Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, April 29, 2011

745.itanichaMdamu harihar - ఇతనిచందము హరిహరి

Audio link : Sri R.Viswanath
ఇతనిచందము హరిహరి ఏమి చెప్పగొలది హరిహరి
అతిరహస్యముల హరిహరి అదిగో మనకు జిక్కె హరిహరి

ఆదివిష్ణుడితడు హరిహరి అదె యశోద కొడుకు హరిహరి
వేదమూర్తి యితడె హరిహరి వెన్న దొంగిలించె హరిహరి
సాదుబండి విరిచె హరిహరి చంటి విషము చెరిచె హరిహరి

పరమపురుషుడితదు హరిహరి పసులగాచెనిదివో హరిహరి
సిరికి మగడు తాను హరిహరి చెలగి రోలఁదగిలె హరిహరి
పరగచూడరోయి హరిహరి బతుకరోయి కొలిచి హరిహరి

అమరవంద్యుడితడు హరిహరి అణచె కంసుని హరిహరి
విమతదానవారి హరిహరి వించె మద్దులు హరిహరి
అమరెనిదివో హరిహరి శ్రీవేంకటాద్రి మీద హరిహరి
జమళి రామకృష్ణుడు హరిహరి సర్వమితడు హరిహరి

itanichaMdamu harihari Emi cheppagoladi harihari
atirahasyamula harihari adigO manaku jikke harihari

AdivishNuDitaDu harihari ade yaSOda koDuku harihari
vEdamUrti yitaDe harihari venna doMgiliMche harihari
sAdubaMDi viriche harihari chaMTi vishamu cheriche harihari

paramapurushuDitadu harihari pasulagAchenidivO harihari
siriki magaDu tAnu harihari chelagi rOla@Mdagile harihari
paragachUDarOyi harihari batukarOyi kolichi harihari

amaravaMdyuDitaDu harihari aNache kaMsuni harihari
vimatadAnavAri harihari viMche maddulu harihari
amarenidivO harihari SrIvEMkaTAdri mIda harihari
jamaLi rAmakRshNuDu harihari sarwamitaDu harihari

Monday, April 25, 2011

744.dEvuDavu nIvu dEvula nEnu - దేవుడవు నీవు దేవుల నేను


Audio link : 
పల్లవి 
దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి
చరణం 1
వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
చరణం 2 
మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
చరణం 3
పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని 


pallavi 
daevuDavu neevu daevula naenu
vaavulu gooDagaanu vaDi saesa veTTiti
charaNaM 1
valapulu nae ne~raga vaasule~raganu - neevu
kalakala navvitaenae karagitini
palukulu nae naera bhaaviMchaga nae naera
pilichi viDemichchitae priyamaMditini
charaNaM 2 
manasu saadhiMchanOpa marmamu laDuganOpa
chenaki gOra nooditae chaekoMTini
penagajaalanu naenu bigiyaga jaalanu
kanuvichchi choochitaenae kaanimmaMTini
charaNaM 3
pachchichaetalu rachiMcha balumaaru sigguvaDa
machchika gaagiliMchitae marigitini
yichchaTa SreeveMkaTaeSa yaelukoMTi viTu nannu
mechchi kaagiliMchitaenu maekoni mokkitini 

Saturday, April 02, 2011

743.pasiDicheeravADavu pAludacchitivigAna - పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన

Audio link : S.Janaki
పల్లవి
పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన
పసిడిబోలినది చేపట్టెను నీకరము
చరణం 1
తొలుతనే చందురుని తోడబుట్టుగనక
పొలుపు చందురు మోముపోలికైనది
కళల చింతామణి కందువ చెల్లెలుగాన
తళుకు మానికపు దంతముల బోలినది
చరణం 2
మంచి యైరావతముతుతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనము బోలినది
పంచల బారిజాతపు భావపు సోదరిగాన
యెంచగ చిగురుబోలె నీకెపాదములు
చరణం 3
తామెర తోట్టెలలోన తగిలి తానుండుగాన
తామెరకన్నులబోలి తనరినది
యీమేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది

