Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Deity:Narasimha. Show all posts
Showing posts with label Deity:Narasimha. Show all posts

Saturday, January 21, 2023

918. నవనారసింహ నమో నమో - navanaarasiMha namO namO

Tuned & composed by Sri T.P. Chakrapani , in Ragam: Bilahari

నవనారసింహ నమో నమో

భవనాశితీర యహోబలనారసింహ


సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ

వితతవీరసింహవిదారణా

అతిశయకరుణ యోగానంద నరసింహ

మతి శాంతపు కానుగుమాని నారసింహ


మరలి బీభత్సపు మట్టెమళ్ల నరసింహ

నరహరి భార్గోటి నారసింహ

పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ

సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ


వదనభయానకపు వరాహనరసింహ

చెదరని వైభవాల శ్రీనరసింహ

అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి

పదివేలు రూపముల బహునారసింహ


navanaarasiMha namO namO
bhavanaaSiteera yahObalanaarasiMha

satataprataaparaudrajvaalaanaarasiMha
vitataveerasiMhavidaaraNaa
atiSayakaruNa yOgaanaMda narasiMha
mati SaaMtapu kaanugumaani naarasiMha

marali beebhatsapu maTTemaLla narasiMha
narahari bhaargOTi naarasiMha
paripoorNaSRMgaara prahlaadanarasiMha
sirula nadbhutapu lakshmeenaarasiMha

vadanabhayaanakapu varaahanarasiMha
chedarani vaibhavaala SreenarasiMha
adana SreevaeMkaTaeSa aMdu niMdu niravaiti
padivaelu roopamula bahunaarasiMha

Sunday, December 01, 2019

860. sEviMcharO mokkarO chelulaala narulaala - సేవించరో మొక్కరో చెలులాల నరులాల


Audio archive link: Tuned & Sung by Sri Sattiraju Venumadhav in Sahana

Youtube link, Tuned by Sri TP Chakrpani , Sung by Smt Anasuya 
సేవించరో మొక్కరో చెలులాల నరులాల
కైవశమై వున్నవాఁడు కరుణాకరుండు    ॥పల్లవి॥


బాసికము గట్టుకొని బంగారుగద్దెమీఁద
లాసి కూచున్నాఁడదివో లకిమమ్మతో
సూసకపువనితలు సోబానఁ బాడఁగాను
భాసురమై యొప్పె నదె ప్రహ్లదవరదుఁడు    ॥సేవిం॥


మునులు చదువఁగాను ముంజేతికంకణాలతో
యెనసి లవ్వులు నవ్వీ నిందిరతో
అనయముఁ బేరఁటాం డ్లారతులెత్తఁగాను
పనివూని వరాలిచ్చీఁ బ్రహ్లదవరదుఁడు    ॥సేవిం॥


పొలఁతులు వడ్డించఁగా బువ్వానఁ గూచుండి
చెలఁగి సరసమాడీ శ్రీదేవితో
యెలమి శ్రీవేంకటాద్రి నీతఁడే యెందుచూచినా
బలవంతుఁడై వున్నాఁడు ప్రహ్లదవరదుఁడు    ॥సేవిఁ॥


saeviMcharO mokkarO chelulaala narulaala
kaivaSamai vunnavaa@MDu karuNaakaruMDu    =pallavi=


baasikamu gaTTukoni baMgaarugaddemee@Mda
laasi koochunnaa@MDadivO lakimammatO
soosakapuvanitalu sObaana@M baaDa@Mgaanu
bhaasuramai yoppe nade prahladavaradu@MDu    =saeviM=


munulu chaduva@Mgaanu muMjaetikaMkaNaalatO
yenasi lavvulu navvee niMdiratO
anayamu@M baera@MTaaM Dlaaratuletta@Mgaanu
panivooni varaalichchee@M brahladavaradu@MDu    =saeviM=


pola@Mtulu vaDDiMcha@Mgaa buvvaana@M goochuMDi
chela@Mgi sarasamaaDee SreedaevitO
yelami SreevaeMkaTaadri neeta@MDae yeMduchoochinaa
balavaMtu@MDai vunnaa@MDu prahladavaradu@MDu    =saevi@M=




