Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Monday, November 23, 2009

657.eMta cadivi cUcina nItaDE ghanamu - ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక


Audio link : in vasanta raga by Sri NukalaChinasatyanarayana ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక| యింతయు నేలేటి దైవమిక వేరే కలరా|| మొదల జగములకు మూలమైన వాడు| తుద ప్రళయము నాడు తోచేవాడు|| కదిసి నడుమనిండి కలిగి వుండెడి వాడు| మదన గురుడే కాక మరి వేరే కలరా|| పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు| సురలకు నరులకు జోటయిన వాడు|| పరమైన వాడు ప్రపంచమైనవాడు| హరి యొక్కడే కాక అవ్వలను గలరా|| పుట్టుగులయినవాడు భోగ మోక్షాలయినవాడు| యెట్టనెదురలోనను యిన్నిటివాడే|| గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి| పట్టపు దేవుడే కాక పరులిక గలరా|| eMta cadivi cUcina nItaDE ghanamu gAka| yiMtayu nElETi daivamika vErE kalarA|| modala jagamulaku mUlamaina vADu| tuda praLayamu nADu tOcEvADu|| kadisi naDumaniMDi kaligi vuMDeDi vADu| madana guruDE kAka mari vErE kalarA|| paramANuvainavADu brahmAMDamainavADu| suralaku narulaku jOTayina vADu|| paramaina vADu prapaMcamainavADu| hari yokkaDE kAka avvalanu galarA|| puTTugulayinavADu bhOga mOkShAlayinavADu| yeTTaneduralOnanu yinniTivADE|| gaTTigA SrIvEMkaTAdri kamalAdEvitODi| paTTapu dEvuDE kAka parulika galarA|| puraMdaradAsu jagadOdhdAraNa kIrtana lo , "అణోరణీయన మహతో మహీయన అప్రమేయన ఆడిసిదళెశోద " అని అన్నారు (Yashoda pampered the) One smaller than an atom and greater than the greatest, Yashoda pampered the incomparable Lord! ఇక్కడ అనమయ్య "పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు" , అని అన్నారు

Saturday, November 21, 2009

656.kODekADe vIDe vIDe gOviMduDu - కోడెకాడె వీడె వీడె గోవిందుడు


Audio Link :
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు

గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు
గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు

కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు

కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొందిఁ దోసె నసురల గోవిందుడు



kODekADe vIDe vIDe gOviMduDu
kUDe iddaru satula gOviMduDu

golletala valapiMche gOviMduDu
kollalADe vennalu gOviMduDu
gulla saMku@Mjakramula gOviMduDu
gollavAriMTa perige gOviMduDu

kOlachE pasulagAche gOviMduDu
kUlagumme kaMsuni gOviMduDu
gOlayai vEla koMDette gOviMduDu
gULepusatula@M dechche gOviMduDu

kuMdanapu chElatODi gOviMduDu
goMdulu saMdulu dUre gOviMduDu
kuMdani SrIvEMkaTAdri gOviMduDu
goMdi@M dOse nasurala gOviMduDu


Youtube video, PriyaSisters

Thursday, November 19, 2009

655.palukutEniyalanupAramiyyavE - పలుకుతేనియలనుపారమియ్యవే


Audio link : P.Suseela, G.Nageswaranayudu(?) పలుకుతేనియలనుపారమియ్యవే అలరువాసనల నీ అధరబింబాలకు పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే చక్కని నీ వదనంపు చందమామకు అక్కరొ నీవాలుగన్ను లారతిగా నెత్తవే గక్కన నీచెక్కు తొలుకరి మెరుపులకు కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము దిమ్మరి నీమురిపెపు తీగమేనికి పతివేంకటేశుగూడి పరవశమియ్యవే యితవైన నీమంచి హృదయానకు అతనినే తలచగ నానతియ్యగదవె తతితోడ నీలోని తలపోతలకు palukutEniyalanupAramiyyavE alaruvAsanala nI adharabiMbAlaku pukkiTi lEnagavu poMgu@MbAlu chUpavE chakkani nI vadanaMpu chaMdamAmaku akkaro nIvAlugannu lAratigA nettavE gakkana nIchekku tolukari merupulaku kammani nImEni tAvi kAnukagA niyyavE vummagiMta challeDi nIvUrupulaku chimmula nIchemaTala@M jEyavE majjanamu dimmari nImuripepu tIgamEniki pativEMkaTESugUDi paravaSamiyyavE yitavaina nImaMchi hRdayAnaku ataninE talachaga nAnatiyyagadave tatitODa nIlOni talapOtalaku

Dr.Jayaprabha gari Annamayya pada Parichayam , pustakam nundi , ee Kirtana vivarana. Author email id : jayaprabha.ani@gmail.com To get the complete book , plz contact :
Chaitanya Teja publicatons,
"Lohitha",
H.No.1-4-220/33,
Sainik Enclave, Sainikpuri,
SECUNDERABAD-500 094,
Andhrapradesh, India.
Tel: 040-2711 7167.

