Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Wednesday, January 31, 2007

117.Nallani Meni Nagavu - నల్లని మేని నగవు



ప|| నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు ||
చ|| బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు |
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు ||
చ|| నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు |
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు ||
చ|| గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు |
తిరముగ ధౄవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||
In English :
pa|| nallani mEni nagavu cUpula vADu | tellani kannula dEvuDu ||

ca|| birusaina danujula piMCamaNacinaTTi | tirupu kaiduva tODi dEvuDu |

saripaDDa jagamella cakka CAyaku dechchi | teravu cUpinaTTi dEvuDu ||
ca|| nITagalasinaTTi niMDina caduvulu | tETa paracinaTTi dEvuDu |
pATimAlinaTTi prANula duritapu | tITa rAsinaTTi dEvuDu ||

ca|| gurutuveTTagarAni guNamula nelakonna | tiruvEMkaTAdripai dEvuDu |

tiramuga dhRuvuniki divyapadaMbicci | teraci rAjannaTTi dEvuDu ||

Thursday, January 25, 2007

116.jayamu jayamu ika - జయము జయము ఇక



ప|| జయము జయము ఇక జనులాల | భయములు వాసెను బ్రదికితి మిపుడు ||చ|| ఘన నరసింహుడు కంభమున వెడలె | దనుజులు సమసిరి ధరవెలసె |
పొనిగె నధర్మము భూభారమడగె | మునుల తపము లిమ్ముల నీడేరె ||చ|| గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె | హిరణ్య కశిపుని నేపడచె |
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె | హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు ||చ|| అహోబలేశుడు సిరి నంకమున ధరించె | బహుగతి శుభములు పాటిల్లె |
ఇహపరము లొసగె నిందును నందును | విహరించెను శ్రీవేంకటగిరిని ||

In English:
pa|| jayamu jayamu ika janulAla | Bayamulu vAsenu bradikiti mipuDu ||
ca|| Gana narasiMhuDu kaMBamuna veDale | danujulu samasiri dharavelase |
ponige nadharmamu BUBAramaDage | munula tapamu limmula nIDEre ||
ca|| garimatO viShNuDu gaddepai nilice | hiraNya kaSipuni nEpaDace |
arasi prahlAduni anniTA manniMce | haruDunu brahmayu ade kolicEru ||
ca|| ahObalESuDu siri naMkamuna dhariMce | bahugati SuBamulu pATille |
ihaparamu losage niMdunu naMdunu | vihariMcenu SrIvEMkaTagirini ||

Wednesday, January 24, 2007

115.harinAmamu kaDu - హరినామము కడు


ప|| హరినామము కడు నానందకరము | మరుగవో మరుగవో మరుగవో మనసా ||
చ|| నళినాక్షు శ్రీనామము | కలిదోషహరము కైవల్యము |
ఫలసారము బహుబంధ మోచనము | తలచవో తలచవో మనసా ||
చ|| నగధరు నామము నరకహరణము | జగదేకహితము సమ్మతము |
సగుణ నిర్గుణము సాక్షాత్కారము | పొగడవో పొగడవో పొగడవో మనసా ||
చ|| కడగి శ్రీవేంకటపతి నామము | ఒడి ఒడినే సంపత్కరము |
అడియాలం బిల నతి సుఖమూలము | తడవవో తడవవో తడవవో మనసా ||


in english :
pa|| harinAmamu kaDu nAnaMdakaramu | marugavO marugavO marugavO manasA ||
ca|| naLinAkShu SrInAmamu | kalidOShaharamu kaivalyamu |
PalasAramu bahubaMdha mOcanamu | talacavO talacavO manasA ||
ca|| nagadharu nAmamu narakaharaNamu | jagadEkahitamu sammatamu |
saguNa nirguNamu sAkShAtkAramu | pogaDavO pogaDavO pogaDavO manasA ||
ca|| kaDagi SrIvEMkaTapati nAmamu | oDi oDinE saMpatkaramu |
aDiyAlaM bila nati suKamUlamu | taDavavO taDavavO taDavavO manasA ||

Friday, January 12, 2007

114.ammamma Emamma alamElmaMga -అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ


ప అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

చ: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ


చ: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

చ: చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ
In English:
pa ammamma Emamma alamElmaMga nAMcAramma tammiyiMTa nalarukomma Oyamma

ca nIrilOna tallaDiMcE nIkE talavaMcI nIrikiMda pulakiMcI nIramaNuMDu
gOrikona cemariMcI kOpamE pacariMcI sAreku nIyaluka iTTe cAliMcavamma

ca nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI mEkoni nIvirahAna mEnu veMcIni
IkaDAkaDi satula hRudayamE perarEcI Aku maDiciyyanaina AnatiyyavammA

ca cakkadanamule peMcI sakalamu gAladaMci nikkapu vEMkaTESuDu nIkE poMcIni
makkuvatO alamElmaMga nAMcAramma akkuna nAtani niTTE alariMcavamma

Priya Sisters

Tuesday, January 02, 2007

113.telisinavAriki dEvuMDitaDE - తెలిసినవారికి దేవుండితడ


Audio link :PriyaSisters
Archive link :
ప|| తెలిసినవారికి దేవుండితడే | వలవని దుష్టుల వాదములేల ||

చ|| పురుషులలోపల పురుషోత్తముడు | నరులలోన నరనారాయణుడు |
పరదైవములకు పరమేశ్వరుడు | వరుసమూఢుల కెవ్వరోయితడు ||

చ|| పలుబ్రహ్మలకును పరబ్రహ్మము | మలయునీశులకు మహేశుడితడు |
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు | ఖలులకెట్లుండునో కానము యితడు ||

చ|| వేదంబులలో వేదాంతవేద్యుడు | సోదించకరిగాచుచో నాదిమూలము |
ఈదెస శ్రీవేంకటేశుడిందరికి | గాదిలిమతులను గైకొనడితడు ||


in english :
pa|| telisinavAriki dEvuMDitaDE | valavani duShTula vAdamulEla ||
ca|| puruShulalOpala puruShOttamuDu | narulalOna naranArAyaNuDu |
paradaivamulaku paramESvaruDu | varusamUDhula kevvarOyitaDu ||
ca|| palubrahmalakunu parabrahmamu | malayunISulaku mahESuDitaDu |
ilanAtmalalO niTuparamAtmuDu | KalulakeTluMDunO kAnamu yitaDu ||
ca|| vEdaMbulalO vEdAMtavEdyuDu | sOdiMcakarigAcucO nAdimUlamu |
Idesa SrIvEMkaTESuDiMdariki | gAdilimatulanu gaikonaDitaDu ||