Youtube link, Tuned by Sri TP Chakrpani , Sung by Smt Anasuya

Sunday, April 29, 2018

847. janulu namarulunu jayaliDa@Mgaa - జనులు నమరులును జయలిడఁగా


రాగము: ముఖారి
రేకు: 0062-05
సంపుటము: 1-320
॥పల్లవి॥
జనులు నమరులును జయలిడఁగా
ఘనుఁడదె వుయ్యాలగంభముకాడ
॥చ1॥
వదలక వలసినవారికి వరములు
యెదురెదురై తానిచ్చుచును
నిదురలేక పెనునిధినిధానమై
కదలఁ డదే గరుడగంభముకాడ
॥చ2॥
కోరినవారికి కోరినవరములు
వోరంతప్రోద్దు నొసఁగుచును
చేరువయై కృపసేసీ నిదివో
కూరిముల పడిమిగోపురమాడ
॥చ3॥
వడి వేంకటపతి వరములరాయఁడు
నుడుగఁగాళ్ళుఁగన్నులు సుతుల
బడిబడి నొసఁగుచు బ్రాణచారులకు
కడిమి నీడ దిరుగని చింతాడ

raagamu: mukhaari
raeku: 0062-05
saMpuTamu: 1-320

pallavi 
janulu namarulunu jayaliDa@Mgaa
ghanu@MDade vuyyaalagaMbhamukaaDa

cha1 
vadalaka valasinavaariki varamulu
yeduredurai taanichchuchunu
niduralaeka penunidhinidhaanamai
kadala@M Dadae garuDagaMbhamukaaDa

cha2 
kOrinavaariki kOrinavaramulu
vOraMtaprOddu nosa@Mguchunu
chaeruvayai kRpasaesee nidivO
koorimula paDimigOpuramaaDa

cha3 
vaDi vaeMkaTapati varamularaaya@MDu
nuDuga@MgaaLLu@Mgannulu sutula
baDibaDi nosa@Mguchu braaNachaarulaku
kaDimi neeDa dirugani chiMtaaDa

Wednesday, June 04, 2014

822. chelle chelle nIchEta SiMgari nI - చెల్లెఁ జెల్లె నీచేత శింగరి నీ


Archive link : G Anila kumar
చెల్లెఁ జెల్లె నీచేత శింగరి నీ
వుల్లమెల్లఁ దక్కఁ గొంటినో శింగరి

చిక్కని నీనవ్వుచూచి శింగరి నే

నొక్కటై నీకు మొక్కితినో శింగరి
చెక్కులఁ జెమటగారె శింగరి నీ
వుక్కుగోరు సోకనీ

కు వో శింగరి

చిరుత నిట్టూర్పుల శింగరి నిను

నొరసీబో నాకు చాలు వో శింగరి
సిరుల నిట్టమాపు శింగరి నీ
వొరపు నాచేతఁ జిక్కెనో శింగరి

చేవదేరె నోమోవి శింగరి నే

నోవరిలోఁ గూడగానె వో శింగరి
శ్రీవేంకటాద్రి మీద శింగరి
వోవమన సిగ్గుదేరెనో శింగరి.

chelle@M jelle nIchEta SiMgari nI
vullamella@M dakka@M goMTinO SiMgari

chikkani nInavvuchUchi Simgari nE
nokkaTai nIku mokkitinO SiMgari
chekkula@M jemaTagAre SiMgari nI
vukkugOru sOkanIku vO SiMgari

chiruta niTTUrpula SiMgari ninu
norasIbO nAku chAlu vO SiMgari
sirula niTTamApu SiMgari nI
vorapu nAchEta@M jikkenO Simgari

chEvadEre nOmOvi Simgari nE
nOvarilO@M gUDagAne vO Simgari
SrIvEMkaTAdri mIda Simgari
vOvamana siggudErenO Simgari.


Wednesday, March 12, 2014

816. kaMTi kaMTi mide kalige mApAliTa - కంటిఁగంటి మిదె కలిగె మాపాలిట


Archive/Audio link : Balakrishnaprasad
కంటిఁగంటి మిదె కలిగె మాపాలిట
యింటి వేలుపై యేలీ వీడె

