Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [ఈ_అన్నమయ్య]. Show all posts
Showing posts with label [ఈ_అన్నమయ్య]. Show all posts

Sunday, May 10, 2009

612.IItaDE muktidOva ItaDE mA - ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు

Archive Audio Link
Audio link sung by Balakrishnaprasad
ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు
ఈతడు గలుగబట్టి ఇందరు బదికిరి

అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు
యిదెవీడె శ్రీవేంకటేశునెదుట
వెదవెట్టి లోకములో వేదములన్నియు మంచి -
పదములు చేసి పాడి పావనము సేసెను

అలరుచు తాళ్ళపాక అన్నమాచార్యులు
నిలిచి శ్రీవేంకటనిధియే తానై
కలిదోషములు వాప ఘనపురాణములెల్ల
పలుకులు నించి నించి పాడినాడు హరిని

అంగవించె తాళ్ళపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీవేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకటరమణుని యలమేలు-
మంగను యిద్దరి పాడి మమ్ము గరుణించెను
IItaDE muktidOva ItaDE mA AchAryuDu
ItaDu galugabaTTi iMdaru badikiri

adivO tALLapAka annamAchAryulu
yidevIDe SrIvEMkaTESuneduTa
vedaveTTi lOkamulO vEdamulanniyu maMchi -
padamulu chEsi pADi pAvanamu sEsenu

alaruchu tALLapAka annamAchAryulu
nilichi SrIvEMkaTanidhiyE tAnai
kalidOshamulu vApa ghanapurANamulella
palukulu niMchi niMchi pADinADu harini

aMgaviMche tALLapAka annamAchAryulu
baMgAru SrIvEMkaTESu pAdamulaMdu
raMgumIra SrIvEMkaTaramaNuni yalamElu-
maMganu yiddari pADi mammu garuNiMchenu

Monday, March 30, 2009

604.ItaDuvO rAmuDu EkAMgavIruDu - ఈతడువో రాముడు ఏకాంగవీరుడు


Audio link : BalaKrishnaPrasad
ఈతడువో రాముడు ఏకాంగవీరుడు
ఏతలజూచినా తానె ఇరవుకొన్నవాడు

చిరుత ప్రాయమునాడు శివునివిల్లువిరచి
మెరసి సీతను పెండ్లాడి మించినవాడు
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదిపిన వాడు

ఓడకవిల్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్ళు ధరను కూలవేసినవాడు
జాడాగా కొండలచేత జలనిధిఁ గట్టించి
వేడుకతో లంకమీద విడిసిన వాడు

రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి
ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు
శ్రీవేంకటాద్రిమీదఁ జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాడు
ItaDuvO rAmuDu EkAMgavIruDu
EtalajUchinA tAne iravukonnavADu

chiruta prAyamunADu Sivunivilluvirachi
merasi sItanu peMDlADi miMchinavADu
tari padunAlugu vEla dAnavula nimishAna
jarasi tAnokkaDE chadipina vADu

ODakavillekkupeTTi UrakE okkammuna
EDu tALLu dharanu kUlavEsinavADu
jADAgA koMDalachEta jalanidhi@M gaTTiMchi
vEDukatO laMkamIda viDisina vADu

rAvaNa kuMbhakarNAdi rAkAsula parimArchi
Ivala ayOdhyApaTnamElina vADu
SrIvEMkaTAdrimIda@M jEri mAlyavaMtamuna
vEvElu chaMdamulanu velasinavADu



Tuesday, December 09, 2008

552.Itani mahimalu yeMtani cheppeda - ఈతని మహిమలు యెంతని చెప్పెద



Audio link:PSRanganath  in raga Saraswati
Archive link :


ఈతని మహిమలు యెంతని చెప్పెద
చేతుల మొక్కెద జెలగుచు నేను
శ్రీనరసింహుడు చిన్మయమూరితి
నానావిధకరనఖరుడు
దారుణ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు

అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహుదేవతా సార్వభౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
యిహపరములొసగు యేలిక యితడూ
కేవలుడగు సుగ్రీవ నృసింహుడు
భావించ సుజనపాలకుడు
శ్రీవేంకటేశుడు చిత్తజజనకుడు
వేవేలకు నిలువేలుపు యితడు




Itani mahimalu yeMtani cheppeda
chEtula mokkeda jelaguchu nEnu

SrInarasiMhuDu chinmayamUriti
nAnAvidhakaranakharuDu
dAruNa daitya vidAruDu viShNuDu
tAnakamagu mA daivaMbitaDu

ahObalESuDu AdimapurushuDu
bahudEvatA sArwabhaumuDu
sahajAnaMduDu sarwarakshakuDu
yihaparamulosagu yElika yitaDu

kEvaluDagu sugrIva nRsiMhuDu
bhAviMcha sujanapAlakuDu
SrIvEMkaTESuDu chittajajanakuDu
vEvElaku nilavElupu yitaDu

Saturday, July 26, 2008

508.Itani mUlamE pO yilagala - ఈతని మూలమే పో యిలగల ధనములు



Audio link - Dwaram Lakshmi
Archive link :
ఈతని మూలమే పో యిలగల ధనములు
ఈతడు మాకు గలడు యెంత లేదు ధనము

విరతి మాధనము విజ్ఞానమే ధనము
మరిగినతత్వమే మాధనము
పరము మాధనము భక్తే మాధనము మా
కరిరాజవరదుడే కైవల్యధనము

శాంతమే మాధనము సంకీర్తనే ధనము
యెంతైనా నిశ్చింతమే ఇహధనము
అంతరాత్మే మాధనము హరిదాస్యమే ధనము
యింతటా లక్ష్మీకాంతు డింటిమూలధనము

ఆనందమే ధనము ఆచార్యుడే ధనము
నానాట పరిపూర్ణమే ధనము
ధ్యానమే మా ధనము దయే మాధనము
పానిన శ్రీవేంకటాద్రిపతియే మాధనము


Itani mUlamE pO yilagala dhanamulu
ItaDu mAku galaDu yeMta lEdu dhanamu

virati mAdhanamu vij~nAnamE dhanamu
mariginatatwamE mAdhanamu
paramu mAdhanamu bhaktE mAdhanamu mA
karirAjavaraduDE kaivalyadhanamu

SAMtamE mAdhanamu saMkIrtanE dhanamu
yeMtainA niSchiMtamE ihadhanamu
aMtarAtmE mAdhanamu haridAsyamE dhanamu
yiMtaTA lakshmIkAMtu DiMTimUladhanamu

AnaMdamE dhanamu AchAryuDE dhanamu
nAnATa paripUrNamE dhanamu
dhyAnamE mA dhanamu dayE mAdhanamu
pAnina SrIvEMkaTAdripatiyE mAdhanamu

Saturday, May 10, 2008

491.ItaDE yItaDE suMDi - ఈతడే యీతడే సుండి

Audio download link : Balakrishnaprasad
to listen....

ఈతడే యీతడే సుండి యెంత యెంచి చూచినా
చేతనే వరాలిచ్చే శేషాచలేశుడు

విశ్వరూపపుబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము
ఐశ్వర్యస్వరాట్టా సామ్రాట్టయిన బ్రహ్మము
శాశ్వత బ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము
యీశ్వరు(డై మహారాట్టై యిందరిలో బ్రహ్మము

సూర్యునిలో తేజము సోమునిలో తేజము
శౌర్యపుటనలునిభాస్వ తేజము
కార్యపుటవతారాల గనుగొనే తేజము
వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము

పరమపూరుషమూర్తి ప్రకృతియైన మూర్తి
గరిమతో మహదహంకారమూరితి
ధర పంచతన్మాత్రలు తత్వములైన మూరితి
గరుడానంత సేనేశకర్తయైన మూరితి

భాగవతపు దైవము భారతములో దైవము
సాగిన పురాణ వేదశాస్త్ర దైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము


