Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label [అ_ఆ_అన్నమయ్య]. Show all posts
Showing posts with label [అ_ఆ_అన్నమయ్య]. Show all posts

Friday, January 01, 2021

900. arimuri judabOtE - అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను

Audio link : sung by Sri Sathiraju Venumadhav, in Dharmavati ragam
అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను
మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా

నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక-
అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య
పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము
మన్నించవయ్య వో మధుసూదనా    

సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య
అంకెల నీసన్నిధినే అదిగోవయ్య
అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా-
సంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా

పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు
ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య
యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను
నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా  
 

a~rimu~ri@M jooDa@MbOtae naj~naani naenu
ma~ra@Mgu chochchiti meeku mahilO naaraayaNaa

ninnu dhyaanamu saeseeni nichchanichcha@M daaLlapaaka-
annamayya@Mgaa reduTa nadigOvayya
panni yaataninae choochi paatakulamaina mammu
manniMchavayya vO madhusoodanaa   

saMkeertanalu saesee saare@M daaLlapaakannayya
aMkela neesannidhinae adigOvayya
aMkiMchi nae vaarivaa@MDanani dushTuDanainaa naa-
saMke deera@M gaavavayya sarvaeSvaraa

paadaalaM dunnaa@MDu daaLlapaakannamayya meeku
aadaraana muktu@MDai adigOvayya
yeedesa SreevaeMkaTaeSa yeesammaMdhaananae nannu
needayapeTTi rakshiMchu nemmadi bhooramaNaa  
 


Sunday, April 26, 2020

871. aadimunula siddhaaMjanamu - ఆదిమునుల సిద్ధాంజనము

FB Video link : Priya Sisters
ఆదిమునుల సిద్ధాంజనము
యే దెసఁ జూచిన నిదివో వీఁడే    =పల్లవి=

నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే    =ఆది=

కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే    =ఆది=

పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే    =ఆది=


aadimunula siddhaaMjanamu
yae desa@M joochina nidivO vee@MDae    =pallavi=

nagina selavi@M baDu naalugujagamulu
mogamuna@M joopae mOhanamu
nigiDi yaSOdaku nidhaanaMbai
pogaDoMdee gRhamuna nide vee@MDae    =aadi=

kanuderachina nalugaDa namRtamu laTu
anuvuna@M gurasee napaaramu
vanitalu naMdavrajamuna@M jela@Mga@Mga
manikiki niravai malasee vee@MDae    =aadi=

paramunakunu@M daa@M baramai velasina-
paripoorNa paraatparu@MDu
sarusa rukmiNiki satyabhaamakunu
varu@MDagu vaeMkaTavaradu@MDu vee@MDae    =aadi=

Wednesday, January 10, 2018

845. ApadbaMdhuDu hari maaku galaDu - ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు

Youtube link : SP Sailaja
ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
దూపలి తలఁచినా దోషహరము ॥పల్లవి॥

గరుడనినెక్కినఘనరేవంతుఁడు

గరుడ కేతనముగలరథుఁడు
గరుడఁడే తనకును గరియగుబాణము
గరిమె నీతఁడేపో ఘనగారుడము ॥ఆప॥

పాముపరపుపై బండినసిద్ధుడు

పాముపాశముల పరిహరము
పామున నమృతముఁ పడఁదచ్చినతఁడు
వేమరు నీతఁడే విషహరము ॥ఆప॥

కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును

కమలాదేవికిఁ గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితఁడే
మమతల మాకిదే మంత్రౌషధము ॥ఆప॥

aapadbaMdhu@MDu hari maaku@M gala@MDu
doopali tala@Mchinaa dOshaharamu pallavi

garuDaninekkinaghanaraevaMtu@MDu

garuDa kaetanamugalarathu@MDu
garuDa@MDae tanakunu gariyagubaaNamu
garime neeta@MDaepO ghanagaaruDamu aapa

paamuparapupai baMDinasiddhuDu

paamupaaSamula pariharamu
paamuna namRtamu@M paDa@Mdachchinata@MDu
vaemaru neeta@MDae vishaharamu aapa

kamalaakshu@M Deeta@MDu kamalanaabhu@MDunu

kamalaadaeviki@M gaivaSamu
amarina SreevaeMkaTaadhipu Dita@MDae
mamatala maakidae maMtraushadhamu aapa

