Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label tatwam. Show all posts
Showing posts with label tatwam. Show all posts

Wednesday, December 19, 2012

787.గోనెలె కొత్తలు కోడెలెప్పటివి - gOnele kottalu kODeleppaTivi

Audio link : P Ranganath

గోనెలె కొత్తలు కోడెలెప్పటివి
నానినలోహము నయమయ్యీనా

మున్నిటిజగమే మున్నిటిలోకమే
యెన్నగ బుట్టుగులివె వేరు
నన్ను నెవ్వ రున్నతి బోధించిన
నిన్న నేటనే నేనెఱిగేనా

చిత్తము నాటిదే చింతలు నాటివే
యిత్తల భోగములివె వేరు 
సత్తగు శాస్త్రము చాయ చూపినా 
కొత్తగ నే నిక గుణినయ్యేనా 

జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడే 
యీవల భావనలివే వేరు 
ధావతి కర్మము తప్పఁ దీసినా 
దైవము గావక తలగీనా 
     
gOnele kottalu kODeleppaTivi
naaninalOhamu nayamayyInaa

munniTijagamE munniTilOkamE
yennaga buTTugulive vEru
nannu nevva runnati bOdhimchina
ninna nETanE nEne~rigEnaa

chittamu naaTidE chimtalu naaTivE
yittala bhOgamulive vEru 
sattagu Saastramu chaaya chUpinaa 
kottaga nE nika guNinayyEnaa 

jeevaantaraatmuDu SrI vEnkaTESuDE 
yIvala bhaavanalivE vEru 
dhaavati karmamu tappa@M deesinaa 
daivamu gaavaka talageenaa 
     



Sunday, January 03, 2010

666.enni bAdhalabeTTi yEchedavu - ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక

ప : ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా చ : ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా చ: అసలనియెడి తాళ్ళ నంటగట్టుకవిధికి నప్పగించితివిగదె కర్మమా వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా చ: తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా pa : enni baadhalabeTTi yaechedavu neeviMka yeMtakaalamudaaka karmamaa manniMchumanuchu neemarugu jochchitimi maamaaTaalakiMchavO karmamaa cha : pratilaeni duritamula paalusaeyakanannu paaliMchavaitivO karmamaa tatitODa naatmaparitaapaMbu tODutanu tagulaela chaesitivO karmamaa jitakaamulakugaani chaetikini lOnayi chikkavaekaalaMbu karmamaa matiheenulainaTTi maakunoka paripaaTi maargaMbu choopavO karmamaa cha: asalaniyeDi taaLLa naMTagaTTukavidhiki nappagiMchitivigade karmamaa vaasi viDichitimi neevaaramaitimi mammu vanne cheDaneekuvO karmamaa kaasukunu goragaani gatilaeni panikigaa kaaloodaneevaela karmamaa OsariMchoka maaru voyyanae vokareeti nollanani talagumee karmamaa cha: tiruvaeMkaTaachalaadhipuni maayalachaeta desala diriginayaTTi karmamaa haridaasulaguvaari naadariMtuvugaaka aMta noppiMtuvaa karmamaa varusa naenugumeedivaanisunnaMbaDuga vachchunaa neekiTla karmamaa paramapurushOttamuni bhramatabaDi neeviTla baTTabayalaitigaa karmamaa

Monday, August 24, 2009

637.tolli kalave yiviyu tolli - తొల్లి కలవె యివియు తొల్లి తాను గలడె




తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు
కనుదెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడుశూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోచీని
తలచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు
తలపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలుచంచలవికారభావ మీ గుణము
ముందు దాఁ గలిగితే మూడు లోకములుఁ గల-
వెందు దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీడె
కందువల నితనిసంకల్ప మీపనులు
tolli kalavE iviyu tolli tAnu@M galaDE
kallayunu@M gAdu idi kaDu nijamu gAdu
kanuderachinaMtanE kalugu nI jagamu
kanumUsinaMtanE kaDuSUnyamaunu
kanureppa mara@Mgunane kalimiyunu lEmiyunu
tana manObhAvanala@M dagili tOchIni
talachinaMtane yeMtadavvayina@M gAn&piMchu
talapu marachinamatiki daTTamau@M damamu
polasi matimaragunane puTTuTalu@M bOvuTalu
paluchaMchalavikArabhAva mI guNamu
muMdu dA@M galigitE mUDu lOkamulu@M gala-
veMdu dA lEkuMTE nEmiyunu lEdu
aMdi SrIvEMkaTESu@M DAtmalOnane vIDe
kaMduvala nitanisaMkalpa mIpanulu

