Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Thursday, July 31, 2008

514.అచ్యుత మిమ్ము(దలచే యంతపని - achyuta mimmu(dalachE yaMtapani



Audio link : Dwaram Lakshmi
Archive link :

అచ్యుత మిమ్ము(దలచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా

మిమ్ము నెఱిగినయట్టి మీదాసుల నెఱిగే-
సమ్మతి విజ్ఞానమే చాలదా మాకు
వుమ్మడి మీసేవ సేసుకుండేటి వైష్ణువుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

నిరతి నీకు మొక్కేటినీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్ను పూజించే ప్రపన్నులపూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు

అంది నీకు భక్తులైన యలమహానుభావుల-
చందపు వారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడి బంటనవుటే చాలదా నాకు


achyuta mimmu(dalachE yaMtapani valenA
yichchala mIvArE mAku nihaparAliyyagA

mimmu ne~riginayaTTi mIdAsula ne~rigE-
sammati vij~nAnamE chAladA mAku
vummaDi mIsEva sEsukuMDETi vaishNuvula
sammukhAna sEviMchuTE chAladA nAku

nirati nIku mokkETinIDiMgarIlaku
saravitO mokkuTE chAladA nAku
paraga ninnu pUjiMchE prapannulapUjiMchE
sarilEni bhAgyamu chAladA nAku

aMdi nIku bhaktulaina yalamahAnubhAvula-
chaMdapu vAripai bhakti chAladA nAku
kaMduva SrIvEMkaTESa kaDu nIbaMTubaMTuku
saMdaDi baMTanavuTE chAladA nAku


Tuesday, July 29, 2008

513. kaladokkaTE guri kamalAksha - కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ


Audio link : Dwaram Lakshmi : Kharaharapriya
Archive link :

కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ
యిల నేనెట్టుండినాను యెంచకుమీ నేరమి

మనసులోనికి గురి మాధవ నీ పాదాలు
తనువుపై గురి నీ సుదర్శనము
కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు
పను లెన్నిగలిగిన( బట్టకు నా నేరమి

చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు
నీతి నా నాలికకు గురి నీ నామము
కాతరపునుదుటికి( గల తిరుమణి గురి
పాతకపునావలన( బట్టకుమీ నేరము

యిహపరాలకు గురి యీ నీ శరణాగతి
సహజ మాత్మకు గురి సంతతభక్తి
మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి
బహువిధముల నింక( బట్టకుమీ నేరమి


kaladokkaTE guri kamalAksha nI karuNa
yila nEneTTuMDinAnu yeMchakumI nErami

manasulOniki guri mAdhava nI pAdAlu
tanuvupai guri nI sudarSanamu
kanuchUpulaku guri kamalAksha nI rUpu
panu lennigaligina( baTTaku nA nErami

chEtulu reMTiki guri sEsETi nI pUjalu
nIti nA nAlikaku guri nI nAmamu
kAtarapunuduTiki( gala tirumaNi guri
pAtakapunAvalana( baTTakumI nEramu

yihaparAlaku guri yI nI SaraNAgati
sahaja mAtmaku guri saMtatabhakti
mahilO SrIvEMkaTESa manniMchi nannElitivi
bahuvidhamula niMka( baTTakumI nErami


Monday, July 28, 2008

512.jayamu manadi vanacharulAla - జయము మనది వనచరులాల



Audio link : Dwaram Lakshmi
Audio link :SattirajuVenumadhav
Archive link :

జయము మనది వనచరులాల
రయమున దర్మదారలు తుత్తుతూ

రక్కసులమీద రాముడలిగె: నలు
దిక్కుల నడవుడూ తిడిం తిడిం
యెక్కుడు సేనలు యిటు మొరయింపుడు
డక్కానినదము ఢమ ఢమ ఢమం

కుటిలదానవుల( గొట్టుడూ; కోటలు
తటుకున దాటు
డు ధణం ధణం
పటుగతినార్చుచు పట్టుడు లగ్గలు
పెటులు చూడుడదె పెట పెట పెటల్

