Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga:Janjhuti. Show all posts
Showing posts with label Raga:Janjhuti. Show all posts

Saturday, April 18, 2020

867. E poddu chuchina dEviDiTAnE yAragiMchu - ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు

Youtube link
Audio archive link: tuned and sung by Sri Sathiraju Venumadhav,  in Raga: Janjhuti


ఉ. నించిన పంచదారలును నేతుఁలు దేనెలు గమ్మ గాఁగఁ దా
లించినకూరలున్‌ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్పఁగ నారగింతు నీ
మించిన వేయుచేతులును మేలములాడుచు వేంకటేశ్వరా!

 
ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు
రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను    ॥పల్లవి॥

మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు
సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు
ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను
బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను    =ఏపొ=

పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు
వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు
బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను
అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను    =ఏపొ=

పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును
వండి యలమేలుమంగ వడ్డించఁగా
అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ
దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను    =ఏపొ=



ae poddu choochina daevu@M DiTaanae yaaragiMchu
roopulatO@M badivaelu ruchulainaTluMDenu    pallavi

maerumaMdaraalavale merayu niDDenalu
sooriyachaMdrulavaMTi chuTTu@MbaLLaelu
aaraniraajaannaalu aMdupai vaDDiMcha@Mgaanu
bOrana chukkalu raasi vOsinaTluMDenu    =aepo=

palu jaladhulavaMTi pai@MDiveMDiginnelu
veli@MgoMDalaMtalaesi vennamuddalu
balasina chilupaalu paMchadaara guppa@Mgaanu
alaru vennelarasa maMdichchinaTluMDenu    =aepo=

paMDina paMTalavaMTi pachchaLLu@M gooralunu
vaMDi yalamaelumaMga vaDDiMcha@Mgaa
aMDanae SreevaeMkaTaeSu@M DaaragiMchee migula@Mga
daMDigaa daasulakellaa daa@MchinaTluMDenu    =aepo=

Thursday, April 15, 2010

687.nIvokkaDavE nAkucAlu nIrajAksha - నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ


నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ
నీవే నాకు గతి అని తెలిసితి నెక్కొని ఇతరము వృథా వృథా
నీనామోచ్ఛరణమే నెరసిన దుఖ నివారణము
నీనామోచ్చరణమే నెలగూ శుభకరము
నా నా వేదశస్త్రములు నవపురాణ ఇతిహాసములు
నీ నామములోనే వున్నవి మిగిలిన వన్నియు వృథా వృథా
నీ పాదమూలము నింగియు భువియు రాసాతలము
నీ పాదమూలము నిఖిల జీవ పరినామములు
దీపించిన చరాచరంబులు దివ్యులు మునులు సర్వమును
ఈ పాదమూలమే మరి మిగిలిన వన్నియు వృథా వృథా
దేవా మీ తిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము
దేవా మీ తిరుమేను ఉత్పత్తిస్థితిలయములకును ఆకరము
శ్రీ వేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ
దేవా నీ శరణమును జొచ్చితి దిక్కులన్నియు వృథా వృథా
nIvokkaDavE nAkucAlu nIrajAksha nArAyaNa
nIvE nAku gati ani telisiti nekkoni itaramu vRdhA vRdhA
nInAmOccaraNamE nerasina dukha nivAraNamu
nInAmOccaraNamE nelagU Subhakaramu
nA nA vEdaSastramulu navapurANa itihAsamulu
nI nAmamulOnE vunnavi migilina vanniyu vRdhA vRdhA
nI pAdamUlamu nimgiyu bhuviyu rAsAtalamu
nI pAdamUlamu nikhila jIva parinAmamulu
dIpimcina carAcarambulu divyulu munulu sarvamunu
I pAdamUlamE mari migilina vanniyu vRdhA vRdhA
dEva mI tirumEnu dikkunu brahmAnDAdhAramu
dEva mI tirumEnu utpattistitilayamulakunu Akaramu
SrI vEmkaTapati nAbhAvamu cittamu nIkE samarpaNa
dEva nI SaraNamunu jocciti dikkulanniyu vRdhA vRdhA

Wednesday, May 27, 2009

618.maMtanAna nADEramma - మంతనాన నాడేరమ్మ



Audio link , composed and sung by TP Chakrapani raga: jhanjhuti
మంతనాన నాడేరమ్మ మధురలో యీసుద్దులు
వింతలాయ వినరమ్మ వీనుల పండుగలు

గక్కన కృష్ణుడు పుట్టె కంసుని మద మడగె
మొక్కిరి దేవతలెల్ల ముదమందుచు
చక్కగా జయంతి నేడు శ్రావణ బహుళాష్టమి
తక్కక దేవకి తల్లి తండ్రి వసుదేవుడు

యమున దాటి యట్టె యశోద యింట బెరిగి
జమళితో బలబద్ర సమేతుడై
సమమై చంద్రోదయము సమకూడె తోడతోడ
రమణ పువ్వులవాన రాసులుగా కురిసె