pallavi
pasiDicheeravADavu pAludacchitivigAna
pasiDibOlinadi chEpaTTenu neekaramu
charaNaM 1
tolutanE chanduruni tODabuTTuganaka
polupu chaMduru mOmupOlikainadi
kaLala chintaamaNi kaMduva chellelugAna
taLuku mAnikapu daMtamula bOlinadi
charaNaM 2
maMchi yairAvatamututO maguva saidODugAna
muMchina karigamanamu bOlinadi
paMchala bArijAtapu bhAvapu sOdarigAna
yeMchaga chigurubOle neekepAdamulu
charaNaM 3
tAmera tOTTelalOna tagili tAnunDugAna
tAmerakannulabOli tanarinadi
yeemEra ninniTA bOli inni lakshaNamulatO
neemEna SreevEMkaTESa nelavai nilchinadi

Monday, March 28, 2011

742.rammanavE mAni rachanalu - రమ్మనవే మాని రచనలు

Audio link : Ravu Balasaraswati
రమ్మనవే మాని రచనలు
నెమ్మదిఁ గూడిన నేడే రేపు

నల్లని మేనికేలే నడురేయి తన
తెల్లని కన్నులకేలే తెల్లవాఱను
కల్లజంపులుసేసి కాకల తా(నే)
బల్లిదుండై తే పగలేరేయి

సిగ్గుల మోముకేలే చిరునవ్వు తన
నిగ్గుల చూపులకేలే నెరసులు
దగ్గఱి యింకా నేలే తమకము తా
వెగ్గలము వలచిన వెలియే లోను

తావులమేనికేలే తాపము తన
కావులకన్నుల కేలే కసరులు
శ్రీవేంకటపతి చెలువుండిట్లే
కావలె నంటే కడయే నడుము

rammanavE mAni rachanalu
nemmadi@M gUDina nEDE rEpu


nallani mEnikElE naDurEyi tana
tellani kannulakElE tellavA~ranu
kallajaMpulusEsi kAkala tA(nE)
balliduMDai tE pagalErEyi

siggula mOmukElE chirunavvu tana
niggula chUpulakElE nerasulu
dagga~ri yiMkA nElE tamakamu tA
veggalamu valachina veliyE lOnu

tAvulamEnikElE tApamu tana
kAvulakannula kElE kasarulu
SrIvEMkaTapati cheluvuMDiTlE
kAvale naMTE kaDayE naDumu

Wednesday, March 16, 2011

741.gOvindA hari gOvindA gOvindA bhaja gOvindA - గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా

గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
అనుచు లోకములెల్ల అదజయవెట్టేరు
నిను కొలిచితి కావవే నీరజాక్షుడా

అదివో కోనేటి లోన అదివో సర్వతీర్థములు
అదివో పడిమేడల హరి నగరు
పొదిలి పరుషలెల్ల పొదిగి సేవించేరు
ఇందివో వరములిచ్చే ఇందిరా నాథుడు

అదివో వేదఘోషము అదివో సురలామూక
అదివో విశ్వరూపము అద్భుతమందే
గుదిగొని పుణ్యములు కోట్ల సంఖ్యలు చేరే
ఇదివో దయతలచే ఈశ్వరేశ్వరుడు
అనుచు లోకములెల్ల అదజయవెట్టేరు
నిను కొలిచితి కావవే నీరజాక్షుడా

అదివో శ్రీవేంకటేశుడు అక్కున అలమేల్మంగ
అదివో నిత్యసూరులు ఆలువారులు
నిదుల శేషాచలము నిక్కి పైపొడచూపే
ఇదివో కొలువై వున్నాడు హృదయాంతరాత్ముడు 


gOvindA hari gOvindA gOvindA bhaja gOvindA 
anucu lOkamulella adajayaveTTEru 
ninu koliciti kAvavE nIrajAkshuDA 

adivO kOnETi lOna adivO sarvatIrthamulu 
adivO paDimEDala hari nagaru 
podili parushalella podigi sEvimcEru 
indivO varamuliccE indirA nAthuDu 


adivO vEdaghOshamu adivO suralAmUka 
adivO viSWarUpamu adbhutamandE 
gudigoni puNyamulu kOTla sankhyalu cErE 
idivO dayatalacE ISwarESwaruDu 
anucu lOkamulella adajayaveTTEru 
ninu koliciti kAvavE nIrajAkshuDA 

adivO SrIvEnkaTESuDu akkuna alamElmanga 
adivO nityasUrulu AluvArulu 
nidula SEshAcalamu nikki paipoDacUpE 
idivO koluvai vunnADu hRdayAntarAtmuDu
youtube Video : Priya Sisters