ItaDE yItaDE suMDi yeMta yeMchi chUchinA
chEtanE varAlichchE SEshAchalESuDu

viSwarUpapubrahmamu virATTayina brahmamu
aiSwaryaswarATTA sAmrATTayina brahmamu
SASwata brahmAMDAlu SarIramaina brahmamu
yISwaru(Dai mahArATTai yiMdarilO brahmamu

sUryunilO tEjamu sOmunilO tEjamu
SauryapuTanalunibhAsva tEjamu
kAryapuTavatArAla ganugonE tEjamu
vIryapuTej~nabhAgAla vishNunAma tEjamu

paramapUrushamUrti prakRtiyaina mUrti
garimatO mahadahaMkAramUriti
dhara paMchatanmAtralu tatwamulaina mUriti
garuDAnaMta sEnESakartayaina mUriti

bhAgavatapu daivamu bhAratamulO daivamu
sAgina purANa vEdaSAstra daivamu
pOgulaina brahmalanu boDDuna ganna daivamu
SrIgaligi bhUpataina SrIvEMkaTadaivamu


Monday, March 17, 2008

434.ItaDE haruDu yItaDE yajuDu - ఈతడే హరుడు యీతడే యజుడు

Audio link : Balakrishnaprasad
ఈతడే హరుడు
యీతడే యజుడు

ఈతనికి నీ చేతలెంత
ఘనమటుగాన


కడుపెక్కు బ్రహ్మాండ
కటకములు సుడివడిన

కడుపులో నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యంత

వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు-
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమింతురు గాన

తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె


ItaDE haruDu yItaDE yajuDu
Itaniki nI chEtaleMta ghanamaTugAna

kaDupekku brahmAMDa kaTakamulu suDivaDina
kaDupulO niDukonna ghanuDu
veDali pUtakichaMTi vishamu tAgina yaMta
vaDi tanaku nEmAya vaTTibUmelugAka

ellajaladhulu migili yEkamai pabbinapu-
Dullasilluchu nItaDuMDu
mallADi yoka reMDu maddulu virachinaTTi
balliduDavani ninnu pariNamiMturu gAna

tiruvEMkaTESwaruDu dEva dEvOttamuDu
paripUrNuDachyutuDabhavuDu
SaraNAgatula rakshasEyu vADanumATa
gurutugA talapOsi koniyADAgA valase

Wednesday, August 15, 2007

289.ItaDu tArakabrahma-ఈతడు తారకబ్రహ్మ


Audio link :GBKP
Archive link :
ఈతడు తారకబ్రహ్మ మితడు మాదేవుడు
కౌతుకాన చెప్పే వినగదరే వో జనులు ||

రాముడు యిందీవరశ్యాముడు నానాసార్వ-
భౌముడు షోడశకళాసోముడు
దోమటి రాక్షసులను తుత్తుమురు సేసినాడు
కామిత ఫలము లిచ్చి కాచినాడు సురల ||

పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున వి-
స్తీర్ణుడు వాహన సుపర్ణుడు
ఆర్ణవము దాటి రావణాదుల గెలిచినాడు
నిర్ణయించి చెప్పరాదు నేడీతని మహిమ ||

వరుడు సీతకు పరాత్పరుడు కోదండ దీక్షా
గురుడు దివ్యామోఘశరుడితడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాడు
సరి భరత లక్ష్మణ శత్రుఘ్న సహితుడు ||


ItaDu tArakabrahma mitaDu mAdEvuDu
kautukAna cheppE vinagadarE vO janulu ||

rAmuDu yiMdIvaraSyAmuDu nAnAsArwa-
bhaumuDu shODaSakaLAsOmuDu
dOmaTi rAkshasulanu tuttumuru sEsinADu
kAmita phalamu lichchi kAchinADu surala ||

pUrNuDu nIlamEghavarNuDu dAnamuna vi-
stIrNuDu vAhana suparNuDu
ArNavamu dATi rAvaNAdula gelichinADu
nirNayiMchi chepparAdu nEDItani mahima ||

varuDu sItaku parAtparuDu kOdaMDa dIkshA
guruDu divyAmOghaSaruDitaDu
nirati SrIvEMkaTAdri nelavai yuMDETivADu
sari bharata lakshmaNa Satrughna sahituDu ||