Saturday, June 16, 2007

235.AdimapUruShu Dachyutu-ఆదిమపూరుషు డచ్యుతు


ప|| ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు | ఆదిదేవు డీతడేపో హరి వేంకటవిభుడు ||
చ|| ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో | బైకొనియుండ నొకవటపత్రములోపలను |
చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన- | శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు ||
చ|| అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము | సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి |
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నగలించిన | పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు ||
చ|| క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా | ధారుణియును సిరియును బాదము లొత్తగును |
చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి | నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు ||
pa|| AdimapUruShu Dacyutu Dacalu DanaMtu DamaluDu | AdEvu DItaDEpO hari vEMkaTaviBuDu ||
ca|| EkArNavamai udakamulEcina brahmAMDamulO | baikoniyuMDa nokavaTapatramulOpalanu |
cEkoni pavaLiMpucu nokaSiSuvai vaDi dElADina- | SrIkAMtu DItaDEpO SrIvEMkaTaviBuDu ||
ca|| aruduga balimada maDapaga nAkasamaMTina rUpamu | saraguna BUmiyaMtayu nokacaraNaMbuna golici |
paraginapAdAMguTamuna brahmAMDamu nagaliMcina | paramAtmu DItaDEpO pativEMkaTaviBuDu ||
ca|| kShIrapayOnidhilOpala SEShuDu paryaMkamugA | dhAruNiyunu siriyunu bAdamu lottagunu |
cEruva danu brahmAdulu sEviMpaga jeluvoMdeDi | nArAyaNuDitaDE vunnatavEMkaTaviBuDu ||

Tuesday, June 05, 2007

225.AtaDE brahmaNyadaivamu-ఆతడే బ్రహ్మణ్యదైవము


Audio link :GBKP
Archive link :

ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము

ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు

అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము

నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
in english:
AtaDE brahmaNyadaivamu Adi mUlamaina vADu
Atani mAnuTalella avithipUrvakamu

evvani pEra piluturu ila puTTina jIvula
navvuchu mAsa nakshatra nAmamula
avvala evvani kESavAdi nAmamulE
ravvagA AchamanAlu rachiyiMturu

achcha mEdEvuni nArAyaNa nAmamE gati
chachchETi vAriki sanyAsamu vAriki
ichcha nevvari talachi yitturu pitALLAku
muchchaTa nevvani nAmamulanE saMkalpamu

nAradudu talachETinAma madi yevvanidi
gaurinuDigETinAmakatha yEDadi
tArakamai brahmarudratati kevvari nAmaku
yIrIti SrIvEMkaTAdri nevvaDichchI varamu

Sunday, June 03, 2007

223.ADarO pADarO-ఆడరో పాడరో


Audio link :GBKP
Archive link :

ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేడు

కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడాధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిగల దేవతలు

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలచే
చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు

బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి
అడరిన తలబాలందె నదె
నడచి పరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరో ముయిగా నరులు

in english:
ADarO pADarO apsarOgaNamu
vIDemu liMdarO vibhavamu nEDu

kamalAramaNuni kaLyANamunaku
taminade garuDAdhwaja mesage
temaluchu mrOsenu divyaduMdubhulu
gamaniMcharO divigala dEvatalu

velayaga lakshmIvibhuni peMDlikini
balasi aMkurArpaNa madivO
kalagona nichchEru gaMdhAkshatalachE
chelagi kaikonarO SrIvaishNavulu

baDi SrI vEMkaTapatiki SrIsatiki
aDarina talabAlaMde nade
naDachi parushalu nAnA mukhamula
muDupulu chaduvarO muyigA narulu


222.ataDE parabraHmaM-అతడే పరబ్రహ్మం


Audio link :DPasupathi
Audio link :Pasupathi
Archive link :
అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా

కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా?
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమర వంద్యుడు మాహరికే కాక

అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన శ్రీభాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికే(కి) గాక

నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక

in english:
ataDE parabraHmaM ataDE lOkanAyakuDu
atanikaMTE mari adhikulu lErayyA

kamalavAsini lakshmi kaladA yevvarikainA?
kamalanAbhuniki okkanikE kAka
kamalajuDaina brahma kalaDA yevvani nAbhin
amara vaMdyuDu mAharikE kAka

aMdarunuMDedi bhUmi anyulaku kaladA
aMdapu gOviMdunikE AlAyagAka
cheMdina SrIbhAgIrathi SrIpAdAla galadA
maMdharadharuDaina mAdhavunikE(ki) gAka

nichchalu abhayamichchE nErupu yeMdugaladA
achcugA nArAyaNuniyaMdE gAka
rachchala SaraNAgatarakshaNameMdu galadA
tachchina SrIvEMkaTAdri daivAnikEgAka

Saturday, May 05, 2007

203.aNurEnu paripUrNamaina-అణురేణు పరిపూర్ణమైన


Audio link :Priya Sisters
Archive link :

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

in english:
aNurENu paripUrNamaina rUpamu
aNimAdisiri aMjanAdrimIdi rUpamu

vEdAMtavEttalella vedakETirUpamu
AdinaMtyamu lEni yArUpamu
pAduga yOgIMdrulu bhAviMchurUpamu
yIdesa nidivO kOnETidari rUpamu

pAlajalanidhilOna (bavaLiMchErUpamu
kAlapu sUryachaMdrAgnigala rUpamu
mElimi vaikuMThAna merasina rUpamu
kIlainadide SEshagirimIdirUpamu

muMchinabrahmAdulaku mUlamainarUpamu
koMchani ma~r~rAkumIdi konarUpamu
maMchi parabrahmamai mammunElina rUpamu
yeMchaga SrIvEMkaTAdri nide rUpamu

Monday, April 23, 2007

193.anAdi jagamulu-అనాది జగములు


Audio link :TPChakrapani
Archive link :
:పెదతిరుమలాచార్య కీర్తన:
book:15 kriti:107

అనాది జగములు అనాది దేవుడు

వినోదములు గని విసుకదు మాయ
పుట్టేటి జీవులు పోయిన జీవులు
(పు)వొట్టిన జీవులు ఉన్నారు
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
తెట్టా( దెరువుననె తేగడు కాలము
కలడు బ్రహ్మయును కలరింద్రాదులు
కలవనేకములు కార్యములు
ఫలభోగంబులు పైపైనున్నవి
కలియు( గర్మము (గడవగ లేదూ
శ్రీవేంకటేశుడు చిత్తములో వేడె
భావము లోపల భక్తి యిదే
భావించి బ్రతుకుట ప్రపన్నులు వీరిదె
యేవల జూచిన యిహమే పరము

in english:
anAdi jagamulu anAdi dEvuDu
vinOdamulu gani visukadu mAya

puTTETi jIvulu pOyina jIvulu
(pu)voTTina jIvulu unnAru
chuTTEru dinamulu sUryachaMdrAdulu
teTTA( deruvunane tEgaDu kAlamu

kalaDu brahmayunu kalariMdrAdulu
kalavanEkamulu kAryamulu
phalabhOgaMbulu paipainunnavi
kaliyu( garmamu (gaDavaga lEdU

SrIvEMkaTESuDu chittamulO vEDe
bhAvamu lOpala bhakti yidE
bhAviMchi bratukuTa prapannulu vIride
yEvala jUchina yihamE paramu

Sunday, April 22, 2007

189.alukalu chellavu-అలుకలు చెల్లవు


Audio link :GBKP
Archive link :
ప|| అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ | నలి నిందిర నీతో నవ్వినది ||
చ|| ఆదిలక్ష్మి మోహన కమలంబున | వేద మాత నిన్ను వేసినది |
ఆదెస నీపై నభయహస్తమును | సాదరముగ గడు జూచినది ||
చ|| సిరి దన కన్నుల చింతామణులను | పొరి నీపై దిగ బోసినది |
వరద హస్తమున వలచెయి పట్టుక | అరుదుగ నిను మాటాడించినది ||
చ|| జలధి కన్య తన సర్వాంగంబుల | బిలిచి నిన్ను నిటు పెనగినది |
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి- | నెలమి నీ వురంబెక్కినది ||