గుట్టున నుండక కూలె రావణుడు
పట్టుడు సంకులు భం భం భం
యిట్టె శ్రీవేంకటేశుడు గెలిచెను
తిట్టలై యాడుడు ధిం ధిం ధిం


jayamu manadi vanacharulAla
rayamuna darmadAralu tuttutU

rakkasulamIda rAmuDalige: nalu
dikkula naDavuDU tiDiM tiDiM
yekkuDu sEnalu yiTu morayiMpuDu
DakkAninadamu Dhama Dhama DhamaM

kuTiladAnavula( goTTuDU; kOTalu
taTukuna dATudU dhaNaM dhaNaM
paTugatinArchuchu paTTuDu laggalu
peTulu chUDuDade peTa peTa peTal

guTTuna nuMDaka kUle rAvaNuDu
paTTuDu saMkulu bhaM bhaM bhaM
yiTTe SrIvEMkaTESuDu gelichenu
tiTTalai yADuDu dhiM dhiM dhiM


Sunday, July 27, 2008

511. dEvadEVOttama nAkudikku - దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే



Audio link : Dwaram Lakshmi
Archive link :

దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును
యేవివరము తెలియ నేమిసేతునయ్యా

పాపముడిగినగాని ఫలియించదు పుణ్యము
కోపముమానినగాని కూడదు శాంతి
చాపల మడచక నిశ్చలబుద్ధి గలుగదు
యేపున నా వసము గా దేమి సేతునయ్యా

ఆసవిడిచిన గాని యంకెకురాదు విరతి
రోసినగాని సుజ్ఞానరుచి పుట్టదు
వేసాలు దొలగించక వివేకా లెల్లా మెచ్చరు
యీసుద్దు లేమియు నేర నేమి సేతు నయ్యా

కల్లలాడకున్నగాని కడతేరదు సత్యము
వొల్ల నన్నగాని సుఖ మొనగూడదు
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
యెల్లకాల మీమేలున కేమి సేతు నయ్యా


dEvadEVOttama nAkudikku nIvE yepuDunu
yEvivaramu teliya nEmisEtunayyA

pApamuDiginagAni phaliyiMchadu puNyamu
kOpamumAninagAni kUDadu SAMti
chApala maDachaka niSchalabuddhi galugadu
yEpuna nA vasamu gA dEmi sEtunayyA

AsaviDichina gAni yaMkekurAdu virati
rOsinagAni suj~nAnaruchi puTTadu
vEsAlu dolagiMchaka vivEkA lellA mechcharu
yIsuddu lEmiyu nEra nEmi sEtu nayyA

kallalADakunnagAni kaDatEradu satyamu
volla nannagAni sukha monagUDadu
yillide SrIvEMkaTESa yElitivi nannu niTTE
yellakAla mImEluna kEmi sEtu nayyA

510. paramapurusha hari parama - పరమపురుష హరి పరమ పరాత్పర


Audio link : Dwaram lakshmi
Archive link :

పరమపురుష హరి పరమ పరాత్పర
పరరిపుభంజన పరిపూర్ణ నమో

కమలాపతి కమలనాభ కమలాసనవంద్య
కమలహితానంత కోటి ఘనసముదాయతేజా
కమలామలపత్రనేత్ర కమలవైరివర్ణగాత్ర
కమలషట్కయోగీశ్వరహృదయం తే హం నమో నమో

జలనిధిమథన జలనిధిబంధన జలధిమధ్యశయనా
జలధియంతరవిహార మచ్చకచ్చపయవతారా
జలనిధిజామాత జలనిధిశోషణ జలనిధిసప్తకగమన
జలనిధికారుణ్య నమోతేహం జలనిధిగంభీర నమోనమో

నగధర నగరిపునందిత నగచరయూథపనాథా
నగపారిజాతహర సారసపన్నగపతిరాజశయన
నగకులవిజయ శ్రీవేంకటనగనాయక భక్తవిధేయా
నగధీరా హం తే సర్వేశ్వర నారాయణ నమో నమో


paramapurusha hari parama parAtpara
pararipubhaMjana paripUrNa namO

kamalApati kamalanAbha kamalAsanavaMdya
kamalahitAnaMta kOTi ghanasamudAyatEjA
kamalAmalapatranEtra kamalavairivarNagAtra
kamalashaTkayOgISwarahRdayaM tE haM namO namO

jalanidhimathana jalanidhibaMdhana jaladhimadhyaSayanA
jaladhiyaMtaravihAra machchakachcapayavatArA
jalanidhijAmAta jalanidhiSOshaNa jalanidhisaptakagamana
jalanidhikAruNya namOtEhaM jalanidhigaMbhIra namOnamO

nagadhara nagaripunaMdita nagacharayUthapanAthA
nagapArijAtahara sArasapannagapatirAjaSayana
nagakulavijaya SrIvEMkaTanaganAyaka bhaktavidhEyA
nagadhIrA haM tE sarwESwara nArAyaNa namO namO

