Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Tuesday, April 27, 2010

692.ETi braduku yETi braduku - ఏటి బ్రదుకు యేటి బ్రదుకు



Audio link : Sri R.Viswanath 
ఏటి బ్రదుకు యేటి బ్రదుకు ! వొక్క - మాట లోనే యటమటమైన బ్రదుకు సంతకూటములే చవులయిన బ్రదుకు దొంతిభయములతోడి బ్రదుకు ముంతనీళ్ళనే మునిగేటి బ్రదుకు వంతఁ బొరలి కడవర(ల)లేని బ్రదుకు మనసుచంచలమే మనువయిన బ్రదుకు దినదినగండాలఁ దీరు బ్రదుకు తనియ కాసలనె తగిలేటి బ్రదుకు వెనక ముందర చూడ వెరపయిన బ్రదుకు తెగి చేదెతీపయి తినియేటి బ్రదుకు పగవారి పంచల పాలైన బ్రదుకు తగువేంకటేశ్వరుఁ దలచని బ్రదుకు పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు ETi braduku yETi braduku ! vokka - mATa lOnE yaTamaTamaina braduku saMtakUTamulE chavulayina braduku doMtibhayamulatODi braduku muMtanILLanE munigETi braduku vaMta@M borali kaDavara(la)lEni braduku manasuchaMchalamE manuvayina braduku dinadinagaMDAla@M dIru braduku taniya kAsalane tagilETi braduku venaka muMdara chUDa verapayina braduku tegi chEdetIpayi tiniyETi braduku pagavAri paMchala pAlaina braduku taguvEMkaTESwaru@M dalachani braduku pogaku nOpaka maMTa@M bogilETi braduku

Saturday, April 24, 2010

691.ADarAnimATadi gurutu - ఆడరానిమాటది గుఱుతు



Audio link : Tuned and sung by Sri TP Chakrapani garu (ragam saranga?) ఆడరానిమాటది గుఱుతు వేడుకతోనే విచ్చేయమనవే కాయజకేలికిఁ గడుఁ దమకించగ ఆయములంటిన దది గుఱుతు పాయపు పతికినిఁ బరిణాముచెప్పి మోయుచు తనకిటు మొక్కితిననవే దప్పిమోవితో తా ననుఁ దిట్టగ - నప్పుడు నవ్విన దది గుఱుతు యిప్పుడు దనరూ పిటు దలచి బయలు చిప్పిల గాగిటఁ జేర్చితిననవే పరిపరివిధముల పలుకులుఁ గులుకగ అరమరచి చొక్కినదది గుఱుతు పరగ శ్రీవేంకటపతి కడపలోన సరవిగూడె నిక సమ్మతియనవే ADarAnimATadi gu~rutu vEDukatOnE vichchEyamanavE kAyajakEliki@M gaDu@M damakiMchaga AyamulaMTina dadi gu~rutu pAyapu patikini@M bariNAmucheppi mOyuchu tanakiTu mokkitinanavE dappimOvitO tA nanu@M diTTaga - nappuDu navvina dadi gu~rutu yippuDu danarU piTu dalachi bayalu chippila gAgiTa@M jErchitinanavE pariparividhamula palukulu@M gulukaga aramarachi chokkinadadi gu~rutu paraga SrIvEMkaTapati kaDapalOna saravigUDe nika sammatiyanavE

Friday, April 23, 2010

690.kuMdanapu pillaMgrOvi gOpinAthA - కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా


కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా ! మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపినాథా కొలనిలోపలిమాతో గోపినాథా ! యేల కులికినవ్వు నవ్వేవు గోపినాథా కొలువు మొక్కు మొక్కేము గోపినాథా ! నీ చలము చెల్లితేఁ జాలు జాణ గోపినాథా గొబ్బన మాచీరలిమ్ము గోపినాథా ! మా గుబ్బలపైఁ గాక రేగె గోపినాథా గుబ్బతిల్లీ తమకమే గోపినాథా నీ కబ్బితి మేమైన చేయవయ్య గోపినాథా కుప్పవడె మాసిగ్గు గోపినాథా ! మా కొప్పు జారె ముడువుమా గోపినాథా వొప్పుగ శ్రీవేంకటాద్రి నుండి వచ్చి కూడితివి అప్ప తొండమారేగుళ్ళా ఆది గోపినాథా kuMdanapu pilla@MgrOvi gOpinAthA ! mApai chiMdEvu mOharasAlu chinni gOpinAthA kolanilOpalimAtO gOpinAthA ! yEla kulikinavvu navvEvu gOpinAthA koluvu mokku mokkEmu gOpinAthA ! nI chalamu chellitE@M jAlu jANa gOpinAthA gobbana mAchIralimmu gOpinAthA ! mA gubbalapai@M gAka rEge gOpinAthA gubbatillI tamakamE gOpinAthA nI kabbiti mEmaina chEyavayya gOpinAthA kuppavaDe mAsiggu gOpinAthA ! mA koppu jAre muDuvumA gOpinAthA voppuga SrIvEmkaTAdri nuMDi vachchi kUDitivi appa toMDamArEguLLA Adi gOpinAthA

