Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [ఊ_అన్నమయ్య]. Show all posts
Showing posts with label [ఊ_అన్నమయ్య]. Show all posts

Monday, March 07, 2022

912. oorakaitE ninnu gAnamu - ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని

ragam : revati (రేవతి) composed & sung by Sri Sattiraju Venumadhav garu

Youtube link



॥పల్లవి॥ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని

పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు ॥చ1॥అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే అసురలు బాధింతు రమరులను పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము ॥చ2॥అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు వెడఁగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే ॥చ3॥నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు పైకొని వారున్నచోటఁ బాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత నీకథలు విని విని నే మీడేరితిమి

pallavioorakaitae ninnu@M gaana mokakaaraNaana@M gaani poorijeevulamu, neevu purushOttamu@MDavu cha1asuralu bhuvi@M buTTuTadi vupakaaramae asuralu baadhiMtu ramarulanu posa@Mga vaariki@Mgaanu poonukavachchi neevu vasudha janiMchitaenu vaDi ninnu@M gaMdumu cha2aDari dharmamu cheDi yadharmamainaa maelu veDa@Mgu munulu vinnaviMturu neeku taDavi dharmamu nilpa dharaNi@M buTTudu neevu baDi ninnu saeviMchi bradukudu mapuDae cha3neekaMTae maaku@M jooDa needaasulae maelu paikoni vaarunnachOTa@M baayakuMduvu chaekoni SreevaeMkaTaeSa cheppa@Mgaanae vaarichaeta neekathalu vini vini nae meeDaeritimi --------taaLlapaaka annamaachaarya aadhyaatma saMkeertana (raagamu: saamaMtaM,raeku: 0138-02,saMpuTamu: 2-161) ragam : revati (raevati) composed & sung by Sri Sattiraju Venumadhav garu

Sunday, November 23, 2008

549.UrakE dorakunA vunnatOnnatasukhamu - ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము


Audio link : MangalampalliBalaMuraliKrishna
Audio link :MangalampalliRajeswari
Archive link :

ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము
సారంబు తెలిసికా జయము చేకొనుట

తలపు లోపలిచింత దాటినప్పుడు కదా
అలరి దైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడుగదా
తలకొన్న మోక్షంబు తనకు జేపడుట

కర్మంబుకసటు వోగడిగినప్పుడుగదా
నిర్మలజ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీ మఱుగుచొచ్చినగదా
కూర్మి తనజన్మ మెక్కుడు కెక్కుడౌట


తనశాంతమాత్మలో తగిలినప్పుడు గదా
పనిగొన్నతనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినగదా దరిచేరిమనుట


UrakE dorakunA vunnatOnnatasukhamu
sAraMbu telisikA jayamu chEkonuTa

talapu lOpalichiMta dATinappuDu kadA
alari daivaMbu pratyakshamauTa
kalushaMpu durmadamu gaDachinappuDugadA
talakonna mOkshaMbu tanaku jEpaDuTa

karmaMbukasaTu vOgaDiginappuDugadA
nirmalaj~nAnaMbu neravEruTa
marmaMbu SrIhari nI ma~ruguchochchinagadA
kUrmi tanajanma mekkuDu kekkuDauTa



tanaSAMtamAtmalO tagilinappuDu gadA
panigonnatanachaduvu phaliyiMchuTa
yenalEni SrIvEMkaTESwaruni dAsyaMbu
tanaku nabbinagadA darichErimanuTa

Saturday, June 23, 2007

241.UrulEni polimEra-ఊరులేని పొలిమేర


Audio link :SattirajuVenumadhav
Audio link :KMuraliKrishna
Archive link :
ఆన్నమయ్య సామెతలు
ప|| ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు |

గారవంబులేని ప్రియము కదియనేటికే ||

చ|| ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల |
యెండలేని నాటి నీడ యేమిసేయనే |
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల |
రెండు నొకటిగాని రచన ప్రియములేటికే ||

చ|| మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు |
మచ్చికలేని చోట మంచిమాట లేటికే |
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము |
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే ||

చ|| బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన |
శంకలేక కదియలేని (చనవు)చదువులేటికే |
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి |
వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే ||

pa|| UrulEni polimEra pEru peMpulEni bratuku |
gAravaMbulEni priyamu kadiyanETikE ||
ca|| uMDarAni virahavEdana vuMDani suratasuKamEla |
yeMDalEni nATi nIDa yEmisEyanE |
daMDigalugu tamakamaneDi daMDalEni tAlimEla |
reMDu nokaTigAni racana priyamulETikE ||
ca|| mecculEni cOTa maMcimElu kaligInEmi selavu |
maccikalEni cOTa maMcimATa lETikE |
peccu peragalEni cOTa priyamugaligi yEmi Palamu |
iccalEninATi sobagulEmi sEyanE ||
ca|| boMkulEni celimigAni poMdulEla manasulOna |
SaMkalEka kadiyalEni (chanavu)chaduvulETikE |
koMku gosarulEni maMcikUTamalara niTlugUDi |
vEMkaTAdri viBuDu lEni vEDukETikE ||