Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Saturday, November 24, 2012

786.SrIpati nIyAj~na sEseda midivO - శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో

Youtube link : Priya sisters

శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ బొరలగనేల

కాయము సుఖదుఃఖములకు మూలము

పాయము యింద్రియ పరవశము
ఆయము రెంటికి అన్నపానములు
మోయని మోపిది ములుగగనేలా

తలపు పుణ్యపాతకములమూలము

కలిగినపుట్టువు కర్మగతి
ఫలమిది రేంటికి బలు సంసారము
కలిగిన వెట్టికి కాదన నేలా

జీవుడింతటా సృష్టికి మూలము

భావము ప్రకృతికి ప్రపంచము
చేవగ రేంటికి శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు నెమకగ నేలా


SrIpati nIyAj~na sEseda midivO
pU@Mpala mAyala@M boralaganEla

kAyamu sukhadu@Hkhamulaku mUlamu
pAyamu yiMdriya paravaSamu
Ayamu reMTiki annapAnamulu
mOyani mOpidi mulugaganElA

talapu puNyapAtakamulamUlamu
kaliginapuTTuvu karmagati
phalamidi rEMTiki balu saMsAramu
kaligina veTTiki kAdana nElA

jIvuDiMtaTA sRshTiki mUlamu
bhAvamu prakRtiki prapaMchamu
chEvaga rEMTiki SrIvEMkaTESwara
nI vaMtarAtmavu nemakaga nElA

Friday, September 14, 2012

785.kaligemAku nidi kaivalyam - కలిగెమాకు నిది కైవల్యం

Audio/Vido link : P.Ranganath
కలిగెమాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం

అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతిశోభితం
అచలం బిదివో హరికీర్తనం


నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితహరం భవదూరం
పరమమంగళం భావాతీతం
కరివరదం నిజకైంకర్యం

సులభం సుకరం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీవేంకటపతిశరణం
జలజోదరనిచ్చ స్తోత్రం

kaligemAku nidi kaivalyam
kalakAlamu harikathASravaNaM

achiMtya madbhuta mAnaMdaM
prachuraM divyaM pAvanaM
sucharitraM SrutiSObhitaM
achalaM bidivO harikIrtanaM

nirataM nityaM nikhila SubhakaraM
duritaM hara (duritaharaM?) bhavadUraM
paramamaMgaLaM bhAvAtItaM
karivaradaM(?) nijakaiMkaryaM

sulabhaM sukaraM SOkanASanaM
phaladaM lalitM bhayaharaNaM
kalitaM SrIvEMkaTapatiSaraNaM
jalajOdaranichcha stOtraM

Thursday, August 16, 2012

784.pADaina yerukatO baMdhamOkshamulokka - పాడైన యెరుకతో బంధమోక్షములొక్క




Audio link : G.Balakrishnaprasad
పాడైన యెరుకతో బంధమోక్షములొక్క
గాడిఁగట్టుట తెలివిగానకేకాదా

భావించి నిను పరబ్రహ్మమని వేదములు
వేవేలు విధుల మొరవెట్టగాను
కేవలపు నిన్ను తక్కిన దైవముల గూర్చి
సేవింపుటిది తప్పు సేయుటేకాదా

సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా
త్పరుడవని నలుగడల పలుకగాను
వరుసతోఁ బెక్కుదైవముల సంగడి నిన్ను
తొరల గొలచుట మహాద్రోహమే కాదా

ఎందుఁజూచిన పురాణేతిహాసములు నీ
చందమే యధికమని చాటగాను
కందర్పజనక వేంకటగిరిస్వామి నీ
కందు వెఱగనిది యజ్ఞానమే కాదా

Download link: 2
pADaina yerukatO baMdhamOkshamulokka
gADi@MgaTTuTa telivigAnakEkAdA

bhAviMchi ninu parabrahmamani vEdamulu
vEvElu vidhula moraveTTagAnu
kEvalapu ninnu takkina daivamula gUrchi
sEviMpuTidi tappu sEyuTEkAdA

sarilEni ninu nupanishadvAkyamule parA
tparuDavani nalugaDala palukagAnu
varusatO@M bekkudaivamula saMgaDi ninnu
torala golachuTa mahAdrOhamE kAdA

eMdu@MjUchina purANEtihAsamulu nI
chaMdamE yadhikamani chATagAnu
kaMdarpajanaka vEMkaTagiriswAmi nI
kaMdu ve~raganidi yaj~nAnamE kAdA






