Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [ల_అన్నమయ్య]. Show all posts
Showing posts with label [ల_అన్నమయ్య]. Show all posts

Saturday, August 29, 2009

638.lEnibhramaluDigi lEvayyA - లేనిభ్రమలుడిగి లేవయ్యా



Audio link : Sri Mangalampalli BAlamuralikrishna
లేనిభ్రమలుడిగి లేవయ్యా
లేనగుమోముతో లేవయ్యా

చెంచెత కౌగిట జెలగి వేడుక పవ
ళించిననాథుండ లేవయ్యా
పించెపుం బయ్యెదఁ బెనగి రతినిఁ జా
లించి యింతటను లేవయ్యా

చక్కని శ్రీసతి చనుగవ సన్నపు
లెక్కలు వ్రాయక లేవయ్యా
పెక్కగు నమృతము పెదవికోమలికి
లిక్కిగఁ జేసితి లేవయ్యా

ఏకాంతంలో నిన్నెనసి తలచి రని
లేకలు వచ్చెను లేవయ్యా
శ్రీకాంతుడవగు శ్రీవేంకటనా
ళీకదళాక్షుడ లేవయ్యా


lEnibhramaluDigi lEvayyA
lEnagumOmutO lEvayyA

cheMcheta kaugiTa jelagi vEDuka pava
LiMchinanAthuMDa lEvayyA
piMchepuM bayyeda@M benagi ratini@M jA
liMchi yiMtaTanu lEvayyA

chakkani SrIsati chanugava sannapu
lekkalu vrAyaka lEvayyA
pekkagu namRtamu pedavikOmaliki
likkiga@M jEsiti lEvayyA

EkAMtaMlO ninnenasi talachi rani
lEkalu vachchenu lEvayyA
SrIkAMtuDavagu SrIvEMkaTanA
LIkadaLAkshuDa lEvayyA

Get this widget | Track details | eSnips Social DNA

Sunday, March 16, 2008

432.lakshmI kaLyANamu - లక్ష్మీ కళ్యాణము

Audio Archive link :Vedavyasa Ananda Bhattar
లక్ష్మీ కళ్యాణము లీలతో బాడే మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనము నీవును

చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్ను గుబ్బలివి బూజగుండలు
తీపుల మోవితేనెలు తీరని మధు పర్కము
దాపుగ బెండ్లి యాడరయ్య తగుదగు మీకును

మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు
మేటితలబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీతున పెండ్లాడరయ్య నెరవేరె మీకును

కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాగిన కోరికలే పావకోళ్ళు
ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీగక పెండ్లాడడయ్య వేడుకాయమీకును


lakshmI kaLyANamu lIlatO bADE midE nEmu
lakshmI nArAyaNulE lalanamu nIvunu

chUpulu chUpulu mIku sUsakamu bAsikamu
vUpachannu gubbalivi bUjaguMDalu
tIpula mOvitEnelu tIrani madhu parkamu
dApuga beMDli yADarayya tagudagu mIkunu

mATalu mI kiddariki madana maMtramulu
mETitalabAlu mIlO miMchu navvulu
gATamaina pulakalu kappuravasaMtAlu
nItuna peMDlADarayya neravEre mIkunu

kaugili kaugili mIku kaMduva peMDli chavike
pAgina kOrikalE pAvakOLLu
Agina SrIvEMkaTESa alamElumaMgA nIvu
vIgaka peMDlADaDayya vEDukAyamIkunu

Saturday, January 19, 2008

395.lalitalAvaNya vilAsamutODa - లలితలావణ్య విలాసముతోడ

Audio link (tuned and sung by Chakrapani)
లలితలావణ్య విలాసముతోడ
నెలత ధన్యత గలిగె నేటితోడ

కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పదోగేటి (గెడి?) చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చను(గవతోడ
దప్పిదేరేటి (రెడి?) మోము)దమ్మితోడ

కులుకు (గబరీభరము కుంతలంబులతోడ
తొల(గ( దోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలకు ముద్దుజూపుల తోడ
పులకలు పొడవైన పొలుపుతోడ

తిరువేంకటాచధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొల (లం?) కెడి చిన్నిసిగ్గుతోడ



lalitalAvaNya vilAsamutODa
nelata dhanyata galige nETitODa

kuppalugA mainasalukonna kastUritODa
toppadOgETi (geDi?) chemaTatODa
appuDaTu SaSirEkhalaina chanu(gavatODa
dappidErETi (reDi?) mOmu)dammitODa

kuluku (gabarIbharamu kuMtalaMbulatODa
tola(ga( dOyani prEmatODa
molakanavvulu dolaku muddujUpula tODa
pulakalu poDavaina poluputODa

tiruvEMkaTAchadhipuni mannanatODa
sarilEni divyavAsanalatODa
parikiMcharAni araviribhAvamutODa
siri dola (laM?) keDi chinnisiggutODa