in english:
pa|| alukalu cellavu hari puruShOttama | nali niMdira nItO navvinadi ||
ca|| AdilakShmi mOhana kamalaMbuna | vEda mAta ninnu vEsinadi |
Adesa nIpai naBayahastamunu | sAdaramuga gaDu jUcinadi ||
ca|| siri dana kannula ciMtAmaNulanu | pori nIpai diga bOsinadi |
varada hastamuna valaceyi paTTuka | aruduga ninu mATADiMcinadi ||
ca|| jaladhi kanya tana sarvAMgaMbula | bilici ninnu niTu penaginadi |
alamuka SrI vEMkaTAdhipa ninu rati- | nelami nI vuraMbekkinadi ||

Wednesday, April 18, 2007

185.ahO namO namO-అహో నమో నమో


Audio link :Vanijayaram
Archive link :
ప|| ఆహా నమో నమో ఆదిపురుష నీకు | ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి ||
చ|| లోకాలోకములు లోన నించుకొన్న నీవు | ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి |
ఆకడ వేదములకు నగోచరమైన నీవు | వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి ||
చ|| అన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవు | అన్న పానాదు లివి యెట్టారగించితివి |
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు | వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి ||
చ|| దేవతలచే పూజ తివిరి గొనిన నీవు | ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి |
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు | ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి ||

in english:
pa|| AhA namO namO AdipuruSha nIku | Ihala neMtavADanu eTTugAcitivi ||
ca|| lOkAlOkamulu lOna niMcukonna nIvu | IkaDa nA yAtmalOna neTTaNagitivi |
AkaDa vEdamulaku nagOcaramaina nIvu | vAkkucE nI nAmamula vaDi neTTaNagitivi ||
ca|| anniTA brahmAdula yaj~ja BOktavaina nIvu | anna pAnAdu livi yeTTAragiMcitivi |
sannuti pUrNuDavai janiyiMcina nIvu | vunnati nA puTTugalO vokacO neTTuMTivi ||
ca|| dEvatalacE pUja tiviri gonina nIvu | Ivala nAcE pUja eTTugoMTivi |
SrI vEMkaTAdri mIda siritO gUDina nIvu | I vIdhi mA yiMTa ipuDeTTu nilicitivi ||

Thursday, March 22, 2007

159.AdidEva paramAtmA- ఆదిదేవ పరమాత్మా



Audio link :NedunuriKrishnamurthy
Archive link :
ragam : sindhubhairavi, composer : Nedunuri Krishnamurty
ప|| ఆదిదేవ పరమాత్మా | వేదవేదాంతవేద్య నమో నమో ||
చ|| పరాత్పరా భక్తభవభంజనా | చరాచరలోకజనక నమో నమో ||
చ|| గదాధరా వేంకటగిరినిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||

in english:
pa|| AdidEva paramAtmA | vEdavEdAMtavEdya namO namO ||
ca|| parAtparA BaktaBavaBaMjanA | carAcaralOkajanaka namO namO ||
ca|| gadAdharA vEMkaTagirinilayA | sadAnaMda prasanna namO namO ||

Adideva Paramatma, on Veena by E.Gayatri:









by Hyderbad Brothers:





by small kids, watch this video after 5:30min

Friday, March 16, 2007

154.AdivishNu vItaDE-ఆదివిష్ణు వీతడే


Audio link :PriyaSisters
Archive link :
ఆదివిష్ణు వీతడే యటరమ్మ
ఆదిగొని భూభార మణచీనోయమ్మా

చందురునుదయవేళా సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డగనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుటింటివాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా

వసుదేవుని యెదుట వైకుంఠనాథుడు
సిసువై యవతరించీ చెలగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాడభయమిచ్చీనమ్మా

కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూక లణచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాల(బరగీనమ్మా


in english:
AdivishNu vItaDE yaTaramma
Adigoni bhUbhAra maNachInOyammA

chaMdurunudayavELA savarEtirikADa
kaMduva dEvaki biDDaganenammA
poMduga brahmAdulu puruTiMTivAkiTanu
cheMdi bAluni nutulu sEsErOyammA

vasudEVuni yeduTa vaikuMThanAthuDu
sisuvai yavatariMchI chelagI nammA
musimusinavvulatO munulaku Rshulaku
yisumaMtavADabhayamichchInammA

kannatallidaMDrulaku karmapASamu lUDichi
anniTA rAkAsimUka laNachInammA
vunnati SrIvEMkaTAdrinuMDi lakshmIdEvitODa
panni nichchakalyANAla(baragInammA

