Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్
Showing posts with label Singer : Srirangam Gopalaratnam. Show all posts
Showing posts with label Singer : Srirangam Gopalaratnam. Show all posts

Sunday, February 06, 2011

738.valegA vEsAlu vaddanna mAnaDu - వలెగా వేసాలు వద్దన్న మానడు

Audio link : Srirangam Gopalaratnam
వలెగా వేసాలు వద్దన్న మానడు
యెలయింపుమాటల నెంత సేసీనె

కన్నుల నే మొక్కితేను కాక లేల రేగీనె
యిన్నిటాఁ జేతులు మోపి యేల చూపీనె
వెన్నెల బయట నుంటె వెతలేల రేగీనె
నిన్న నేటనె కతలు నేరిచె దాగదవే

పొలసి నే నగితేను పులక లేల పుట్టీనె
యెలమిఁ జూడు మ నెన లేల పెట్టీనె
చిలుకలు వలికితే చింత లేల పొడమీనె
మలక లెల్లఁబెనచే మాయకాడు కదవే

గక్కున కాగిలించెతె కడుఁ జెమరించనేలె
మిక్కిలి గోర నూరిచి మీదఁ జిమ్మీనె
యెక్కువ శ్రీవేంకటేశు డెనసె నన్నిటా నన్ను
చక్కని సరసముల జాణకాడు కదవే

valegA vEsAlu vaddanna mAnaDu
yelayiMpumATala neMta sEsIne

kannula nE mokkitEnu kAka lEla rEgIne
yinniTA@M jEtulu mOpi yEla chUpIne
vennela bayaTa nuMTe vetalEla rEgIne
ninna nETane katalu nEriche dAgadavE

polasi nE nagitEnu pulaka lEla puTTIne
yelami@M jUDu ma nena lEla peTTIne
chilukalu valikitE chiMta lEla poDamIne
malaka lella@MbenachE mAyakADu kadavE

gakkuna kAgiliMchete kaDu@M jemariMchanEle
mikkili gOra nUrichi mIda@M jimmIne
yekkuva SrIvEMkaTESu Denase nanniTA nannu
chakkani sarasamula jANakADu kadavE
click on play to listen :

Friday, December 31, 2010

733.paTTina paMtamu baluvanavE - పట్టిన పంతము బలువనవే

Audio link : Sri Srirangam Gopalaratnam
పట్టిన పంతము బలువనవే
చుట్టపువరుసలు చూచితిననవే

తానూఁజూచెను తనువూ నాటెను
కానీకానీ కద్దనవే
నానితిఁజెమటల నవ్వుల మునిగితి
పూని యిద్దరికిఁ బోదనవే

మారుమాటాడెను మనసుననిలిచెను
ఆరీ తేరీ నౌననవే
తీరవు పులకలు తెగదిది తమకము
భారము తనపై పడెననవె

కాగిట గూడెను కళలను గరగితి
దాగనేల యికఁ దగుననవే
వీగనైతి శ్రీవేంకటపతి రతి
చేగదేరె నిక జెల్లుబడనవే

paTTina paMtamu baluvanavE
chuTTapuvarusalu chUchitinanavE

tAnU@MjUchenu tanuvU nATenu
kAnIkAnI kaddanavE
nAniti@MjemaTala navvula munigiti
pUni yiddariki@M bOdanavE

mArumATADenu manasunanilichenu
ArI tErI naunanavE
tIravu pulakalu tegadidi tamakamu
bhAramu tanapai paDenanave

kAgiTa gUDenu kaLalanu garagiti
dAganEla yika@M dagunanavE
vIganaiti SrIvEMkaTapati rati
chEgadEre nika jellubaDanavE

Thursday, December 31, 2009

664.evvarivADAgAnu yEmaMduniMduku - ఎవ్వరివాడాగాను యేమందునిందుకు

Tune and sung by Sri Srirangam Gopalaratnam
ఎవ్వరివాడాగాను యేమందునిందుకు నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు కుదువవెట్టితి నే గురి గానక వెదకి కామునికి విషయములకు నే అదివో నావయసెల్ల నాహివెట్టితిని ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా evvarivADAgAnu yEmaMduniMduku navvuchu nAlOnihari nannugAvavE kOpularAjulanella kolichi konnALLu nEnu chUpuDu@MbUTa veTTiti sogisi nEnu yEpuna saMsAramuna idigAka kammaTAnu dApuga torlu@MbUTa tagiliMchukoMTini modala karmamulaku mOsapOyi yI braduku kuduvaveTTiti nE guri gAnaka vedaki kAmuniki vishayamulaku nE adivO nAvayasella nAhiveTTitini ippuDE SrIvEMkaTESa yIDErchi nAmanasu kappina guruDu nIku krayamichchenu voppiMchiriMdaru baluvuDu chEpaTTenanuchu appulellabAsi nI sommaitinEnayyA