Tuesday, July 31, 2007

272.ItaDE raghurAmuDIta-ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు


Audio link :GBKP
Archive link :
Tallapaka padasahityam - book :29, kriti : 196

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు

యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు

ఖరదూషణాదులను ఖండతుండముల సేసె
అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె
ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల
తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన
పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-
కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె
అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె



ItaDE raghurAmuDItaDEkAMgavIruDu
yItaDu chEsina chEta lenniyainA kalavu

kharadUshaNAdulanu khaMDatuMDamula sEse
arudugA vAli nokkayammuna nEse
saravi koMDalachEta samudramu baMdhiMche
iravai vibhIshaNunikichche laMkArAjyamu

kUDapeTTe vAnarula, kuMbhakarNAdidaityula
tODanE rAvaNujaMpe duramu gelche
vEDukatO sItAdEvi kUDenu pushpakamekke
yIDu jODai siMhAsana mEle nayOdhyalOna

puDamiyaMtayu( gAche poMdugA tanaMtalEsi-
koDukula( gAMchenu kuSalavula
yeDayaka SrIvEMkaTESuDai varamulichche
aDari tArakabrahmamai ide velase

Saturday, February 24, 2007

133.IDagupeMDli iddari - ఈడగుపెండ్లి ఇద్దరి


Audio link :G.BalaKrishnaPrasad
Audio link :G.BalaKrishnaPrasad
Archive link :

ప|| ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము | చేడెలాల ఇది చెప్పరుగా ||
చ|| పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కౄష్ణుడు మోహించి |
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||
చ|| ముత్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||
చ|| కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||
in English:
pa|| IDagupeMDli iddari cEsEmu | cEDelAla idi cepparugA ||
ca|| paccikabayaLLa paDati ADaga | muccaTa kRuShNuDu mOhiMci |
veccapu pUdaMDa vEsi vaccenaTa | gaccula nAtani kAnaruga ||
ca|| muttepu muMgiTa mudita naDuvaga | uttamuDE celi vuramunanu |
cittaravu vrAsi celagivacce noka | jottumAni iTu jUparugA ||
ca|| kottacavikelO kommanilicitE | pottuna talabAlu vOsenaTa |
ittala SrIvEMkaTESuDu navvucu | hatti satigUDe nani pADarugA ||

Wednesday, February 21, 2007

130.I pAdamEkadA - ఈ పాదమేకదా



Audio link :G.BalaKrishnaPrasad
Audio link :MBalaMuraliKrishna
Archive link :
ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||

చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |

యీపాదమే కదా యెలమి బొంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||

చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |

యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||

చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |

యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||


in english:
pa|| I pAdamEkadA yila yellagolicinadi | I pAdamE kadA yiMdirA hastamula kitavainadi ||
ca|| I pAdamE kadA yiMdarunu mrokkeDidi | yIpAdamE kadA yI gagana gaMga puTTinadi |
yIpAdamE kadA yelami boMpoMdinadi | yIpAdamE kadA yinniTiki nekkuDainadi ||
ca|| I padamE kadA yiBarAju dalacinadi | yIpadamE kadA yiMdrAdu lella vedakinadi |
yIpAdamE kadA yIbrahma kaDiginadi | yIpAdamE kadA yegasi brahmAMDa maMTinadi ||
ca|| I pAdamE kadA yihaparamu losageDidi | yIpAdamE kadA yila nahalyaku gOrikainadi |
yIpAdamE kadA yIkShiMpa durlaBamu | yIpAdamE kadA yI vEMkaTAdripai niravainadi ||