Tuesday, November 17, 2009

654.innALLu naMdunaMdu - ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని

Audio link: 
ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని అంగనలపసఁజిక్కి అలయికలే కంటి బంగారు వెంటఁ దగిలి భ్రమ గంటిని ముంగిటి క్షేత్రాలంటి ముంచి వెట్టిసేయగంటి అంగపునన్నే చూచి అంతరాత్మఁ గంటి చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి మట్టిలేని వయసుతో మదము గంతి వట్టి కామములు సేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణుని భక్తి నిన్ను గంటిని వింతచదువులవల్ల వేవేలు మతాలు గంటి సంతకర్మములవల్ల సాము గంటిని యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి innALLu naMdunaMdu nEmigaMTini anniTA SaraNu chochchi hari ninu gaMTini aMganalapasa@Mjikki alayikalE kaMTi baMgAru veMTa@M dagili bhrama gaMTini muMgiTi kshEtrAlaMTi muMchi veTTisEyagaMTi aMgapunannE chUchi aMtarAtma@M gaMTi chuTTAla@M jEri chUchi suddulavAvulu gaMTi maTTilEni vayasutO madamu gaMTi vaTTi kAmamulu sEsi varusa mAyalu gaMTi paTTi nArAyaNuni bhakti ninnu gaMTini viMtachaduvulavalla vEvElu matAlu gaMTi saMtakarmamulavalla sAmu gaMTini yiMtaTa SrIvEMkaTESa yiTu nAjIvabhAvamu chiMtiMchi aMdulOna nISrIpAdAlu gaMTi

Monday, November 16, 2009

653.vADala vADala veMTa vasaMtamu - వాడల వాడల వెంట వసంతము



Audio link 1: Priya Sisters 
Audio link 2: S.Janaki garu 
వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ కలికి నవ్వులె నీకు కప్పుర ర వసంతము వలచూపు కలువల వసంతము కులికి మాటాడినదె కుంకుమ వసంతము చలమున చల్లె నీపై జాజర జాజర జాజ కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహము నీటి వసంతము బూమెల సరసముల పుప్పొడి వసంతము సామజ గురుడ నీపై జాజర జాజర జాజ అంగన అధరమిచ్చే అమృత వసంతము సంగడి శ్రీవేంకటేశ సతిగూడితి ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ vADala vADala veMTa vasaMtamu jADatO challEru nIpai jAjara jAjara jAja kaliki navvule nIku kappura vasaMtamu valachUpu kaluvala vasaMtamu kuliki mATADinade kuMkuma vasaMtamu chalamuna challe nIpai jAjara jAjara jAja kAmini jaMkena nIku kastUri vasaMtamu vAmula mOhamu nITi vasaMtamu bUmela sarasamula puppoDi vasaMtamu sAmaja guruDa nIpai jAjara jAjara jAja aMgana adharamichchE amRta vasaMtamu saMgaDi SrIvEMkaTESa satigUDiti muMgiTi rati chemaTa muttEla vasaMtamu saMgatAyeniddariki jAjara jAjara jAja