Sunday, May 31, 2009

620.jIvAtumai yuMDu chilukA - జీవాతుమై యుండు చిలుకా





జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయమున నుండి నా-చేతనే పెరిగిన చిలుకా
జాతిగా కర్మపు సంకెళ్ళ బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా

భాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంబురెక్కలచాటున నుండి సీతుకోరువ లేని చిలుకా

బెదరి అయిదుగిరికిని భీతి పొందుచు కడు జెదరగ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిగాక ఆడిచి(అదిరి)పడుదువే నీవు చిలుకా

వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు- వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నా తోగూడి మెలగిన చిలుకా

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనైయుందు చిలుకా
శ్రీవెంకటాద్రి పై చిత్తములో నుండి సేవించుకొని గట్టి చిలుకా

దైవమానుషములు తలపించి యెపుడు నా -తలపునఁబాయని చిలుకా
యేవియును నిజముగా విని యేటికవి నాకు నెఱిగించి నటువంటి చిలుకా


jIvAtumai yuMDu chilukA nI-vAvaliki paramAtmuDai yuMDu chilukA

AtumapaMjaramulOna nayamuna nuMDi nA- chEtanE perigina chilukA
jAtigA karmapu saMkeLLa baDi kAla@M jEta@M bEdaitivE chilukA

bhAtigA chaduvulu pagalurElunu nA chEta nErichinaTTi chilukA
rItigA dEhaMburekkalachATuna nuMDi sItukOruva lEni chilukA

bedari ayidugirikini bhIti poMduchu kaDu jedaraga jUtuvE chilukA
adayulayyina SatrulArugurikigAka ADichi(adiri)paDuduvE nIvu chilukA

vadalakiTu yAhAravAMCha naTu padivElu- vadarulu vadarETi chilukA
tudalEni mamatalu tOrammu sEsi nA tOgUDi melagina chilukA

nIvana nevvaru nEnana nevvaru nIvE nEnaiyuMdu chilukA
SrIveMkaTAdri pai chittamulO nuMDi sEviMchukoni gaTTi chilukA

daivamAnushamulu talapiMchi yepuDu nA - talapuna@MbAyani chilukA
yEviyunu nijamugA vini yETikavi nAku ne~rigiMchi naTuvaMTi chilukA

Sunday, February 01, 2009

579.tegaka paramunaku teruvu - తెగక పరమునకు తెరువు లేదు



Archive link :
తెగక పరమునకు తెరువు లేదు
పగయెల్లా విడువక భవమూ పోదు

కన్నులయెదుటనున్న కాంచనము పై మమత
వున్నంతతడవు మోక్షమొనగూడదు
అన్నముతోడి రుచుల యలమట గలదాకా
పన్నిన సుజ్ఞానము పదిలము గాదు


పక్కనున్న కాంతల భ్రమగల కాలము
మిక్కిలి శ్రీహరి భక్తి మెరయలేదు
వెక్కసపు సంసారవిధి నున్నంతతడవు
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు


చిత్తములోపలి పలు చింతలు మానినదాకా
సత్తుగా వైరాగ్యము సమకూడదు
యిత్తల శ్రీవేంకటేశు డేలిన దాసులకైతే
హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు


tegaka paramunaku teruvu lEdu
pagayellA viDuvaka bhavamU pOdu

kannulayeduTanunna kAMchanamu pai mamata
vunnaMtataDavu mOkshamonagUDadu
annamutODi ruchula yalamaTa galadAkA
pannina suj~nAnamu padilamu gAdu


pakkanunna kAMtala bhramagala kAlamu
mikkili SrIhari bhakti merayalEdu
vekkasapu saMsAravidhi nunnaMtataDavu
nikki paramadharmamu nilukaDa gAdu


chittamulOpali palu chiMtalu mAninadAkA
sattugA vairAgyamu samakUDadu
yittala SrIvEMkaTESu DElina dAsulakaitE
hatti vaikuMThapadavi appuDE kaladu