Thursday, March 10, 2011

740.chadivi chadivi vaTTi jAlibaDuTiMtE gAka - చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక

Audio link : Sri Balakrishnaprasad (phone recording)
చదివి చదివి వట్టి జాలిబడుటింతే గాక
యెదుట నిన్ను గానగ నితరుల వశమా

ఆకాశముపొడవు ఆకాశమేయెరుగు
ఆకడ జలధిలోతు ఆ జలధే యెరుగు
శ్రీకాంతుడ నీఘనము చేరి నీవే యెరుగుదు
వీకడ నింతంతన నితరుల వశమా

నదుల యిసుకలెల్ల నదులే యెరుగును
కదిలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు -
దిదియదిననిచెప్ప నితరుల వశమా

శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు
యీవల నీశరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీకల్పనలు తగనీవే యెరిగింతు
వీవల నౌగాదన నితరులవశమా

chadivi chadivi vaTTi jAlibaDuTiMtE gAka
yeduTa ninnu gAnaga nitarula vaSamA


AkASamupoDavu AkASamEyerugu
AkaDa jaladhilOtu A jaladhE yerugu
SrIkAMtuDa nIghanamu chEri nIvE yerugudu
vIkaDa niMtaMtana nitarula vaSamA


nadula yisukalella nadulE yerugunu
kadili gAliyiravu gAlikE telusu
adana nAtmaguNamu laMtarAtma nIverugu -
didiyadinanicheppa nitarula vaSamA


SrIvEMkaTESa yinnichiMtalaku modalu
yIvala nISaraNaMTE yiTu nIvE yerigiMtu
daivamA nIkalpanalu taganIvE yerigiMtu
vIvala naugAdana nitarulavaSamA


Wednesday, February 23, 2011

739.kaMduva mI nichcha kaLyANamunaku - కందువ మీ నిచ్చ కళ్యాణమునకు

Audio/Archive link : S.Janaki , composer : Balakrishnaprasad
కందువ మీ నిచ్చ కళ్యాణమునకు
అందములాయను అదననివి

కలువలసేసలు కలికికి నీకును
సొలవక చూచేటి చూపులివి
చిలుకుల మొల్లల సేసలు మీలో
నలుగడ ముసిముసి నవ్వులివి

తామరసేసలు తలకొనె మీకును
మోము మోమొరయు ముద్దు లివి
సేమంతి సేసలు చెలీయకు నీకును
చేమిరి గోళ్ళ చెనకు లివి

సంపెంగ సేసలు సమరతి మీకును
ముంపుల వూర్పుల మూకలివి
యింపుల శ్రీవేంకటేశ చెలిగలసి
సంపదఁ దేలితి చనవులివి

kaMduva mI nichcha kaLyANamunaku
aMdamulAyanu adananivi

kaluvalasEsalu kalikiki nIkunu
solavaka chUchETi chUpulivi
chilukula mollala sEsalu mIlO
nalugaDa musimusi navvulivi

tAmarasEsalu talakone mIkunu
mOmu mOmorayu muddu livi
sEmamti sEsalu cheliayaku nIkunu
chEmiri gOLLa chenaku livi

saMpeMga sEsalu samarati mIkunu
muMpula vUrpula mUkalivi
yiMpula SrIvEMkaTESa cheligalasi
sampada@M dEliti chanavulivi 
Meaning by Mangalampalli Kiran garu

Sunday, February 06, 2011

738.valegA vEsAlu vaddanna mAnaDu - వలెగా వేసాలు వద్దన్న మానడు

Audio link : Srirangam Gopalaratnam
వలెగా వేసాలు వద్దన్న మానడు
యెలయింపుమాటల నెంత సేసీనె