Video : PriyaSisters

Saturday, November 14, 2009

652.maruni nagaridaMDa mAyilleragavA - మరుని నగరిదండ మాయిల్లెరగవా


Audio link 1 : Sattiraju Venumadhav

మరుని నగరిదండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు మఱగు మూక చింతల మాయిల్లెరగవా గురుతైన బంగారు కొడల సంది మఱపుఁ దెలివి యిక్క మాయిల్లెరగవా వెరవక మదనుడు వేటాడేచోటు మదనుని వేదసంత మాయిల్లెరగవా చెదరియు జెదరని చిమ్మఁ జీకటి మదిలోన నీవుండేటి మాయిల్లెరగవా కొదలేక మమతలు కొలువుండేచోటు మరులుమ్మెత్తల తోట మాయిల్లెరగవా తిరువేంకటగిరి దేవుడ నీవు మరుముద్రల వాకిలి మాయిల్లెరగవా నిరతము నీసిరులు నించేటి చోటు maruni nagaridaMDa mAyilleragavA virula tAvulu vella virisETi chOTu ma~ragu mUka chiMtala mAyilleragavA gurutaina baMgAru koDala saMdi ma~rapu@M delivi yikka mAyilleragavA veravaka madanuDu vETADEchOTu madanuni vEdasaMta mAyilleragavA chedariyu jedarani chimma@M jIkaTi madilOna nIvuMDETi mAyilleragavA kodalEka mamatalu koluvuMDEchOTu marulummettala tOTa mAyilleragavA tiruvEMkaTagiri dEVuDa nIvu marumudrala vAkili mAyilleragavA niratamu nIsirulu niMchETi chOTu
 
 

Friday, November 13, 2009

651.hariyE erugunu aMdari batukulu - హరియే ఎరుగును అందరి బతుకులు



హరియే ఎరుగును అందరి బతుకులు యిరవై ఈతని యెరుగుటే మేలు వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు యెనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వడెరుగు ఆసఁదొల్లి మును లనంతకోట్లు చేసిరి తపములు సేనలుగా యేసిరులందిరి యెరగ రెవ్వరును వేసపునరులకు విధి యేదో
కలవనేకములు కర్మ మార్గములు
పలుదేవతలిటు పాటించిరి
బలిమి శ్రీ వేంకట పతికి మొరయిడి
వెలసిరి తుదనిదె వెరవిందరికి
hariyE erugunu aMdari batukulu yiravai Itani yeruguTE mElu venakaTi brahmalu vEvEla saMkhyalu yenasi brahmAMDamu lEliraTa penagoni vArala pErulu marachiri manuja kITamula marevvaDerugu Asa@Mdolli munu lanaMtakOTlu chEsiri tapamulu sEnalugA yEsirulaMdiri yeraga revvarunu vEsapunarulaku vidhi yEdO
kalavanEkamulu karma maargamulu
paludEvataliTu paaTinchirib
balimi SrI vEnkaTa patiki morayiDi
velasiri tudanide veravindariki

Tuesday, November 10, 2009

650.niMDu manasE nIpUja - నిండు మనసే నీపూజ


Audio link, tuned and sung by Sri Mangalampalli Balamuralikrishna
నిండు మనసే నీపూజ
అండగోరకుండుటదియు నీపూజ

యిందు హరిగలడందు లేడనేటి
నిందకు బాయుటే నీపూజ
కొందరు చుట్టాలు కొందరు పగనే
అందదుకు మానుటదియే నీపూజ

తిట్టులు గొన్నని దీవెనె గొంతని
నెటుకోనిదే నీపూజ
పెట్టిన బంగారు పెంకును నినుమును
అట్టే సరియనుటదియు నీపూజ

సర్వము నీవని స్వతంత్రముడిగి
నిర్వహించుటే నీపూజ
పర్వి శ్రీవేంకటపతి నీ దాసుల
పూర్వమనియెడి బుద్ధి నీపూజ


niMDu manasE nIpUja
aMDagOrakuMDuTadiyu nIpUja

yiMdu harigalaDaMdu lEDanETi
niMdaku bAyuTE nIpUja
koMdaru chuTTAlu koMdaru paganE
aMdaduku mAnuTadiyE nIpUja

tiTTulu gonnani dIvene goMtani
neTukOnidE nIpUja
peTTina baMgAru peMkunu ninumunu
aTTE sariyanuTadiyu nIpUja

sarwamu nIvani swataMtramuDigi
nirwahiMchuTE nIpUja
parvi SrIvEMkaTapati nI dAsula
pUrvamaniyeDi buddhi nIpUja

Sunday, November 08, 2009

649.tanalOnuMDina hari tagoluvaDI - తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి


Audio link
తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి
యెనలేక శరణంటే నితడే రక్షించును

కోరి ముదిమి మానుపుకొనేయాస మందులంటా
వూరకే చేదులుదిన నొడబడును
ఆరూఢి మంత్రసిధ్ధుడనయ్యేననే యాసలను
ఘోరపు పాట్లకు గక్కున నొడబడును

యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనేయాసలను
వొట్టి జీవహింసలకు నొడబడును
దిట్టతనమున తా నదృశ్యము సాధించేయాస
జట్టిగ భూతాల పూజించగ నొడబడును