Friday, August 01, 2008

515.nammitijummI vO manasA nAkE - నమ్మితిజుమ్మీ వో మనసా నాకే


Audio link : Dwaram Lakshmi : Raga Mohana
Archive link :

నమ్మితిజుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ
ముమ్మాటికి నే( జెప్పితి(జుమ్మీ మురహరునామమే జపించుమీ

తలచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మరువకుమీ
కలగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ
వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ
కొలువకుమీ యితరదేవతల గోవిందునే భజించుమీ

కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ
మీరకుమీ గురువులయానతి మెఱయ పురాణములే వినుమీ
చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుడవై నిలువుమీ
దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ

వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుడవగుమీ
మఱవకుమీ యలమేల్మంగకుమగడగు శ్రీవేంకటపతిని
కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుడవుగమ్మీ
తొఱలకుమీ నేరములను సింధు రక్షకునినే సేవించుమీ


nammitijummI vO manasA nAkE hitavayi melaMgumI
mummATiki nE( jeppiti(jummI muraharunAmamE japiMchumI

talachakumI yitaradharmamulu tatwaj~nAnamu maruvakumI
kalagakumI yEpanikainanu kaDuSAMtaMbunanuMDumI
valavakumI vanitalakeppuDu vairAgyaMbuna nuMDumI
koluvakumI yitaradEvatala gOviMdunE bhajiMchumI

kOrakumI dEhabhOgamulu gonakoni tapamE chEkonumI
mIrakumI guruvulayAnati me~raya purANamulE vinumI
chErakumI durjanasaMgati jitEMdriyuDavai niluvumI
dUrakumI karmaphalaMbunu dhruvavaraduninE nutiMchumI

ve~ravakumI puTTugulaku mari vivEkiMchi dhIruDavagumI
ma~ravakumI yalamElmaMgakumagaDagu SrIvEMkaTapatini
ke~ralakumI mAyAratulanu kEvalasAtwikuDavugammI
to~ralakumI nEramulanu siMdhu rakshakuninE sEviMchumI

Friday, August 17, 2007

296.eMta cadivina nEmi vinina-ఎంత చదివిన నేమి వినిన


Audio link :
Archive link :
ప|| ఎంత చదివిన నేమి వినిన తన | చింత యేల మాను సిరులేల కలుగు ||
చ|| ఇతర దూషణములు ఎడసిన గాక | అతి కాముకుడు గాని యప్పుడు గాక |
మతి చంచలము కొంత మానిన గాక |గతి యేల కలుగు దుర్గతులేల మాను ||
చ|| పర ధనముల యాస బాసిన గాక | అరిది నిందలు లేని యప్పుడు గాక |
విరస వర్తనము విడచిన గాక | పర మేల కలుగు నాపద లేల మాను ||
చ|| వేంకటపతి నాత్మ వెదికిన గాక | కింక మనసున తొలగిన గాక |
బొంకు మాటలెడసి పోయిన గాక | శంక యేల మాను జయమేల కలుగు ||


pa|| eMta cadivina nEmi vinina tana | ciMta yEla mAnu sirulEla kalugu ||
ca|| itara dUShaNamulu eDasina gAka | ati kAmukuDu gAni yappuDu gAka |
mati caMcalamu koMta mAnina gAka |gati yEla kalugu durgatulEla mAnu ||
ca|| para dhanamula yAsa bAsina gAka | aridi niMdalu lEni yappuDu gAka |
virasa vartanamu viDacina gAka | para mEla kalugu nApada lEla mAnu ||
ca|| vEMkaTapati nAtma vedikina gAka | kiMka manasuna tolagina gAka |
boMku mATaleDasi pOyina gAka | SaMka yEla mAnu jayamEla kalugu ||