Sunday, December 13, 2009

660.manavi cheppitini - మనవి చెప్పితిని



Audio link : Sri Srirangam Gopalaratnam 
మనవి చెప్పితిని మఱవకుమీ కనుగొని నామాట కడువకుమీ యిచ్చక మాడితి వీడనె వుంటివి మచ్చిక నామేలు మఱవకుమీ వచ్చి వేరొకతె వలపులు చల్లిన పచ్చిదేరి మరి పదరకుమీ సరసమాడితివి చనవు లిచ్చితివి మరిగిన నాపొందు మానకుమీ సరిగా మరొకతె సందులు దూరిన తొరలి యపుడు మరి తొలచకుమీ కలసితి విప్పుడు కాగిలించితివి పొలసి యిట్లనె భోగించుమీ యెలమిని శ్రీవేంకటేశ్వర మరొకతె పిలిచితేను మరి పెనగకుమీ manavi cheppitini ma~ravakumI kanugoni nAmATa kaDuvakumI yichchaka mADiti vIDane vuMTivi machchika nAmElu ma~ravakumI vachchi vErokate valapulu challina pachchidEri mari padarakumI sarasamADitivi chanavu lichchitivi marigina nApoMdu mAnakumI sarigA marokate saMdulu dUrina torali yapuDu mari tolachakumI kalasiti vippuDu kAgiliMchitivi polasi yiTlane bhOgiMchumI yelamini SrIvEMkaTESwara marokate pilichitEnu mari penagakumI

Tuesday, December 01, 2009

658.iddari tamakamu niTuvalene - ఇద్దరి తమకము నిటువలెనె



Audio link : Sri Srirangam Gopalaratnam garu ఇద్దరి తమకము నిటువలెనె పొద్దున నేమని బొంకుదమయ్యా లలి నాకథరము లంచమియ్యగా పలు సోకులయి పరగెనవే పిలువగరాగా బెరసి నిందవడె పొలతికి నేమని బొంకుదమయ్యా అడుగుకొనుచు నిన్నంటి పెనగగా తడయక నఖములు తాకెనవే తొడుకొనిరాగా దూఱు మీదబడె పొడవుగ నేమని బొంకుదమయ్యా పెక్కులు చెవిలో ప్రియముగ చెప్పగ ముక్కున జవ్వాది మోచె నిదే యిక్కడ శ్రీవేంకటేశుడ సడివడె పుక్కటి నేమని బొంకుదమయ్యా iddari tamakamu niTuvalene podduna nEmani boMkudamayyA lali nAkatharamu laMchamiyyagA palu sOkulayi paragenavE piluvagarAgA berasi niMdavaDe polatiki nEmani boMkudamayyA aDugukonuchu ninnaMTi penagagA taDayaka nakhamulu tAkenavE toDukonirAgA dU~ru mIdabaDe poDavuga nEmani boMkudamayyA pekkulu chevilO priyamuga cheppaga mukkuna javvAdi mOche nidE yikkaDa SrIvEMkaTESuDa saDivaDe pukkaTi nEmani boMkudamayyA

Thursday, October 22, 2009

644.evvaDerugunu mIyettulu - ఎవ్వడెరుగును మీయెత్తులు


Audio link: 
listen to this kirtana sung by Srirangam Gopalaratnam garu in mohana : youtube link
ఎవ్వడెరుగును మీయెత్తులు
మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య

సొలపుల నిన్నాపె చూచీనీ
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱగులు
బలిమిని యెట్టయినా బతుకరయ్యా

విరులనాపె నిన్ను వేసీనీ
కెరలి బొమ్మల జంకించేవు
సరిగానము మీ చందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా

పెనగి ఆపె నిన్ను పిలిచీనీ
యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్య

evvaDerugunu mIyettulu
muvvaMka merase mI mu~ripemayya

solapula ninnApe chUchInI
nalugaDa nIvEla navvEvu
teliyavu mAku mI te~ragulu
balimini yeTTayinA bratukarayyA

virulanApe ninnu vEsInI
kerali bommala jaMkiMchEvu
sarigAnamu mI chaMdamulu
paripari vidhamula bradukarayyA

penagi Ape ninnu pilichInI
yenasitivi SrIvEMkaTESwaruDA
nanu nElitiviTu nayamunanu
panivaDi yiTlAnE bradukarayya



Thursday, January 22, 2009

573.ElarADammA yiMtirO - ఏలరాడమ్మా యింతిరో


Archive Link :
ఏలరాడమ్మా యింతిరో వా( -
డేల రాడమ్మ నన్నేలినవాడు

పచ్చని పులుగుల బండిమీద నుండు-
పచ్చవింటి పిన్నబాలుని తండ్రి
పచ్చని చాయల పాయని బంగారు
పచ్చడము గట్టి(న) బాగైనవాడు

తెల్లని పులుగపై తిరుగ మరిగినట్టి
తెల్లని సతి పాలి దేవర తండ్రి
తెల్లని పరపుపై తేలిపొరలు వెట్టు-
తెల్లని కన్నుల తెలివైన వాడు

కొండవింటి వాని గుత్తగొనిన యట్టి -
కొండుక పాయపు కూతురు తండ్రి
కొండలరాయడు కోనేటి తిమ్మయ్య
కొండ తలనెత్తి గుఱుతైనవాడు


ElarADammA yiMtirO vA( -
DEla rADamma nannElinavADu

pachchani pulugula baMDimIda nuMDu-
pachchaviMTi pinnabAluni taMDri
pachchani chAyala pAyani baMgAru
pachchaDamu gaTTi(na) bAgainavADu

tellani pulugapai tiruga mariginaTTi
tellani sati pAli dEvara taMDri
tellani parapupai tEliporalu veTTu-
tellani kannula telivaina vADu

koMDaviMTi vAni guttagonina yaTTi -
koMDuka pAyapu kUturu taMDri
koMDalarAyaDu kOnETi timmayya
koMDa talanetti gu~rutainavADu

Sunday, November 04, 2007

333.kalalOnE yiruvuramu aligi -కలలోనే యిరువురము

ARchive link : Click for Audio : book:5, kriti:21
కలలోనే యిరువురము అలిగి వేగ
కలయనుచు తెలిసి నిను కౌగిలించితిరా

అలుగుదురె (సతులు)(బతులనగా వినగ-
నలవాటు లేక నే నలుగుచుండుదురా
అలిగితటా వురక నీవంత నాతోను మరి-
నలుగులౌనట పూవులంతలోపలనే

చందురుడే సూర్యుడై జరగ మిగుల
కెందమ్ములవుర నా కెంగేలుదోయి
గందమే తోచెనట కస్తూరియనగ నా-
చందమపుడొకలాగు చందమవునటరా

విటవరుడ కోనేటివిభుడ నీ-
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా
యిటువలెనె మనలోన నెలమి మరచి
తటుకనను( గలయనుచు తలకి తెలిసితిరా

kalalOnE yiruvuramu aligi vEga
kalayanuchu telisi ninu kaugiliMchitirA

alugudure (satulu)(batulanagA vinaga-
nalavATu lEka nE naluguchuMDudurA
aligitaTA vuraka nIvaMta nAtOnu mari-
nalugulaunaTa pUvulaMtalOpalanE

chaMduruDE sUryuDai jaraga migula
keMdammulavura nA keMgEludOyi
gamdamE tOchenaTa kastUriyanaga nA-
chaMdamapuDokalAgu chaMdamavunaTarA

viTavaruDa kOnETivibhuDa nI-
veTu dolaMgina dEhameTTu nilupudurA
yiTuvalene manalOna nelami marachi
taTukananu( galayanuchu talaki telisitirA

Click here to listen to this kriti : Srirangam Gopalaratnam

Thursday, October 25, 2007

325.nAkunjeppare valapu-నాకు(జెప్పరె వలపు


అన్నమయ్య, ఈ విరహ గీతం లో జంటపదాలని ఎంత అద్భుతాంగా వాడారో చూడండి. "ఎగ్గో సిగ్గో" "పొగయో వగయో".... అద్భుతం...!
ఈ కీర్తనని శ్రీరంగం గోపాలరత్నంగారి గాత్రంలొ వినండి