శ్రీనరసింహుడు చిన్మయ రూపుడు

నానామహిమల నాటరుఁ(కుఁ)డు
దానవాంతకుడు దైవశిఖామణి
పూని యహోబలపురపతి వీడే

పరమ పూరుషుడు ప్రహ్లాదవరదుడు

హరి లోకోన్నతుఁ డనంతుడు
దురిత విదారుడు దుష్టభంజకుడు
సిరుల నహోబలశ్రీపతి వీడే

చెలువుడు వరదుడు జీవాంతరాత్ముడు

నిలిచె శ్రీవేంకట నిధియందు
బలువుడు సులభుడు భక్తరక్షకుడు
లలి నహోబలవిలాసుడు వీడే

kaMTi@MgaMTi mide kalige mApAliTa
yiMTi vElupai yElI vIDe

SrInarasiMhuDu chinmaya rUpuDu
nAnAmahimala nATaru@M(ku@M)Du
dAnavAMtakuDu daivaSikhAmaNi
pUni yahObalapurapati vIDE

parama pUrushuDu prahlAdavaraduDu
hari lOkOnnatu@M DanaMtuDu
durita vidAruDu dushTabhaMjakuDu
sirula nahObalaSrIpati vIDE

cheluvuDu varaduDu jIvAMtarAtmuDu
niliche SrIvEMkaTa nidhiyaMdu
baluvuDu sulabhuDu bhaktarakshakuDu
lali nahObalavilAsuDu vIDE


Tuesday, March 11, 2014

815.sugrIva nArasiMhuni chUDarO / judaro - సుగ్రీవ నారసింహునిఁ జూడరో వాడె

Archive Audio link : G Anila Kumar
సుగ్రీవ నారసింహునిఁ జూడరో వాడె
అగ్రపూజ గొన్నవాడు ఆదిసింహము

దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ
దేవులతోఁ గూడున్నాడు దివ్యసింహము
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము

అసురులను గెలిచి అదె సింహాసనముపై
వెసఁ గొలువున్నాడు వీరసింహము
పసిడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో
దెసల వెలుగొందీనీ ధీరసింహము

నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల
ఆనుకొని రక్షించీఁ బ్రత్యక్షసింహము
పూని శ్రీవెంకటాద్రిని భుధులెల్లాఁ గొలువగా
నానావరము లొసగీ మానవసింహము

sugrIva nArasiMhuni@M jUDarO vADe
agrapUja gonnavADu AdisiMhamu

dEvatalu jayaveTTi divinuMDi pogaDaga
dEvulatO@M gUDunnADu divyasiMhamu
bhAviMpa neTTaneduTa prahlAduDuMDagAnu
vEvElu navvulu navvI vijayasiMhamu

asurulanu gelichi ade siMhAsanamupai
vesa@M goluvunnADu vIrasiMhamu
pasiDivarNamutODa bahudivyAyudhAlatO
desala velugoMdInI dhIrasiMhamu

nAnAbharaNAlu veTTi namminadAsulanella
Anukoni rakshiMchI@M bratyakshasiMhamu
pUni SrIveMkaTAdrini bhudhulellA@M goluvagA
nAnAvaramu losagI mAnavasiMhamu


Friday, February 21, 2014

804. modalivElpa mA mo~ra yAliMchave - మొదలివేల్ప మా మొఱ యాలించవె


Archive link : G.Anila kumar
మొదలివేల్ప మా మొఱ యాలించవె
యెదుటఁ గావు మము నిదివో దేవా

ధరపై తపసుల తపములు చెరచెను
నిరతపుణ్యముల నీరుసేసెనదె
పరకామినులను భంగపెట్టెనదె
హిరణ్యకశిపుడిదివో దేవా

మునులజడ లవిగో మోపులకొలదులు
ఇనచంద్రాదుల నెక్కువగెలిచెను
చనవరి యింద్రుని స్వర్గము చేకొనె
యెనగొని హిరణ్యుడిదివో దేవా

పలుదిక్పాదులఁ బారగఁ దోలెను
బలిమినే ప్రహ్లాదుఁ బరచీని
యెలమిని శ్రీవేంకటేశ నీవలన
యిల కశిపుడు చెడె నిదివో దేవా

 modalivElpa mA mo~ra yAliMchave
yeduTa@M gAvu mamu nidivO dEvA

dharapai tapasula tapamulu cherachenu
niratapuNyamula nIrusEsenade
parakAminulanu bhaMgapeTTenade
hiraNyakaSipuDidivO dEvA

munulajaDa lavigO mOpulakoladulu
inachaMdrAdula nekkuvagelichenu
chanavari yiMdruni swargamu chEkone
yenagoni hiraNyuDidivO dEvA

paludikpAdula@M bAraga@M dOlenu
baliminE prahlAdu@M barachIni
yelamini SrIvEMkaTESa nIvalana
yila kaSipuDu cheDe nidivO dEvA


