Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, September 02, 2011

754.ihapara sAdhana mItalapu - ఇహపర సాధన మీతలపు

Audio link : 
ఇహపర సాధన మీతలపు
సహజ జ్ఞానికి సతమీతలపు


సిరులు వయోమదముప్పతిల్లినను
హరిని మఱవనిది అది తలపు
సరికాంత లెదుట సందడి గొనగా
తిరమయి భ్రమయనిదే తలపు


వొడలి వయోమదముప్పతిల్లినను
అడచి మెలంగుట యది తలపు
కడగుచు సుఖదుఃఖములు మంచినను
జడియని నామస్మరణమే తలపు


మతి సంసారపుమాయ గప్పినను
అతికాంక్షజొరనిదది తలపు
గతియై శ్రీ వేంకటపతి గాచిన
సతతము నితని శరణమే తలపు


ihapara saadhana mItalapu
sahaja j~naaniki satameetalapu


sirulu vayOmadamuppatillinanu
harini ma~ravanidi adi talapu
sarikaaMta leduTa saMdaDi gonagaa
tiramayi bhramayanidae talapu


voDali vayOmadamuppatillinanu
aDachi melaMguTa yadi talapu
kaDaguchu sukhadu@hkhamulu maMchinanu
jaDiyani naamasmaraNamae talapu


mati saMsaarapumaaya gappinanu
atikaaMkshajoranidadi talapu
gatiyai Sree vaeMkaTapati gaachina
satatamu nitani SaraNamae talapu

Sri GB Sankara Rao gari vivarana : (from silconandhra's sujanaranjani)

మనసు కోతి వంటిది మరియు వాయువు వంటిది. దానిని గ్రహించుట మిక్కిలి కష్టమైనది. గీతాచార్యుడు సైతం మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు. భౌతిక పరిధులను తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసు మాత్రం నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సిరిసంపదలు కుప్పలు తెప్పలుగా పడుతున్నా సరే. సర్వాత్ముడైన హరిని మరవదు. అతిశయమైన సౌందర్యంతో భామినులు సందడి చేస్తున్నా సరే. ఆ మోహావేశానికి లోను కాదు, యవ్వనము మదము చేత పొంగి పొరలుచున్ననూ అణుకువగా ఉంటుంది తప్ప విర్రవీగదు. సుఖదుఃఖాలలో సైతం హరినామస్మరణను విడువదు. సంసారమనే మాయ ఆవరించిననూ అత్యాశలకు లోను కాదు. ఎల్లప్పుడూ శీ వేంకటపతి శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని తలపు.

అటువంటి జ్ఞానాన్ని మనము కూడా సొంతం చేసుకుందామా! మరి! దానికి అన్నమయ్య చూపిన సంకీర్తన మార్గంలో నడిస్తే అట్టి నిశ్చల స్థితి, జ్ఞాన సిద్ధి తప్పక కలుగుతాయు.
సతము, సతతము = శాశ్వతము;
జిగి = ప్రకాశించు;
తిరము =స్థిరము (శాశ్వతము);
అడచి = అణచి;
మెలంగుట = ప్రవర్తించుట

Dr T Patanjali gari vyakhyanam, S.Venumadhav gari gatram.