Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [ఒ_ఓ_అన్నమయ్య]. Show all posts
Showing posts with label [ఒ_ఓ_అన్నమయ్య]. Show all posts

Monday, June 17, 2024

920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము

tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani

archive link 

 ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము

ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥

తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు
పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన ॥ఒక॥

దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు
భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన ॥ఒక॥

సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు
అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన ॥ఒక॥

okaTi suj~naanamu okaTi aj~naanamu
prakaTiMchi vokaTi chaepaTTarO vivaekulu
tanu@M dalachukoMTaenu takkina daehabhOgaalu
panikiraavu avi prakRti gaana
ghanamaina lOkabhOgamulatO lOlu@MDaitae
tanu@M gaanaraadu jeevatatvamu gaana

daivamu ne~ri@Mgitaenu tana kaamyakaryamulu
bhaaviMchi ma~ravavale baMdhaalu gaana
kaaviMchaeTi tana kaamyakarmaala@M gaTTuvaDitae
daivamu lOnu gaa@MDu svataMtru@MDu gaana

sarimOkshamu gOritae svargamu teruvu gaadu
araya svargamu teru vala mOkshaanaku
paraga nalamaelmaMgapati SreevaeMkaTaeSuni
SaraNaagatiye sarvasaadhanamu gaana

Wednesday, September 19, 2007

305.OhO yentaTi vaaDE-ఓహో యెంతటి వాడే



Audio Archive link : G Balakrishnaprasad
ఓహో యెంతటి వాడే వొద్దనున్నవాడే
సాహసపు గుణములచతురుడా యితడు

జలధిలో బవళించి జలనిధి బంధించి
జలనిధి కన్యకను సరిబెండ్లాడి
జలనిధిలో నీది జలనిధి మధియించి
జలధి వెరించిన చలమరాయితడు

ధరణికి బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణి కూతురు దానె తగ బెండ్లాడి
ధరణి పాదము మోపి ధరణి భారము దించి
ధరణీ ధరుడైన దైవమా ఇతడు

కొండ గొడుగుగ నెత్తి కొండ దూటు పడవేసి
కొండకిందగుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటి రాయడై
కొండ వంటి దేవుడైన కోవిదుడా ఇతడు


OhO yentaTi vaaDE voddanunnavaaDE
saahasapu guNamulachaturuDaa yitaDu

jaladhilO bavaLinchi jalanidhi bandhinchi
jalanidhi kanyakanu saribenDlaaDi
jalanidhilO needi jalanidhi madhiyinchi
jaladhi verinchina chalamaraayitaDu

dharaNiki batiyai dharaNi grungina netti
dharaNi kUturu daane taga benDlaaDi
dharaNi paadamu mOpi dharaNi bhaaramu dinchi
dharaNI dharuDaina daivamaa itaDu

konDa goDuguga netti konDa dUTu paDavEsi
konDakindagudurai kUchunDi
konDapai SrI vEnkaTaadri kOnETi raayadai
konDa vanTi dEvuDaina kOviduDaa itaDu

Saturday, April 21, 2007

187.OyammA iMtayEla-ఓయమ్మా ఇంతయేల


Audio link :Srirangamgopalaratnam
Archive link :

book:20, kriti:62
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే

నాయముగాదిందరిలో నగుబాటు తనకును

చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు

ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు

కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు



in english:
OyammA iMtayEla voddanarE
nAyamugAdiMdarilO nagubATu tanakunu

chekkunokkitini selavi navvitini
makkuvatO neMtainA mATADaDu
mokkU mokkitini mOnAna nuMDitini
yekkuDu diTTitinaMTA negguvaTTI nitaDu

ichchakamu jEsiti ichchiti viDemunu
kachchupeTTi yeMtainA karagaDu
muchchaTalADitini mOvijUchiti tannu
bachchigA jEsitinaMTA pagachATI nitaDu

kannulA jokkitini kAgiTA niMchitini
manniMche ratineMtainA mAnaDua
sannala mechchitini chAyala hechchitini
inniTA SrIvEMkaTESu DeMtajANE itaDu

Oyamma Inthaela Oddanare - Srirangam Goplaratnam
Hosted by Surasa.net

Thursday, February 22, 2007

131.O pavanAtmaja - ఓ పవనాత్మజ


Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ప||
ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా
చ1||
ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ||
చ2||
ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా||
చ3||
ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ||



in english:
pa||
O pavanAtmaja O ghanuDA
bApu bApanagA parigitigA

ca1||
O hanumaMtuDa udayAchala ni-
rwAhaka nija sarwa prabalA
dEhamu mOcina teguvaku niTuvale
sAhasa miTuvale chATitigA ||

ca2||
O ravi grahaNa OdanujAMtaka
mArulEka mati malasitigA
dAruNapu vinatA tanayAdulu
gAraviMpa niTu kaligitigA||

ca3||
O daSamukha hara O vEMkaTapati-
pAdasarOruha pAlakuDA
I dEhamutO innilOkamulu
nIdEhamekka nilichitigA ||

Monday, December 25, 2006

108.okkaDE EkAMga viiruDurviki - ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి



ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము

ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము

చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము

జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము

in English:
okkaDE EkAMga viiruDurviki daivamaunaa
yekkaDA hanumaMtuni keduraa lOkamu

muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu
aMdaru daityulachaMpi haripErainaaDu
aMdi rudraviiryamu taanai haruDainaaDu
yeMdunaa hanumaMtuni keduraa lOkamu

chukkalu mOva perigi suuryuDu taanainaaDu
chikku paataaLamu duuri SEshuDainaaDu
gakkana vaayujuDai jagatpraaNuDainaaDu
ekkuva hanumaMtuni keduraa lOkamu

jaladhi puTamegasi chaMdruDu taanainaaDu
malasi mErupupoMta siMhamainaaDu
balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi
ila ii hanumaMtuni keduraa lOkamu

meaning by GB Sankar Rao garu in sujanaranjani
ఆంజనేయుని ప్రతాపానికి ఈ ఇలలో తిరుగులేదు! బ్రహ్మపట్టాన్ని పొందిన ధీరుడితడు!
రాక్షసులను సంహరించి హరి పేరుకు మారుగా నిలిచాడు. శివుని ఆత్మజుడు ఈ హనుమంతుడు! ఆకాశాన్ని ఆక్రమించి సూర్యుణ్ణి అందుకున్నవాడు! పాతాళము చొచ్చి శేషుడైనాడు! వాయురూపంలో జగతికి ప్రాణమైనాడు! ఇన్ని విశిష్టతలు కల ఈ హనుమంతుడు కలియుగంలో బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరునికి దాసుడైనాడు అని అన్నమాచార్యులవారు ఆంజనేయుని శౌర్య పరాక్రమాన్ని తెలియజేస్తున్నాడు.

ఉర్వి = భూమి;
దైత్యులు = రాక్షసులు;
మేరువు పొంత = మేరు పర్వతం దగ్గర;
ఏకాంగ వీరుడు = విష్ణుముర్తి;
మంగాంబుధి = ఒక ఊరు