Wednesday, February 07, 2007

121.leMDO leMDOmATaliMcarO - లెండో లెండోమాటలించర


Audio link :G.BalaKrishnaPrasad
Audio link :Shobharaju
Archive link :
ప|| లెండో లెండోమాటలించరో | కొండలరాయనె పేర్కొన్నదిదె జాలి ||
చ|| మితిమీరె జీకట్లు మేటి తలవరు లాల | జతనము జతనము జాలో జాలి |
యితవరులాల వాయించే వాద్యాలకంటె- | నతి ఘోషముల తోడ ననరోజాలి ||
చ|| గాములు వారెడి పొద్దు కావాలి కాండ్లాల | జాము జాము దిరుగరో జాలో జాలి |
దీమసపు పరితార దివ పంజాలు చేబట్టి | యేమరక మీలోమీరు యియ్యరో జాలి ||
చ|| కారు కమ్మె నడురేయి గడచె గట్టిక వార | సారె సారె బలుకరో జాలో జాలి |
యీరీతి శ్రీవేంకటేశుడిట్టె మేలుకొన్నాడు | గారవాననిక మానగదరో జాలి ||
in english :
pa|| leMDO leMDOmATaliMcarO | koMDalarAyane pErkonnadide jAli ||
ca|| mitimIre jIkaTlu mETi talavaru lAla | jatanamu jatanamu jAlO jAli |
yitavarulAla vAyiMcE vAdyAlakaMTe- | nati GOShamula tODa nanarOjAli ||
ca|| gAmulu vAreDi poddu kAvAli kAMDlAla | jAmu jAmu dirugarO jAlO jAli |
dImasapu paritAra diva paMjAlu cEbaTTi | yEmaraka mIlOmIru yiyyarO jAli ||
ca|| kAru kamme naDurEyi gaDace gaTTika vAra | sAre sAre balukarO jAlO jAli |
yIrIti SrIvEMkaTESuDiTTe mElukonnADu | gAravAnanika mAnagadarO jAli ||

Monday, October 09, 2006

27.Lalanuchu nucheru - లాలనుచు నూచేరు



Archive Page
Youtube link : Priya sisters
కృష్ణయ్య కు లాలి పాడుతున్న గోపికలను, అన్నమయ్య ఈ కీర్తనలో ఎంత చక్కగా వర్ణిస్తున్నడో చూదండి

లాలనుచు నూచేరు లలనలిరుగడల - బాలగండవీర గోపాలబాల..
ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ -పదరి కంకణరవము బహుగతులమ్రోగ

వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ -ముదురు చెమటల నళికములు తొప్పదోగ
..
సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక - మలయ రవళులకు బహుమాఱును బెళంక

కొలది కోవిగములు క్రోలుమదనాంక -ములగ్రేణిసేయ రవములు వడిదలంక
..
సరుస పదములు జంగ చాపుచేబాయ - గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ

కరమూలములు కాంతి కడుజాయజేయు - సరస నురుకుసుమ వాసనలెదురుడాయ
..
కొలది నునుమేనుల కూనలసి యాడ -మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ

తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ -అలరి యెల్లరు మోహనాకృతులు చూడ
..
లలిత తాంబూల రసకలితంబులైన -తళుకు దంతములు కెంపుల గుంపులీన

మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన - చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన
..
మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ

పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ
..
లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప

తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప

..to listen :

another version : P.Suseela in album Krishnam vande jagadgurum


laalanuchu noochaeru lalanalirugaDala - baalagaMDaveera gOpaalabaala
..
uduTa gubbala sarasamu luyyaala looga -padari kaMkaNaravamu bahugatulamrOga
vodigi cheMpala koppu lokkiMta veega -muduru chemaTala naLikamulu toppadOga
..
solapu teligannugava choopuliruvaMka - malaya ravaLulaku bahumaa~runu beLaMka
koladi kOvigamulu krOlumadanaaMka -mulagraeNisaeya ravamulu vaDidalaMka
..
sarusa padamulu jaMga chaapuchaebaaya - guruleela meegaLLa guchcheLLaraaya
karamoolamulu kaaMti kaDujaayajaeyu - sarasa nurukusuma vaasanaleduruDaaya
..
koladi nunumaenula koonalasi yaaDa -melakuvatOnokarokari mechchi sariyaaDa
talaloochi chokki chittaru bommalaaDa -alari yellaru mOhanaakRtulu chooDa
..
lalita taaMboola rasakalitaMbulaina -taLuku daMtamulu keMpula guMpuleena
molaka vennela Daalu musuru konitOna - chelagi selavula muddu chirunavvulaana
..
malaya maaruta gatulu maaTiki jelaMga -paluku gapurapu taavi paipai melaMga
palugaanalahari yiMpula raalgaraMgaa - balasi vinuvaari chevi baDalika dolaMga
..
lalanaa janaapaaMga lalita sumachaapa -jalajalOchana daeva sadguNa kalaapa
talapu lOpala melagu tatvapradeepa -bhaLira gaMDaparaeSa paramaatmaroopa
కృష్ణయ్య కు గోపికలు లాలి పాడుతున్న సన్నివేశన్ని అన్నమయ్య ఈ కీర్తనలో కళ్ళకు కట్టినట్టుగా ఎంత చక్కగా వర్ణిస్తున్నడో చూడండి
vivarana - Nallani chakravartula Krishnamacharyulu

