Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, January 11, 2010

670.SaraNAgata vajra paMjaruDitaDu - శరణాగత వజ్ర పంజరుడితడు


Audio link : Sri Nukala China satyanarayana
ప శరణాగత వజ్ర పంజరుడితడు చక్రధరుడు అసుర సంహారుడు
అప వెరవుతోడ తను శరణనువారికి వెనుబలమీతడే రక్షకుడు

చ అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది
ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి
ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రక్షకుడు

చ శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి
దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి
శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు


pa SaraNAgata vajra paMjaruDitaDu cakradharuDu asura saMhAruDu
apa veravutODa tanu SaraNanuvAriki venubalamItaDE rakShakuDu

ca aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi
iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru
eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki
iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu

ca SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi
dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru
tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki
SrIpati goliciti cEre saMpadalu jiginitaDE mA rakShakuDu

Saturday, January 09, 2010

669.pADarE sObanAlu paDatulArA - పాడరే సోబనాలు పడతులారా


ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే || చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి | అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు | వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల | పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే || చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి | ఇవలా నవలా తాము ఏటిదరుల | జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు | తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు || చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల | సందడి వసంతముగా జల్లులాడుచు | అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక | చందమున కూడి సరసములాడేరు || pa|| pADarE sObanAlu paDatulArA | vEDuka liddarini velasejUDarE || ca|| koMDalE pITalugA kUcunnAredurubaDi | aMDanE nArasiMhuDu AdilakShmiyu | veMDipaiDi niMDukonna vEdAdri garuDAdrula | peMDilADE riddarunu priyamuna cUDarE || ca|| BavanASijalamula pAyaka tODanILLADiri | ivalA navalA tAmu ETidarula | javaLi maMcipUvula sarisEsalu veTTucu | tavili sumuhUrtAna tappaka cUcEru || ca|| poMduga kanakAvati BOgavati nadula | saMdaDi vasaMtamugA jallulADucu | aMdamai SrIvEMkaTAdri ahObalAna oka | caMdamuna kUDi sarasamulADEru ||

Friday, January 08, 2010

668.merugu jekkula alamElumaMgA - మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా



మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా తరితోడిరతులను దైవారవమ్మా చనవులు నీకిచ్చి చక్కనివదనమెత్తి పెనగీ నాతడు నిన్ను ప్రేమతోడను కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ పొందులు నీతో నెరపి పూచి నీపై చేతులు వేసి చిందీ నీపై నతడు చిరు చెమట విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మా అందుకొని ఆకుమడిచి యాతనికీయవమ్మ గక్కునను కాగిలించి కరుణనీపైనించి ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను వక్కణ లడుగవమ్మ వన్నెలెల్ల జూపవమ్మ నిక్కుచు నురము మీద నిండుకొనవమ్మా me~rugu@Mjekkula alamElumaMgA taritODiratulanu daivAravammA chanavulu nIkichchi chakkanivadanametti penagI nAtaDu ninnu prEmatODanu kanuvichchi chUDavamma kaMduvala navvavamma manasichchi AtanitO mATalADavamma poMdulu nItO nerapi pUchi nIpai chEtulu vEsi chiMdI nIpai nataDu chiru chemaTa viMdulamOviyyavamma vEDukalu chUpavammA aMdukoni AkumaDichi yAtanikIyavamma gakkunanu kAgiliMchi karuNanIpainiMchi ikkuva gUDe SrIvEMkaTESuDu ninnu vakkaNa laDugavamma vannelella jUpavamma nikkuchu nuramu mIda niMDukonavammA

Monday, January 04, 2010

667.kalalOni sukhamae kaliyugamaa - కలలోని సుఖమే కలియుగమా


ప : కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలో ఎక్కడిదె కలియుగమా చ : కడిగడి గండమై కాలము గడపేవు కడుగ గడుగ రొంపి కలియుగమా బడలికె వాపవు పరమేదొ చూపవు గడిచి ఇటు నీవు కలియుగమా చ : కరపేవు కరతలే మరపేవు మమతలే కరకర విడువవు కలియుగమా తెరచీర మరగింతే తెరువేల మూసేవు గరుసేల దాటేవో కలియుగమా చ : కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు కానీలే కానీలే కలియుగమా పైనిదే వేంకటపతి దాసులుండగ కానవ నీవిదేమి కలియుగమా pa : kalalOni sukhamae kaliyugamaa venna kalilO ekkaDide kaliyugamaa cha : kaDigaDi gaMDamai kaalamu gaDapaevu kaDuga gaDuga roMpi kaliyugamaa baDalike vaapavu paramaedo choopavu gaDichi iTu neevu kaliyugamaa cha : karapaevu karatalae marapaevu mamatalae karakara viDuvavu kaliyugamaa teracheera maragiMtae teruvaela moosaevu garusaela daaTaevO kaliyugamaa cha : kaanide mechchaevu kapaTaalae yichchaevu kaaneelae kaaneelae kaliyugamaa painidae vaeMkaTapati daasuluMDaga kaanava neevidaemi kaliyugamaa

Sunday, January 03, 2010

666.enni bAdhalabeTTi yEchedavu - ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక

ప : ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా చ : ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా చ: అసలనియెడి తాళ్ళ నంటగట్టుకవిధికి నప్పగించితివిగదె కర్మమా వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా చ: తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా pa : enni baadhalabeTTi yaechedavu neeviMka yeMtakaalamudaaka karmamaa manniMchumanuchu neemarugu jochchitimi maamaaTaalakiMchavO karmamaa cha : pratilaeni duritamula paalusaeyakanannu paaliMchavaitivO karmamaa tatitODa naatmaparitaapaMbu tODutanu tagulaela chaesitivO karmamaa jitakaamulakugaani chaetikini lOnayi chikkavaekaalaMbu karmamaa matiheenulainaTTi maakunoka paripaaTi maargaMbu choopavO karmamaa cha: asalaniyeDi taaLLa naMTagaTTukavidhiki nappagiMchitivigade karmamaa vaasi viDichitimi neevaaramaitimi mammu vanne cheDaneekuvO karmamaa kaasukunu goragaani gatilaeni panikigaa kaaloodaneevaela karmamaa OsariMchoka maaru voyyanae vokareeti nollanani talagumee karmamaa cha: tiruvaeMkaTaachalaadhipuni maayalachaeta desala diriginayaTTi karmamaa haridaasulaguvaari naadariMtuvugaaka aMta noppiMtuvaa karmamaa varusa naenugumeedivaanisunnaMbaDuga vachchunaa neekiTla karmamaa paramapurushOttamuni bhramatabaDi neeviTla baTTabayalaitigaa karmamaa