766.eTTunnadO nIchitta yedurADa - ఎట్టున్నదో నీచిత్త యెదురాడ నే వెఱతు
YouTube link
Audio link : G. Anila Kumar
ఎట్టున్నదో నీచిత్త యెదురాడ నే వెఱతు
గట్టిగా హరి నీ మాయ కడవగరాదు
నిచ్చ పతితుల జూచి నేను సంసారినైయుందు
అచ్చపు సన్యాసుల జూచి అటువలె నయ్యేనందు
హెచ్చి మెంచి వచ్చితేను యెక్కడి గొడవ యందు
ఇచ్చట నిశ్చల బుద్ధి యెందూ నేగానను
కర్ముల జూచొకవేళ కర్మము నేఁ జేయబోదు
మర్మపు జ్ఙ్ణానుల జూచి మంచిదందును
అర్మిల రెండూ జూచి అంతలో సందేహింతు
నిర్మలమయిన బుద్ధి నే నెందు గానను
వారణాసి వోఁజూచి వారివెంట తగులుదు
తేరి కొంత దవ్వు వోయి తిరుగుదును
నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి
యీరీతి తేరినబుధ్ధి యందు నేగానను
ఎట్టున్నదో నీచిత్త యెదురాడ నే వెఱతు
గట్టిగా హరి నీ మాయ కడవగరాదు
నిచ్చ పతితుల జూచి నేను సంసారినైయుందు
అచ్చపు సన్యాసుల జూచి అటువలె నయ్యేనందు
హెచ్చి మెంచి వచ్చితేను యెక్కడి గొడవ యందు
ఇచ్చట నిశ్చల బుద్ధి యెందూ నేగానను
కర్ముల జూచొకవేళ కర్మము నేఁ జేయబోదు
మర్మపు జ్ఙ్ణానుల జూచి మంచిదందును
అర్మిల రెండూ జూచి అంతలో సందేహింతు
నిర్మలమయిన బుద్ధి నే నెందు గానను
వారణాసి వోఁజూచి వారివెంట తగులుదు
తేరి కొంత దవ్వు వోయి తిరుగుదును
నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి
యీరీతి తేరినబుధ్ధి యందు నేగానను
eTTunnadO nIchitta yedurADa nE ve~ratu
gaTTigA hari nI mAya kaDavagarAdu
nichcha patitula jUchi nEnu saMsArinaiyuMdu
achchapu sanyAsula jUchi aTuvale nayyEnaMdu
hechchi meMchi vachchitEnu yekkaDi goDava yaMdu
ichchaTa niSchala buddhi yeMdU nEgAnanu
karmula jUchokavELa karmamu nE@M jEyabOdu
marmapu j~mNAnula jUchi maMchidaMdunu
armila reMDU jUchi aMtalO saMdEhimtu
nirmalamayina buddhi nE neMdu gAnanu
vAraNAsi vO@MjUchi vAriveMTa taguludu
tEri koMta davvu vOyi tirugudunu
nErichi SrIvEMkaTESa nIvE nannu gAchitivi
yIrIti tErinabudhdhi yMdu nEgAnanu