703.mariyeMdU gatilEdu manupa - మరియెందూ గతిలేదు మనుప
మరియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు
జరసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు
భవసాగరంబులోఁ బడి మునిగిననాకు
తివిరి నీనామమనుతేపయే దిక్కు
చివికి కర్మంబనెడి చిచ్చు చొచ్చిన నాకు
జవళి నాచార్యుకృపాజలధియే దిక్కు
ఘనమోహాపాశముల గాలిఁబొయ్యెడినాకు
కొనల నీపాదచింతకొమ్మయే దిక్కు
కనలి మనసనెడి యాకాసముననున్ననాకు
కనుగొనగ నీదాస్య గరుడడే దిక్కు
మరిగి సంసారమనెడి మంటికిందటి నాకు
ధరభక్తియను బిలద్వారమె దిక్కు
యిరవైన శ్రీవేంకటేశ యిన్నిటా నాకు -
నరుదైన నీవంతరాత్మవే దిక్కు
mariyeMdU gatilEdu manupa nIvE dikku
jarasi lakshmISa nI SaraNamE dikku
bhavasAgaraMbulO@M baDi muniginanAku
tiviri nInAmamanutEpayE dikku
chiviki karmaMbaneDi chichchu chochchina nAku
javaLi nAchAryukRpAjaladhiyE dikku
ghanamOhApASamula gAli@MboyyeDinAku
konala nIpAdachiMtakommayE dikku
kanali manasaneDi yAkAsamunanunnanaku
kanugonaga nIdAsya garuDaDE dikku
marigi saMsAramaneDi maMTikiMdaTi nAku
dharabhaktiyanu biladwArame dikku
yiravaina SrIvEMkaTESa yinniTA nAku -
narudaina nIvaMtarAtmavE dikku
No comments:
Post a Comment