కన్నుల నే మొక్కితేను కాక లేల రేగీనె
యిన్నిటాఁ జేతులు మోపి యేల చూపీనె
వెన్నెల బయట నుంటె వెతలేల రేగీనె
నిన్న నేటనె కతలు నేరిచె దాగదవే

పొలసి నే నగితేను పులక లేల పుట్టీనె
యెలమిఁ జూడు మ నెన లేల పెట్టీనె
చిలుకలు వలికితే చింత లేల పొడమీనె
మలక లెల్లఁబెనచే మాయకాడు కదవే

గక్కున కాగిలించెతె కడుఁ జెమరించనేలె
మిక్కిలి గోర నూరిచి మీదఁ జిమ్మీనె
యెక్కువ శ్రీవేంకటేశు డెనసె నన్నిటా నన్ను
చక్కని సరసముల జాణకాడు కదవే

valegA vEsAlu vaddanna mAnaDu
yelayiMpumATala neMta sEsIne

kannula nE mokkitEnu kAka lEla rEgIne
yinniTA@M jEtulu mOpi yEla chUpIne
vennela bayaTa nuMTe vetalEla rEgIne
ninna nETane katalu nEriche dAgadavE

polasi nE nagitEnu pulaka lEla puTTIne
yelami@M jUDu ma nena lEla peTTIne
chilukalu valikitE chiMta lEla poDamIne
malaka lella@MbenachE mAyakADu kadavE

gakkuna kAgiliMchete kaDu@M jemariMchanEle
mikkili gOra nUrichi mIda@M jimmIne
yekkuva SrIvEMkaTESu Denase nanniTA nannu
chakkani sarasamula jANakADu kadavE
click on play to listen :

Tuesday, February 01, 2011

737.kOrina kOrikalella kommayaMdE - కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని

Audio link : Sri Balakrishnaprasad
కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని
చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు
పొదుపైన తమ్ములము పురోడాశము
మదన పరిభాషలు మంచి వేద మంత్రములు
అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
నలువైన గుబ్బలు కనక పాత్రలు
కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల
ఆముకొన్న చెమటలే యవబృథము
యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి
చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు

kOrina kOrikalella kommayaMdE kaligIni
chEri kAmayaj~na miTTE sEyavayyA nIvu

sudatimOvi tEnelu sOmapAnamu nIku
podupaina tammulamu purODASamu
madana paribhAshalu maMchi vEda maMtramulu
ade kAmayaj~namu sEyavayyA nIvu

kaliki payyada nIku kappina kRshNAjinamu
naluvaina gubbalu kanaka pAtralu
kalasETi sarasAlu karma taMtra vibhavAlu
chelagi kAmayaj~namu sEyavayyA nIvu

kAmini kAgili nIku ghanamaina yAgaSAla
Amukonna chemaTalE yavabRthamu
yImEranE SrIvEMkaTESa nannu nEliti
chEmuMchi kAma yaj~namu sEyavayyA nIvu

Friday, January 21, 2011

736.koluvarO mokkarO kOrina - కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ

Audio link : Sri Balakrishnaprasad
కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ
సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||

కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి
అంబరపు దేవతలకు అభయమిచ్చి |
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి
అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||

నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని
పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి
ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||

మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ
అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ
చక్కదనములకెల్లా చక్కని నరహరి ||

koluvarO mokkarO kOrina varamu liccI
sulaBu DinniTAnu vIDe sugrIva narahari ||

kaMbamulOna puTTi kanakadaityuni koTTi
aMbarapu dEvatalaku aBayamicci |
paMbi siridana toDapai beTTuka mATalADi
aMbujAkShuDainaTTi Adima narahari ||

nAnA BUShaNamulu unnati tODa niDukoni
pUnikatO prahlAduni bujjagiMci
mAnavulakellanu mannana cAlA nosagi
AnaMdamutO nunnADu adigO narahari ||

mikkili pratApamutO miMcina kAMtulatODa
akkajapu mahimala nalarucunu
takkaka SrIvEMkaTAdri tAvukoni varAliccI
cakkadanamulakellA cakkani narahari ||