Wednesday, August 15, 2007

292.vennavaTTuka nEyi- వెన్నవట్టుక నేయి


Audio link :
Archive link :
ప|| వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- | నెన్నివలసినను దమయేలేటివి కావా ||
చ|| తలపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు | కలుగుటే కలుగవలెగాక |
వలపైనభోగములు వైభవంబులు మరియు | కలవెల్ల తమయెదుట గలిగినవె కావా ||
చ|| పదిలముగ హరినామపఠన మంత్రము నోరు | కదియుటే కలుగవలెగాక |
తుదిలేనిసంపదలు తొలగనిముదంబులును | కదలకెప్పుడు దమకు గలిగినవె కావా ||
చ|| యించుకైనను వేంకటేశుగిరిశిఖరంబు | కాంచుటే కలుగవలెగాక |
అచింతంబైన నిత్యానందపదవులును | మించి తమయెదుట బ్రభవించినవె కావా ||


pa|| vennavaTTuka nEyi vedakanElA mariyu- | nennivalasinanu damayElETivi kAvA ||
ca|| talapunaku viShNuciMtana nimiShamAtraMbu | kaluguTE kalugavalegAka |
valapainaBOgamulu vaiBavaMbulu mariyu | kalavella tamayeduTa galiginave kAvA ||
ca|| padilamuga harinAmapaThana maMtramu nOru | kadiyuTE kalugavalegAka |
tudilEnisaMpadalu tolaganimudaMbulunu | kadalakeppuDu damaku galiginave kAvA ||
ca|| yiMcukainanu vEMkaTESugiriSiKaraMbu | kAMcuTE kalugavalegAka |
aciMtaMbaina nityAnaMdapadavulunu | miMci tamayeduTa braBaviMcinave kAvA ||

Tuesday, August 14, 2007

287.tanakEDa caduvulu-తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు


Audio link :
Archive link :
ప|| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచల బుద్ధి మానీనా
చ|| జడ్డు మానవుడు చదువ జదువు నాస | వడ్డివారుగాక వదలీనా |
గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన | దుడ్డు పెట్లే కాక దొరకేనా ||
చ|| దేవదూషకుడై తిరిగేటి వానికి | దేవతాంతరము తెలిసీనా |
శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక | పావనమతియై పరగీనా ||


pa|| tanakEDa caduvulu tanakEDa SAstrAlu | manasu caMcala buddhi mAnInA
ca|| jaDDu mAnavuDu caduva jaduvu nAsa | vaDDivArugAka vadalInA |
guDDikukka saMtakubOyi tirigina | duDDu peTlE kAka dorakEnA ||
ca|| dEvadUShakuDai tirigETi vAniki | dEvatAMtaramu telisInA |
SrIvEMkaTESvaru sEvAparuDugAka | pAvanamatiyai paragInA ||

Monday, July 23, 2007

268.evvarevvarivADO yIjIvuDu- ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు


Audio link :PBSrinivas
Archive link : Mangalampalli Balamuralikrishna


ప|| ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
చ|| ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుహ్ఖ- | మెందరికి గావింప డీజీవుడు ||
చ|| ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||
చ|| ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు 

||pa|| evvarevvarivADO yIjIvuDu cUDa | nevvariki nEmaunO yIjIvuDu ||
ca|| eMdariki goDukugA DIjIvuDu venuka- | keMdariki dObuTTa DIjIvuDu |
yeMdarini BramayiMca DIjIvuDu duHKa- | meMdariki gAviMpa DIjIvuDu ||
ca|| ekkaDekkaDa diruga DIjIvuDu venuka- | kekkaDO tanajanma mIjIvuDu |
yekkaDi cuTTamu danaku nIjIvuDu yeppu- | DekkaDiki nEgunO yIjIvuDu ||
ca|| ennaDunu jETulEnIjIvuDu venuka- | kennidanuvulu mOva DIjIvuDu |
yennagala tiruvEMkaTESu mAyala dagili | yennipadavula boMda DIjIvuDu ||