Saturday, July 14, 2012

783.tirumalayya viMdu maMchidE - తిరుమలయ్య విందు మంచిదే వుండంటే


Audio : composed and sung by Sattiraju Venumadhav, in yaman ragam

తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును


పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ
మరల చెంచువారితోడి మాటలేలె తనకును


ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె
పొసగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు
వొసగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ
యెసగ చెంచువారి యెంగి లేటికమ్మ తనకును


వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే
చెలగి పక్కపండు మంట శ్రీవేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును



nsaravilEni cheMchuvAri saMtayEle tanakunu


parikidaMDa pogaDadaMDa baMDigurigiMja daMDa
berakulEni pikilidaMDa balidaMDalanniyu
merasi kAnukiyyabOte mEnidaMDalaDigenamma
marala cheMchuvAritODi mATalEle tanakunu


musurutEne juMTitEne mudirinaTTi peralatEne
posaga miMchu pUvutEne puTTatEne lanniyu
vosagi kAnukiyyabOte mOvitEne laDige namma
yesaga cheMchuvAri yeMgi lETikamma tanakunu


velagapaMDu jIDipaMDu velalEni mOvipaMDu
palukudoMDapaMDu pAlapaMDu kAnukichchitE
chelagi pakkapaMDu maMTa SrIvEMkaTanAyakuDu
yelami kUDenamma cheMchu lETikamma tanakunu



Wednesday, July 11, 2012

782. maanare maayalu maguvalu - మానరె మాయలు మగువ

Audio link : G.Balakrishnaprasad
మానరె మాయలు మగువలు నే
కాను కాననుచు కనలీ శిశువు ||

పాలట దొంగిలె బాలుడు గో-
పాలుల కూడుక పలుమరును |
పోలవీమాటలు(మాయలు) బొంకులు
యేలె యేలె మీ రెలజవ్వనులు ||

సారెకు వెన్నలు చవులట యీ-
దూరులు మీకిక దొసగులును |
చేరువ గరిమలు చెల్లవు మీరు
పోరె పోరె వొరపుల నెర సతులు || 

కింకలు మీకివి గెలుపులు నెల-
వంకలు మీకివి వన్నెలునూ |
వేంకటపతి మీ విభుడట మీరు
బొంకక బొంకక పొలతురు మనరే ||




maanare maayalu maguvalu nae
kaanu kaananuchu kanalee SiSuvu ||


paalaTa doMgile baaluDu gO-
paalula kooDuka palumarunu |
pOlaveemaaTalu(maayalu) boMkulu
yaele yaele mee relajavvanulu ||


saareku vennalu chavulaTa yee-
doorulu meekika dosagulunu |
chaeruva garimalu chellavu meeru
pOre pOre vorapula nera satulu || 




kiMkalu meekivi gelupulu nela-
vaMkalu meekivi vannelunoo |
vaeMkaTapati mee vibhuDaTa meeru
boMkaka boMkaka polaturu manarae ||

Monday, July 02, 2012

781.veladi sobagulivi vinnaviMchitimi - వెలది సొబగులివి విన్నవించితిమి


Audio link : G.Balakrishnaprasad
(thanks to sai garu for sharing this kirtana in his blog : )
వెలది సొబగులివి విన్నవించితిమి
నెలకొని ఇక కరుణించవయా ||


చెలపల  చెలపల చెమటలు గారీ
వలపున  పొడమిన వానలివి |
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి ||


బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపు వరుసలివి |
మిస మిస కాంతులు మెరుగులు వారీ
యెసగిన విరహపు టెండలివి ||


మది మది (గో ర్కుల మంచులు కురిసీ
మదనుని అలహేమంత మిది |
యిదె యిదె శ్రీ వేంకటేశ యింతి గూడితి
వదలని కాగిళ్ళవాడికలివి  ||

veladi sobagulivi vinnaviMchitimi
nelakoni ika karuNiMchavayaa ||

chelapala  chelapala chemaTalu gaaree
valapuna  poDamina vaanalivi |
solapula solapula choopulu vodalee
telupuga vennela taeTalivi ||

busabusamanu noorpulu chigiriMchee
vasaMtakaalapu varusalivi |
misa misa kaaMtulu merugulu vaaree
yesagina virahapu TeMDalivi ||

madi madi (gO rkula maMchulu kurisee
madanuni alahaemaMta midi |
yide yide Sree vaeMkaTaeSa yiMti gooDiti
vadalani kaagiLLavaaDikalivi  ||