Monday, April 19, 2010

689. challani choopulavaani chakkanivaani - చల్లని చూపులవాని చక్కనివాని


Audio link : Hemavati (?) చల్లని చూపులవాని చక్కనివాని | పీలి | చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు | చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును |వానిఁ| జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు | సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని| పొందులు మానగ లేను పోనీకురే చెలు(లు?)
ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే | వాడు| దంటవాడు కవి(లి?) కిఁచేతలకృష్ణుడు నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్నుఁ గూడెనే | వాని | వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.
(photo by Hema garu..) challani choopulavaani chakkanivaani | peeli | chollepu@M juTlavaani@M jooparamma chelulu VaaDalOni chelulanu valapinchi vacchenE | vaaDu | chEDela manasu donga chinnikRshNuDu yEDugaDayunu@M daanai yelayinche nannunu |vaani@M| jooDaka vunDaga lEnu chooparamma chelulu mandalOni golletala maraginchi vacchenE | vaaDu | sandaDipenDlikoDuku jaaNakRShNuDu mundu venakaa nalami mohimpinche nannunu | vaani| pondulu maanaga lEnu pOneekurE chelu(lu?) inTinTi yintula nellaa yelayinchi vacchenE | vaaDu| danTavaaDu kavi(li?) ki@MchEtalakRshNuDu nanTunanu SreevenkaTanaathu@MDai nannu@M gooDenE | vaani | vonTi@M baayalE naavadda nuncharamma chelulu

Sunday, April 18, 2010

688.echchaTAa chUchina nitaDai kRshNuDu - ఎచ్చటఁజూచిన నితడై కృష్ణుడు


Audio link : Sri Balakrishnaprasad & Bullemma ఎచ్చటఁజూచిన నితడై కృష్ణుడు
మచ్చిక నలమేలుమంగతో వెలసీ కొట్టరో వుట్ట్లు గోపాలబాలులు యిట్టె కృష్ణుని యెదుటను పట్టరో వారలు పాలునేతికిని గట్టిగ జోరున గారీనవిగో కూడరో మూకలు కోలలవారలు వేడుక కృష్ణుని వెంటవెంట ఆడుచు మెసగరో అడుకులు చక్కిలాల్లు వాడల వాడల వరుసతోను నిక్కితీసుకోరో నెలవాదికాండ్లు మక్కువ కృష్ణుని మఱగునను యెక్కరో శ్రీవేంకటేశు కొండమీద పెక్కు నురుగులు పెరుగులు నివిగో echchaTa@MjUchina nitaDai kRshNuDu machchika nalamElumaMgatO velasI koTTarO vuTTlu gOpAlabAlulu yiTTe kRshNuni yeduTanu paTTarO VAralu pAlunEtikini gaTTiga jOruna gArInavigO kUDarO mUkalu kOlalavAralu vEDuka kRshNuni veMTaveMTa ADuchu mesagarO aDukulu chakkilAllu vADala vADala varusatOnu nikkitIsukOrO nelavAdikAMDlu makkuva kRshNuni ma~ragunanu yekkarO SrIvEMkaTESu koMDamIda pekku nurugulu perugulu nivigO

Thursday, April 15, 2010

687.nIvokkaDavE nAkucAlu nIrajAksha - నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ


నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ
నీవే నాకు గతి అని తెలిసితి నెక్కొని ఇతరము వృథా వృథా
నీనామోచ్ఛరణమే నెరసిన దుఖ నివారణము
నీనామోచ్చరణమే నెలగూ శుభకరము
నా నా వేదశస్త్రములు నవపురాణ ఇతిహాసములు
నీ నామములోనే వున్నవి మిగిలిన వన్నియు వృథా వృథా
నీ పాదమూలము నింగియు భువియు రాసాతలము
నీ పాదమూలము నిఖిల జీవ పరినామములు
దీపించిన చరాచరంబులు దివ్యులు మునులు సర్వమును
ఈ పాదమూలమే మరి మిగిలిన వన్నియు వృథా వృథా
దేవా మీ తిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము
దేవా మీ తిరుమేను ఉత్పత్తిస్థితిలయములకును ఆకరము
శ్రీ వేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ
దేవా నీ శరణమును జొచ్చితి దిక్కులన్నియు వృథా వృథా
nIvokkaDavE nAkucAlu nIrajAksha nArAyaNa
nIvE nAku gati ani telisiti nekkoni itaramu vRdhA vRdhA
nInAmOccaraNamE nerasina dukha nivAraNamu
nInAmOccaraNamE nelagU Subhakaramu
nA nA vEdaSastramulu navapurANa itihAsamulu
nI nAmamulOnE vunnavi migilina vanniyu vRdhA vRdhA
nI pAdamUlamu nimgiyu bhuviyu rAsAtalamu
nI pAdamUlamu nikhila jIva parinAmamulu
dIpimcina carAcarambulu divyulu munulu sarvamunu
I pAdamUlamE mari migilina vanniyu vRdhA vRdhA
dEva mI tirumEnu dikkunu brahmAnDAdhAramu
dEva mI tirumEnu utpattistitilayamulakunu Akaramu
SrI vEmkaTapati nAbhAvamu cittamu nIkE samarpaNa
dEva nI SaraNamunu jocciti dikkulanniyu vRdhA vRdhA

Tuesday, April 13, 2010

686.ayanAya vyaMgamElE ativA - అయనాయ వ్యంగమేలే అతివా


అయనాయ వ్యంగమేలే అతివా ! నీ -
ఆయమే తాకీ మాట లందుకేమీ సేతురా
కప్పురమిందవే వోకలికీ ! మాకు -
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి
తప్పులెవ్వరెందున్నవో తలచుకో నీవు
నిమ్మ పండిందవే వీ నెలతా ! ఆ -
నిమ్మపండే పాపరవును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు
కుంకుమపూ నిందవే వో కోమలీ ! నీ -
కుంకుమలే పుప్పుడౌను కూడుకుంటేను
యింకనేలే కలసితి నింతీ ! వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరి చెమటలు
ayanAya vyaMgamElE ativA ! nI -
AyamE tAkI mATa laMdukEmI sEturA
kappuramiMdavE vOkalikI ! mAku -
nuppulavu nIkappurA lollamu pOrA
tappanADE vadiyEmE taruNI ! vOri
tappulevvareMdunnavO talachukO nIvu
nimma paMDiMdavE vI nelatA ! A -
nimmapaMDE pAparavunu nE nollarA
chimmEvu saTa lidEmE cheliya mEna
chimmurEkha levvaraMdO chittagiMchu nIvu
kuMkumapU niMdavE vO kOmalI ! nI -
kuMkumalE puppuDaunu kIDukuMTEnu
yiMkanElE kalasiti niMtI ! vOri
yiMkapu SrIvEMkaTESa yiddari chemaTalu

Monday, April 12, 2010

685.evvari mechchadagavu yiddarilO - ఎవ్వరి మెచ్చదగవు యిద్దరిలో రామరామ


Audio link : Lalitha Madhav S Ramya
ఎవ్వరి మెచ్చదగవు యిద్దరిలో రామరామ
రవ్వగా సురలు విచారము సేసేరిందుకే

దశరథు యజ్ఞములో తగ నీవు జనియింప
దశకంఠు మేన బుట్టె దావాగ్ని
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు
దశకంఠు డంటి(ది?) నట్టిధర్మ మందె సమసె

నెఱిదొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను
చెఱకు విల్లెత్తె నీపె జేరి మరుడు
విఱిగె నీవెత్తినట్టి విల్లయితే నెంతైన
విఱుగ కాతనివిల్లు వెసఁ బెండ్లి సేసేను

శ్రీవేంకటాద్రిమీదఁ జేరి యెక్కితివి నీవు
ఆవెలది నీవుర మట్టె యెక్కెను
దేవుడవై ఇందరిలోన తిరుగాడుదువు గాని
నోవల నాకైతే (ఆకె + ఐతే) నీపై వున్నచోనే వున్నది



evvari mechchadagavu yiddarilO rAmarAma
ravvagA suralu vichAramu sEsEriMdukE

daSarathu yaj~namulO taga nIvu janiyiMpa
daSakaMThu mEna buTTe dAvAgni
vaSamaina SAMtitO varNanakekkiti nIvu
daSakaMThu DaMTi(di?) naTTidharma maMde samase

ne~ridolli sItakugA nIvu villettagAnu
che~raku villette nIpe jEri maruDu
vi~rige nIvettinaTTi villayitE neMtaina
vi~ruga kAtanivillu vesa@M beMDli sEsEnu

