Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, May 17, 2011

750.ihaparasAdhana midi yokaTE - ఇహపరసాధన మిది యొకటే

ఇహపరసాధన మిది యొకటే - సహజపు మురారి సంకీర్తననొకటే

భవసాగరముల బాపెడిది తేప - భువి నజ్ఞానము పులివాకట్టిది
జవళి నాశాపాశములకు కొడువలి - నవనీతచోరు నామం బొకటే

చింతా తిమిరము చెరచేటి సూర్యుడు - అంతట దరిద్రహతపు నిధానము
వింత మరణభయవినాశ మంత్రము - మంతుకు హరినామంబిది యొకటే

మించు దుఃఖముల మృతసంజీవని - అంచల పంచేంద్రియముల కంకుశము
ఎంచగ శ్రీ వేంకటేశు దాసులకు - పంచిన పాళ్ళ పరగిన దొకటే

ihaparasAdhana midi yokaTE - sahajapu murAri saMkIrtananokaTE

bhavasAgaramula bApeDidi tEpa - bhuvi naj~nAnamu pulivAkaTTidi
javaLi nASApASamulaku koDuvali - navanItachOru nAmaM bokaTE

chiMtA timiramu cherachaeTi sUryuDu - aMtaTa daridrahatapu nidhaanamu
viMta maraNabhayavinaaSa maMtramu - maMtuku harinAmaMbidi yokaTE

miMchu du@hkhamula mRtasaMjIvani - aMchala paMchEMdriyamula kaMkuSamu
eMchaga SrI vaeMkaTESu dAsulaku - paMchina pALLa paragina dokaTE

కలియుగంలో నామస్మరణకు, నామసంకీర్తనకు ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది! సాక్షాత్తూ భగవంతుడే తాను కలియుగంలో కేవలం ‘సంకీర్తనం’ చేత సంతుష్టుడునౌతానని ప్రకటించాడు. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని, సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవన్తి అని పలురకాలుగా పేర్కొన్నారు. అటువంటి విశిష్ట సంకీర్తన మంత్రాన్ని తాను ఉపాశించి మనందరికీ కరదీపికగా, ఆత్మజ్యోతిగా అందించాడు అన్నమయ్య ఈ సంకిర్తనలో ఇహపరాలను సాధించడానికి సాధనము మురారి సంకీర్తనమొకటేనని చాటి చెబుతూ, చరణాలలో ఆ సంకీర్తన ఏ విధంగా విశ్వరూపం ధరించి మనల్ని భవబంధ విముక్తుల్ని చేస్తుందో, అజ్ఞానాంధకారాలను దారిద్ర్యాన్ని, మరణ భయాన్ని, పలు బాధలను, పంచేంద్రియాల వికారాలను ఏ విధంగా రూపుమాపుతుందో చక్కగా స్పష్టం చేస్తున్నాడు ఆచార్య పురుషుడు! మరి మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇహపరసాధక మంత్రమైన సంకీర్తనను ఆశ్రయిద్దాం!

మురారి - ముర + అరి = రాక్షసులకు శత్రువు (శ్రీ మహావిష్ణువు);
భవసాగరము = సంసారమనెడు సముద్రము
జవళి = రంగురంగుల (భ్రాంతిని కలుగజేయు)
తిమిరము = అంధకారము
మంతుకు = ప్రసిద్ధికి
మించు = ఎక్కువైన
అంకుశము = ఏనుగు కుంభస్థలము నందు పొడిచెడి ఆయుధము
పరగిన (పరిగీ) = ప్రీతితో / అతిశయముతో
అంకుల = ప్రక్క, పార్వ్యము (శ.ర)


Monday, May 16, 2011

749.anuchu munulu Rshu laMtaniMta - అనుచు మునులు ఋషు లంతనింత నాడగాను

Audio link : NC Sridevi
అనుచు మునులు ఋషు లంతనింత నాడగాను
వినియు విననియట్టె వీడె యాడెగాని

ముకుందుఁడితడు మురహరుడితడు
అకటా నందునికొడుకాయగాని
శకుంతగమనుడితడు సర్వేశుడితడు
వెకలి రేపల్లెవీధి విహరించీగాని

వేదమూరితి యితడు విష్ణుదేవుడితడు
కాదనలేక పసులఁ గాచీగానీ
ఆదిమూలమీతడు యమరవంద్యుడితడు
గాదిలిచేతల రోలఁ గట్టువడెగాని

పరమాత్ముడితడే బాలుడై యున్నాడుగాని
హరి యీతడే వెన్నముచ్చాయెగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీగానీ

anuchu munulu Rshu laMtaniMta nADagAnu
viniyu vinaniyaTTe vIDe yADegAni

mukuMdu@MDitaDu muraharuDitaDu
akaTA naMdunikoDukAyagAni
SakuMtagamanuDitaDu sarwESuDitaDu
vekali rEpallevIdhi vihariMchIgAni

vEdamUriti yitaDu vishNudEvuDitaDu
kAdanalEka pasula@M gAchIgAnI
AdimUlamItaDu yamaravaMdyuDitaDu
gAdilichEtala rOla@M gaTTuvaDegAni

paramAtmuDitaDE bAluDai yunnADugAni
hari yItaDE vennamuchchAyegAni
paraga SrIvEMkaTAdripatiyunu nItaDe
tiramai golletalachE@M diTTuvaDIgAnI

