Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, January 21, 2011

736.koluvarO mokkarO kOrina - కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ

Audio link : Sri Balakrishnaprasad
కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ
సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||

కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి
అంబరపు దేవతలకు అభయమిచ్చి |
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి
అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||

నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని
పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి
ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||

మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ
అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ
చక్కదనములకెల్లా చక్కని నరహరి ||

koluvarO mokkarO kOrina varamu liccI
sulaBu DinniTAnu vIDe sugrIva narahari ||

kaMbamulOna puTTi kanakadaityuni koTTi
aMbarapu dEvatalaku aBayamicci |
paMbi siridana toDapai beTTuka mATalADi
aMbujAkShuDainaTTi Adima narahari ||

nAnA BUShaNamulu unnati tODa niDukoni
pUnikatO prahlAduni bujjagiMci
mAnavulakellanu mannana cAlA nosagi
AnaMdamutO nunnADu adigO narahari ||

mikkili pratApamutO miMcina kAMtulatODa
akkajapu mahimala nalarucunu
takkaka SrIvEMkaTAdri tAvukoni varAliccI
cakkadanamulakellA cakkani narahari ||


Monday, January 10, 2011

735.nirmalulu vIru nityasukhulu - నిర్మలులు వీరు నిత్యసుఖులు

Audio : Sri DV Mohanakrishna
నిర్మలులు వీరు నిత్యసుఖులు
కర్మదూరులు విష్ణుకైంకర్యపరులు

పరమజ్ఞానసంపన్నులగువారికిని
అరుదుగా దిచటిమహదైశ్వర్యము
హరికృపారాధనము చేనబ్బినమహాత్ములకు
సరకుగాకుండు పంచల విధానములు

బలిమిని వేదాంత పట్టభద్రులకు నిల
బలురాజ్యపదవు లిరుగడబంట్లు
లలిమీరి హరిచక్రలాంఛనపు శూరులకు
యెలమి విజయములెల్ల నింటిలో నుండు

యీవలను శ్రీవేంకటేశు శరణాగతుల
కావటించిన పుణ్య మడువుగాదు
దైవజ్ఞులయిన యా ధర్మస్వరూపులకు
వేవేలు భోగములు వెనుతగులుచుండు

nirmalulu vIru nityasukhulu
karmadUrulu vishNukaiMkaryaparulu

paramajnAnasaMpannulaguvArikini
arudugA dichaTimahadaiSwaryamu
harikRpArAdhanamu chEnabbinamahAtmulaku
sarakugAkuMDu paMchala vidhAnamulu

balimini vEdAMta paTTabhadrulaku nila
balurAjyapadavu lirugaDabaMTlu
lalimIri harichakralAMChanapu SUrulaku
yelami vijayamulella niMTilO nuMDu

yIvalanu SrIvEMkaTESu SaraNAgatula
kAvaTiMchina puNya maDuvugAdu
daivaj~nulayina yaa dharmaswarUpulaku
vEvElu bhOgamulu venutaguluchuMDu

Friday, January 07, 2011

734.chinnavADu nAluguchEtulatOnunnADu - చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు


Audio link : Sri DV Mohanakrishna
చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు
కన్నప్పుడే శంఖముచక్రముచేతనున్నది

నడురెయి రోహిణి నక్షత్రమునబుట్టె
వడి కృష్ణుడిదివో దేవతలందు
పడిన మీ బాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుడికను

పుట్టుతనె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టె వసుదేవుని కానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టి వేములు మానెను వెరవకుడికను

శ్రీవేంకటనాథుడే యీసిసువు తానైనాడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావగ దిక్కైనా డిక్కడనె వోదాసులల
వేవేగ వేడుకతోడ వెరవకుడికను


chinnavADu nAluguchEtulatOnunnADu
kannappuDE SaMkhamuchakramuchEtanunnadi

naDureyi rOhiNi nakshatramunabuTTe
vaDi kRshNuDidivO dEvatalaMdu
paDina mI bAdhalella prajalAla yippuDiTTe
viDugarAya mIru veravakuDikanu

puTTutane bAluDu abburamaina mATalella
aTTe vasudEvuni kAnatichchenu
vaTTijAliMkEla dEvatalAla munulAla
veTTi vEmulu mAnenu veravakuDikanu

SrIvEMkaTanAthuDE yIsisuvu tAnainADu
yIvala varamu lellA nichchuchunu
kAvaga dikkainaa DikkaDane vOdAsulala
vEvEga vEDukatODa veravakuDikanu