Saturday, July 26, 2008

509.rAma rAmachaMdra rAghavA - రామ రామచంద్ర రాఘవా

Audio link : Dwaram Lakshmi
Archive link :
రామ రామచంద్ర రాఘవా రాజీవలోనరాఘవా
సౌమిత్రిభరత శతృఘ్నులతోడ జయమందు దశరథరాఘవా

శిరసు కూకటుల రాఘవా చిన్నారిపొన్నారి రాఘవా
గరిమ నావయసున తాటకి జంపిన కౌసల్యనందన రాఘవా
అరిదియజ్ఞము గాచు రాఘవా యట్టె హరునివిల్లు విరిచిన రాఘవా
సిరులతో జనకుని యింట జానకి జెలగి పెండ్లాడినరాఘవా

మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవా
చెలగి చుప్పనాతి గర్వ మడచి దైత్యసేనల జంపిన రాఘవా
సొలసి వాలిజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా
జలధి బంధించిన రాఘవా లంకసంహరించిన రాఘవా

దేవతలు చూడ రాఘవా దేవేంద్రు రథమెక్కి రాఘవా
రావణాదులను జంపి విభీషణురాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయ పట్టమేలి రాఘవా
శ్రీవేంకటగిరిమీద నభయములు చెలగి మాకిచ్చిన రాఘవా


rAma rAmachaMdra rAghavA rAjIvalOnarAghavA
saumitribharata SatRghnulatODa jayamaMdu daSaratharAghavA

Sirasu kUkaTula rAghavA chinnAriponnAri rAghavA
garima nAvayasuna tATaki jaMpina kausalyanaMdana rAghavA
aridiyaj~namu gAchu rAghavA yaTTe harunivillu virichina rAghavA
sirulatO janakuni yiMTa jAnaki jelagi peMDlADinarAghavA

malayu nayOdhyA rAghavA mAyAmRgAMtaka rAghaVA
chelagi chuppanAti garwa maDachi daityasEnala jaMpina rAghaVA
solasi vAlijaMpi rAghavA daMDi sugrIvunElina rAghavA
jaladhi baMdhiMchina rAghavA laMkasaMhariMchina rAghavA

dEvatalu chUDa rAghavA dEvEMdru rathamekki rAghavA
rAvaNAdulanu jaMpi vibhIshaNurAjyamEliMchina rAghavA
vEvEga marali rAghavA vachchi vijaya paTTamEli rAghavA
SrIvEMkaTagirimIda nabhayamulu chelagi mAkichchina rAghavA

508.Itani mUlamE pO yilagala - ఈతని మూలమే పో యిలగల ధనములు



Audio link - Dwaram Lakshmi
Archive link :
ఈతని మూలమే పో యిలగల ధనములు
ఈతడు మాకు గలడు యెంత లేదు ధనము

విరతి మాధనము విజ్ఞానమే ధనము
మరిగినతత్వమే మాధనము
పరము మాధనము భక్తే మాధనము మా
కరిరాజవరదుడే కైవల్యధనము

శాంతమే మాధనము సంకీర్తనే ధనము
యెంతైనా నిశ్చింతమే ఇహధనము
అంతరాత్మే మాధనము హరిదాస్యమే ధనము
యింతటా లక్ష్మీకాంతు డింటిమూలధనము

ఆనందమే ధనము ఆచార్యుడే ధనము
నానాట పరిపూర్ణమే ధనము
ధ్యానమే మా ధనము దయే మాధనము
పానిన శ్రీవేంకటాద్రిపతియే మాధనము


Itani mUlamE pO yilagala dhanamulu
ItaDu mAku galaDu yeMta lEdu dhanamu

virati mAdhanamu vij~nAnamE dhanamu
mariginatatwamE mAdhanamu
paramu mAdhanamu bhaktE mAdhanamu mA
karirAjavaraduDE kaivalyadhanamu

SAMtamE mAdhanamu saMkIrtanE dhanamu
yeMtainA niSchiMtamE ihadhanamu
aMtarAtmE mAdhanamu haridAsyamE dhanamu
yiMtaTA lakshmIkAMtu DiMTimUladhanamu

AnaMdamE dhanamu AchAryuDE dhanamu
nAnATa paripUrNamE dhanamu
dhyAnamE mA dhanamu dayE mAdhanamu
pAnina SrIvEMkaTAdripatiyE mAdhanamu