Archive Audio link నాకు(జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవ(గరాదు నుయ్యో కొండో

పొలతి మరునికి వెరవ పులియో యెలువో
వులుకుతుమ్మిదమోత వురుమో మెరుమో
తిలకింప చందనము తేలో పామో
యెలమి కోవిలకూత యేదోపోదో(రేకు : యేటోపోటో )

పొదలిన చలిగాలి పొగయో వగయో
వదలిన కన్నీరు వాగో వంతో
వుదరమున పన్నీరు వుడుకో మిడుకో
యెదుట తలవంచుకొనుట ఎగ్గో సిగ్గో

అసమశరునిపై పరపుటదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదోపాదో(రేకు : ఆటోపాటో)
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో


nAku(jeppare valapu nalupO telupO
nUki pOva(garAdu nuyyO koMDO

polati maruniki verava puliyO yeluvO
vulukutummidamOta vurumO merumO
tilakiMpa chaMdanamu tElO pAmO
yelami kOvilakUta yEdOpOdO

podalina chaligAli pogayO vagayO
vadalina kannIru vAgO vaMtO
vudaramuna pannIru vuDukO miDukO
yeduTa talavaMchukonuTa eggO siggO

asamaSarunipai parapuTadanO padanO
pasagalavAnimOvi paMchadArO tEnO
asamagati vAnirAka AdOpAdO
rasiku vEMkaTESu poMdu rAjyamO lakshmO


Explanation by Kalaprapoorna Dr. Balantrapu Rajanikanta Rao garu


Saturday, July 21, 2007

262.namO nArAyaNa nAvinnapamidivO-నమో నారాయణ నావిన్నపమిదివో


Audio link :Srirangamgopalaratnam
Archive link :
నమో నారాయణ నావిన్నపమిదివో
సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే

మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే
తనువు నీపుట్టించినధన మిది
మును నీవంపున నిన్ని మోచుకున్నవాడనింతే
వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే

భోగములెల్లా నీవి బుధ్ధులు నీవిచ్చినవి
యీగతి నాబతుకు నీవిరవైనది
చేగదీర నీవునన్ను జేసినమానిసి నింతే
సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే

వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే
కలకాలమును నీకరుణే నాకు
యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే
నెలవు దప్పించక నీవే రక్షించవే



namO nArAyaNa nAvinnapamidivO
samAnuDagAnu nIku sarwESa rakshiMchavE

manasu nIyAdhInamu mATalu nIvADETivE
tanuvu nIpuTTiMchinadhana midi
munu nIvaMpuna ninni mOchukunnavADaniMtE
venaka nannu nErAlu vEyaka rakshiMchavE

bhOgamulellA nIvi budhdhulu nIvichchinavi
yIgati nAbatuku nIviravainadi
chEgadIra nIvunannu jEsinamAnisi niMtE
sOgala nAyaj~nAnamu chUDaka rakshiMchavE

velinIve lOnIvE vEDukalellA nIvE
kalakAlamunu nIkaruNE nAku
yila SrIvEMkaTESa nIvElukonnabamTa niMtE
nelavu dappiMchaka nIvE rakshiMchavE



Saturday, April 21, 2007

187.OyammA iMtayEla-ఓయమ్మా ఇంతయేల


Audio link :Srirangamgopalaratnam
Archive link :

book:20, kriti:62
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే

నాయముగాదిందరిలో నగుబాటు తనకును

చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు

ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు

కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు



in english:
OyammA iMtayEla voddanarE
nAyamugAdiMdarilO nagubATu tanakunu

chekkunokkitini selavi navvitini
makkuvatO neMtainA mATADaDu
mokkU mokkitini mOnAna nuMDitini
yekkuDu diTTitinaMTA negguvaTTI nitaDu

ichchakamu jEsiti ichchiti viDemunu
kachchupeTTi yeMtainA karagaDu
muchchaTalADitini mOvijUchiti tannu
bachchigA jEsitinaMTA pagachATI nitaDu

kannulA jokkitini kAgiTA niMchitini
manniMche ratineMtainA mAnaDua
sannala mechchitini chAyala hechchitini
inniTA SrIvEMkaTESu DeMtajANE itaDu

Oyamma Inthaela Oddanare - Srirangam Goplaratnam
Hosted by Surasa.net

Friday, March 16, 2007

155.nAlaM vA tava-నాలం వా తవ


Audio link :SrirangamGopalaratnam
Archive link :
Meaning by Kiran Mangalampalli  in his blog:
నాలం వా తవ నయవచనం
చేలం త్యజతే చేటీ భవామి  //ప//