SrIvEMkaTAdrimIda@M jEri yekkitivi nIvu
Aveladi nIvura maTTe yekkenu
dEvuDavai iMdarilOna tirugADuduvu gAni
nOvala nAkaitE (Ake + aitE) nIpai vunnachOnE vunnadi

Saturday, April 10, 2010

684.kOrinaTTE AyanIku gOviMduDA - కోరినట్టే ఆయనీకు గోవిందుడా



కోరినట్టే ఆయనీకు గోవిందుడా
మా కూరిమి మరవకుమీ గోవిందుడా

క్రొమ్మెఱుగు చూపు గోవిందుడా
కుమ్మరించేవు వలపు గోవిందుడా
కుమ్మెవో గోర నొత్తకు గోవిందుడా నీ
కొమ్మలెల్లా నవ్వేరు గోవిందుడా

కొలనిలోని వారము గోవిందుడా నీకు
గొలువు సేసేము గోవిందుడా
కొలముగొల్లెతలము గోవిందుడా
కొలకొల నవ్వుదురా గోవిందుడా

కుందణపు చాయమేని గోవిందుడా
గొందినేల పవ్వళించ గోవిందుడా
చెందె నిన్నలమేల్ మంగ శ్రీవేంకటేశ నిన్నాడు -
కొందుము సుమ్మీ నేము
గోవిందుడా


kOrinaTTE AyanIku gOviMduDA
mA kUrimi maravakumI gOviMduDA

kromme~rugu chUpu gOviMduDA
kummariMchEvu valapu gOviMduDA
kummevO gOra nottaku gOviMduDA nI
kommalellA navvEru gOviMduDA

kolanilOni vAramu gOviMduDA nIku
goluvu sEsEmu gOviMduDA
kolamugolletalamu gOviMduDA
kolakola navvudurA gOviMduDA

kuMdaNapu chAyamEni gOviMduDA
goMdinEla pavvaLiMcha gOviMduDA
cheMde ninnalamEl maMga SrIvEMkaTESa ninnADu -
koMdumu summI nEmu gOviMduDA

Thursday, April 08, 2010

683.muddugAraganide muMgiTa - ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు


Audio link : Singer: Ramya S , in Bhupalam (classical)
ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు
వొద్దికేగి చెలులెల్ల వూరడించరే

వేకువజామున లేచి వేడుక కృష్ణుడు తల్లి
ఆకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి
కాకలతో పసివాడి కన్నులు పులుముకొంటా
యేకరుచు నున్నవాడు యెత్తుకోరే బిడ్డని

బాలులతో వూరనెల్ల బరువులు వెట్టి వెట్టి
చాలుకొని యాడి యాడి జామెక్కగా వచ్చి
కేలుచాచి వెన్నడిగి కిందుపడీ యంతలో
బేలులై వుండగనేల పెట్టరే బిడ్డనికి

మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే
చట్టల పెరుగు వేడీ చాలఁబెట్టరే మీరు
పట్టపు శ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె
అట్టిట్టనక వీని నాదరించరే

Painting by Sri Raja Ravivarma
muddugAraganide muMgiTa niluchunnADu
voddikEgi chelulella vUraDiMcharE

vEkuvajAmuna lEchi vEDuka kRshNuDu talli
AkalayyI nanuchu voyyane maMchamu digi
kAkalatO pasivADi kannulu pulumukoMTA
yEkaruchu nunnavADu yettukOrE biDDani

bAlulatO vUranella baruvulu veTTi veTTi
chAlukoni yADi yADi jAmekkagA vachchi
kEluchAchi vennaDigi kiMdupaDI yaMtalO
bElulai vuMDaganEla peTTArE biDDaniki

maTTAmadyAnnapuvELa malayuchu niMTilOnE
chaTTala perugu vEDI chAla@MbeTTarE mIru
paTTapu SrIvEMkaTAdripai kIlukone nide
aTTiTTanaka vIni nAdariMcharE