పనులెల్లా నీడేరే బ్రదికె లోకములెల్లా
నినుపులై ధర్మములు నెలకొనెను
వొనర నలమేల్మంగ నురమున నిడుకొని
ఘన శ్రీవేంకటేశుడై కందువ నిలిచెను


maMtanAna nADEramma madhuralO yIsuddulu
viMtalAya vinaramma vInula paMDugalu

gakkana kRShNuDu puTTe kaMsuni mada maDage
mokkiri dEvatalella mudamaMduchu
chakkagA jayaMti nEDu SrAvaNa bahuLAShTami
takkaka dEVaki talli taMDri vasudEvuDu

yamuna dATi yaTTe yaSOda yiMTa berigi
jamaLitO balabadra samEtuDai
samamai chaMdrOdayamu samakUDe tODatODa
ramaNa puvvulavAna rAsulugA kurise

panulellA nIDErE bradike lOkamulellA
ninupulai dharmamulu nelakonenu
vonara nalamElmaMga nuramuna niDukoni
ghana SrIvEMkaTESuDai kaMduva nilichenu

Saturday, March 14, 2009

596.jUTudanAla vADavu - జూటుఁదనాల వాడవు సుగ్రీవనరసింహా



Archive link :
జూటుఁదనాల వాడవు సుగ్రీవనరసింహా
పాటించి నిన్ను మేము పంగించే వారమా


మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు
జొగితొడ మీదట శ్రీమహాలక్ష్మి
తగు నీకు నిటువంటి తగవులెల్లాఁ జెల్లు
యెగసక్కేలాడామాకు నేలయ్య నిన్నును
కట్టినది పైడికాశ కంబములోన వునికి
నెట్టుకొన్న నవ్వులు నోలోనివే
యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేతలు
అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి

అమరుల కేలికవు అసురులకు వైరివి
రమణ ప్రహ్లాదునకు రక్షకుడవు
కొమరై శ్రీవేంకటాద్రి కొత్తలు నీగుణములు
సముకాన పలుమారు సంతీసించే మికను

jUTu@MdanAla vADavu sugrIvanarasiMhA
pATiMchi ninnu mEmu paMgiMchE vAramA

mogamu siMhapurUpu mogi mai mAnisirUpu
jogitoDa mIdaTa SrImahAlakshmi
tagu nIku niTuvaMTi tagavulellA@M jellu
yegasakkElADAmAku nElayya ninnunu
kaTTinadi paiDikASa kaMbamulOna vuniki
neTTukonna navvulu nOlOnivE
yiTTivallA nIkamaru yennilEvu nIchEtalu
aTTiTTani ninnu mAku naDuganEmiTiki

amarula kElikavu asurulaku vairivi
ramaNa prahlAdunaku rakshakuDavu
komarai SrIvEMkaTAdri kottalu nIguNamulu
samukAna palumAru saMtIsiMchE mikanu
Composer of this kirtana Sri TP Chakrapani

Wednesday, December 10, 2008

553.idiyE vEdAMta miMdukaMTe lEdu - ఇదియే వేదాంత మిందుకంటె లేదు



Audio link : Balakrishnaprasad in Arabhi raga

Explanation

ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము


విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియేపో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనకవారెల్ల
విరతి బొందకున్న వీడదు భవము

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తము వలెనె శ్రీహరి నిలుచును
చిత్త శాంతిలేక చేరదు పరము

యెంతచదివినా యెంత వెదకినా
యింతకంటే మరి యికలేదు
యింతకంటె శ్రీవేంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు

idiyE vEdAMta miMdukaMTe lEdu
idiyE SrIvEMkaTESuni matamu


viratiyE lAbhamu viratiyE saukhyamu
viratiyEpO vij~nAnamu
viratichE ghanulairi venakavArella
virati boMdakunna vIDadu bhavamu

chittamE pApamu chittamE puNyamu
chittamE mOkshasiddhiyunu
chittamu valene SrIhari niluchunu
chitta SAMtilEka chEradu paramu

yeMtachadivinA yeMta vedakinA
yiMtakaMTE mari yikalEdu
yiMtakaMTe SrIvEMkaTESudAsulauTa
yeMtavArikaina yidiyE teruvu

Wednesday, January 02, 2008

381.nArAyaNAya namO namO nAnAtmanE - నారాయణాయ నమో నమో నానాత్మనే


Audio Archive link , Balakrishnaprasad , Malladi Brothers
ప|| నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో |
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో |
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు |
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో |
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో |
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||
చ|| పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో |
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో |
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||


pa|| nArAyaNAya namO namO nAnAtmanE namO namO |
yIracanalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||
ca|| gOviMdAya namO namO gOpAlAya namO namO |
BAvajaguravE namO namO praNavAtmanE namO namO |
dEvESAya namO namO divyaguNAya namO yanucu |
yIvarusalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||
ca|| dAmOdarAya namO namO dharaNISAya namO namO |
SrImahiLApatayE namO SiShTarakShiNE namO namO |
vAmanAya tE namO namO vanajAkShAya namO namO |
yImEralanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||
ca|| paripUrNAya namO namO praNavAgrAya namO namO |
ciraMtana SrI vEMkaTanAyaka SEShaSAyinE namO namO |
narakadhvaMsE namO namO narasiMhAya namO namO |
yiravuga nIgati nevvaru dalacina yihapara maMtramu liMdariki ||