చల చల మమ సం సద్ఘటనే కిం 

కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి || నాలం ||

భజ భజ తే ప్రియ భామాం సతతం

సుజనస్త్వం నిజ సుఖనిలయ
భుజరేఖా రతి భోగ భవసి కిం
విజయీభవ మద్విధిం వదామి || నాలం ||

నయ నయ మామను నయనవిధంతే

ప్రియ కాంతాయాం ప్రేమభవం
భయహర వేంకటపతే త్వం
మత్ప్రియో భవసి శోభితా భవామి || నాలం ||

in english :

naalaM vaa tava nayavachanaM
chaelaM tyajatae chaeTee bhavaami  //pa//

chala chala mama saM sadghaTanae kiM 
kuliSa hRdaya bahuguNa vibhava
pulakita tanu saMbhRta vaedanayaa
malinaM vahaami madaM tyajaami || naalaM ||

bhaja bhaja tae priya bhaamaaM satataM
sujanastvaM nija sukhanilaya
bhujaraekhaa rati bhOga bhavasi kiM
vijayeebhava madvidhiM vadaami || naalaM ||

naya naya maamanu nayanavidhaMtae
priya kaaMtaayaaM praemabhavaM
bhayahara vaeMkaTapatae tvaM
matpriyO bhavasi SObhitaa bhavaami || naalaM ||


kaTana ## = the roof or thatch of a house ## kuliza ## = an axe, hatchet, a diamond, the thunderbolt of Indra ## vilaH ## = (same as bilaH) a cave, hole, pit, opening, aperture, the hollow of a dish), bowl (of a spoon or ladle). ## cheTa ## = a servant slave; cheTI = a female servant ## sambhRita ## = brought together, collected, assembled, accumulated, concentrated, furnished, ##

Tuesday, March 13, 2007

148.anarAdu vinarAdu Atani-అనరాదు వినరాదు ఆతన


Audio link : SrirangamGopalaratnam
Archive link :
ragam : arabhi
ప|| అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు |
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు ||

చ||
ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని |
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి |

యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి |
చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా ||

చ||
తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె |
తీటకుగాక బాలులు తెగి వాపోగా |

పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను |
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా ||

చ||
కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి |
వాకొలిపి బాలులెల్ల వాపోగా |

ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు |
జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము ||


in english :

pa|| anarAdu vinarAdu Atani mAyalu nEDu | dinadina krottalAya driShTamidE mAku ||


ca|| ADeDi bAlula hari aMgali cUpumani | tODanE vAMDla nOra dummulu calli |
yIDamAtO ceppagAnu yiMdaramu gUDipOyi | cUDapOtE paMcadArai cOdyamAyanammA ||


ca|| tITa tIgelu sommaMTU dEhamu niMDa gaTTe | tITakugAka bAlulu tegi vApOgA |

pATiMci yIsuddivini pAriteMci cUcitEnu | kOTikOTi sommulAya kottalOyammA ||


ca|| kAki junnu junnulaMTA gaMpeDEsi tinipiMci | vAkolipi bAlulella vApOgA |
AkaDa SrIvEMkaTESuDA bAlula kaMTi nIru | jOkaga mutyAlusEse jUDagAnE nEmu ||

Thursday, November 02, 2006

58.AlameluManga Nee AbhinavaRupamu - అలమేలుమంగనీ వభినవరూపము



Audio link : Srirangamgopalaratnam
Archive link :
అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ


alamaelumaMganee vabhinavaroopamu
jalajaakshu kannulaku chavulichchaevamma

garuDaachalaadheeSu ghanavakshamunanuMDi
paramaanaMda saMbhiratavai
neratanamulu joopi niraMtaramunaathuni
harushiMpaga jaesi tigadamma

SaSikiraNamulaku chaluvalachoopulu
viSadamugaa meeda vedajalluchu
rasikata peMpuna karagiMchi eppuDu nee
vaSamujaesukoMTi vallabhunOyamma

raTTaDi SreevaeMkaTaraayaniki neevu
paTTapuraaNivai paraguchu
vaTTimaakuligiriMchu valapumaaTalavibhu
jaTTigoni vuramunasatamaitivamma