Tuesday, August 27, 2013

800.navamoortulainaTTi narasiMhamu - నవమూర్తులైనట్టి నరసింహము

Meaning by Dr.T.Patanjali
Audio archive link : Sri Sathiraju venumadhav, raga Gowla
Audio : G.Nageswaranayudu link 1 link
Audio link : From movie Intinta Annamayya

నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము

నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము

పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము


navamoortulainaTTi narasiMhamu veeDe
navamaina Sree kadiri narasiMhamu

1.nagarilO gaddemeedi narasiMhamu veeDe
naguchunna jvaalaa narasiMhamu
nagamu pai yOgaanaMda narasiMhamu veeDe
migula vaedaadri lakshmee narasiMhamu

2.naaTukonna bhaargavooTu narasiMhamu veeDe
naaTakapu maTTemaLla narasiMhamu
naaTi yee kaanugumaani narasiMhamu veeDe
maeTi varaahapulakshmee naarasiMhamu

3.polasi ahObalaana bommireDDi cherlalona
naliraegina prahlaada narasiMhamu
chelagi kadirilOna Sree vaeMkaTaadri meeda

melagaeTi chakkani lakshmee naarasiMhamu

Wednesday, May 09, 2012

778.ihaparamulakunu Elikavu - ఇహపరములకును ఏలికవు


  Audio link : Sri Balakrishnaprasad

ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||

pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu ||

ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada ||

ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada ||

ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||

Friday, January 21, 2011

736.koluvarO mokkarO kOrina - కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ

Audio link : Sri Balakrishnaprasad
కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ
సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||

కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి
అంబరపు దేవతలకు అభయమిచ్చి |
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి
అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||

నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని
పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి
ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||

మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ
అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ
చక్కదనములకెల్లా చక్కని నరహరి ||

koluvarO mokkarO kOrina varamu liccI
sulaBu DinniTAnu vIDe sugrIva narahari ||

kaMbamulOna puTTi kanakadaityuni koTTi
aMbarapu dEvatalaku aBayamicci |
paMbi siridana toDapai beTTuka mATalADi
aMbujAkShuDainaTTi Adima narahari ||

nAnA BUShaNamulu unnati tODa niDukoni
pUnikatO prahlAduni bujjagiMci
mAnavulakellanu mannana cAlA nosagi
AnaMdamutO nunnADu adigO narahari ||

mikkili pratApamutO miMcina kAMtulatODa
akkajapu mahimala nalarucunu
takkaka SrIvEMkaTAdri tAvukoni varAliccI
cakkadanamulakellA cakkani narahari ||


Thursday, December 30, 2010

732.chittajaguruDa vO SrInarasiMhA - చిత్తజగురుడ వో శ్రీనరసింహా

Audio link : Sri Balakrishnaprasad
చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

chittajaguruDa vO SrInarasiMhA
battisEsEru munulu parikiMchavayyA

sakaladEvatalunu jayaveTTuchunnAru
chakitulai dAnavulu samasirade
akalaMkayagu lakshmiyaTu nI toDapai nekke
prakaTamaina nI kOpamu mAnavayyA

tuMburunAradAdulu dorakoni pADEru
aMbujAsanuDabhayamaDigInade
aMbaravIdhi nADEru yachcharalaMdarugUDi
SaMbararipujanaka SAMtamu chUpavayyA

hatti kolichErade yakshulunu gaMdharvulu
chittagiMchu pogaDEru siddhasAdhyulu
sattugA nI dAsulamu SaraNu chochchiti mide
yittala SrIvEMkaTESa yElukonavayyA

Thursday, July 22, 2010

712.AnaMda nilaya prahlAda varadA - ఆనంద నిలయ ప్రహ్లాద వరదా



audio link  : Composed by Sri TP Chakrapani garu in nilambari ragam, sung by Sri Anasuya Murthy garu
ప|| ఆనంద నిలయ ప్రహ్లాద వరదా | భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా ||
చ|| పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా | హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా |
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా | భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా ||
చ|| భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా | అవిరళ కేశవ ప్రహ్లాద వరదా |
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా | భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా ||
చ|| బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా | లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా |
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా | బలి వంశ కారణ ప్రహ్లాద వరదా ||