ఓ బాలవరగండ గోపాల ! స్త్రీలు రెండు వైపుల నుంచి లాలి లాలి యనుచు నిన్ను ఊచుచున్నరు।
c1.
అప్పుడు వారు ధరించిన హారములు చనులపై అసియాడుచున్నవి। చేతులకు ధరించిన కంకణములు వివిధ గతులతో మ్రోగుచున్నవి। కొప్పులు వదులై చెంపలపై జారి పడుచున్నవి।నుదుట చెమటగారుచున్నది।
c2,3,4
చుట్టుప్రక్కల మ్రోగే ధ్వనుల చేత బెదురు చూపులగుచున్నవి।అంగలు వేయుచు పాటపాడుటలో చీర కుచ్చిళ్ళు రాచుకుంటున్నయి।ఊచుటలో వారి చేతి కాంతులు ప్రసరిస్తు న్నాయి।కొప్పులలో దాల్చిన మరువపు వాసనలు దిక్కులలో వ్యాపిస్తున్నాయి।మెత్తని వారి దేహలతలు అసియాడుచున్నవి। ఒకరినొకరు మెచ్చుకొనుచు సరిగా కలసి ఊపుచున్నరు। ఊపే ఊయెలకు కట్టిన బొమ్మలు తలలూచి ఎగురుచున్నవి। అందరు నీ మోహనాకృతిని చూచుచు ఊపుచున్నారు।

c4(lalita tambularasa kalitambulaina, talukudamtamulu kempula gumpuleena...)
వారు వేసుకొనిన తాంబూలము చేత దంతములు ఎర్రబారి ఉన్నవి।లోపలి ఆనందముతో పైకి వచ్చే వారి వారి చిరునవ్వులు చిరు వెన్నెలలను చిమ్ముచున్నవి।
c5.
మలయమారుతము వీచుచున్నది।కర్పూరపు పరిమళము చిమ్ముచున్నది। వారు పాడె పాటలకు రాళ్ళు కరుగుచున్నవి। వినే వారి చెవి బాధలు పోవుచున్నవి।
c6.
చివరి చరణమతయు కృష్ణుని పిలుచుటయే।

Monday, September 25, 2006

3.Lali sri krishnayya - లాలి శ్రీ కృష్ణయ్య


Archive page
Audio link : Vedavathi Prabhakar
లాలి శ్రీ కృష్ణయ్య, నీల మేఘ వర్ణా
బాల గోపాల నీవు, పవ్వళింపరా
...
శృంగారించిన మంచి, బంగారు ఊయలలో

శంఖు చక్ర ధర స్వామి, నిదుర పోరా
...
లలితాంగి రుక్మిణి, లలనయె కవలెనా

పలుకు కోయిల, సత్య భామె కవలెనా
....
ఎవ్వరు కావలెనయ్య, ఇందరిలో నీకు

నవమోహనంగనా, చిన్ని కృష్ణయ్య
....
అలుకలు పోవేల, అలమేలు మంగతొ

కులుకుతు శయనించు,వేంకటెశ్వరుడా

laali Sree kRshNayya, neela maegha varNaa
baala gOpaala neevu, pavvaLiMparaa
...
SRMgaariMchina maMchi, baMgaaru ooyalalO
SaMkhu chakra dhara svaami, nidura pOraa
...
lalitaaMgi rukmiNi, lalanaye kavalenaa
paluku kOyila, satya bhaame kavalenaa
....
evvaru kaavalenayya, iMdarilO neeku
navamOhanaMganaa, chinni kRshNayya
....
alukalu pOvaela, alamaelu maMgato
kulukutu SayaniMchu,vaeMkaTeSvaruDaa
....
Vedavathi Prabhakar : 
listen to this song
:by Smt.Vedavathi prabhakar: