతివిగా
జనని గర్భము నందు చరిఁ బడి వుండేనాడు
వెనుబలమవై నన్ను విడువ వైతి
పెనగి పంచేద్రియాల పిరువీకులయ్యెనాడు
అనుభవింపగఁజేసి అందుకు లోనైతివి
యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుడవై
మెట్టు కొని నా యిచ్చలో మెలగితివి
యిట్టి యీ జన్మమున నన్నేలి శ్రీ వేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి
aMta ninnu marachi nE naparAdhi naitini
duritamulE nE jEsi duhkamu bonde nAdu
torali nannu rOsi tolaga vaiti
narakamu cochchenAdu nAku antaryAmi vai
parudu veedEla yani pAya vaitivigA
janani garbhamu nandu caribaDi undENadu
venubalamvai nannu viduva vaiti
penagi panchendriyaala piruveekulayyenAdu
anubhavimpaga jesi anduku lOnaitivi
yeTTE nE gorina adi ichchi paratantrudavai
meTTukoni nA yichcha lO meligitivi
yitti yee janmamuna naNNEli Sree Venkatesa
paTTi nee dAsulalO dappaka manniMcitivi