pa|| AnaMda nilaya prahlAda varadA | BAnu SaSi nEtra jaya prahlAda varadA ||
ca|| parama puruSha nitya prahlAda varadA | hari acyutAnaMda prahlAda varadA |
paripUrNa gOviMda prahlAda varadA | Barita kalyANaguNa prahlAda varadA ||
ca|| BavarOga saMharaNa prahlAda varadA | aviraLa kESava prahlAda varadA |
pavamAna nuta kIrti prahlAda varadA | Bava pitAmaha vaMdya prahlAda varadA ||
ca|| bala yukta narasiMha prahlAda varadA | lalita SrI vEMkaTAdri prahlAda varadA |
Palita karuNArasa prahlAda varadA | bali vaMSa kAraNa prahlAda varadA ||



Saturday, March 27, 2010

678.balavaMtuDitani baMTlamai bratukudumu - బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము



బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము
కిలకిల నవ్వీ సుగ్రీవ నరసింహుడు

 
దేవదేవుడితడు తేజోరాశి యితడు
భావించ నలవిగాని బ్రహ్మ మితడు
శ్రీవల్లభుడితడు జీవరక్షకుడితడు
కేవలమయిన సుగ్రీవనరసింహుడు


పరమాత్ముడితడు భయహరుడితడు
నిరుపమగుణముల నిత్యుడితడు
వరదుడితడు సర్వవంద్యుడు నీతడు
గిరిగుహలోని సుగ్రీవ నరసింహుడు


లరూపుడితడు కరుణానిధియితడు
మేలిమి జగత్తులకు మేటి యీతడు
మూలమై శ్రీవేంకటశైల నిలయుడితడు
కీలకమిన్నిటికి సుగ్రీవ నరసింహుడు


balavaMtuDitani baMTlamai bratukudumu
kilakila navvI sugrIva narasiMhuDu

dEvadEvuDitaDu tEjOrASi yitaDu
bhAviMcha nalavigAni brahma mitaDu
SrIvallabhuDitaDu jIvarakshakuDitaDu
kEvalamayina sugrIvanarasiMhuDu

paramAtmuDitaDu bhayaharuDitaDu
nirupamaguNamula nityuDitaDu
varaduDitaDu sarvavaMdyuDu nItaDu
giriguhalOni sugrIva narasiMhuDu

larUpuDitaDu karuNAnidhiyitaDu
mElimi jagattulaku mETi yItaDu
mUlamai SrIvEMkaTaSaila nilayuDitaDu
kIlakaminniTiki sugrIva narasiMhuDu

Saturday, January 09, 2010

669.pADarE sObanAlu paDatulArA - పాడరే సోబనాలు పడతులారా


ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే || చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి | అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు | వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల | పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే || చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి | ఇవలా నవలా తాము ఏటిదరుల | జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు | తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు || చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల | సందడి వసంతముగా జల్లులాడుచు | అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక | చందమున కూడి సరసములాడేరు || pa|| pADarE sObanAlu paDatulArA | vEDuka liddarini velasejUDarE || ca|| koMDalE pITalugA kUcunnAredurubaDi | aMDanE nArasiMhuDu AdilakShmiyu | veMDipaiDi niMDukonna vEdAdri garuDAdrula | peMDilADE riddarunu priyamuna cUDarE || ca|| BavanASijalamula pAyaka tODanILLADiri | ivalA navalA tAmu ETidarula | javaLi maMcipUvula sarisEsalu veTTucu | tavili sumuhUrtAna tappaka cUcEru || ca|| poMduga kanakAvati BOgavati nadula | saMdaDi vasaMtamugA jallulADucu | aMdamai SrIvEMkaTAdri ahObalAna oka | caMdamuna kUDi sarasamulADEru ||

Monday, July 27, 2009

632.pedayaubaLapu koMDa - పెదయౌబళపు కొండ పెరిగీనిదే




Audio link : G.Anil Kumar

పెదయౌబళపు కొండ పెరిగీనిదే
వదలకకొలిచితే వరములిచ్చీని

పదివేలశిరసుల పలునరసింహము
గుదిగొన్న చేతుల గురుతైనది
ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది

ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది
మొనసి రాకాసి మొకములగొట్టేది
కనకపుదైత్యుని కడుపుచించినది
తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది

శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది
దేవతలు గొలువ గద్దెపై నున్నది
శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది
భావించి చూచితేను పరబ్రహ్మమైనది
pedayaubaLapu koMDa perigInidE
vadalakakolichitE varamulichchIni

padivElaSirasula palunarasiMhamu
gudigonna chEtula gurutainadi
eduTapAdAlu kannulennaina kaliginadi
yidi brahmAMDapuguha niravainadi

ghanaSaMkhachakrAdula kaiduvalatOnunnadi
monasi rAkAsi mokamulagoTTEdi
kanakapudaityuni kaDupuchiMchinadi
tanunammina prahlAdudApunu daMDainadi

SrIvanita toDamIda jEkoni nilipinadi
dEvatalu goluva gaddepai nunnadi
SrIvEMkaTAdriyaMdu@Mjelagi bhOgiMchEdi
bhAviMchi chUchitEnu parabrahmamainadi

Get this widget | Track details | eSnips Social DNA

Thursday, June 25, 2009

625.namAmyahaM mAnavasiMhaM - నమామ్యహం మానవసింహం



ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||

చ|| దానవదైత్య విదారణ సింహం | నానాయుధకర నరసింహం |
భూనభోంతరాళ పూరిత సింహం | ఆనన వహ్నిలయాంతక సింహం ||

చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖరముఖ ఘోషిత సింహం | తిలకిత బహు రవిదీపిత సింహం ||

చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయసింహం |
కాంతం శ్రీవేంకటగిరి సింహం | చింతిత ఘన సంసిద్ధ నృసింహం ||


pa|| namAmyahaM mAnavasiMhaM | pramadAMka mahObala narasiMhaM ||

ca|| dAnavadaitya vidAraNa siMhaM | nAnAyudhakara narasiMhaM |
BUnaBOMtarALa pUrita siMhaM | Anana vahnilayAMtaka siMhaM ||

ca|| praLaya nRusiMhaM bahumuKa siMhaM | salalita garuDAcala siMhaM |
kuliSa naKaramuKa GOShita siMhaM | tilakita bahu ravidIpita siMhaM ||


ca|| SAMta nRusiMhaM Saurya nRusiMhaM | saMtata karuNA jayasiMhaM |
kAMtaM SrIvEMkaTagiri siMhaM | ciMtita Gana saMsiddha nRusiMhaM ||

Saturday, June 20, 2009

624.mokkarE mokkarE mIru - మొక్కరే మొక్కరే మీరు




album name : Divyasimham namami (SACRED creations)
to purchase contact : tp.chakrapani@gmail.com

మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయలిడి
దక్కి శ్రీవేంకటేశుడే తానైన దేవుడికి

కరములు వేయవే కరములును భయం -
కరనఖాయుధములు కడలేవవే
సిరి తొడపైనదే సింహపునెమ్మోమదె
నరరూపసగమదె నరసింహునికి

వంకరకోరలవే వజ్రపుదంతములవె
సంకుమ చక్రము నిరువంకలా నవె
జంకెల నేత్రము లవె జడలు మూపున నవె
అంకె నభయ హస్తము నదె నరహరికి

నిక్కిలి కర్ణము లవె నీలిమచ్చపురమదె
చుక్కలమొలపూసల నొక్కరూపదె
తొక్కినపాపము లవె తోడనే శ్రీవెంకటాద్రి
పక్కెర నరసింహపు ప్రళయసింహునికి


mokkarE mokkarE mIru muMdu muMdE jayaliDi
dakki SrIvEMkaTESuDE tAnaina dEvuDiki

karamulu vEyavE karamulunu bhayaM -
karanakhAyudhamulu kaDalEvavE
siri toDapainadE siMhapunemmOmade
nararUpasagamade narasiMhuniki

vaMkarakOralavE vajrapudaMtamulave
saMkuma chakramu niruvaMkalA nave
jaMkela nEtramu lave jaDalu mUpuna nave
aMke nabhaya hastamu nade narahariki

nikkili karNamu lave nIlimachchapuramade
chukkalamolapUsala nokkarUpade
tokkinapApamu lave tODanE SrIveMkaTAdri
pakkera narasiMhapu praLayasiMhuniki