చాపలపు సిరులకై శక్తి గొలిచేయాసను
వోపి నిందలకునెల్లా నొడబడును
యేపున శ్రీవేంకటేశు డేలి చేపట్టినదాకా
ఆపరానియాస నెందుకైనా నొడబడును


tanalOnuMDina hari@M dAgoluvaDI dEhi
yenalEka SaraNaMTE nitaDE rakshiMchunu

kOri mudimi mAnupukonEyAsa maMdulaMTA
vUrakE chEduludina noDabaDunu
ArUDhi maMtrasidhdhuDanayyEnanE yAsalanu
ghOrapu pATlaku gakkuna noDabaDunu

yiTTe yakshiNi@M baMpu sEyiMchukonEyAsalanu
voTTi jIvahiMsalaku noDabaDunu
diTTatanamuna tA nadRSyamu sAdhiMchEyAsa
jaTTiga bhUtAla pUjiMchaga noDabaDunu

chApalapu sirulakai Sakti golichEyAsanu
vOpi niMdalakunellA noDabaDunu
yEpuna SrIvEMkaTESu DEli chEpaTTinadAkA
AparAniyAsa neMdukainA noDabaDunu

Thursday, November 05, 2009

648.sakala jIvulakella saMjIvi - సకల జీవులకెల్ల సంజీవి


Audio link , Balakrishnaprasad
అ : సకల జీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

చ : మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది
పోడిమి నల్లని కాంతి బొదలినది
పేడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాడే శేషగిరిమీద నాటుకొన్న మందు

చ : పడిగెలు వేయింటి పాము గాచుకున్నది
కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది
కడలేని యంజనాద్రి గారుడపు మందు

చ : బలు శంఖు జక్రముల బదనికెలున్నది
తలచిన వారికెల్ల తత్త్వమైనది
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది
వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు


a : sakala jIvulakella saMjIvi yImaMdu
vekalulai yiMdaru sEviMcarO yImaMdu

ca : mUDu lOkamu lokkaTa muMci periginadi
pODimi nallani kAMti bodalinadi
pEDuka kommulu nAlgu penaci cEyivArinadi
nADE SEShagirimIda nATukonna maMdu

ca : paDigelu vEyiMTi pAmu gAcukunnadi
kaDu vEdaSAstramula gabbu vEsEdi
yeDayaka vokakAMta yekkuka vuMDinadi
kaDalEni yaMjanAdri gAruDapu maMdu

ca : balu SaMKu jakramula badanikelunnadi
talacina vArikella tattvamainadi
alarina brahmarudrAdula buTTiMcinadi
velugu tODuta SrIvEMkaTAdri maMdu

Monday, November 02, 2009

647.Emani vinnaviMchEmu yiTTE - ఏమని విన్నవించేము యిట్టే



Audio link :
ఏమని విన్నవించేము యిట్టే కనుగొనవయ్య
మోమున చేతులలోన మొక్కులున్నవి
నెలతమనసులోన నిండువలపులున్నవి
సెలవినవ్వులలోన సిగ్గులున్నవి
తలిరుమోవిమీద తరితీపులున్నవి
కలువకన్నులలోన కాంక్షలున్నవి
అంగనమాటల లోన నడియాసలున్నవి
రంగగుచన్నులపై కరగు లున్నవి
అంగపు సేవలలో ప్రియములెల్లా నున్నవి
సింగారంపుగొప్పుమీద సేసలున్నవి
కప్పి యలమేలుమంగకాగిట నీమేనున్నది
చిప్పిలఁ జెక్కుల మీద చిహ్నలున్నవి
యిప్పుడె శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
నెప్పున నీకెవేల నీ వుంగరమున్నది

Emani vinnaviMchEmu yiTTE kanugonavayya
mOmuna chEtulalOna mokkulunnavi

nelatamanasulOna niMDuvalapulunnavi
selavinavvulalOna siggulunnavi
talirumOvimIda taritIpulunnavi
kaluvakannulalOna kAMkshalunnavi

aMganamATala lOna naDiyAsalunnavi
raMgaguchannulapai karagu lunnavi
aMgapu sEvalalO priyamulellA nunnavi
siMgAraMpugoppumIda sEsalunnavi

kappi yalamElumaMgakAgiTa nImEnunnadi
chippila@M jekkula mIda chihnalunnavi
yippuDe SrIvEMkaTESa yiddarunu@M gUDitiri
neppuna nIkevEla nI vuMgaramunnadi