Saturday, May 14, 2011

748.inni janmamulETiki haridAsu - ఇన్ని జన్మములేటికి హరిదాసు

Audio link : M.Rajeswari
ఇన్ని జన్మములేటికి హరిదాసు-
లున్న వూరఁ దానుండినఁ జాలు

హరిభక్తులయింటియన్నము గొనువారి
వరువుడై వుండవలెనన్నఁ జాలు
పరమభాగవత భవనంబులఁ జెడ్డ
పురువు దానయి పొడమిన జాలు

వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను-
రోసిన యెంగిలి రుచిగొన్నఁ జాలు
శ్రీ సతీశునిఁ దలచినవారి దాసాన(ను)-
దాసుడైవుండఁ దలచినజాలు

శ్రీవేంకటేశుఁ జూచినవారి శ్రీపాద-
సేవకుడై యుండఁజేరినఁ జాలు
ఈవిభుదాసుల హితుల పాదధూళి-
పావనమై సోకిఁ బ్రదికినఁ జాలు

inni janmamulETiki haridAsu-
lunna vUra@M dAnuMDina@M jAlu

hariBaktulayiMTiyannamu gonuvAri
varuvuDai vuMDavalenanna@M jAlu
paramaBAgavata BavanaMbula@M jeDDa
puruvu dAnayi poDamina jAlu

vAsudEvuni bhaktavaruladAsulu munnu-
rOsina yeMgili ruchigonna@M jAlu
SrI satISuni@M dalacinavAri dAsAna(nu)-
dAsuDaivuMDa@M dalacinajAlu

SrIvEMkaTESu@M jUcinavAri SrIpAda-
sEvakuDai yuMDa@MjErina@M jAlu
IvibhudAsula hitula pAdadhULi-
pAvanamai sOki@M bradikina@M jAlu

Tuesday, May 10, 2011

747.Baaramu nIpai vEsi - భారము నీపై వేసి బ్రతికియుండుటే మేలు


Audio link : Sri Dwaram Thyagaraju
భారము నీపై వేసి బ్రతికియుండుటే మేలు
నారాయణుడా నీవే నాకుఁ గలవనుచు

శరణన్నా వెరపయ్యీ సామజముఁ గాచినట్టు
వరుస దావతీ పడి వచ్చేవంటా
హరికృష్ణాయనవెరపయ్యీ ద్రౌపదివర
మిరవుగా నిచ్చినట్టు నిచ్చేవో యనుచు

చేతమొక్క వెరపయ్యీ చీరలిచ్చి యింతులకు
బాతీపడ్డట్టె నన్నుఁ బైకొనేవంటా
ఆతల నమ్మగ వెరపయ్యీ పాండవులవలె
గాతరాన వెంట వెంటఁ గాచియుండేవనుచు

ఆరగించుమన వెరపయ్యీ శబరి వలె
ఆరయ నెంగిలి యనకంటేవంటా
యేరీతి నన వెఱతు ఇచ్చైనట్ట్లఁ గావు
కూరిమి శ్రీవేంకటేశ గోవులగాచినట్లు

Baaramu nIpai vEsi bratikiyuMDuTE mElu
naaraayaNuDA nIvE nAku@M galavanucu

SaraNannaa verapayyI sAmajamu@M gaacinaTTu
varusa daavatI paDi vaccEvaMTA
harikRShNaayanaverapayyI droupadivara
miravugaa niccinaTTu niccEvO yanucu

chEtamokka verapayyI chIralichchi yiMtulaku
bAtIpaDDaTTe nannu@M baikonEvaMTA
Atala nammaga verapayyI paaMDavulavale
gAtarAna veMTa veMTa@M gaaciyuMDEvanuchu

aaragiMcumana verapayyI Sabari vale
Araya neMgili yanakaMTEvaMTA
yErIti nana ve~ratu iccainaTTla@M gaavu
kUrimi SrIvEMkaTESa gOvulagaacinaTlu

Sunday, May 01, 2011

746.teliyanivAriki teramarugu - తెలియనివారికి తెరమరుగు


Audio link : Sri Mangalampalli Rajeswari
Audio link : Sri Nukala ChinaSatyanarayana
తెలియనివారికి తెరమరుగు
తిలిసినవారికి దిష్టంబిదియే

కన్నుల యెదుటను కాంచిన జగమిది
పన్నిన ప్రకృతియు బ్రహ్మమునే
యిన్నిట నుండగ నిదిగాదని హరి
గన్న చోట వెదకగబోనేలా

అగపడి యిరువదియైదై జీవుని
తగిలినవెల్లా తత్వములే
నగవుల నిదియును నమ్మకజాలక
పగటున తమలో భ్రమయగనేలా

అంతరంగుడగు నర్చావతారము
నింతయు శ్రీవేంకటేశ్వరుడే
చెంతల నీతనిసేవకులకు మరి
దొంతికర్మముల తొడసికనేలా

teliyanivAriki teramarugu
tilisinavAriki dishTaMbidiyE

kannula yeduTanu kAMchina jagamidi
pannina prakRtiyu brahmamunE
yinniTa nuMDaga nidigAdani hari
ganna chOTa vedakagabOnElA

agapaDi yiruvadiyaidai jIvuni
tagilinavellA tatwamulE
nagavula nidiyunu nammakajAlaka
pagaTuna tamalO bhramayaganElA

aMtaraMguDagu narchAvatAramu
niMtayu SrIvEMkaTESwaruDE
cheMtala nItanisEvakulaku mari
doMtikarmamula toDasikanElA