Tuesday, March 13, 2007

148.anarAdu vinarAdu Atani-అనరాదు వినరాదు ఆతన


Audio link : SrirangamGopalaratnam
Archive link :
ragam : arabhi
ప|| అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు |
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు ||

చ||
ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని |
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి |

యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి |
చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా ||

చ||
తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె |
తీటకుగాక బాలులు తెగి వాపోగా |

పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను |
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా ||

చ||
కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి |
వాకొలిపి బాలులెల్ల వాపోగా |

ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు |
జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము ||


in english :

pa|| anarAdu vinarAdu Atani mAyalu nEDu | dinadina krottalAya driShTamidE mAku ||


ca|| ADeDi bAlula hari aMgali cUpumani | tODanE vAMDla nOra dummulu calli |
yIDamAtO ceppagAnu yiMdaramu gUDipOyi | cUDapOtE paMcadArai cOdyamAyanammA ||


ca|| tITa tIgelu sommaMTU dEhamu niMDa gaTTe | tITakugAka bAlulu tegi vApOgA |

pATiMci yIsuddivini pAriteMci cUcitEnu | kOTikOTi sommulAya kottalOyammA ||


ca|| kAki junnu junnulaMTA gaMpeDEsi tinipiMci | vAkolipi bAlulella vApOgA |
AkaDa SrIvEMkaTESuDA bAlula kaMTi nIru | jOkaga mutyAlusEse jUDagAnE nEmu ||

Friday, January 12, 2007

114.ammamma Emamma alamElmaMga -అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ


ప అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

చ: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ


చ: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

చ: చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ
In English:
pa ammamma Emamma alamElmaMga nAMcAramma tammiyiMTa nalarukomma Oyamma

ca nIrilOna tallaDiMcE nIkE talavaMcI nIrikiMda pulakiMcI nIramaNuMDu
gOrikona cemariMcI kOpamE pacariMcI sAreku nIyaluka iTTe cAliMcavamma

ca nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI mEkoni nIvirahAna mEnu veMcIni
IkaDAkaDi satula hRudayamE perarEcI Aku maDiciyyanaina AnatiyyavammA

ca cakkadanamule peMcI sakalamu gAladaMci nikkapu vEMkaTESuDu nIkE poMcIni
makkuvatO alamElmaMga nAMcAramma akkuna nAtani niTTE alariMcavamma

Priya Sisters

Sunday, December 31, 2006

112.aMganalIrE hAratulu - అంగనలీరే హారతులు


ప అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు

చ శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు

చ సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు

చ నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు

in English :

pa aMganalIrE hAratulu aMgajagurunaku nAratulu
ca SrIdEvi tODuta jelagucu navvE Adima puruShuni kAratulu
mEdinI ramaNi mElamu lADETi Aditya tEjuna kAratulu
ca suralaku namRutamu soradi nosaMgina hari kivO pasiDAratulu
taramidi duShTula danujula naDacina ari BayaMkaruna kAratulu
ca niccalu kalyANa nidhiyai yEgETi acyutunaku nive yAratulu
cocci SrI vEMkaTESuDu nalamElmaMga yaccuga niliciri yAratulu


Meaning by GB Sankara Rao garu in Sujanaranjani:
నిత్య కళ్యాణ౦, పచ్చతోరణ౦గా భాసిల్లే తిరుమలలో కొలువైన కళ్యాణ చక్రవర్తి శ్రీదేవితో కూడి సిరులు కురిపిస్తున్న శ్రీ వే౦కటేశ్వరునకు, అలమేల్మ౦గమ్మకు హారతులు! మ౦గళారతులు!! పసిడారతులు!!!
మేలము =పరిహసము / వేళాకొళము; అ౦గనలు = స్రీలు: అ౦గజు గురుడు = మన్నధుని గురువు మరియు త౦డ్రి; మేదిని = భూమి; ఆదిత్యుడు = సూర్యుడు; అరి భయ౦కరుడు = శత్రువులకు భయమును కలిగి౦చువాడు; దనుజులు = రాక్షసులు; నిచ్చలు = నిత్యము

Sunday, December 24, 2006

107.apuDEmane nEmanumanenu - అపుడేమనె నేమనుమనెను



This kriti is a dailogue between Rama and Hanuma.
Hanuma returned from lanka with good news, Rama eagerly asks him about seeta..

అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె

పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె


యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె

బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట ఇటు చేసెననె


నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నా వలెనె తాపమనె
మను కులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరి గంటిననె


in English :
apuDEmane nEmanumanenu
tapamE virahapu taapamane

pavanaja yEmane paDatimarEmane
avanija ninu nEmanu manenu

ravikulEMdra bhaaramu praaNambane
ivala neTla dhariyiMchEnane

yiMkaa nEmane yiMti marEmane
koMkaka yEmani kosarumane

boMkula dEhamu pOdidi vEgane
chiMka vETa iTu chEsenane

nanu nEmane praaNamu mana kokaTanetanaku nii valene taapamane
manukulESa prEmapu manakUTami
ghanavEMkaTagiri gaMTinane

Sunday, December 17, 2006

102.Avadharu Raghupati - అవధారు రఘుపతి


Youtube Link : Malladi Brothers
అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
యివలనిండే కొలువిదెనదె సముఖాన

రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు
మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో

యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర

కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజసము చెప్పరాదు రామ

avadhaaru raghupati aMdarini chittagiMchu yivalaniMDae koluvidenade samukhaana raamaraaghavaraama raamachaMdraprabhO SreemadayOdhyaadhipati seetaapati praemanaaraduDu paaDipekkuraMbhaadulaaDaeru mOmetti kapulella mrokkaeradivO yinavaMSakula jaata ikshvaakukulatilaka ghanadaSarathasuta kauSikapriya munulu deeviMchaeru muMdaTa bharatuDade venaka lakshmaNuDu saeviMchee viMjaamara kaMduvakausalyaagarbha ratnaakara cheMdina SreevaeMkaTaadri Sreenivaasa saMdaDi kuSalavulu chadivaeru vokavaMka cheMdi neeraajasamu chepparaadu raama

Sunday, November 26, 2006

90.Anisamu Talacharo Ahobalam - అనిశము దలచరో అహోబలం




అనిశము దలచరో అహోబలం అనంత ఫలదం అహోబలం

హరి నిజనిలయం అహోబలం హరివిరించి నుత అహోబలం
అరుణ మణిశిఖరమహోబలం అరిదైత్యహరణ మహోబలం

అతిశయ శుభదం అహోబలం అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం యతి మత సిద్ధం అహోబలం

అగు శ్రీ వేంకట మహోబలం అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం అగకుల రాజం అహోబలం

88.AragiMchi KurchunnaDallavaDe - ఆరగించి కూర్చున్నాడల్లవాడె




ఆరగించి కూర్చున్నాడల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు

ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీనల్ల వాడె
చెందిన మాణికముల శేషుని పడెగె మీది
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్ల వాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు

పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము
అండనే పూజ గొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు


aaragiMchi koorchunnaaDallavaaDe
chaeruvanae chooDare lakshmeenaarasiMhuDu

iMdiranu toDameeda niDukoni koluvichchee
aMdapu navvulu challeenalla vaaDe
cheMdina maaNikamula Saeshuni paDege meedi
cheMdi varaalichchee lakshmeenaarasiMhuDu

baMgaaru maeDalOna pachchala gaddiyala meeda
aMganala aaTa choochi nalla vaaDe
raMgagu sommula tODa raajasapu vibhavaala
cheMgaTa nunnaaDu lakshmee naarasiMhuDu

peMDepu paadamu chaachi penachi oka paadamu
aMDanae pooja gonee nallavaaDe
koMDala SreevaeMkaTaadri kOri ahObalamuna
meMDugaanu merasee lakshmeenaarasiMhuDu