Saturday, March 14, 2009

596.jUTudanAla vADavu - జూటుఁదనాల వాడవు సుగ్రీవనరసింహా



Archive link :
జూటుఁదనాల వాడవు సుగ్రీవనరసింహా
పాటించి నిన్ను మేము పంగించే వారమా


మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు
జొగితొడ మీదట శ్రీమహాలక్ష్మి
తగు నీకు నిటువంటి తగవులెల్లాఁ జెల్లు
యెగసక్కేలాడామాకు నేలయ్య నిన్నును
కట్టినది పైడికాశ కంబములోన వునికి
నెట్టుకొన్న నవ్వులు నోలోనివే
యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేతలు
అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి

అమరుల కేలికవు అసురులకు వైరివి
రమణ ప్రహ్లాదునకు రక్షకుడవు
కొమరై శ్రీవేంకటాద్రి కొత్తలు నీగుణములు
సముకాన పలుమారు సంతీసించే మికను

jUTu@MdanAla vADavu sugrIvanarasiMhA
pATiMchi ninnu mEmu paMgiMchE vAramA

mogamu siMhapurUpu mogi mai mAnisirUpu
jogitoDa mIdaTa SrImahAlakshmi
tagu nIku niTuvaMTi tagavulellA@M jellu
yegasakkElADAmAku nElayya ninnunu
kaTTinadi paiDikASa kaMbamulOna vuniki
neTTukonna navvulu nOlOnivE
yiTTivallA nIkamaru yennilEvu nIchEtalu
aTTiTTani ninnu mAku naDuganEmiTiki

amarula kElikavu asurulaku vairivi
ramaNa prahlAdunaku rakshakuDavu
komarai SrIvEMkaTAdri kottalu nIguNamulu
samukAna palumAru saMtIsiMchE mikanu
Composer of this kirtana Sri TP Chakrapani

Friday, February 13, 2009

582.arudarudIgati ahObalESwara - అరుదరుదీగతి అహోబలేశ్వర



Archive Link :

అరుదరుదీగతి అహోబలేశ్వర
పొరి(బొరి దాసుల పొగడుట యెట్టు

యెదుట( జించితివి హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు

ఘనసింహాకృతి గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
పనివడి కంబము పగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్టు

సరవితో వీరరసమున మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు
arudarudIgati ahObalESwara
pori(bori dAsula pogaDuTa yeTTu

yeduTa( jiMchitivi hiraNyakaSipuni
ade prahlAduDu baMTaguTeTlu
kadisina rudruni garva maDachitivi
gudigoni divijula koluchuTa yeTTu

ghanasiMhAkRti gaikonivuMTivi
yanayaMga kari gAchinadeTlu
panivaDi kaMbamu pagula veDalitivi
manujulu pUjiMchi maruguTa yeTTu

saravitO vIrarasamuna miMchitivi
arayaMga SRMgAri vauTeTTu
sirivura mekkenu SrIvEMkaTAdrini
yiravuga nItoDa yekkuTa yeTTu



Get this widget | Track details | eSnips Social DNA

Monday, January 05, 2009

568.dikkunIvE jIvulaku dEva siMhamA - దిక్కునీవే జీవులకు దేవ సింహమా




Audio link : Balakrishnaprasad
Archive link :
దిక్కునీవే జీవులకు దేవ సింహమా
తెక్కుల గద్దియమీది దేవసింహమా

సురలెల్లా గొలువగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతి ప్రహ్లాదుడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా

భుజములుప్పొంగగాను పూచిన శంఖుచక్రాల
త్రిజగములు నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి
ద్విజముని సంఘముల దేవసింహమా

ముప్పిరి దాసులకెల్లా ముందు ముందే యొసగేటి
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవెంకటాద్రి మీద
తెప్పల దేలేటి యట్టి దేవసింహమా
dikkunIvE jIvulaku dEva siMhamA
tekkula gaddiyamIdi dEvasiMhamA

suralellA goluvaga sUryachaMdrulakannula
tiramaina mahimala dEvasiMhamA
nirati prahlAduDu nIyeduTa nilichitE
teradIsiti mAyaku dEvasiMhamA

bhujamuluppoMgagAnu pUchina SaMkhuchakrAla
trijagamulu nElETi dEvasiMhamA
gajabhajiMpuchu vachchi kAchuka nutiMchETi
dvijamuni saMghamula dEvasiMhamA

muppiri dAsulakellA muMdu muMdE yosagETi
tipparAni varamula dEvasiMhamA
chippala nahObalAna SrIveMkaTAdri mIda
teppala dElETi yaTTi dEvasiMhamA