Tuesday, April 17, 2007

179.inni chaduvanEla-ఇన్నిచదువనేల


Audio link :Nedunuri KrishnaMurthy
Archive link :
ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
చ|| వలెననేదొకమాట వలదనేదొక మాట | సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను |
వలెనంటె బంధము వలదంటె మోక్షము | తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||
చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
చ|| పరమనేదొకటే ప్రపంచమొకటే | సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను |
ఇరవు వేంకటేశుడిహ పరములకర్త | శరణాగతులకెల్ల సతమీతడొకడే ||

in english:
pa|| innicaduvanEla iMta vedakanEla | kannu teracuTokaTi kanumUyuTokaTi ||
ca|| valenanEdokamATa valadanEdoka mATa | silugulI reMTikini cittamE guriyaunu |
valenaMTe baMdhamu valadaMTe mOkShamu | telisi vij~nAnulaku teruvidi yokaTE ||
ca|| puTTeDidokaTE pOyeDidokaTE | tiTTamai reMTikini dEhamE guriyaunu |
puTTuTa saMSayamu pOvuTa niScayamu | voTTi vij~nAnulaku vupamidi vokaTE ||
ca|| paramanEdokaTE prapaMcamokaTE | sirula nIreMTikini jIvuDE guriyaunu |
iravu vEMkaTESuDiha paramulakarta | SaraNAgatulakella satamItaDokaDE ||
meaning by Sri GB Sankar rao garu , posted in sujanaranjani :తత్త్వ సారాన్ని, జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికి అన్ని శాస్త్రాలు చదువవలసిన అవసరం లేదు. శుష్క సాధనలు, శోధనలు అంతకంటే అవసరం లేదు. మరి ముక్తి మార్గం ఎలా తెలుసుకోవాలనే జిజ్ఞాసులకు అతి సులభంగా తత్త్వ సారాన్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ఉపదేశిస్తున్నారు. జనన మరణాలు అనివార్యమైన ఈ ప్రపంచ నాటక రంగస్థలంపై భగవంతుడు ఆడించే బొమ్మలు ఈ జీవులు! మరులు గొలిపే బాహ్య భౌతిక ఆకర్షణలకు లోనై, యింద్రియ సుఖాలకు అంటిపెట్టుకుని ఉండడమే బంధం! వాటిని ‘మాయ’ గా గ్రహించి, దూరంగా ఉండటమే మోక్షం. పుట్తిన దేహం గిట్టక మానదు! (కా) వలెను. (కా)వలదు అని మనసులో రెండు భావాలు తరచు సంవాద పడుతుంటాయి మనం ఏదైనా ఇది మనది అనుకుంటే బంధం! కాదు అనుకుంటే బంధరాహిత్యం! అలాగే పుట్టుట, చావుట రెండూ దేహానికి సంబంధించినవే! పుట్టుక సంశయం అంటే మనం మళ్ళీ పుడతామో లేదో తెలియదు కానీ పుట్టిన తరువాత చావటాం మాత్రం అనివార్యంగా జరిగే పని, ఈ విజ్ఞతతో కూడిన ఈ విషయాలన్నీ భక్తి, జ్ఞాన శిఖామణులైన వారికి మాత్రమే తెలుస్తాయి. ఆ జ్ఞాన సారాన్ని అన్నమయ్య ఈ పాట ద్వారా మనకందిస్తున్నాడు! ఈ సత్యం తెలుసుకుని ఇహపరలోకాలకు కర్తయైన శాశ్వతుడు శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడడమే జీవికి ముక్తిమార్గం.

సిలుగు = ఉపద్రవము / కష్టము;
తెరువు = మార్గం;
సతము = శాశ్వతము;
తిట్టము = ఆశ్రయం;
ఇరవు = నెలవు;
తెలిసి విజ్ఞానులు = గమనించగలిగే వివేకులు;
వలెను = కావాలి;
వలదు = వద్దు;
సిరుల = విశిష్టమైన