Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Raga:Kedaram. Show all posts
Showing posts with label Raga:Kedaram. Show all posts

Monday, January 07, 2008

385.parusamu sOkaka pasiDaunA - పరుసము సోకక పసిడౌనా

Audio link: Malladi Brothers, Raga Kedaram
ప|| పరుసము సోకక పసిడౌనా | పురుషోత్తముడే బుద్ధిచ్చు గాక ||
చ|| భువి భోగములకు పుట్టిన దేహము | వివరపు మోక్షము వెదకీనా |
ఇవల సకలమును యేలేటి దేవుడు | తవిలి రక్షించుట ధర్మము గాక ||
చ| ఘనమగు సంసార కారణ జీవుడు | తన సుజ़్జానము తలచీనా |
వెనుక మునుప శ్రీ వేంకట పతియే | కనుగొని మమ్మిట గాచుట గాక ||


pa|| parusamu sOkaka pasiDaunA | puruShOttamuDE buddhiccu gAka ||
ca|| Buvi BOgamulaku puTTina dEhamu | vivarapu mOkShamu vedakInA |
ivala sakalamunu yElETi dEvuDu | tavili rakShiMcuTa dharmamu gAka ||
ca| Ganamagu saMsAra kAraNa jIvuDu | tana suj~jAnamu talacInA |
venuka munupa SrI vEMkaTa patiyE | kanugoni mammiTa gAcuTa gAka ||

Monday, October 30, 2006

52.ITu Garuduni NiVekkinanu - ఇటు గరుడని నీ వెక్కినను


composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam

Audio link : BalaKrishnaPrasad
Archive link
ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె

ఎగసినగరుడని యేపున'ధా'యని జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు గగనము జగములు గడగడ వడకె

బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె

పల్లించిననీపసిడిగరుడనిని కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వేంకటరమణ


iTu garuDani nee vekkinanu paTapaTa dikkulu baggana bagile

egasinagaruDani yaepuna'dhaa'yani jigidolakachabuku chaesinanu

nigamaaMtaMbulu nigamasaMghamulu gaganamu jagamulu gaDagaDa vaDake


birusuga garuDani paeremu dOluchu berasi neevu gOpiMchinanu

sarusa nikhilamulu jarjaritamulai tiruvuna nalugaDa diradira dirige

palliMchinaneepasiDigaruDanini kelluna neevekkinayapuDu

jhallane raakshasasamiti nee mahima velli munuguduru vaeMkaTaramaNa