Wednesday, April 07, 2010

682.kaladu tirumaMtramu kaladihamu - కలదు తిరుమంత్రము కలదిహము బరము


Audio link : ప|| కలదు తిరుమంత్రము కలదిహము బరము | కలిమి గలుగు మాకు గడమే లేదు || చ|| కమలాక్షు నీవు మాకు గలిగియుండగ భూమి | నమరలేని దొకటి నవ్వలలేదు | నెమకి నాలుకమీద నీనామము మెలగగ | తమితో బరుల వేడ దా జోటులేదు || చ|| శౌరి నీ చక్రము నాభుజము మీదనుండగాను | బూరవపు బగ లేదు యెదురూ లేదు | చేరువ నీ సేవ నాచేతులపై నుండగాను | తీరని కర్మపు వెట్టిదినమూ లేదు || చ|| అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండగాను | రచ్చల బుట్టిన యపరాధమూ లేదు | నిచ్చలు శ్రీ వేంకటేశ నీశరణాగతుండగా | విచ్చిన విడే కాని విచారమే లేదు || pa|| kaladu tirumaMtramu kaladihamu baramu | kalimi galugu mAku gaDamE lEdu || ca|| kamalAkShu nIvu mAku galigiyuMDaga BUmi | namaralEni dokaTi navvalalEdu | nemaki nAlukamIda nInAmamu melagaga | tamitO barula vEDa dA jOTulEdu || ca|| Sauri nI cakramu nABujamu mIdanuMDagAnu | bUravapu baga lEdu yedurU lEdu | cEruva nI sEva nAcEtulapai nuMDagAnu | tIrani karmapu veTTidinamU lEdu || ca|| accuta nIpai Bakti yAtumalO nuMDagAnu | raccala buTTina yaparAdhamU lEdu | niccalu SrI vEMkaTESa nISaraNAgatuMDagA | viccina viDE kAni vicAramE lEdu ||

Tuesday, April 06, 2010

681.atisulaBaM bidi yaMdaripAliki - అతిసులభం బిది యందరిపాలికి

ప|| అతిసులభం బిది యందరిపాలికి | గతియిది శ్రీపతి కైంకర్యంబు || చ|| పాలసముద్రము బలిమి దచ్చి కొని- | రాలరి దేవత లమృతమును | నాలుక నిదె హరినామపుటమృతము | యేల కానరో యిహపరసుఖము || చ|| అడరి బాతిపడి యవని దేవతలు | బడివాయరు యజ్ఞ భాగాలకు | విడువక చేతిలో విష్ణుప్రసాదము | కడిగడియైనది కానరుగాని || చ|| యెక్కుదురు దిగుదు రేడులోకములు | పక్కన దపముల బడలుచును | చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు- | డిక్కడితుదిపద మెఱగరుగాని || pa|| atisulaBaM bidi yaMdaripAliki | gatiyidi SrIpati kaiMkaryaMbu || ca|| pAlasamudramu balimi dacci koni- | rAlari dEvata lamRtamunu | nAluka nide harinAmapuTamRtamu | yEla kAnarO yihaparasuKamu || ca|| aDari bAtipaDi yavani dEvatalu | baDivAyaru yaj~na BAgAlaku | viDuvaka cEtilO viShNuprasAdamu | kaDigaDiyainadi kAnarugAni || ca|| yekkuduru digudu rEDulOkamulu | pakkana dapamula baDalucunu | cikkinADu mati srIvEMkaTESvaru- | DikkaDitudipada me~ragarugAni ||

Friday, April 02, 2010

680.eMta puNyamO yiTu mAku - ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె




ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె చెంతనే నీకృప సిధ్ధించబోలు శ్రీపతి మీకథ చెవులను వింటిమి పాపము లణగెను భయముడిగె తీపుగ తులసితీర్థము గొంటిమి శాపము దీరెను సఫలంబాయ గోవింద మిము కనుగోంటి మిప్పుడే పావనమైతిమి బ్రతికితిమి తావుల మీపాదములకు మ్రొక్కితి వేవేలు కలిగెను వేడుకలాయ శ్రీవేంకటేశ్వర సేవించితి మిము ధావతి దీరెను తనిసితిమి వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతిమి నిలిచితి మిపుడు eMta puNyamO yiTu mAku kalige cheMtanE nIkRpa sidhdhiMchabOlu SrIpati mIkatha chevulanu viMTimi pApamu laNagenu bhayamuDige tIpuga tulasitIrthamu goMTimi SApamu dIrenu saphalaMbAya gOviMda mimu kanugOMTi mippuDE pAvanamaitimi bratikitimi tAvula mIpAdamulaku mrokkiti vEvElu kaligenu vEDukalAya SrIvEMkaTESwara sEviMchiti mimu dhAvati dIrenu tanisitimi vAviri mummAru valagoni vachchiti nIvAramaitimi nilichiti mipuDu