Tuesday, May 22, 2012

780.mUDEmATalu mUDumUMDlu tommidi - మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది


english lyrics
Audio link :  Sri G Balakrishnaprasad
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||


చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||


చ|| తనలోని (వి)జ్ఞానము తప్పకుండా తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||


చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||


Lyrics in English pa|| mUDEmATalu mUDumUMDlu tommidi | vEDukoni cadavarO vEdAMta rahasyamu ||


ca|| jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu | dEvuni vaiBavamu telisi |
BAviMci prakRti saMpadayidi yeruguTE | vEvElu vidhamula vEdAMta rahasyamu ||


ca|| tanalOni (vi)j~nAnamu tappakuMDA talabOsi | panitODa naMduvalla Baktinilipi |
manikigA vairAgyamu maravakuMDuTE | vinavalasina yaTTi vEdAMta rahasyamu ||


ca|| vEDukatO nAcArya viSvAsamu galigi | jADala SaraNAgati sAdhanamutO |
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE | vIDani brahmAnaMda vEdAMta rahasyamu ||



Thursday, May 17, 2012

779.SrAvaNa bahuLAshTami savarEtrikADanu - శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను


Youtube link : Priya Sisters
శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుడుదయించె చెలులాల వినరే


అసురుల శిక్షించ నమరుల రక్షించ 
వసుధ భారమెల్ల నివారింపను
వసుదేవికిని దేవకిదేవికిని
అసదృశమగు కృష్ణుడవతారమందెను


గోపికల మన్నించ గొల్లలనెల్లఁ గావగ
దాపై మునులనెల్ల దయసేయను
దీపించ నందునుకి దేవియైన యశోదకు
యేపున సుతుడై కృష్ణుడిన్నిటఁ బెరిగెను


పాండవుల మనుపగ పదారువేల పెండ్లాడగ
నిండి శ్రీవేంకటాద్రి పై నిలుచుండగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాగలించగ
దండియై యుండ కృష్ణుడు తగ నుతికెక్కెను

SrAvaNa bahuLAshTami savarEtrikADanu
SrIvibhuDudayiMche chelulAla vinarE

asurula SikshiMcha namarula rakshiMcha 
vasudha bhAramella nivAriMpanu
vasudEvikini dEvakidEvikini
asadRSamagu kRshNuDavatAramaMdenu

gOpikala manniMcha gollalanella@M gAvaga
dApai munulanella dayasEyanu
dIpiMcha naMdunuki dEviyaina yaSOdaku
yEpuna sutuDai kRshNuDinniTa@M berigenu

pAMDavula manupaga padAruvEla peMDlADaga
niMDi SrIvEMkaTAdri pai niluchuMDagA
aMDa nalamElmaMga nakkuna@M gAgaliMchaga
daMDiyai yuMDa kRshNuDu taga nutikekkenu

Wednesday, May 09, 2012

778.ihaparamulakunu Elikavu - ఇహపరములకును ఏలికవు


  Audio link : Sri Balakrishnaprasad

ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||

pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu ||

ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada ||

ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada ||

ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||

777.iMdulOna gala sukhamu iMtae chaalu - ఇందులోన గల సుఖము ఇంతే చాలు


Audio link : Sri Balakrishnaprasad

ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు
ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము ||


ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని |
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము ||


పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని
మురహరు గోవిందుని ముకుందుని  |
హరి పుండరీకాక్షు అనంతుని అభవుని
పరగ నుతించితిమి పరులనేమొల్లము  ||


అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు
ఘనుని చిరంతనుని కలిభంజనుని |
దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||



iMdulOna gala sukhamu iMtae chaalu maaku
iMdu veliyaina sirulaemiyoo nollamu ||


aadi daevunachyutu sarvaaMtaraatmukuni
vaedavaedyu kamalaakshu viSvapoorNuni |
Sreedaevu harini aaSrita paarijaatuni
adigoni SaraNaMTimi anyamu maemollamu ||


paramaatmu paripoorNu bhava rOgavaidyuni
muraharu gOviMduni mukuMduni  |
hari puMDareekaakshu anaMtuni abhavuni
paraga nutiMchitimi parulanaemollamu  ||




anupama guNa daehuni aNuraeNu paripoorNu
ghanuni chiraMtanuni kalibhaMjanuni |
danujaaMtakuni sarva dharu SreevaeMkaTapatini
kani kolichitimi yaegatulu naemollamu ||